republic day parade
-
రిపబ్లిక్ డే పరేడ్‌లో ఆకట్టుకున్న శకటాలు
ఢిల్లీ: గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. భారత్ సాంస్కృతిక వైవిధ్యాన్ని, సైనిక నైపుణ్యాన్ని ప్రదర్శించింది. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రదర్శించిన శకటాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. అయోధ్య రాముడు, చంద్రయాన్-3 శకటాలు అందర్నీ ఆకర్షించాయి. ఈవీఎంలో ఓటు వేస్తున్నట్లు రూపొందించిన శకటం ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటిచెప్పింది. ► 'విక్షిత్ భారత్', 'భారత్ - లోక్తంత్రకి మాతృక' అనే జంట థీమ్‌ల ఆధారంగా ఈ ఏడాది జరిగిన కవాతులో 13,000 మంది ప్రత్యేక అతిథులు పాల్గొన్నారు. ► మొదటిసారిగా, శంఖం, నాదస్వరం, నగడ వంటి భారతీయ సంగీత వాయిద్యాలను వాయిస్తూ 100 మంది మహిళా కళాకారులు కవాతును ప్రారంభించారు. ► కర్తవ్య మార్గంలో మహిళలతో కూడిన ట్రై-సర్వీస్ బృందం తొలిసారిగా కవాతు చేసింది. మహిళా పైలట్లు కూడా 'నారీ శక్తి'ని సూచిస్తూ ఫ్లై పాస్ట్ సమయంలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF) దళం కూడా పూర్తిగా మహిళా సిబ్బందిని కలిగి ఉంది. ► భారత అంతరిక్ష పరిశోధక సంస్థ ప్రదర్శించిన చంద్రయాన్-3, ఆదిత్య ఎల్1 శకటం ఆకట్టుకుంది. చంద్రునిపై విక్రమ్ ల్యాండర్ దిగుతున్న దృశ్యాలను ఇందులో పొందుపర్చారు. మహిళా శాస్త్రవేత్తలు ల్యాండర్ దిగిన శివశక్తి పాయింట్‌ను కూడా చూపించారు. ► అయోధ్యలో ఇటీవల ప్రారంభమైన బాల రాముని శకటం ఆకర్షించింది. రామ మందిర ప్రారంభోత్సవానికి గుర్తుగా దీన్ని ప్రదర్శించారు. బాల రాముడు విల్లు, బాణాలు ధరించిన రూపాన్ని శకటంలో రూపొందించారు. ► దేశంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమైతోంది. ఈ క్రమంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటిచెప్పడానికి ఎన్నికల సంఘం ఈవీఎంలో ఓటు వేస్తున్నట్లు రూపొందించిన శకటం ఆకర్షణగా నిలిచింది. ► కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, ఢిల్లీ పోలీసుల బృందాలకు మహిళా సిబ్బంది నాయకత్వం వహించారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కాంటింజెంట్కి అసిస్టెంట్ కమాండెంట్ మోనికా లక్రా నాయకత్వం వహించారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌కు అసిస్టెంట్ కమాండెంట్ తన్మయీ మొహంతి నాయకత్వం వహించారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు అసిస్టెంట్ కమాండెంట్ మేఘా నాయర్ లీడర్‌గా వ్యవహరించారు. ఇదీ చదవండి: భారత విద్యార్థులకు మాక్రాన్ రిపబ్లిక్ డే కానుక -
రిపబ్లిక్ డే పరేడ్‌లో చరిత్ర సృష్టించిన మన ‘రాకెట్ గర్ల్స్'
#RepublicDay2024-ISRO Tableau 75వ రిపబ్లిక్ డే పరేడ్‌లో సగర్వంగా కవాతు నిర్వహించి భారతదేశపు రాకెట్ అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. 'చంద్రయాన్-3 - ఎ సాగా ఇన్ ది ఇండియన్ స్పేస్ హిస్టరీ' కర్తవ్య పథంలోకి దూసుకెళ్లి రికార్డు క్రియేట్ చేశారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఆధ్వర్యంలోని శకటంపై చంద్రయాన్ -3 మిషన్ సాధించిన విజయాలను, ఆదిత్య ఎల్ వన్ ప్రాజెక్ట్ వివరాలు, 'బాహుబలి రాకెట్' లాంచ్ వెహికల్ మార్క్ 3 నమూనా తదితర వివరాలను ప్రదర్శించింది. అలాగే అంతరిక్ష పితామహులు, ఖగోళ శాస్త్రవేత్తలు ఆర్యభట్ట , వరాహమిహిరులు కూడా ఈ శకటంలో దర్శనిమచ్చారు. చంద్రుని దక్షిణ ధ్రువంలో విజయవంతంగా దిగిన ల్యాండింగ్ సైట్‌ను శివ శక్తి పాయింట్‌తోపాటు విక్రమ్ ల్యాండర్ , ప్రజ్ఞాన్ రోవర్ వివరాలను ప్రదర్శించింది. బెంగుళూరు, అహ్మదాబాద్, తిరువనంతపురం, శ్రీహరికోటలోని వివిధ ఇస్రో కేంద్రాలకు చెందిన ఎనిమిది మంది మహిళా శాస్త్రవేత్తల బృందం ఆహూతులను ఆకట్టుకున్నారుఇస్రో షీరోలైన ఆదిత్య L1 మిషన్ డైరెక్టర్ నిగర్ షాజీ ,చంద్రయాన్-2 మిషన్‌కు నాయకత్వం వహించిన ఎం వనిత, ఎర్త్ ఇమేజింగ్ ఉపగ్రహం ఓషన్‌శాట్ తయారీ మిషన్ హెడ్ శ్రీమతి తేన్మొళి సెల్వి కె , చంద్రయాన్-3 మిషన్‌కు డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ కల్పన తదితరులు దీనికి నాయకత్వం వహించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా మరో 220 మంది మహిళా శాస్త్రవేత్తలు కవాతు చేశారు. రెండు చారిత్రాత్మక విజయాల తర్వాత ఇస్రో ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొంది. Happy Republic Day🇮🇳#ISRO’s #RepublicDay tableau led on Kartavya Path by Bharat’s #NariShakti. pic.twitter.com/XP2g6bAuJY — ISRO InSight (@ISROSight) January 26, 2024 దేశ రాజధాని నగరంలో ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ ఏడాది వేడుకల్లో త్రివిధ దళాల్లో అందరూ మహిళలే ఉండటం విశేషం. కర్తవ్య పథ్‌లో త్రివిధ దళాల మహిళా అధికారుల నేతృత్వంలో మహిళాబృందం తొలిసారిగా మార్చ్ చేసి రికార్డు క్రియేట్ చేశారు. ఆర్మీ డెంటల్ కార్ప్స్ నుండి కెప్టెన్ అంబా సమంత్, ఇండియన్ నేవీ నుండి సర్జ్ లెఫ్టినెంట్ కాంచన,ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన లెఫ్టినెంట్ దివ్య ప్రియతో కలిసి మేజర్ సృష్టి ఖుల్లర్ నేతృత్వంలోని ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్‌కు చెందిన పూర్తి మహిళా బృందం కర్తవ్యపథ్‌లో నారీ శక్తి పేరుతో విన్యాసాలను ప్రదర్శించడం విశేషంగా నిలిచింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ఈ ఉత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. Happy Republic Day to all Indians and #ISRO lovers 🇮🇳 The #RepublicDayParade today featured a Chandrayaan-3/ISRO tableau!! Here's the video of that:pic.twitter.com/6blzAUj8nn — ISRO Spaceflight (@ISROSpaceflight) January 26, 2024 -
