జార్ఖాండ్లోని పాకుర్ జిల్లాలో మషిహేశ్పుర్ పరిధిలో ఇద్దరు యవతులపై గత అర్థరాత్రి నలుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారని గురువారం పోలీసులు వెల్లడించారు. సమాచారం అందిన వెంటనే ఆ గ్రామానికి తరలివెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అత్యాచారానికి గురైన యువతులను వైద్యపరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.
నలుగురు నిందితులు అదే గ్రామానికి చెందని వారని పోలీసులు పేర్కొన్నారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.