జార్ఖండ్(Jharkhand )కు చెందిన ఈ పాతిక మందిలో ఎక్కువ మంది ఆదివాసీ అమ్మాయిలే. ఎవరూ ఎప్పుడూ ఢిల్లీకి వెళ్లలేదు. వీరికి ఢిల్లీకి వెళ్లే అవకాశం రావడమే కాదు రిపబ్లిక్ డే(Republic Day) వేడుకలలో పాల్గొని, రాష్ట్రపతి ముందు పైపర్ బ్యాండ్ పెర్‌ఫార్మెన్స్ ఇచ్చే అపూర్వ అవకాశం వచ్చింది.
కర్తవ్యపథ్ దగ్గర ప్రదర్శన(Republic Day Parade ) ఇవ్వడానికి దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన మూడు పాఠశాలల్లో జార్ఖండ్‌లోని సింగ్‌భమ్ జిల్లా ‘కస్తుర్బాగాంధీ బాలికా విద్యాలయ’ ఒకటి. ట్యూన్స్ వాయించడంలో కచ్చితత్వం, ఏకరూపత కారణంగా ఈ పైపర్ బ్యాండ్ ఎంపికైంది. రాష్ట్ర్రపతి ముందు ప్రదర్శన ఇవ్వబోతున్న ఈ గర్ల్ బ్యాండ్ ఉత్సాహంగా ఉంది. ‘ఇది చాలా గొప్ప అవకాశం. జీవితంలో ఎప్పుడూ మరచి΄ోలేని అవకాశం’ అంటుంది బ్యాండ్ సభ్యులలో ఒకరైన పార్వతి మహతో.
(చదవండి: డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం: స్టైలిష్ లుక్‌లో మెలానియా ట్రంప్)
Comments
Please login to add a commentAdd a comment