Republic Day 2024: కర్తవ్య పథ్‌లో దళ నాయికలు
ఢిల్లీ పోలీస్ మొదటిసారి రిపబ్లిక్ డే పరేడ్‌లో సంపూర్ణ మహిళా దళాన్ని కవాతు చేయించనుంది. ఇదొక రికార్డు. ఈ దళానికి ఐపిఎస్ శ్వేత కె సుగాధన్ నాయకత్వం వహించనుంది. అలాగే ఇండియన్ కోస్ట్ గార్డ్ దళానికి అసిస్టెంట్ కమాండెంట్ చునౌతి శర్మ నాయకత్వం వహించనుంది. ఇదీ రికార్డే. భారత త్రివిధ దళాలలో, రక్షణ దళాలలో మహిళల భాగస్వామ్యం ప్రతి ఏటా ప్రాధాన్యం సంతరించుకుంటోంది. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో మహిళా శక్తి తన స్థయిర్యాన్ని ప్రదర్శించనుంది. దేశ రక్షణలో, సాయుధ ప్రావీణ్యంలో తాను ఎవరికీ తీసిపోనని చాటి చెప్పనుంది. గత రెండు మూడు సంవత్సరాలుగా రిపబ్లిక్ డే పరేడ్‌లో మహిళలకు దొరుకుతున్న ప్రాధాన్యం ఈ సంవత్సరం కూడా కొనసాగుతోంది. అంతే కాదు గత కొన్నాళ్లుగా త్రివిధ దళాలలో ప్రమోషన్లు, ర్యాంకులు, నియామకాల్లో స్త్రీలకు సంబంధించిన పట్టింపులు సడలింపునకు నోచుకుంటున్నాయి. ప్రాణాంతక విధుల్లో కూడా స్త్రీలు ఆసక్తి ప్రదర్శిస్తే వారిని నియుక్తులను చేయడం కనిపిస్తోంది. ఆ తెగువే ఇప్పుడు రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రదర్శితం కానుంది. ఢిల్లీ మహిళా దళం ఈ సంవత్సరం గణతంత్ర వేడుకలలో ఢిల్లీ పోలీసులు సంపూర్ణ మహిళా దళాన్ని కవాతు చేయించాలని, దానికి మరో మహిళా ఆఫీసర్ నాయకత్వం వహించాలని నిర్ణయించడం చరిత్రాత్మకం. ఎప్పుడో 1975లో ఢిల్లీ పోలీసు దళానికి నాటి ఐ.పి.ఎస్. ఆఫీసర్ కిరణ్ బేడీ నాయకత్వం వహించి చరిత్ర సృష్టించింది. మళ్లీ గత సంవత్సరంగాని ఐ.పి.ఎస్. ఆఫీసర్ శ్వేత కె సుగాధన్కు నాయకత్వం వహించే అవకాశం రాలేదు. అయితే ఆ దళంలో ఉన్నది మగవారు. ఈసారి మాత్రం పూర్తి మహిళా దళం పాల్గొననుండటం విశేషం. దీనికి తిరిగి శ్వేత కె సుగాధన్ నాయత్వం వహించనుండటం మరో విశేషం. నార్త్ ఢిల్లీకి అడిషినల్ డీసీపీగా పని చేస్తున్న శ్వేత కె సుగాధన్ది కేరళ. 2015లో బి.టెక్ పూర్తి చేసిన శ్వేత మొదటిసారి కాలేజీ టూర్లో ఢిల్లీని దర్శించింది. 2019లో యు.పి.ఎస్.సి. పరీక్షలు రాయడానికి రెండోసారి ఢిల్లీ వచ్చింది. అదే సంవత్సరం ఐ.పి.ఎస్.కు ఎంపికైన శ్వేత ఇప్పుడు అదే ఢిల్లీలో గణతంత్ర దినోత్సవంలో దళ నాయకత్వం వహించే అవకాశాన్ని పొందింది. శ్వేత దళంలో మొత్తం 194 మంది మహిళా హెడ్ కానిస్టేబుళ్లు ఉంటారు. వీరిలో 80 శాతం మంది ఈశాన్య రాష్ట్రాలకు చెందినవారు. ఢిల్లీ పోలీసు విభాగంలో ఈశాన్య రాష్ట్రాల మహిళల నియామకానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. అందుకే శ్వేత నాయకత్వం వహించే దళంలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన మహిళా పోలీసులే ఉంటారు. మరో విశేషం ఏమంటే ఈసారి ఢిల్లీ పోలీస్ బ్యాండ్‌కు రుయాంగియో కిన్సే అనే మహిళా ఆఫీసర్ నాయకత్వం వహించనుంది. 135 మంది పురుష కానిస్టేబుళ్లు ఢిల్లీ పోలీసు గీతాన్ని కవాతులో వినిపిస్తూ ఉంటే వారికి కిన్సే నాయకత్వం వహించనుంది. కోస్ట్ గార్డ్‌కు చునౌతి శర్మ గణతంత్ర వేడుకలలో ఇండియన్ కోస్ట్ గార్డ్ దళానికి అసిస్టెంట్ కమాండెంట్ చునౌతి శర్మ నాయకత్వం వహించనుంది. తీర ప్రాంతాల గస్తీకి, అసాంఘిక కార్యకలాపాల నిరోధానికి నియుక్తమైన ఇండియన్ కోస్ట్ గార్డ్ తన ప్రాతినిధ్య దళంతో పరేడ్‌లో పాల్గొననుంది. దీనికి నాయకత్వం వహించే అవకాశం రావడం పట్ల చునౌతి శర్మ ఆనందం వ్యక్తం చేసింది. ‘గతంలో నేను ఎన్సీసీ కేడెట్‌గా పరేడ్‌లో పాల్గొన్నాను. ఎన్సీసీలో మహిళా కాడెట్ల దళం, పురుష కాడెట్ల దళం విడిగా ఉంటాయి. కాని ఇక్కడ నేను కోస్ట్ గార్డ్ పురుష జవాన్ల దళానికి నాయకత్వం వహించనున్నాను. ఈ కారణానికే కాదు మరోకందుకు కూడా ఈ వేడుకల నాకు ప్రత్యేకమైనవి. ఎందుకంటే నా భర్త శిక్కు దళానికి పరేడ్‌లో నాయకత్వం వహించనున్నాడు. దేశ సేవలో ఇదో విశిష్ట అవకాశం’ అందామె. వీరే కాదు... త్రివిధ దళాల మరిన్ని విభాగాలలోనూ స్త్రీల ప్రాధాన్యం ఈ రిపబ్లిక్ డే వేడుకల్లో పథం తొక్కనుంది. -
ఢిల్లీ పరేడ్‌కు అసామాన్యులు
ఈసారి గణతంత్ర దినోత్సవ ఉత్సవాలకు తెలంగాణ నుంచి ‘అసామాన్యులు’ హాజరై తెలంగాణకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఒకరు హైదరాబాద్ స్వీపర్ నారాయణమ్మ. మరొకరు కోదాడ మొబైల్ షీ టాయిలెట్ నిర్వహిస్తున్న నాగలక్ష్మి. ప్రజల కోసం భిన్నమైన ఉపాధుల్లో అంకితభావంతో పని చేస్తున్న వీరిద్దరూ ‘శ్రమయేవ జయతే’కు నిజమైన ప్రతీకలు. నారాయణమ్మ, నాగలక్ష్మిల పరిచయం. నారాయణమ్మ దినచర్యను చూస్తే కర్మయోగుల దినచర్యలా అనిపిస్తుంది. తెల్లవారుజాము నాలుగ్గంటలకు నిద్ర లేస్తుందామె. స్నానపానాదులు ముగించుకుని గంటసేపు గురుధ్యానం చేసి కొద్దిగా టీ తాగి ఆరు గంటలకంతా బంజారాహిల్స్‌లోని కాలనీలో రోడ్లు ఊడ్చే పనిలోకి వస్తుంది. పెదాల మీద ఏదో ఒక జానపదగీతమో, గురు తత్వమో, స్మరణో లేకుండా నారాయణమ్మ కనిపించదు. అందుకే ఆమెను అందరూ ‘సింగింగ్ స్వీపర్’ అంటారు. 22 సంవత్సరాలుగా నగరాన్ని తన చేతులతో శుభ్రం చేస్తూ స్వస్థతనిస్తూ మరోవైపు వీలున్నప్పుడల్లా భజనలకు, భక్తి కార్యక్రమాలకు హాజరయ్యి ముక్తిమార్గాన్ని చూపుతూ నారాయణమ్మ చేస్తున్న సేవ సామాన్యం కాదు. అందుకే ఆమెను రిపబ్లిక్ డేకి ఢిల్లీ పంపాలని జి.హెచ్.ఎం.సి. అధికారులు నిశ్చయించారు. ‘ఇది విని మావాళ్లంతా చాలా సంతోషించారు. మంచి కర్మల ఫలితం ఇది’ అంటుంది నారాయణమ్మ. బావులు తవ్వుతూ రంగారెడ్డి జిల్లా యాచారంకు చెందిన నారాయణమ్మ భర్తతో కలిసి బావులు తవ్వే పనికి వెళ్లేది. అది చాలా శ్రమతో కూడిన పని. అయినా పదిహేను ఇరవై రోజుల్లో బావిని తవ్వి జలను బయటకు తేవడంలో ఆమెకు తృప్తి కలిగేది. తర్వాత జెసీబీలు వచ్చాయి. బావుల స్థానంలో బోర్లు వచ్చాయి. దాంతో పొట్ట చేత్తో పట్టుకుని హైదరాబాద్ చేరుకుంది నారాయణమ్మ. అప్పటికే తల్లి స్వీపర్‌గా చేస్తుండంతో తన పని కూతురికి అప్పజెప్పింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ అదే పనిలో కొనసాగుతూ ఉంది నారాయణమ్మ. నెలకు 14 వేలు వస్తాయి. కొడుకు లారీ డ్రైవర్‌గా చేస్తున్నాడు. కూతురిని స్వీపర్ ఉద్యోగంలోనే పెట్టించింది. జీవుడే దేవుడు నారాయణమ్మకు భక్తి ఎక్కువ. పెళ్లయినప్పటి నుంచి భర్తతో కలిసి దేశంలోని గుళ్లన్నీ తిరిగేది. సంపాదించినది అంతా తీర్థయాత్రలకే ఖర్చు పెట్టింది. ‘కాని గుళ్లన్నీ తిరిగాక జీవుడిలోనే దేవుడు ఉన్నాడని గ్రహించాను. కరీంనగర్ జిల్లాకు చెందిన నిత్యానంద రాజేశ్వరాచార్యుల దగ్గర గురుబోధ తీసుకున్నా. నన్ను నేను ఆత్మజ్ఞానిగా మార్చుకున్నా. మనిషి చిత్తం విచిత్రం. అతను లోకాన్ని తరచి చూసి ముక్తిపొందాలంటే గురువును తెలుసుకుని గురుబోధతో నడుచుకోవాలి. అజ్ఞానాన్ని తవ్వి బయట పారేయాలి’ అంటుంది నారాయణమ్మ. ఆమెకు రోకటి పాటల దగ్గరి నుంచి మంగళహారతి పాటల వరకూ కరతామలకం. రామయణ, భారతాలను కూడా పాటలుగా పాడుతుంది. వేమన పద్యాల నుంచి సంస్కృత పద్యాల వరకూ అన్నీ చెబుతుంది. ఆమె ధారణకు, ఆధ్యాత్మిక అవగాహనకు ఎవరైనా నమస్కరించాల్సిందే. కోదాడలో అమూల్యసేవ సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకూ నాగలక్ష్మి నిర్వహించే మొబైల్ షీ టాయిలెట్ కనిపిస్తుంది. 30 ఏళ్ల ఈ డబుల్ డిగ్రీ హోల్డర్ కోదాడ మునిసిపల్ ఉద్యోగిగా మొబైల్ టాయిలెట్‌ను నిర్వహించడానికి, తిప్పడానికి ఏ మాత్రం సిగ్గుపడదు. ‘ఐదేళ్లుగా ఈ టాయిలెట్‌ను నిర్వహిస్తున్నాను. ఆటోకు బిగించిన టాయిలెట్‌ను రోజూ నేను ఉదయం ఎనిమిదన్నర నుంచి పట్టణంలో తిప్పుతాను. గుళ్ల దగ్గర, బస్టాండ్ దగ్గర, మార్కెట్ దగ్గర అవసరాన్ని బట్టి ఉంచుతాను. పనుల కోసం పల్లెల నుంచి వచ్చిన స్త్రీలు తగిన టాయిలెట్లు లేక ఇబ్బంది పడతారు. వారు నా మొబైల్ టాయిలెట్‌ను చూడగానే ఎంతో రిలీఫ్ ఫీలవుతూ ఉపయోగిస్తారు. నేను గమనించేదేమిటంటే ఆ ఒత్తిడి తీరాక వారు చల్లగా బతకమ్మా ఆని ఆశీర్వదించడం. ముఖ్యంగా గర్భిణి స్త్రీలు ఎంతో సంతోషపడతారు’ అంటుంది నాగలక్ష్మి. ఈ మొబైల్ టాయిలెట్ ఉపయోగించుకోవడానికి ఏమీ రుసుము చెల్లించనక్కర లేదు. మధ్యాహ్నం వరకూ ఈ వాహనాన్ని నడిపే నాగలక్ష్మి మధ్యాహ్నం భోజన విరామం తీసుకుని మళ్లీ సాయంత్రం వరకూ తిప్పుతుంది. ‘మా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది’ అంటుందామె. ఆమె అంకితభావాన్ని గమనించిన జి.హెచ్.ఎం.సి. అధికారులు ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలకు తెలంగాణ ప్రతినిధిగా ఢిల్లీకి పంపుతున్నారు. -
Republic Day Parade: పోరాట యోధుల థీమ్‌తో తెలంగాణ శకటం
న్యూఢిల్లీ: ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల కవాతుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర శకటాలు ఎంపికయ్యాయి. మదర్ ఆఫ్ డెమోక్రసీ పేరిట ఈ ఏడాది తెలంగాణ శకటం ఆకట్టుకోనుంది. చాకలి ఐలమ్మ, కొమరం భీం, రాంజీ గోండు తదితర పోరాట యోధులతో శకటాన్ని ఏర్పాటు చేశారు. ఈ థీమ్‌కు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. జనవరి 26న కర్తవ్యపథ్‌లో తెలంగాణ శకటం సందడి చేయనుంది. కాగా తెలంగాణ శకటం ప్రదర్శనకు వచ్చే సమయంలో దానికి ఇరువైపులా రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా కొమ్ముకోయ, గుస్సాడి, డప్పుల నృత్యాల కళాకారుల ప్రదర్శన ఉండే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో ఒకసారి, 2020లో మరోసారి రిపబ్లిక్ డే పరేడ్‌లో తెలంగాణ శకటం కనువిందు చేయగా మళ్లీ నాలుగేళ్ల తర్వాత ప్రస్తుత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర శకటానికి అవకాశం లభించింది మరోవైపు రిపబ్లిక్ డే పరేడ్ కోసం ఎంపికైన ఏపీ శకటం.. ఈసారి డిజిటల్ క్లాస్ రూమ్ థీమ్‌తో ప్రదర్శనకు ఏర్పాటైంది. దేశంలోనే తొలిసారిగా 62,000 డిజిటల్ క్లాస్ రూమ్‌ల ద్వారా విద్యాబోధన చేస్తున్న రాష్ట్రంగా ఏపీ చరిత్ర సృష్టించింది. ఇదే అంశాన్ని దేశం మొత్తం చాటిచెప్పేలా.. శకటం రూపకల్పన జరిగింది. జనవరి 26న కర్తవ్య పథ్‌లో వికసిత్ భారత్ థీమ్‌లో భాగంగా రిపబ్లిక్ డే వేడుకల్లో కనువిందు చేయనుంది. -
రిపబ్లిక్ వేడుకల్లో ఏపీ శకటంగా జగనన్న విజన్!
ఢిల్లీ, సాక్షి: దేశ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో.. తొలిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చరిత్ర సృష్టించబోతోంది. రిపబ్లిక్ డే కోసం శకటాల ఎంపికలో వైవిధ్యతను కనబర్చింది. రాష్ట్రంలోని పరిస్థితులకు తగ్గట్లే.. డిజిటల్ క్లాస్ రూమ్ థీమ్ శకటం ఈసారి రిపబ్లిక్ డే పరేడ్‌కు సిద్ధమైంది. దేశంలో 62,000 డిజిటల్ క్లాస్ రూమ్‌ల బోధన ద్వారా ఏపీ చరిత్ర సృష్టించింది. ప్రపంచంతో పోటీ పడే విధంగా విద్యార్థులను అందించాలన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి లక్ష్యానికి తగ్గట్లుగానే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇదే అంశాన్ని దేశం మొత్తం చాటిచెప్పేలా.. శకటం రూపకల్పన జరిగింది. డిజిటల్ క్లాస్ రూమ్ థీమ్‌తో రూపొందించిన శకటం.. అదీ ఏపీ తరఫున తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సందడి చేయబోతోంది. జనవరి 26వ తేదీన కర్తవ్య పథ్ లో వికసిత్ భారత్ థీమ్‌లో భాగంగా కనువిందు చేయనుంది జగనన్న విజన్‌ను ప్రతిబింబించే ఏపీ శకటం. -
సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతున్నారు.. బీజేపీ నేత ఫైర్
బీజేపీ చెత్త రాజకీయలు చేస్తోందన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విమర్శలపై ఢిల్లీ బీజేపీ నేత మన్జిందర్ సింగ్ సిర్సా మండిపడ్డారు. ‘రిపబ్లిక్ డే’ సందర్భంగా రాష్ట్రాలకు సంబంధించి ప్రదర్శించే ఘాటాల వ్యవహారంపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతున్నారని మన్జిందర్ అన్నారు. ఇటీవల ఇదే విషయంపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్.. కేంద్ర బీజేపీ ప్రభుత్వం రిపబ్లిక్ డే ఘాటాల విషయంలో పంజాబ్‌పై తీవ్రమైన వివక్ష చూపుతోందని మండిపడ్డ విషయం తెలిసిందే. అయితే తాజాగా ఢిల్లీ బీజేపీ నేత మన్జిందర్ స్పందించి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. పంజాబ్ రాష్ట్ర ఘాటాన్ని తిరస్కరించడానికి అసలైన నిజం మరోటి ఉందని తెలిపారు. పంజాబ్ రూపొందించే ఘాటంపై మై భాగో జీ, అమరవీరుల ఫొటోలకు బదులుగా.. పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఫొటోలు ఉన్నాయని అన్నారు. భగవంత్ మాన్ సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. అందుకే పంజాబ్ ఘాటం తిరస్కరణకు గురైందని తెలిపారు. భగవంత్ మాన్.. పంజాబ్ సార్వభౌమత్వాన్ని కేజ్రీవాల్ కాళ్ల వద్ద వదిలేశారని తీవ్రంగా దుయ్యబట్టారు. The real reason for rejection of Punjab Tableau is that it prominently showed pics of Arvind Kejriwal & Bhagwant Mann rather than Mai Bhago Ji or martyrs! Mann Sahab is shamelessly lying; and worst is he has surrendered Punjab’s sovereignty in the feet of Kejriwal. Tussi Ta… pic.twitter.com/qF81TUHOyC — Manjinder Singh Sirsa (@mssirsa) December 29, 2023 ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల సంబంధించిన ఘాటాలను ‘రిపబ్లిక్ డే’ ఉత్సవాలకు పంజాబ్ ఘాటం ఎంపిక చేయకుండా బీజేపీ చెత్త రాజకీయాలు చేస్తోందని ఆప్ నేత ప్రియాంఖ్ కక్కర్ శుక్రవారం విమర్శలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, అస్సాం, ఉత్తర్ఖండ్లకు చెందిన ఘాటాను వరుసగా ఎంపిక చేస్తోందని.. ఢిల్లీ, పంజాబ్‌లను మాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా పక్కకు తప్పించిందని మండిపడ్డారు. చదవండి: క్షమాపణ చెప్పిన అస్సాం సీఎం.. శ్లోకంపై క్లారిటీ.. -
గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఇప్పటికే ఫ్రాన్స్ అధ్యక్షుడిని ప్రధాని మోదీ ఆహ్వానించగా.. ఇందుకు మెక్రాన్ కూడా అంగీకరించారు. ఈ మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎక్స్(ట్విటర్)లో స్పందించారు. నా ప్రియమైన మిత్రుడు మోదీ.. మీ ఆహ్వానానికి ధన్యవాదాలు. మీ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మీతో వేడుకలను జరుపుకోవడానికి నేను వస్తున్నాను’ అని పేర్కొన్నారు. Thank you for your invitation, my dear friend @NarendraModi. India, on your Republic Day, I’ll be here to celebrate with you! — Emmanuel Macron (@EmmanuelMacron) December 22, 2023 కాగా రిపబ్లిక్ డే పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యే ఆరో ఫ్రెంచ్ నేత మాక్రాన్. మాజీ ఫ్రెంచ్ ప్రధాన మంత్రి జాక్వెస్ చిరాక్ రెండుసార్లు(1976,1998) ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మాజీ అధ్యక్షులు వాలెరీ గిస్కార్డ్ డి ఎస్టేయింగ్, నికోలస్ సర్కోజీ, ఫ్రాంకోయిస్ హోలాండ్ వరుసగా 1980, 2008, 2016లో వేడుకలకు విచ్చేశారు. మరోవైపు ఈ ఏడాది జులైలో పారిస్‌లో జరిగిన ఫ్రాన్స్ జాతీయ దినోత్సవమైన బాస్టిల్ డే పరేర్కు ప్రధాని మోదీ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఆ తర్వాత ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సుకు మెక్రాన్ వచ్చారు. ఇక గణతంత్ర దినోత్సవ వేడుకలకు భారత్ తన మిత్ర దేశాల నేతలను ఆహ్వానించడం 1950 నుంచి సంప్రదాయంగా వస్తోన్న విషయం తెలిసిందే. చదవండి: నానమ్మ ఇందిరా గాంధీపై వరుణ్ ప్రశంసలు -
గణతంత్ర దినాన... తెలుగు ప్రభలు
భారతదేశం విభిన్న సంస్కృతి సంప్రదాయాల సమాహారం. వందల ఏళ్ల నాటి సంప్రదాయాలను నేటికీ కొనసాగించడం దేశం గర్వించదగ్గ విషయం. సంక్రాంతి పర్వ దినాలలో భాగంగా కోన సీమ ప్రాంతంలో నిర్వహించే ప్రభల తీర్థాలు అత్యంత విశిష్టమైనవే కాక 400 సంవత్సరాల చరిత్ర కలిగినవి. ఈ ఏడాది ఢిల్లీలో జరిగే ప్రధాన గణతంత్ర వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ప్రభల తీర్థం’ ఇతివృత్తంగా తయారుచేసిన శకటాన్ని ప్రదర్శిస్తోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం, జగ్గన్నతోటలో నిర్వహించే ప్రభల తీర్థం కోనసీమలో అత్యంత ముఖ్యమైన సాంస్కృతిక వేడుక. క్రీ.శ 17వ శతాబ్దంలో ప్రభల తీర్థాన్ని ప్రారంభించారని అంటారు. 11 గ్రామాల నుండి వచ్చిన ఏకాదశ రుద్రులు ఇక్కడ కొలువై ఉంటారని ప్రతీతి. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభల తీర్థం విశిష్టతను కొనియాడుతూ నిర్వాహకులకు లేఖను రాశారు. సంప్రదాయబద్ధంగా, భక్తి శ్రద్ధలతో వెదురు, తాటి కర్రలను, రంగు రంగుల కొత్త బట్టలు, నూలుదారాలను, కొబ్బరి తాళ్ళను, రంగు కాగితాలను, నెమలి పింఛాలను ఉపయోగించి ఒక అందమైన ప్రభను తయారు చేసి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆయా గ్రామాల నుండి ఉత్సవ ప్రదేశానికి అంగరంగ వైభవంగా భుజాలపై ఆ ప్రభలను మోసుకువస్తారు. కుల మతాలకు అతీతంగా ఈ తీర్థానికి భక్తులు హాజరవ్వడం విశేషం. ప్రతియేటా సంక్రాంతి పర్వదినాల్లో కనుమ నాడు ఈ తీర్థాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. కోనసీమ వ్యాప్తంగా దాదాపు 200 గ్రామాల్లో ప్రభల తీర్థాలను నిర్వహిస్తారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలోనే కాక కృష్ణా జిల్లాలోనూ ప్రభల సంప్రదాయం ఉన్నది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ ప్రాంతాలకు చెందిన ప్రజలు దేశ, విదేశాలలో ఎక్కడ ఉన్నా... సంక్రాంతి సమయానికి మాత్రం వారి వారి స్వగ్రామాలకు చేరుకొని, ప్రభల తీర్థా లలో పాల్గొంటారు. మేళ తాళాలు, సంప్రదాయ నృత్యాల నడుమ బాణసంచా కాలుస్తూ సంప్రదాయ సంగీత వాద్యాలు, ‘గరగ’ జానపద కళారూపం వంటివాటిని ప్రదర్శిస్తూ వేడుకలు చేసుకుంటారు. సంప్రదాయ కళలకు, వాటినే నమ్ముకుని జీవిస్తున్న కళాకారులకు ఈ ఉత్సవాలు ప్రోత్సాహం ఇస్తాయి. చిన్న చిన్న బొమ్మలు, జీళ్ళు, కర్జూరం, గృహోపకరణాలు వంటివాటిని అమ్ముకుని జీవించే అనేక మంది చిరు వ్యాపారులకు ఆర్థికంగా చేయూత ఇస్తున్నాయి ఈ తీర్థాలు. ప్రభల తీర్థ మహోత్సవాల్లో కొలువుదీరే ప్రభలలో వాకల గురువు (52 అడుగుల ఎత్తు), తొండవరం (51 అడుగుల ఎత్తు) ప్రభలు రాష్ట్రంలోనే అత్యంత ఎల్తైన ప్రభలుగా గుర్తింపబడ్డాయి. ఇంత ఎల్తైనప్రభలను తయారు చేయడం, వాటిని గ్రామస్థులు తమ భుజస్కంధాలపై ఎత్తుకుని కొబ్బరి, వరి పొలాలు, కాలువలు దాటుకుంటూ తీర్థం జరిగే ప్రదేశానికి తీసుకురావడం ఎంతో శ్రమతో కూడిన పని. పెద్ద ప్రభలకు బాసటగా పిల్ల ప్రభలను కొలువుదీరుస్తారు. వీటిని స్వయంగా 10 నుండి 15 ఏళ్ల వయసు ఉన్న చిన్నారులు తయారు చేస్తారు. సమాజంలో శాంతి, లోక కల్యాణం కోసం ప్రజలు ఏకాదశ రుద్రులను ప్రార్థిస్తారు. రైతులను సంఘటితం చేసేందుకు, వారి ఐక్యతను పెంపొందించేందుకు ఇవి ఉపయోగపడతాయని భావి స్తారు. ఇంతటి సాంస్కృతిక ప్రాధాన్యం కలిగిన ప్రభల తీర్థాలను ప్రతిబింబిస్తూ... గణతంత్ర దినోత్సవంలో ప్రదర్శించ తలపెట్టిన రాష్ట్ర శకటం ఎంతో ఆకర్షణీయంగా ఉంది. శకటం ముందు భాగంలో కోనసీమ జిల్లాలో సంక్రాంతి పర్వదినాల సందర్భంగా అలంకరించినట్లుగా ఉన్న ఒక గూడు ఎడ్ల బండిపై రైతు కుటుంబం ప్రయాణిస్తున్నట్లుగా చిత్రించారు. అలాగే కోనసీమ ప్రకృతి అందాలను ప్రతిబింబించే విధంగా వరి పొలం గట్టుపై ఈ బండి వెళుతున్నట్లుగాను, వరి ధాన్యాన్నీ, ఈ ప్రాంతంలో పండే కొన్ని కూరగాయలను, పొలాలను కూడా చిత్రించారు. దాని వెనుకే శోభాయమానంగా అలంకరించిన ప్రభలను, బోయీలు మోస్తున్న పల్లకీని ప్రదర్శిస్తున్నారు. ప్రభలను రైతులు పూజించే విధానాన్నీ, కోనసీమలో సంప్రదాయ ‘గరగ నృత్యం’ విశిష్ట తనూ తెలిపేవిధంగా ప్రదర్శన ఉంటుంది. వెనుక భాగంలో కోనసీమ కొంగుబంగారం కొబ్బరి చెట్లు ఎటూ ఉంటాయనుకోండి! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ శకటం ప్రదర్శించడం ద్వారా తెలుగు ప్రజల సంస్కృతీ సంప్రదాయాలకు పెద్దపీట వేసింది. తద్వారా రైతు పండుగకు అగ్రతాంబూలం ఇచ్చింది. (క్లిక్ చేయండి: సకల శక్తుల సాధన సబ్‌ప్లాన్) - నేలపూడి స్టాలిన్ బాబు సామాజిక రాజకీయ విశ్లేషకులు -
