ఐఏఎస్‌ టీనా దాబీ వైరల్‌ .. అధికార పార్టీ నేతకు వంగి వంగి దండాలు | IAS Officer Tina Dabi Bows To BJP Leader 5 Times In 7 Seconds, Watch Video Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

ఐఏఎస్‌ టీనా దాబీ వైరల్‌ .. అధికార పార్టీ నేతకు వంగి వంగి దండాలు

Published Fri, Oct 25 2024 9:08 PM | Last Updated on Sat, Oct 26 2024 9:19 AM

IAS Tina Dabi Bows to BJP Leader 5 Times in 7 Seconds

జైపూర్‌ :  ఒకటి,రెండు,మూడు.. ఇదంతా ఏంటని అనుకుంటున్నారా? ఓ జిల్లా ఐఏఎస్‌ అధికారిణి  సదరు అధికార పార్టీ నేతకు వంగి వంగి పెట్టిన దండాలు. ఇప్పుడీ అంశంపై సోషల్‌ మీడియాలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఐఏఎస్ అధికారిణి టీనా దాబి గత నెలలో రాజస్థాన్‌ రాష్ట్రం బార్మర్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.  నగరంలో పరిశుభ్రత, స్వచ్ఛత కోసం ‘నవో బార్మర్’ పేరుతో ప్రచారాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా నవో బార్మర్ కార్యక్రమానికి రాజస్థాన్ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ సీనియర్‌ నేత సతీష్ పూనియాను ఆహ్వానించారు.

 

అయితే కార్యక్రమానికి వచ్చిన సతీష్ పూనియా కాన్వాయ్ నుంచి దిగి వస్తూనే ఫోన్‌లో బిజీ అయ్యారు. అదే సమయంలో సతీష్ పూనియాను ఆహ్వానించేందుకు వచ్చిన టీనా దాబి ఆయనకు వంగి వంగి దండాలు పెట్టింది. ఏడు సెకన్ల వ్యవధిలో ఐదుసార్లు నమస్కరించారు. కొద్ది సేప‌టి త‌ర్వాత టీనా దాబి ప‌నితీరుపై ప్ర‌శంస‌లు కురిపించారు. ఇండోర్‌ మాదిరిగా బార్మర్‌ కూడా మారుతుందని అన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.

మరోవైపు ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. సతీష్ పూనియాకు జిల్లా కలెక్టర్‌ టీనా దాబి వంగి వంగి దండాలు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి. 

సంచలనాలకు.. వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ టీనా దాబి
రాజస్థాన్‌కు చెందిన టీనా దాబి.. ఢిల్లీ లేడీ శ్రీ రామ్‌ కాలేజీలో చదివారు. దళిత వర్గం నుంచి మొదటి ప్రయత్నంలోనే టాపర్‌గా నిలిచిన ఫీట్‌ను సొంతం చేసుకున్నారు. టీనా దాబి 2015 సివిల్స్‌ సర్వీసెస్‌ ఎంట్రెన్స్‌లో టాపర్‌. రెండో ర్యాంకర్‌ అథర్‌ అమీర్‌ ఖాన్‌. వీళ్లిద్దరూ రిలేషన్‌లో ఉన్నట్లు 2016లో సోషల్‌ మీడియాలో ప్రకటించారు. ఆ సమయంలో మతపరమైన చర్చతో పెను దుమారమే చెలరేగింది. అయినా ఈ జంట వెనక్కి తగ్గలేదు.  

2018లో వీళ్లద్దరూ పెద్దల సమక్షంలో ప్రేమవివాహం చేసుకున్నారు. ఢిల్లీలో జరిగిన వీళ్ల వెడ్డింగ్‌ రిసెప్షన్‌కు వెంకయ్య నాయుడు, సుమిత్ర మహాజన్‌ లాంటి రాజకీయ ప్రముఖులు సైతం హాజరయ్యారు.  అయితే.. 2020లో విడిపోతున్నట్లు ప్రకటించిన ఈ జంట..2021లో జైపూర్‌ కోర్టు నుంచి అధికారికంగా విడాకులు కూడా తీసుకుంది.

గతేడాది 2013 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ ఆఫీసర్‌ ప్రదీప్‌ గవాన్డేతో ఆమె నిశ్చాతార్థం చేసుకున్నారు. టీనా కంటే ఆయన మూడేళ్లు సీనియర్‌ బ్యాచ్‌. గ్లామర్‌ ఉన్న ఆఫీసర్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఆమెకు ఫాలోయింగ్‌ ఎక్కువే.  టీనా దబీకి సుమారు మిలియన్‌న్నర ఫాలోవర్లు ఉన్నారు. టీనా సోదరి రియా దాబి 2020 ఐఏఎస్‌ ఫలితాల్లో 15వ ర్యాంకు సాధించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement