gangraped
-
ఆగని అఘాయిత్యాలు: ఇద్దరు విద్యార్థినులపై గ్యాంగ్‌రేప్
కాశీబుగ్గ: కూటమి ప్రభుత్వహయాంలో అత్యాచారాలు, మహిళలపై అఘాయిత్యాలు ఆగడంలేదు. నిన్న తెనాలిలో కేంద్రమంత్రి అనుచరుడి దురాగతం.. మొన్న బద్వేలులో ఉన్మాది దారుణం.. అంతకుముందు అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారం ఇలా అత్యాచారాలు, వేధింపులు, హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో మరో దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. పుట్టినరోజు వేడుకల పేరిట స్నేహితురాళ్లను తీసుకెళ్లిన యువకులు గ్యాంగ్‌రేప్ చేశారు. ఈ సంఘటన పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో సోమవారం బయటకు వచ్చింది.పట్టణానికి చెందిన ముగ్గురు ఇంటర్ విద్యార్థినులు, ఇంటర్ తప్పి ఖాళీగా తిరుగుతున్న ముగ్గురు యువకులు స్నేహితులు. ఈ నెల 19న వారిలో ఒక యువకుడి పుట్టినరోజు కావడంతో అందరూ కలిసి పార్టీ చేసుకోవాలనుకున్నారు. పలాస సినిమా థియేటర్ సమీపంలో ఉన్న ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ వద్ద బిర్యానీలు, స్వీట్‌షాప్‌లో కేక్‌లు, గిఫ్ట్‌లు కొనుక్కుని ద్విచక్ర వాహనాలపై పలాస–కాశీబుగ్గ జంటపట్టణాలకు ఐదు కిలోమీటర్ల దూరంగా ఉన్న కాలనీకి చేరుకున్నారు.అక్కడ కేక్‌కట్ చేసి భోజనాలు చేసిన తరువాత ఇద్దరు విద్యార్థినులపై యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. తనపై జరిగిన లైంగిక దాడి నుంచి మరో విద్యార్థిని తప్పించుకోగలిగింది. తప్పించుకున్న విద్యార్థని తల్లిదండ్రులకు విషయం చెప్పింది. అత్యాచారానికి గురైన విద్యార్థినుల తల్లిదండ్రులకు విషయం తెలిసినా పరువు పోతుందని మిన్నకుండిపోయారు. బాధిత విద్యార్థిని ఒకరు సోమవారం అనారోగ్యానికి గురవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. -
పైశాచికం: కొట్టి.. జుట్టు కత్తిరించి.. సామూహిక అత్యాచారం
నాగౌర్: ప్రస్తుతం పరిస్థితులు మహిళలకు, పిల్లలకు ఏ మాత్రం రక్షణ లేదనిపించాలా ఉన్నాయి. ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ రోజురోజకి పరిస్థితి దిగజారిపోతుందే తప్ప ఎటువంటి ఆశావాహ ధోరణి కనిపించటం లేదు. ఇందుకు నిదర్మనమే రాజస్తాన్‌లో చోటు చేసుకున్న ఉదంతం. (చదవండి: వృద్ధ బిచ్చగాడు కూడబెట్టుకున్న సోమ్ము వృధానేనా!) వివరాల్లోకెళ్లితే.....రాజస్తాన్‌లోని నాగౌర్ జిల్లాకి చెందిన 35 ఏళ్ల మహిళను ముగ్గురు దుండగులు కిడ్నాప్ చేసి సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ భయంకరమైన ఘటన ఆమె షాపింగ్ చేసుకుని తన బిడ్డతో కలిసి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు చోటుచేసుకుంది.. ఈ మేరకు ఆ మహిళ పై సాముహిక అత్యాచారానికి పాల్పడటమే కాక ఆమెను అత్యంత దారుణంగా కొట్టి, జుట్టు కత్తిరించారు. పైగా ఆ నిందుతులు ఆమెను 6 గంటలు బంధించి ఉంచారు. ఈ మేరకు పోలీసులు బాధితురాలి సోదరుడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో నాగౌర్ సీఐ వినోద్ సీపా మాట్లాడతుతూ..." సంఘటనా స్థలానికి చేరుకుని ఒక నిందుతుడిని అదుపులోకి తీసుకున్నమని మిగతా ఇద్దరూ ఆచూకి కోసం గాలిస్తున్నాం. బాధిత మహిళలను వైద్య పరీక్షల నిమిత్తం జెఎల్ఎన్ ఆసుపత్రికి తరలించాం" అని చెప్పారు. (చదవండి: శత్రు ట్యాంకులను ఎలా నాశనం చేస్తామంటే!) -
మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం
నాగ్‌పూర్: ఎన్ని చట్టాలు తీసుకువస్తున్న మహిళలపై సామూహిక అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ భారతదేశ వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న నేరాలకు అంతం లేదనిపిస్తుంది. ప్రస్తుతం ఇలాంటి ఘటనే నాగ్‌పూర్‌లో చోటు చేసుకుంది. ఈ మేరకు నాగపూర్‌లోని మాదవ్ నగరి ప్రాంతానిక చెందిన ఒక మైనర్ బాలిక్ తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి రాత్రి 8 గంటల సమయంలో నడుచుకుంటూ వెళ్తుండగా నలుగురు యువకులు వచ్చి వారిపై దాడి చేశారు. (చదవండి: "అనుకోని అరుదైన వ్యాధి జీవితాన్నే మార్చేసింది") ఈ క్రమంలో ఆ యువకులు ఆ బాలుడుని కొట్టి ఆ అమ్మాయిని ఒక నిర్మానుష ప్రాంతానికి తీసుకువెళ్లి సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ మేరకు పోలీసులు ఒక నిందుతుడిని అరెస్ట్ చేయగా మిగతా ముగ్గురు పరారీలో ఉన్నారు. అయితే థానేలోని డోంబివ్లి, సకినాకాలో జరిగిన వరుస అత్యాచార ఘటనలన మరువక మునుపే మరి కొద్ది రోజులకే మళ్లీ ఇలాంటి ఘటనే చోటు చేసుకోవటం అత్యంత బాధాకరం. (చదవండి: వరద ఉధృతిని నేరుగా వీక్షిస్తూ ఆస్వాదించచ్చు!) -
దారుణం: ఆరేళ్ల బాలికపై తాత, మేనమామ అత్యాచారం
భోపాల్: భోపాల్ లోని కోలార్ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు మన దేశంలో రక్షణ లేకుండా పోయింది. వివరాల ప్రకారం.. భోపాల్ లోని కోలార్ ప్రాంతంలో నివసిస్తున్న మైనర్ బాలికపై తన మూడేళ్ల తమ్ముడి ఎదుటే అత్యాచారానికి గురిఅయింది. అయితే, అమ్మాయి ప్రవర్తనలో చాలా రోజుల నుంచి మార్పులను గమనించిన బాధితురాలి తల్లి ఏమి జరిగిందో గట్టిగ అడిగేసరికి జరిగినదంతా ఆమెకు చెప్పింది. షాకైన తల్లి తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. భోపాల్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎనిమిది రోజుల క్రితం జరిగిన ఈ దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రాణాలతో బయటపడిన ఆమె తన తల్లికి గత చాలా రోజులుగా అను భవిస్తున్న బాధ గురించి చెప్పింది. సమోసాలు ఇస్తానంటూ బాలిక మేనమామ బాలికను, ఆమె మూడేళ్ల తమ్ముడిని బంధువుల ఇంటికి తీసుకెళ్లాడని అక్కడ అప్పటికే ఆమె తాత ఉన్నాడని తెలిపింది. తర్వాత ఇద్దరూ కలిసి చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. మూడేళ్ల చిన్నారి(బాధితురాలి సోదరుడు) కళ్లముందే వారీ ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు చెప్పారు. ఆరేళ్ల బాలిక రక్తస్రావం కావడంతో వారు వెంటనే గ్రహించి బాధితురాలికి, తన తమ్ముడికి సమోసా, రూ.20 ఇచ్చి విడిచిపెట్టారు. అలాగే ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించి పంపారు. బాధితురాలు తన తల్లిదండ్రులకు ఈ విషయం గురుంచి చెప్పడానికి చాలా భయపడి, నిశ్శబ్దంగా ఉండిపోయినట్లు కోలార్ పోలీసులు తెలిపారు. నిందితులు ఇద్దరూ కూలీలు, మద్యానికి బానిసలు. నిందితులిద్దరినీ అరెస్ట్ చేశామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు. చదవండి: బ్యాంకులో ఉరివేసుకున్న మహిళ మేనేజర్! -
సినిమా అని తీసుకెళ్ళి గ్యాంగ్ రేప్!
సాక్షి, నిజామాబాద్: జిల్లాలోని నిజామాబాద్ మండలం సారంగాపూర్ శివారులో దారుణం చోటుచేసుకొంది. సినిమా అని చెప్పి ఓ యువతిని బయటకు తీసుకెళ్ళి ఆరుగురు యువకులు గ్యాంగ్ రేప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అత్యాచారం చేస్తుండగా మరో యువకుడు వీడియో చిత్రీకరించాడు. శనివారం బాధితురాలు నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. బాధితురాలిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఈ అమానవీయ ఘటనకు వ్యతిరేకంగా జిల్లాలోని మహిళా సంఘాలు, ఐద్వా నాయకురాలు సబ్బని లత ఆసుపత్రికి వచ్చి సంఘీభావం తెలిపారు. బాధితురాలి తల్లి మాట్లాడుతూ.. ప్రియుడు సురేష్, తన కూతురిని సినిమా అని చెప్పి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని వాపోయారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో పట్టుకుంటామని పోలీసులు అధికారులు తెలిపారు. -
మాజీ భర్త ఘాతుకం : గ్యాంగ్‌రేప్, హత్య
జార్ఖండ్ : జార్ఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఒక మహిళపై (23) ఆమె మాజీ భర్త, మరో ఇద్దరితో కలిసి సామూహిక హత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు అతి దారుణంగా హింసించడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. జంతర జిల్లాలోని నారాయణ పూరా పోలీస్ స్టేషన్లో పరిధిలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసు అధికారి బీఎన్ సింగ్ అందించిన సమాచారం ప్రకారం స్థానిక మహిళ సమీపంలో కాళీపూజా థియేటర్లో సినిమా చూడ్డానికి వెళ్లింది. దీన్ని గమనించిన ఆమె మాజీ భర్త పథకం పన్నాడు. సినిమా నుంచి తిరిగి వస్తున్న సమయంలో మరో ఇద్దరితో కలిసి ఆమెను అటకాయించాడు. సమీపంలోని పొలాల్లోకి తీసుకునిపోయి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆ దుర్మార్గుల ఆగడాలు ఆగిపోలేదు. ఆమె పట్ల పైశాచికంగా ప్రవర్తించారు. అనంతరం అక్కడ్నించి పారిపోయారు. మరునాడు ఉదయం నిస్సహాయ స్థితిలో రోదిస్తున్న ఆమెను గమనించిన స్తానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ బాధితురాలి పరిస్థితి తీవ్రంగా ఉండటంతో మెరుగైన చికిత్సకోసం జంతర సదర్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్టుగా వైద్యులు ధృవీకరించారు. తన మాజీ భర్తే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టుగా బాధితురాలు చెప్పిందన్న గ్రామస్తుల సమాచారం ఆధారంగా ఆమె మాజీ భర్తతోపాటు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసు అధికారి సింగ్ వెల్లడించారు. -
సినిమా హాల్లో గ్యాంగ్‌రేప్
సాక్షి, లక్నో : మొబైల్ ఫోన్లో యువతితో స్నేహం.. అపై వంచన.. అదును చూసి ఆమెపై అకృత్యాలు సహజంగా మారాయి. సినిమా స్టోరీలను తలపించే ఇటువంటి ఘటన తాజాగా ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగింది. పదహారేళ్ల యువతితో ఇద్దరు వ్యక్తులు సెల్ఫోన్లో స్నేహం చేశారు. దాదాపు రెండు నెలల పాటు మొబైల్లో అందరూ కబుర్లు చెప్పుకుంటూ కాలం గడిపారు. స్నేహం పేరుతో మాట్లాడుకుంటూ.. అప్పుడప్పుడూ యువతిని దుండగులు కలిసేవారు. ఈ నేపథ్యంలో యువతితో మంగళవారం దుండగులు కలిశారు. మవానా పట్టణంలో షాపింగ్ తరువాత సినిమాకు వెళ్లాలని అందరూ నిర్ణయించుకున్నారు. అనుకున్నట్టే సినిమాకు వెళ్లిన తరువాత.. ఎవరూలేని ప్రదేశంలో ముగ్గురు కూర్చుకున్నారు. సినిమా ప్రారంభమైన తరువాత.. ఇద్దరు యువకులు.. యువతిపై పాశవికంగా, రాక్షసంగా అత్యాచారం చేశారు. యువతి అరవకుండా నోట్లో గుడ్డలు పెట్టి.. చేతులు కట్టేసి మరీ రాక్షసంగా అత్యాచారం జరిపారు. అత్యాచారం చేసిన తరువాత యువతిని ముజఫర్‌నగర్ ప్రాంతంలో వదిలిపెట్టారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇద్దరు నిందితులను అరెస్ట చేశారు. అలాగే యువకులు ఉయోగించిన బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
‘వాళ్లను నడిరోడ్డుపై ఉరి తీయాలి’
భోపాల్ : ‘వాళ్లకు భూమ్మీద జీవించే హక్కు లేదు. అటువంటి వాళ్లను నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా ఉరితీయాలి. అటువంటి వ్యక్తులు సమాజంలో ఉండటానికి ఎటువంటి అర్హత లేద’ని భోపాల్ గ్యాంగ్‌రేప్ బాధితురాలు డిమాండ్ చేశారు. ఘటన మూడు రోజులు తరువాత ఆమె తొలిసారి మీడియాతో మాట్లాడారు. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థినిపై మంగళవారం నాడు నలుగురు యువకులు మూడు గంటలపాటు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఘటనా స్థలానికి దగ్గరలోనే హబీబ్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఉన్న పోలీసులు బాధితురాలిని కాపాడలేకపోయారు. తనను కిడ్నాప్ చేసేందుకు దుండగులు ప్రయత్నిస్తున్న సమయంలో అక్కడే ఉన్న పోలీసులు కళ్లు మూసుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను పోలీస్ అధికారి కుమార్తెను అని చెప్పకపోయి ఉంటే.. అత్యాచారం తరువాత తనను హత్యచేసేవారని ఆమె చెప్పారు. హబీబ్‌గంజ్ పోలీస్ అధికారుల ప్రవర్తన అత్యంత హేయంగా ఉందని ఆమె తెలిపారు. ఇదిలా ఉండగా ఈ కేసు విషయంలో అలసత్వం ప్రదర్శించిన 5 మంది పోలీసులను మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే విధుల నుంచి తొలగించింది. అంతేకాక ఈ ఘటనపై విచారణ నిర్వహించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. -
పోలీస్ అధికారి కుమార్తెపైనే..!?
సాక్షి, భోపాల్ : మధ్య ప్రదేశ్‌లోనూ మహిళలపై అత్యాచార పర్వం కొనసాగుతోంది. తాజాగా భోపాల్‌లోని హబీబ్‌గంజ్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక యవతిని నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి మూడు గంటలపాటు అత్యాచారం చేశారు. ఇదిలా ఉండగా బాధిత యువతి తల్లిదండ్రులు ఇద్దరూ పోలీసు ఉన్నతాధికారులు కావడం గమనార్హం. బాధిత యువతి ఎంపీ నగర్ ప్రాంతంలో సివిల్ సర్వీసెస్‌కు కోచింగ్ తీసుకుని ఇంటికి వస్తుండగా.. దుండగులు ఈ దుశ్చర్యకు ఒడిగట్టారు. ఘాతుకానికి పాల్పడ్డ నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని ప్రభుత్వ రైల్వే పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటన మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో జరిగిందని ఆయన తెలిపారు. అత్యాచారం చేస్తున్న సమయంలో బాధిత యువతి.. తనపై ఘాతుకానికి పాల్పడవద్దని వేడుకుందని ఆయన చెప్పారు. నాలుగురు యువకులు అత్యాచారం చేశాక.. టీ తాగి, గుట్కా తిని వెళ్లిపోయారని తెలిపారు. నిందితులైన నలుగురు యువకులను గోలు, అమర్, గంటూ, రాజేష్‌గా గుర్తించినట్టు హబీబ్‌గంజ్ పోలీసులు తెలిపారు. ఈ నలుగురిపై 376డీ, 34 సెక్షన్లపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. -
బాలికపై సామూహిక లైంగికదాడి
అనంతపురం: అనంతపురం జిల్లా గుత్తిలో దారుణం జరిగింది. ముగ్గురు యువకులు ఏడో తరగతి విద్యార్థిని కిడ్నాప్ చేసి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. బాధితురాలి తల్లిదండ్రులు ముగ్గురు యువకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేస్తున్నారు. -
భూమి అమ్మలేదని గ్యాంగ్ రేప్, కాల్పులు
ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో అమానుషం చోటుచేసుకుంది. భూమి అమ్మలేదనే అక్కసుతో వివాహిత మహిళ (34)పై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. అనంతరం ఆమెపై కాల్పులు జరిపి పారిపోయారు. పోలీసుల సమాచారం ప్రకారం బాధితురాలి కుటుంబానికి సంబంధించిన భూమిని, నిందితులకు అమ్మడానికి ఆమె భర్త నిరాకరించాడు. దీంతో ఆగ్రహానికి గురైన వారు ఆమె ఇంటి నుంచి మహిళను ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆమె కాళ్లపై కాల్పులు జరిపి పారిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో నిందితులు మున్నా, కల్లూ, గఫ్ఫార్, కలీంలను అరెస్ట్ చేసినట్లు సీతాపూర్ ఎస్పీ బీబీ సింగ్ తెలిపారు. దర్యాప్తు కొనసాగుతుందన్నారు. -
వివాహితను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్
దేవ్ గఢ్: జార్ఖండ్ లోని దేవ్ గఢ్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రైలులో ప్రయాణిస్తున్న ఓ వివాహితను కొందరు గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేసి, ఆ తర్వాత సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ దారుణ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఓ వివాహిత(25), తండ్రితో కలిసి గురువారం గిరిద్-మాదాపూర్ ప్యాసింజర్ రైళ్లో ప్రయానిస్తోంది. రైలు మాదాపూర్ రైల్వే స్టేషన్ వద్దకు రాగానే రైళ్లో ప్రయాణిస్తోన్న ఆరుగురు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేశారని రైల్వే ఎస్పీ అసీమ్ విక్రాంత్ మింజ్ తెలిపారు. మాదాపూర్ స్టేషన్ వద్దకు రైలు రాగానే ఆయనకు మెలకువ వచ్చింది. ఎంత వెతికినా కూతురు కనిపించకపోవడంతో రైల్వే పోలీసులకు ఆమె తండ్రి ఫిర్యాదుచేశాడు. కిడ్నాప్ జరిగిన సమయంలో కూతురు కూడా నిద్రలో ఉన్నట్లు ఫిర్యాదులో ఆమె తండ్రి పేర్కొన్నాడు. విచారణ చేపట్టిన పోలీసులు దంగల్ పుర ప్రాంతంలో అత్యాచారానికి గురైన ఓ మహిళను గుర్తించినట్లు చెప్పారు. బాధిత మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. వివాహితను గ్యాంగ్ రేప్ చేసిన నిందితులలో ముగ్గురిని అరెస్ట్ చేశామని, మిగతా ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని వివరించారు. -
మరో నిర్భయ గ్యాంగ్ రేప్
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో మరో నిర్భయ ఉదంతం వెలుగులోకి వచ్చింది. నోయిడాకు చెందిన ఓ వివాహిత(35)పై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. లిఫ్ట్ ఇస్తామని చెప్పి నమ్మించి అఘాయిత్యానికి ఒడిగట్టిన వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు కథనం ప్రకారం.. నోయిదాడకు చెందిన ఓ మహిళ తన భర్త దగ్గరకు వెళ్లేందుకు బస్టాప్ లో వేచి వుంది. ఇంతలో స్కార్పియో లో వచ్చిన నలుగురు వ్యక్తులు, లిఫ్ట్ ఇస్తామని, గమ్యానికి చేరుస్తామని ఆమెను నమ్మించి వాహనంలో ఎక్కించుకున్నారు. అనంతరం మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఆఫర్ చేసి ...ఆమె మత్తులోకి జారుకున్నాక సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత నిర్మానుష్య ప్రదేశంలో వదిలేసి పారిపోయారు. అపస్మారక స్థితిలో పడివున్న ఆమెను పోలీసులు గమనించి, చికిత్స నిమిత్తం ఆసుపత్రి తరలించారు. బాధితురాలు ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు... నిందితులు వీరు, సమీర్ గా గుర్తించారు. మిగిలిన ఇద్దరినీ గుర్తించే ప్రయత్నంలో వున్నామని కేసు దర్యాప్తు కొనసాగుతోందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. -
టీనేజర్ల వికృతం.. బాలిక ఆత్మహత్య
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌లో దారుణం జరిగింది. ఓ బాలికపై సామూహిక అత్యాచారం చేసి, నగ్నంగా ఇంటికి వెళ్లమంటూ వికృతంగా ప్రవర్తించడంతో.. ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు అందించిన సమచారం ప్రకారం డిసెంబర్ 29న తెండా నబాపరా గ్రామానికి చెందిన బాలిక (15) స్నేహితులతో కలిసి సమీప గ్రామంలోని సంతకు వెళ్లింది. తిరిగి వస్తుండగా వారిని ఐదుగురు వ్యక్తులు వెంబడించారు. ఆమె స్నేహితులను కొట్టి, అమ్మాయిని అడవుల్లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అక్కడితో వారి ఆగడాలు ఆగలేదు. నగ్నంగానే ఇంటికి వెళ్లాలని అనాగరికంగా ప్రవర్తించారు. ఆమె దుస్తులు, ఇతర వస్తువులను లాక్కొని అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో అవమానాన్ని తట్టుకోలేని బాలిక సంఘటనా స్థలంలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు టీనేజర్లు, ముగ్గురు మైనర్ నిందితులు ఉన్నారని.. వారిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. -
గన్‌తో బెదిరించి పోలీస్ స్టేషన్లో అత్యాచారం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. రక్షణగా నిలవాల్సిన పోలీసులు ఓ మహిళపట్ల భక్షకులుగా మారారు. తన భర్త కేసు విషయంలో స్టేషన్‌కు వెళ్లిన మహిళపై సబ్ ఇన్ స్పెక్టర్, మరో ఇద్దరు కానిస్టేబుల్స్ పోలీస్ స్టేషన్లోనే అత్యాచారం చేశారు. గత నెలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి వివరాల ప్రకారం ఓ తప్పుడు కేసులో బాధితురాలి భర్తను పోలీసులు గత నెల ఆగస్టు 1న అరెస్టు చేశారు. ఈ కేసు విషయంలో మాట్లాడేందుకు ఆమె స్టేషన్‌కు అదే నెల 6న వెళ్లింది. ఆ సమయంలో పోలీసులు తుపాకీతో బెదిరించే అదే స్టేషన్లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసుల ఉన్నతాధికారులకు లిఖిత పూర్వక ఫిర్యాదును అందజేసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
జాతీయ స్థాయి క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్
గుర్గావ్ : జాతీయ స్థాయి క్రీడాకారిణి అత్యాచారానికి గురైంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుర్గావ్ సమీపంలోని బిలాస్పూర్ గ్రామంలో గత నెలలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, సోమవారం నాడు బాధితురాలు గుర్గావ్ లోని మహిళా పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తనపై ఓ అల్లరి మూక అత్యాచారానికి పాల్పడిందని నిందితులని కఠినంగా శిక్షించాలని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నట్లు వారు వెల్లడించారు. క్రీడాకారిణిపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితులలో ఒకరిని పోలీసులు అరెస్టు చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. మరో ఘటనలో ఇద్దరు నేపాలీ యువతులు అత్యాచారానికి గురయ్యారు. సౌదీ అరేబియా ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులపై ఆ బాధిత మహిళలు కేసు నమోదు చేశారు. డీఎల్ఎఫ్ టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో బాధితులు అక్కడ ఫిర్యాదు చేశారు. తమను బలవంతంగా నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి తమపై అత్యాచారం చేశారని ఫిర్యాదులో బాధిత యువతులు పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎవరిని అరెస్టు చేయలేదని పోలీసులు చెబుతున్నారు. -
బాలికను కిడ్నాప్ చేసి గ్యాంగ్‌రేప్.. ఆపై హత్య
లూధియానా: కిడ్నాప్‌నకు గురైన ఓ విద్యార్థిని అత్యాచారానికి గురవడంతో పాటు చివరకు శవమై తేలింది. వివరాలు.. పంజాబ్ లోని లూధియానాకు చెందిన విద్యార్థిని స్కూలు నుంచి ఇంటికి వస్తుండగా బుధవారం సాయంత్రం కిడ్నాప్‌నకు గురైంది. విద్యార్థినిని ఓ ఇంట్లోకి తీసుకెళ్లి అనంతరం గ్యాంగ్ రేప్ చేశారు. గురువారం సాయంత్రం బాలిక శవమై ఓ కాలువలో తేలింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అత్యాచారం జరిగినట్లు డాక్టర్లు నిర్ధారించారు. బాధిత బాలిక శరీరంపై సుమారు 17 గాయాలున్నట్లు వారు తెలిపారు. తలపై పెద్దగా గాట్లు కూడా ఉన్నాయని, బలమైన ఆయుధంతో నిందితులు ఆమెపై దాడి చేసి ఉండవచ్చని తెలుస్తోంది. బాధిత విద్యార్థిని బంధువులు, కుటుంబసభ్యులు తమకు న్యాయం చేయాలని మృతదేహంతో వారు ఆందోళన చేపట్టారు. -
వివాహితపై గ్యాంగ్‌రేప్
-
తల్లిని కట్టేసి ... కుమార్తెని అపహరించి ...
ముజఫర్‌నగర్: పొలంలో తల్లికి చేదోడుగా పని చేస్తున్న 20 ఏళ్ల యువతిని అపహరించేందుకు ముగ్గురు యువకులు యత్నించారు. ఆ క్రమంలో తల్లి అడ్డుపడింది. దాంతో ఆగ్రహించి సదరు యువకులు... ఆమెను చెట్టుకు కట్టేశారు. అనంతరం ఆమె కుమార్తెను ఎత్తుకుపోయి... ఆపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ దారుణమైన సంఘటన ఉత్తరప్రదేశ్ షామిల్ జిల్లాలోని సకోటి గ్రామంలో ఈ నెల 25వ తేదీన చోటు చేసుకుంది. బాధితురాలిని గురువారం గ్రామస్థులు రక్షించారు. అనంతరం వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు నిందితులలో మైనర్ బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన ఇద్దరు నిందితులు రజనీష్, సచిన్లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించగా... ఆమెపై అత్యాచారం జరిగినట్లు వైద్య పరీక్షల్లో నిర్థారణ అయిందని చెప్పారు. -
బాలికపై సామూహిక అత్యాచారం
పోలీసుల అదుపులో ముగ్గురు.. పరారీలో మరొకరు యాచారం: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ గ్రామంలో ఓ బాలికపై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సీఐ మదన్‌మోహన్‌రెడ్డి కథ నం ప్రకారం.. మండల పరిధిలోని నానక్‌నగర్‌కు చెందిన ఓ బాలిక(17) మాల్లోని బంధువుల వద్ద ఉంటోంది. బుధవారంరాత్రి ఆమె బహిర్భూమి నిమిత్తం సమీపంలోని పొలంలోకి వెళ్ల అదే గ్రామానికి చెందిన చిన్నొళ్ల చిన్న(19), పెద్దొళ్ల విజయ్(19), గుడుకుట్ల శేఖర్(21), గుడుకుట్ల వెంకటేష్(19)లు అటకాయించి అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు యాచారం పోలీసులు గురువా రం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో నింది తుడు చిన్నొళ్ల చిన్న పరారీలో ఉన్నాడు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను నగరంలోని ఓ ఆస్పత్రికి పంపారు. -
విద్యార్థిని కిడ్నాప్: కారులో సామూహిక అత్యాచారం
బరంపురం: తొమ్మిదో తరగతి విద్యార్థిని కిడ్నాప్ చేసి ఆమెపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఒడిశాలో చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం... ఒడిశా గంజాం జిల్లాలోని చాముండా గ్రామంలో గత నెల ఫిబ్రవరి 18వ తేదీన తొమ్మిదో తరగతి విద్యార్థిని ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి... కారులో తరలిస్తూ ఆమెపై అత్యాచారం చేశారు. ఈ విషయం బయటకు వెల్లడిస్తే చంపేస్తామంటూ బాలికను బెదిరించి వారు పరారైయ్యారు. దాంతో సదరు బాలిక జరిగిన విషయాన్ని చాలా ఆలస్యంగా తల్లిదండ్రులకు తెలిపింది. దాంతో వారు శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి... బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుల్లో ఒకరిని గుర్తించామని పోలీసులు తెలిపారు. సాధ్యమైనంత త్వరలో నిందితులను ఆరెస్ట్ చేస్తామని వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. -
రైల్వే స్టేషన్లో మహిళపై గ్యాంగ్‌రేప్
హౌరా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మరో దారుణం చోటు చేసుకుంది. భర్త ఎదురుగానే ఓ మహిళపై నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు అతి పాశవికంగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. హౌరా జిల్లా మోరిగాం రైల్వే స్టేషన్లో భర్తతో కలిసి రైలు దిగిన అనంతరం నలుగురు వ్యక్తులు వారిపై దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. గత రాత్రి వెస్ట్ మిడ్నాపూర్‌లో దిగాల్సిన దంపతులు నిద్ర మత్తులో ఉన్న కారణంగా మోరిగాం చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న నలుగురు వ్యక్తులు ఆ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టారు. ప్రస్తుతం ఆ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన నిందితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
అటవీ ప్రాంతంలో వివాహితపై గ్యాంగ్ రేప్
ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. స్నేహితురాలితో కలసి ఇంటికి సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లిన వివాహిత(25) పై ఇద్దరు యువకులు దాడి చేసి... అనంతరం సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం ఆ యువకులు అక్కడి నుంచి పరారైయారు. దీంతో బాధితురాలు సివిల్ లైన్స పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా నిందితులు బమన్హెరీ గ్రామానికి చెందిన ఉత్తమ్ చంద్, బావర్ సింగ్‌గా గుర్తించి... అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించామన్నారు. బాధితురాలికి వివాహమైందని ఆమెకు ఒక చిన్నారి కూడా ఉందని పోలీసులు వెల్లడించారు. అయితే అడవికి వెళ్లిన స్నేహితురాలిని అక్కడి నుంచి వెళ్లి పోవాలని బెదిరించారని చెప్పారు. దీంతో ఆమె భయపడి అక్కడి నుంచి వెళ్లిపోయిందని పోలీసులు తెలిపారు. అత్యాచారం చేసే క్రమంలో ప్రతిఘటించిన యువతిపై ఇద్దరు యువకులును దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని పోలీసులు వెల్లడించారు. -
నంద్యాలలో మహిళపై సామూహిక అత్యాచారం
-
14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం
నగరంలోని రాజేంద్రనగర్ ఉప్పరపల్లికి చెందిన మైనర్ బాలికను కొంతమంది దుండగలు మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశారు. ఆమెను నల్గొండ జిల్లా యాదగిరిగుట్టలో రెండు రోజుల పాటు బందించి బాలికపై అత్యాచారం జరిపారు. అనంతరం ఆమెను గత రాత్రి ఉప్పరపల్లిలో వదిలి నిందితులు పరారైయ్యారు. దాంతో ఆమె ఇంటికి చేరుకుని తన తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని వివరించింది. దీంతో బాలిక తల్లిదండ్రులు రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
మహిళ కిడ్నాప్ ఆపై సామూహిక అత్యాచారం
దేశంలో మహిళలపై అత్యాచారాలను నిరోధించేందుకు అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు చేస్తున్నాయి. నిందితులను శిక్షించేందుకు కఠిన శిక్షలు అమలు చేస్తున్నాయి. అయిన మహిళలపై అత్యాచారాలు మాత్రం అడ్డు అదుపు లేకుండా నిరంతరాయంగా కొనసాగుతునే ఉన్నాయి. అందుకు ఉత్తరప్రదేశ్‌లో మంగళవారం చోటు చేసుకున్న సంఘటనే తాజా ఉదాహరణ. ఉత్తరప్రదేశ్ పోలీసుల కథనం ప్రకారం.... రాష్ట్రంలోని లలిత్‌పూర్‌లో ఓ యువతి ప్రభుత్వేతర సంస్థలో విధులు నిర్వర్తిస్తుంది. ఆ యువతి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ముగ్గురు యువకులు ఆమెను కిడ్నాప్ చేశారు. అనంతరం నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లారు. ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. దాంతో బాధితురాలు లలిత్పూర్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా మనోజ్ సమయ్య, బబ్లూ, మరోకరని పోలీసులు నిందితులను గుర్తుంచారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. సాధ్యమైనంత త్వరగా నిందితులను అరెస్ట్ చేస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేశారు. -
గిరిజన యువతిపై గ్యాంగ్ రేప్
సూరి(పశ్చిమబెంగాల్): వేరే వర్గానికి చెందిన వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందన్న కారణంతో 20 ఏళ్ల గిరిజన యువతిపై 13 మంది సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. బిర్భుమ్ జిల్లాలోని లభ్పూర్లో మంగళవారం రాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. 13 మంది నిందితులను, ఆ యువతితో సన్నిహితంగా ఉండే యువకుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ యువతి ప్రస్తుతం సూరి ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. తమ కూతురికి వేరే వర్గానికి చెందినవాడితో సంబంధం ఉందని తమ వర్గానికి చెందినవారే పంచాయితీ పెట్టి ఈ శిక్ష విధించారని ఆ యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
దక్షిణ ఢిల్లీలో దారుణం యువతిపై సామూహిక అత్యాచారం
న్యూఢిల్లీ: యువతిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఈ ఘటన దక్షిణ ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఎన్క్లేవ్ ప్రాంతంలో మంగళవారం రాత్రి జరిగింది. పోలీసులు మీడియాకు బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం... రోహిత్, టింకు, నరేందర్‌లు బాధితురాలని కారులో రమ్మంటూ బలవంతపెట్టారు. తెలిసినవారే కావడంతో ఆమె వారితో వెళ్లింది. కొంతదూరం వెళ్లాక మత్తుమందు కలిపినఓ పానీయాన్ని తాగమంటూ ఒత్తిడి చేశారు. అది తాగిన ఆమె నిద్రలోకి జారుకోవడంతో కారులోనే ఆమెపై అత్యాచారానికి తెగబడ్డారు. ఆ తర్వాత బాధితురాలిని ఆమె ఇంటికి సమీపంలోనే వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు. జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైద్య పరీక్షల్లో కూడా అత్యాచారం జరిగిందని తేలడంతో నిందితులపై భారత శిక్షాస్మృతి, సెక్షన్ 376 ప్రకారం కేసు నమోదు చేశారు. బాలిక స్థానిక ప్రైవేటు పాఠశాలలో చదువుతోందని, పాఠశాలకు సమీపంలోనే ఉంటున్న ముగ్గురు యువకులు ఆమెతో పరిచయం పెంచుకున్నారని, దానిని అవకాశంగా చేసుకొని ఈ దారుణానికి తెగబడ్డారని పోలీసులు తెలిపారు. రాజధానిలో జరుగుతున్న అత్యాచారాల్లో ఎక్కువగా తెలిసినవారి వల్లే జరుగుతున్నాయని, ఈ విషయంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, మానసిక నిపుణులు పదే పదే సూచిస్తున్నా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడే ఇలాంటివి ఆగుతాయంటున్నారు. -
పాలమూరు జిల్లాలో యువతిపై సామూహిక అత్యాచారం
మహబూబ్‌నగర్ జిల్లా నాగర్ కర్నూల్ మండలం ఎండపెట్ల గ్రామంలో బుధవారం గత అర్థరాత్రి 16 ఏళ్ల యువతిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. దాంతో ఆ యువతి జరిగిన విషయాన్ని తల్లితండ్రులకు తెలిపింది. దాంతో వారు బుధవారం ఉదయం నాగర్ కర్నూల్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వెంటనే స్పందించారు. కేసు నమోదు చేసి, ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. మరో నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు నాగర్ కర్నూల్ పోలీసులు తెలిపారు. అయితే సామూహిక అత్యాచారానికి గురైన యువతిని మహబూబ్‌నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
ఫోటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం
దేశ రాజధానిలో సామూహిక అత్యాచారానికి గురైన నిర్భయ ఘటన దేశ ప్రజల మనోఫలకంపై నుంచి ఇంకా చెరిగిపోక మునిపే దేశ వాణిజ్య రాజధాని మంబైలో మరో మహిళపై సామూహిక అత్యాచార సంఘటన దేశ ప్రజలను తీవ్రంగా కలచివేసింది. ముంబైలోని మహాలక్ష్మీ ప్రాంతంలోని శక్తి మిల్స్ ప్రాంగణంలో ఓ మహిళా (23) ఫోటో జర్నలిస్ట్ పై దుండగులు గురువారం సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఓ ఇంగ్లీష్ పత్రికలో ఫోటో జర్నలిస్టుగా పని చేస్తున్న ఆమె విధి నిర్వహణలో భాగంగా తన అసిస్టెంట్‌తో కలసి గురువారం సాయంత్రం శక్తి మీల్స్ ప్రాంగణంలోకి చేరుకున్నారు. కాగా ఆ మీల్ ప్రాంగణమంతా చాలావరకూ మాదకద్రవ్యాలకు బానిసలైనవారితో కిక్కిరిసి ఉంటుంది. ఆమె ఆ ప్రాంగణంలో ఫోటోలు తీసుకునేందుకు ప్రయత్నించింది. ఆమె ప్రయత్నాన్ని కొంత మంది యువకులు అడ్డుకున్నారు. ఆ క్రమంలో ఆమె సహాయకునిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అనంతరం మహిళ ఫోటోగ్రాఫర్పై సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమె తన అసిస్టెంట్ సహాయంతో జస్లోక్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రి వైద్యులు వెంటనే ఈ ఘటనపై ఎన్ఎం జోషి మార్గ్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని సంఘటన వివరాలను తెలసుకుని, 20 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మహారాష్ట హోం మంత్రి ఆర్ ఆర్ పాటిల్ మహిళపై అత్యాచర ఘటన విషయం తెలిసిన వెంటనే జస్లోక్ ఆసుపత్రికి చేరుకుని బాధితురాలిని పరామర్శించారు. ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిణిస్తుందని తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఆర్ ఆర్ పాటిల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
ఇద్దరు యువతులపై సామూహిక అత్యాచారం
జార్ఖాండ్‌లోని పాకుర్ జిల్లాలో మషిహేశ్పుర్ పరిధిలో ఇద్దరు యవతులపై గత అర్థరాత్రి నలుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారని గురువారం పోలీసులు వెల్లడించారు. సమాచారం అందిన వెంటనే ఆ గ్రామానికి తరలివెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అత్యాచారానికి గురైన యువతులను వైద్యపరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. నలుగురు నిందితులు అదే గ్రామానికి చెందని వారని పోలీసులు పేర్కొన్నారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.