హర్యానాలోని గురుగ్రామ్ ఇప్పుడు లగ్జరీ ప్రాపర్టీ మార్కెట్ విభాగంలో.. ముంబై, బెంగళూరులతో పోటీ పడుతోంది. అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్ ది కామెలియాస్‌లో వ్యాపారవేత్త 'రిషి పార్టి' (Rishi Parti) ఏకంగా రూ. 190 కోట్లు చెల్లించి.. 16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. ఇంతకీ రిషి పార్టీ ఎవరు? ఆయనకు సంబంధించిన కంపెనీలు ఏవి? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఎవరీ రిషి పార్టి?
ఇన్ఫో-ఎక్స్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, ఫైండ్ మై స్టే ప్రైవేట్ లిమిటెడ్, ఇంటిగ్రేటర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో సహా నాలుగు కంపెనీలకు 'రిషి పార్టి' డైరెక్టర్. అయితే ఎక్కువగా ఇన్ఫో-ఎక్స్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్‌పై ద్రుష్టి సారిస్తున్నారు. అంతే కాకుండా ఈయన ఏంజెల్ ఇన్వెస్టర్‌గా ఉన్నారు.
ఇన్ఫో-ఎక్స్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్
ఇన్ఫో-ఎక్స్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అనేది లాజిస్టిక్స్‌కు సంబంధించిన కంపెనీ. ఇది 2001లో ప్రారంభమైనట్లు సమాచారం. ఈ సంస్థ లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి లాజిస్టిక్స్ కంపెనీలలో కొత్తదనానికి మార్గం వేస్తోంది. రిషి పార్టి దీనిని 24ఏళ్ల వయసులో మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి ప్రారభించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ కంపెనీలో 150 ఉద్యోగులు పనిచేస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment