జాతీయ స్థాయి క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్ | A national level judo player was allegedly gangraped in the Bilaspur area of Gurgaon | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

Published Tue, Sep 8 2015 4:16 PM | Last Updated on Thu, Sep 27 2018 2:34 PM

జాతీయ స్థాయి క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్ - Sakshi

జాతీయ స్థాయి క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

గుర్గావ్ : జాతీయ స్థాయి క్రీడాకారిణి అత్యాచారానికి గురైంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  గుర్గావ్ సమీపంలోని బిలాస్పూర్ గ్రామంలో గత నెలలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, సోమవారం నాడు బాధితురాలు గుర్గావ్ లోని మహిళా పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తనపై ఓ అల్లరి మూక అత్యాచారానికి పాల్పడిందని నిందితులని కఠినంగా శిక్షించాలని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నట్లు వారు వెల్లడించారు.  క్రీడాకారిణిపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితులలో ఒకరిని పోలీసులు అరెస్టు చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

మరో ఘటనలో ఇద్దరు నేపాలీ యువతులు అత్యాచారానికి గురయ్యారు. సౌదీ అరేబియా ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులపై ఆ బాధిత మహిళలు కేసు నమోదు చేశారు. డీఎల్ఎఫ్ టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో బాధితులు అక్కడ ఫిర్యాదు చేశారు. తమను బలవంతంగా నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి తమపై అత్యాచారం చేశారని ఫిర్యాదులో బాధిత యువతులు పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎవరిని అరెస్టు చేయలేదని పోలీసులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement