![Three Accused Gang Rape Woman After Kidnapping Her In Nagaur She Was Also Thrashed And her hair chopped - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/22/crime.jpg.webp?itok=sjqDHtCJ)
నాగౌర్: ప్రస్తుతం పరిస్థితులు మహిళలకు, పిల్లలకు ఏ మాత్రం రక్షణ లేదనిపించాలా ఉన్నాయి. ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ రోజురోజకి పరిస్థితి దిగజారిపోతుందే తప్ప ఎటువంటి ఆశావాహ ధోరణి కనిపించటం లేదు. ఇందుకు నిదర్మనమే రాజస్తాన్‌లో చోటు చేసుకున్న ఉదంతం.
(చదవండి: వృద్ధ బిచ్చగాడు కూడబెట్టుకున్న సోమ్ము వృధానేనా!)
వివరాల్లోకెళ్లితే.....రాజస్తాన్‌లోని నాగౌర్ జిల్లాకి చెందిన 35 ఏళ్ల మహిళను ముగ్గురు దుండగులు కిడ్నాప్ చేసి సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ భయంకరమైన ఘటన ఆమె షాపింగ్ చేసుకుని తన బిడ్డతో కలిసి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు చోటుచేసుకుంది.. ఈ మేరకు ఆ మహిళ పై సాముహిక అత్యాచారానికి పాల్పడటమే కాక ఆమెను అత్యంత దారుణంగా కొట్టి, జుట్టు కత్తిరించారు. పైగా ఆ నిందుతులు ఆమెను 6 గంటలు బంధించి ఉంచారు.
ఈ మేరకు పోలీసులు బాధితురాలి సోదరుడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో నాగౌర్ సీఐ వినోద్ సీపా మాట్లాడతుతూ..." సంఘటనా స్థలానికి చేరుకుని ఒక నిందుతుడిని అదుపులోకి తీసుకున్నమని మిగతా ఇద్దరూ ఆచూకి కోసం గాలిస్తున్నాం. బాధిత మహిళలను వైద్య పరీక్షల నిమిత్తం జెఎల్‌ఎన్ ఆసుపత్రికి తరలించాం" అని చెప్పారు.
(చదవండి: శత్రు ట్యాంకులను ఎలా నాశనం చేస్తామంటే!)
Comments
Please login to add a commentAdd a comment