మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారం | A Girl Gangraped On Nagpur Outskirts Among Four Boy Friends | Sakshi

మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారం

Oct 9 2021 3:03 PM | Updated on Oct 9 2021 6:07 PM

A Girl Gangraped On Nagpur Outskirts Among Four Boy Friends - Sakshi

నాగ్‌పూర్‌:  ఎన్ని చట్టాలు తీసుకువస్తున్న మహిళలపై సామూహిక అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ  భారతదేశ వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న నేరాలకు అంతం లేదనిపిస్తుంది. ప్రస్తుతం ఇలాంటి ఘటనే నాగ్‌పూర్‌లో చోటు చేసుకుంది. ఈ మేరకు నాగపూర్‌లోని మాదవ్‌ నగరి ప్రాంతానిక చెందిన ఒక మైనర్‌ బాలిక్‌ తన బాయ్‌ ఫ్రెండ్‌తో కలిసి రాత్రి 8 గంటల సమయంలో నడుచుకుంటూ వెళ్తుండగా నలుగురు యువకులు వచ్చి వారిపై దాడి చేశారు.

(చదవండి: "అనుకోని అరుదైన వ్యాధి జీవితాన్నే మార్చేసింది")

ఈ క్రమంలో ఆ యువకులు ఆ బాలుడుని కొట్టి ఆ అమ్మాయిని ఒక నిర్మానుష ప్రాంతానికి తీసుకువెళ్లి సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ మేరకు పోలీసులు ఒక నిందుతుడిని అరెస్ట్‌ చేయగా మిగతా ముగ్గురు పరారీలో ఉన్నారు. అయితే థానేలోని డోంబివ్లి,  సకినాకాలో జరిగిన వరుస అత్యాచార ఘటనలన మరువక మునుపే మరి కొద్ది రోజులకే  మళ్లీ ఇలాంటి ఘటనే చోటు చేసుకోవటం అ‍త్యంత బాధాకరం.

(చదవండి: వరద ఉధృతిని నేరుగా వీక్షిస్తూ ఆస్వాదించచ్చు!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement