సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని పహెల్‌గామ్‌లో వివాహం చేసుకున్న ఐఏఎస్ దంపతులు టీనా దబీ, అథర్ ఆమిర్ ఉల్ షఫీకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. వారి ప్రేమబంధం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ఐఏఎస్ టాపర్లు అయిన టినా దబీ, ఆమిర్ గతకొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వారి ప్రేమ పట్ల పలు వర్గాల నుంచి వ్యతిరేకత, విమర్శలు వచ్చాయి. అయినా వెనుకడుగు వేయకుండా వారు తాజాగా వైవాహిక జీవితంలో అడుగుపెట్టారు.
వారి ప్రేమపెళ్లిపై తాజాగా రాహుల్‌గాంధీ ట్విటర్‌లో స్పందించారు. ‘2015 బ్యాచ్ ఐఏఎస్ టాపర్లు అయిన టీనాదబీ, అథర్ ఆమిర్ ఉల్ షఫీలకు వివాహ మహోత్సవం సందర్భంగా అభినందనలు. మీ ప్రేమబంధం మరింత బలోపేతం కావాలని, అసహనం, విద్వేషం పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మీరు భారతీయులందరికీ స్ఫూర్తిదాయకంగా నిలువాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ’ అని రాహుల్ ట్వీట్ చేశారు.
మూడేళ్ల క్రితం సివిల్ సర్వీస్ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే భోపాల్‌కు చెందిన టీనా దబి మొదటి ర్యాంకు సాధించగా.. అదే పరీక్షలో కశ్మీర్‌కు చెందిన అథల్ ఆమీర్ రెండో ర్యాంకు సాధించారు. వీరు శనివారం దక్షిణ కశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో వివాహం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment