
రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి సంబంధించిన ఒక ఉదంతం చర్చనీయాంశంగా మారింది. ఒక వితంతు వృద్ధ మహిళ మృతిచెందినట్టు నిర్థారిస్తూ ఆమెకు రావాల్సిన పెన్షన్ నిలిపివేశారు. ఈ నేపధ్యంలో బాదామ్‌దేవి అనే ఆ వృద్ధురాలు తన సమస్య పరిష్కరించాలంటూ మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరుగుతోంది.
పెన్షన్ నిలిపివేసి..
తాను బతికే ఉన్నానని, తనను గుర్తించి, తనకు తిరిగి పెన్షన్ ఇప్పించాలని వేడుకుంటోంది. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగా తనకు పెన్షన్ నిలిపివేశారని ఆమె ఆరోపించింది. ఇప్పుడు ఆమె తాను బతికే ఉన్నానని, అధికారులు నిర్థారించిన విధంగానైనా తనకు డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరుతోంది. 2023 జనవరి 20న తనకు పెన్షన్ నిలిపివేశారని, కారణం అడిగితే చనిపోయావని అన్నారని ఆమె తన వినతిపత్రంలో పేర్కొంది.
లైఫ్ సర్టిఫికెట్ సమర్పించినా..
20 ఏళ్లుగా తాను పెన్షన్ అందుకుంటున్నానని, అయితే ఈ ఏడాది దానిని నిలిపివేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. తాను ఈ ఏడాది జనవరి 6న లైఫ్ సర్టిఫికెట్ సమర్పించానని అయినా అధికారులు పట్టించుకోవడం లేదని, అందుకే తాను జీవించివున్నా ఇప్పుడు డెత్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేశానన్నారు. కాగా ఆమె దరఖాస్తును చూసిన అధికారులు కంగుతిన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారి సుభమ్ గుప్త మాట్లాడుతూ ఈ విషయమై దర్యాప్తునకు ఆదేశించామన్నారు.
ఇది కూడా చదవండి: 16 ఏళ్లకే చదువుకు టాటా.. నేడు ఏటా రూ.100 కోట్లు సంపాదిస్తూ..
Comments
Please login to add a commentAdd a comment