
పెంచుకున్న కుక్క కనిపించకపోతే ఏం చేస్తాం? తిరగాల్సిన చోటుకల్లా తిరుగుతాం. పోలీస్ కంప్లాయింట్ ఇస్తాం. అయినా ఫలితం లేకపోతే ప్రియమైన శునకాన్ని తలచుకొని బాధ పడడం తప్ప ఏంచేయగలం? కాని గురుగ్రామ్‌కు చెందిన దీపయాన్ ఘోష్, కస్తూరి దంపతులు మాత్రం ఏమైనా సరే, ఎక్కడున్నా సరే... తప్పిపోయిన తమ పెంపుడు శునకాన్ని వెదికి పట్టుకోవాల్సిందేనని గట్టిగా డిసైడైపోయారు.
శునకం కనిపించని రోజు నుంచి వారికి నిద్ర, తిండి లేవు. కుక్క జాడ చెప్పిన వారికి యాభై వేల రివార్డ్ ప్రకటించడంతో సహా ఇంటింటికీ వెళ్లి శునకం ఆనవాళ్ల గురించి చెప్పడం, సీసీటీవీ ఫుటేజీలను విశ్లేషించడం, డ్రోన్ నిఘా...ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
‘ఇంత కష్టం అవసరమా?!’ అని ఎంతోమంది అన్నారు. అయినా సరే కుక్క కోసం వెదకడం ఆపలేదు. ఎట్టకేలకు వారి అలుపెరగని గాలింపుకు ఫలితం దక్కింది. తాజ్‌మహల్ సమీపంలోని అడవిలో సంచరిస్తున్న గ్రేహౌండ్స్‌ను కనుగొన్నారు. దీపయాన్, కస్తూరి దంపతులు సెలవు రోజుల్లో ఆగ్రాకు వెళ్లారు. వూఫ్, గ్రేహౌండ్స్ అనే పెంపుడు కుక్కలను కూడా వెంట తీసుకెళ్లారు. ఫతేపూర్ సిక్రీని సందర్శిస్తున్న సమయంలో....‘గ్రేహౌండ్స్ కనిపించడం లేదు’ అని తాము బస చేసిన హోటల్ నుంచి ఫోన్ వచ్చింది.
ఎలాగైనా గ్రేహౌండ్స్ ఆచూకి కనుక్కోవాలని అనుకున్న దీపయాన్, కస్తూరి దంపతులు రెండు వారాలపాటు ఆగ్రాలోనే ఉండి పోస్టర్లు వేస్తూ, బ్యానర్లు కడుతూ ఎన్నో ప్రాంతాలు తిరిగారు. అయినా ఫలితం లేకుండాపోయింది. గురుగ్రామ్‌కు తిరిగి వచ్చిన తరువాత కూడా తరచు ఆగ్రాకు వెళ్లేవారు. ఆటోలపై, దుకాణాలు, మెట్రో స్టేషన్‌ల దగ్గర ‘కనిపించడం లేదు’ అనే ప్రకటనలు అంటించేవారు.
వారి ప్రచారం సోషల్‌మీడియాకు కూడా చేరింది. దీంతో యానిమల్ రెస్క్యూ గ్రూప్‌లు, వాలెంటీర్‌లు కూడా రంగంలో దిగారు. ఒకానొక రోజు గ్రేహౌండ్‌ను చూసిన టూర్ గైడ్ ప్రశాంత్ జైన్ నుంచి దంపతులకు ఫోన్ వచ్చింది. అలా కథ సుఖాంతం అయింది. మూడు నెలల తరువాత గ్రేహౌండ్స్ తన పెంపుడు పేరెంట్స్ దగ్గరికి చేరుకుంది.
(చదవండి: ట్రక్కులోనే పదేళ్లుగా జీవనం..కారణం తెలిస్తే విస్తుపోతారు..!)
Comments
Please login to add a commentAdd a comment