ఢిల్లీలో ఘనంగా 74వ రిపబ్లిక్ డే.. అబ్బురపరిచిన శకటాల ప్రదర్శన
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 74వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. కర్తవ్యపథ్‌లో నిర్వహించిన పరేడ్‌లో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ప్రత్యేక అతిథి, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా పాల్గొన్నారు. సైనికులు కవాతు నిర్వహించి వీరికి ఘన స్వాగతం పలికారు. అనంతరం 21 గన్‌సెల్యూట్‌తో త్రివర్ణపతాక ఆవిష్కరణ జరిగింది. ఈ వేడుకల్లో ప్రదర్శించిన 23 శకటాలు దేశంలో భిన్న సంస్కృతిని ప్రతిబింబించాయి. 17 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు, వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన 6 శకటాలను ప్రదర్శించారు. ఈ ఈజిప్టు సైనికులు నిర్వహించిన కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశనలుమూల నుంచి వచ్చిన కళాకారుల ప్రదర్శన ఆకట్టుకుంది. సైనికుల సాహసాలు అబ్బురపరిచాయి. ఆత్మనిర్బర్ భారత్.. ఆత్మనిర్బర్ భారత్ ప్రతిబించేలా ఈసారి వేడుకల్లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఆయుధాలు, ఆయుధ వ్యవస్థలనే ప్రదర్శించారు. 105 ఎంఎం ఇండియన్ ఫీల్డ్ తుపాకులు, ఇటీవలే సైన్యంలో చేరిన ఎల్సీహెచ్ ప్రచండ్, కే-9 వజ్ర హోవిట్జర్, ఎంబీటీ అర్జున్, నాగ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్, ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్, క్విక్ రియాక్షన్ ఫైటింగ్ వెహికిల్స్‌ను ప్రదర్శించారు. పరేడ్ అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించడంతో గణతంత్ర వేడుకలు ముగిశాయి. 11:20 AM అబ్బురపరిచిన శకటాల ప్రదర్శన.. కర్తవ్యపథల్ గణతంత్ర వేడుకల్లో భాగంగా నిర్వహించిన శకటాల ప్రదర్శన అబ్బురపరిచింది. 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన శకటాలతో పాటు వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన 6 శకటాలను పరేడ్‌లో ప్రదర్శించారు. ఆయా రాష్ట్రాల సంస్కృతిని ప్రతింబింబించేలా ఉన్న ఈ శకటాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రభల తీర్థం శకటాన్ని ప్రదర్శించారు. సంక్రాంతి పండగను ప్రతిబింబించేలా ఈ శకటాన్ని ఆకర్షణీయంగా రూపొందించారు. అలాగే గుజరాత్, అసోం, ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల శకటాలు చూపరులను ఆకట్టుకున్నాయి. The tableau of Andhra Pradesh depicts 'Prabhala Theertham'- a festival of the peasantry during Makara Sankranti, at the Republic Day parade pic.twitter.com/YXPdmuUFET — ANI (@ANI) January 26, 2023 10:30 AM పరేడ్‌లో రాష్ట్రపతి, ప్రధాని.. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు వేడుకలకు ప్రత్యేక అతిథిగా వచ్చిన ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా గణతంత్ర పరేడ్‌లో పాల్గొన్నారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించారు. 21-గన్ సెల్యూట్‌తో జాతీయ గీతం ఆలపించారు. సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ గణతంత్ర పరేడ్‌లో ఈజిప్టు సైన్యం కూడా పాల్గొంది. Delhi | President Droupadi Murmu leads the nation in celebrating Republic Day Egypt’s President Abdel Fattah al-Sisi attends the ceremonial event as the chief guest Simultaneously, National Anthem and 21-gun salute presented pic.twitter.com/hi3joxFs57 — ANI (@ANI) January 26, 2023 10:20 AM పరేడ్‌కు రాష్ట్రపతి ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాతో కలిసి రాష్ట్రపతి భవన్ నుంచి కర్తవ్యపథ్‌కు బయల్దేరారు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. అక్కడ ఘనంగా నిర్వహించే 74వ గణతంత్ర వేడుకల్లో పాల్గొంటారు. Delhi | President Droupadi Murmu and Egyptian President Abdel Fattah El –Sisi depart from the Rashtrapati Bhavan to attend the Republic Day celebrations at Kartavya Path pic.twitter.com/tvhgjnwsC7 — ANI (@ANI) January 26, 2023 10:10 AM అమరులకు మోదీ నివాళులు.. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన సైనికులను స్మరించుకున్నారు. అనతరం కర్తవ్య పథలో గణతంత్ర పరేడ్‌కు హాజరవుతారు. #RepublicDay | PM Modi leads the nation in paying homage to the fallen soldiers at the National War Memorial in Delhi pic.twitter.com/CE9B2CPZmB — ANI (@ANI) January 26, 2023 న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబైంది. కర్తవ్యపథ్‌లో నిర్వహించే గణతంత్ర పరేడ్‌కు అధికారులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. ఉదయం 10:30 గంటల సమయంలో పరేడ్ ప్రారంభం కానుంది. మొదట జాతీయ స్మారకాన్ని సందర్శించి అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం మోదీ పరేడ్‌లో పాల్గొననున్నారు. ఈసారి గణతంత్ర వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసీ హాజరవుతున్నారు. ఈజిప్టు సైన్యం కూడా కవాతులో పాల్గొంటుంది. ఈ సారి నిర్వహించే పరేడ్ ప్రత్యేకంగా ఉండనుంది. సైనిక శక్తిసామర్థ్యాలతో పాటు, భారతీయ భిన్న సంస్కృతి, స్వదేశీ సామర్థ్యాలు, నారీ శక్తిని ప్రతిబింబించేలా కార్యక్రమాలు ఉంటాయి. ఈ వేడుకల్లో 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల శకటాలతో పాటు మంత్రిత్వ శాఖలకు చెందిన 6 శకటాలను ప్రదర్శించనున్నారు. వారం రోజుల పాటు జరుగుతున్న గణతంత్ర వేడుకలు జనవరి 23న నేతాజి సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ప్రారంభమయ్యాయి. జనవరి 24, 25 తేదీల్లో 'ఆది శౌర్య- పర్వ్ పరాక్రమ్ కా' ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ఢిల్లీలో నిర్వహించారు. -
ఈజిప్ట్‌తో బంధం బలోపేతం
న్యూఢిల్లీ: ఈజిప్టుతో ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్ నిర్ణయించింది. గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్ సిసి (68)తో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం సమావేశమయ్యారు. రక్షణ, భద్రత, వర్తకం రంగాలతో పాటు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో కూడా పరస్పరం మరింతగా సహకరించుకోవాలని నేతలు నిర్ణయించారు. ముఖ్యంగా సీమాంతర ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. 700 కోట్ల డాలర్లున్న ద్వైపాక్షిక వర్తకాన్ని ఐదేళ్లలో 1,200 కోట్ల డాలర్లకు పెంచాలని నిర్ణయించారు. ఆహార, ఇంధన, ఎరువులు తదితర రంగాలపై రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం తదితరాలు చర్చకు వచ్చాయి. ఐటీ, సైబర్ సెక్యూరిటీ, యువత, సమాచార, సాంస్కృతిక రంగాలకు సంబంధించి ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఐదు ఒప్పందాలు కుదిరాయి. ‘‘ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక బంధం స్థాయికి పెంపొందించుకోవాలని భేటీలో నిర్ణయించాం. ఇరు దేశాల వ్యూహాత్మక సహకారం ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో శాంతికి, ప్రగతికి బాటలు పరుస్తుంది’’ అని మోదీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచమంతటా ఉగ్రవాదం పెచ్చరిల్లుతుండటంపై ఇరు దేశాలూ ఆందోళనతో ఉన్నాయి. ఇది మానవాళి భద్రతకు అతి పెద్ద సమస్యగా మారిందన్న వాస్తవాన్ని అంగీకరిస్తున్నాయి. ఉగ్రవాద భావజాల వ్యాప్తికి సైబర్ స్పేస్ దుర్వినియోగం చేస్తున్న తీరుకు అడ్డుకట్ట వేసేందుకు చేతులు కలపాలని నిర్ణయించాం’’ అన్నారు. కరోనా, యుద్ధంతో దెబ్బ తిన్న ఆహార, ఫార్మా సరఫరాలను బలోపేతం చేయడంపై చర్చించామన్నారు. చర్చలు అత్యంత ఫలప్రదంగా సాగినట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వట్రా తెలిపారు. ఇదే తొలిసారి గణతంత్ర ఉత్సవాలకు ఈజిప్టు అధ్యక్షున్ని ఆహ్వానించడం ఇదే తొలిసారి. ఈజిప్టు సైనిక బృందం కూడా గణతంత్ర పరేడ్‌లో పాల్గొంటోంది. మూడో ఇండియా–ఆఫ్రికా ఫోరం శిఖరాగ్రంలో పాల్గొనేందుకు సిసి 2015లో తొలిసారి భారత్‌లో పర్యటించారు. తర్వాత ఏడాదికే మరోసారి పర్యటించారు. యువతే అతిపెద్ద లబ్ధిదారులు అభివృద్ధి చెందిన భారతదేశంలో యువతే అతిపెద్ద లబ్ధిదారులుగా మారబోతున్నారని ప్రధానినరేంద్ర మోదీ చెప్పారు. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే అతిపెద్ద బాధ్యత సైతం వారిపైనే ఉందన్నారు. గణతంత్ర పరేడ్‌లో పాల్గొననున్న ఎన్సీసీ కేడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘‘అమృతకాలంలో దేశ ఆకాంక్షలు, కలలకు యువత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నేటితరానికి ఎన్నెన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. భారతదేశం సాధిస్తున్న ఘనతల్లోనే ప్రపంచం తన భవిష్యత్తును వెతుక్కుంటోంది. జాతి లక్ష్యాలు, ఆకాంక్షలతో యువతను ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ అనుసంధానిస్తున్నాయి. యువత మాట్లాడడం ప్రత్యేకమైన అనుభూతినిస్తోంది. భారత్ సారథ్యం వహిస్తున్న జి–20 కూటమి గురించి పాఠశాలలు, కళాశాలల్లో చర్చించుకోవాలి’’ అని సూచించారు. స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనాలని యువతను కోరారు. -
74th Republic Day: గణతంత్ర పరేడ్‌లో... స్వదేశీ వెలుగులు
74వ గణతంత్ర వేడుకలు స్వదేశీ వెలుగులతో మెరవనున్నాయి. సంప్రదాయ గౌరవ వందనంలో బ్రిటిష్ కాలపు 25–పౌండర్ గన్స్ స్థానంలో స్వదేశీ 105 ఎంఎం తుపాకులు సగర్వంగా గర్జించనున్నాయి. పరేడ్‌లో ప్రదర్శించే ఆయుధాలన్నీ మన దేశంలో తయారైనవే! బ్రిటన్ వలస పాలన నీడల నుంచి బయటపడి పూర్తిగా భారతీయత ఉట్టిపడేలా ఆత్మనిర్భర్ భారత్ సత్తాను సగర్వంగా చాటేలా గణతంత్ర వేడుకలను జరిపేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. చైనాతో ఉద్రిక్తతల వేళ మన సాయుధ సత్తాను చాటడానికి కవాతులో మేడిన్ ఇండియా ఆయుధాలను ప్రదర్శించబోతున్నారు. ఇండిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా దేశీయంగా అభివృద్ధి చేసిన అగ్ని, ఆకాశ్, నాగ్ క్షిపణులతో పాటు బ్రహ్మోస్, అర్జున్ యుద్ధ ట్యాంకులు, ప్రచండ హెలికాప్టర్లు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి... బ్రహ్మోస్ ప్రపంచంలో మొట్టమొదటి సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి. భారత రక్షణ అభివృద్ధి పరిశోధన రంగ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన బ్రహ్మోస్‌ను విమానాలు, నౌకలు, జలాంతర్గాములు, భూ ఉపరితలం... ఇలా ఎక్కడి నుంచైనా ప్రయోగించవచ్చు. ధ్వని కంటే మూడు రెట్లు వేగంతో ప్రయాణించగలదు. వంద శాతం కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన క్షిపణిగా గుర్తింపు పొందింది. శత్రు దేశాల రాడార్ల నుంచి కూడా సులభంగా తప్పించుకోగల ఈ క్షిపణి శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. అగ్ని దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆధ్వర్యంలో అభివృద్ది చేసిన క్షిపణి. కాలక్రమేణా ఆధునిక సాంకేతితతో రూపు మార్చుకుంటూ వచ్చింది. అగ్ని 5 వెర్షన్లను రూపొందించిన తర్వాత ఇటీవల అణ్వాయుధ సామర్థ్యంతో అగ్ని ప్రైమ్ ఖండాంతర క్షిపణిని తయారు చేశారు. 2 వేల కి.మీ. దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు. అర్జున్ ఈ యుద్ధ ట్యాంకు సరిహద్దుల్ని కాపుకాసే విశ్వసనీయమైన నేస్తం. 2011లో మన అమ్ముల పొదిలో చేరింది. దీని ఫీచర్లను మరింత ఆధునీకరించి అర్జున్ ఎంకే1ఏను అభివృద్ధి చేశారు. రాత్రిళ్లూ సమాన సామర్థ్యంతో పని చేయడం దీని ప్రత్యేకత. బరువు తక్కువ కావడంతో మైదాన, కొండ ప్రాంతాల్లో ఒకేలా కదలగలవు. చెన్నైలోని హెవీ వెలిహల్స్ ఫ్యాక్టరీ దీన్ని తయారు చేసింది. ప్రచండ ఎత్తైన పర్వత ప్రాంతాల్లో మోహరించగలిగే తేలికపాటి హెలికాప్టర్. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) అభివృద్ధి చేసింది. సముద్రమట్టానికి 16,400 అడుగుల ఎత్తులో అలవోకగా టేకాఫ్, ల్యాండింగ్ ప్రత్యేకత. దీనితో రెండు శక్తిమంతమైన ఇంజిన్లు, అత్యంత ఆధునిక సౌకర్యాలుంటాయి. రాత్రి పూట కొండల మధ్య ప్రయాణించగలిగే సత్తాతో పాటు నిమిషానికి 800 రౌండ్లు కాల్పులు జరిపే సామర్థ్యముంది. చైనా డ్రోన్లను కూడా కూల్చివేయగలవు. నేలపై ఉన్న ట్యాంకర్లను సైతం ధ్వంసం చేయగలవు. ఆకాశ్ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిన భారత్ తొలి క్షిపణి ఆకాశ్. భూతలం నుంచి గగనతలానికి ప్రయోగించే ఈ క్షిపణి 25 కి.మీ. దూరంలోని లక్ష్యాలను కచ్చితంగా ఛేదించగలదు. 95% పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. ఇందుకు పాతికేళ్లు పట్టింది. 2014లో వైమానిక దళానికి, 2015లో ఆర్మీకి అందజేశారు. వీటిని విదేశాలకు విక్రయించడానికీ సన్నాహాలు జరుగుతున్నాయి. కే–9 వజ్ర స్వీయ చోదక శతఘ్ని వ్యవస్థ. 2018లో తొలిసారిగా ఆర్మీకి అందజేశారు. మైదాన ప్రాంతాల్లో అత్యంత సమర్థంగా పని చేస్తుంది. ప్రస్తుతం లద్ధాఖ్ సరిహద్దుల్లో మోహరించారు. 155 ఎంఎం కెనాన్ కలిగిన ఈ శతఘ్ని 18 నుంచి 52 కి.మీ. దూరం దాకా గుళ్ల వర్షం కురిపించగలదు. దీనికున్న అత్యంత శక్తిమంతమైన ఇంజిన్ గంటకి 67 కి.మీ. వేగంతో పని చేస్తుంది. అర్జున్ ఈ యుద్ధ ట్యాంకు సరిహద్దుల్ని కాపుకాసే విశ్వసనీయమైన నేస్తం. 2011లో మన అమ్ముల పొదిలో చేరింది. దీని ఫీచర్లను మరింత ఆధునీకరించి అర్జున్ ఎంకే1ఏను అభివృద్ధి చేశారు. రాత్రిళ్లూ సమాన సామర్థ్యంతో పని చేయడం దీని ప్రత్యేకత. బరువు తక్కువ కావడంతో మైదాన, కొండ ప్రాంతాల్లో ఒకేలా కదలగలవు. చెన్నైలోని హెవీ వెలిహల్స్ ఫ్యాక్టరీ దీన్ని తయారు చేసింది. రక్షణ రంగానికి స్వదేశీ హంగులు ప్రధానిగా నరేంద్ర మోదీ పగ్గాలు చేపట్టాక రక్షణ రంగంలో స్వావలంబనకు అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. ఆయుధాల కోసం విదేశాల మీద ఆధారపడటం తగ్గించి దేశీయంగా తయారు చేయడంపై దృష్టి కేంద్రీకరించారు. రష్యా వంటి దేశాల సాంకేతిక సహకారంతో దేశీయంగా ఆయుధాల ఉత్పత్తి ముమ్మరమైంది. 2021లో సాయుధ బలగాలు తమకు కేటాయించిన నిధుల్లో 64% స్వదేశీయంగా తయారైన ఆయుధాల కొనుగోలుకు వినియోగిస్తే గతేడాది 68% నిధులు వినియోగించాయి. ఆర్మీ అత్యధికంగా 72% నిధులను మేడిన్ ఇండియా ఆయుధాలపైనే వెచ్చించింది. దేశీయంగా రక్షణ పరికరాల ఉత్పత్తి విలువను 2025 కల్లా 2,500 కోట్ల డాలర్లకు తీసుకువెళ్లే లక్ష్యం దిశగానూ వడివడిగా అడుగులు పడుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
74th Republic Day: పరేడ్‌లో మహిళా శక్తి
74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగే రిపబ్లిక్ పరేడ్‌లో ఈసారి మహిళా శక్తికి విశేష ప్రాధాన్యం లభించింది. ఆర్మి, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లోనికవాతు బృందాలకు మహిళా ఆఫీసర్లు నాయకత్వం వహించనున్నారు. మొదటిసారి మహిళా ఒంటె దళం కవాతు చేయనుంది. డేర్ డెవిల్స్‌గా స్త్రీల బృందం మోటర్ సైకిల్ విన్యాసాలుచేయనుంది. అనేక శకటాలు మహిళా శక్తిని చాటనున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా స్త్రీ ప్రభావ శక్తికి ఈ పరేడ్ వేదిక కానుంది. గణతంత్ర దినోత్సవం నాడు మన దేశం తన సైనిక తేజాన్ని, సాంస్కృతిక సౌభ్రాతృత్వాన్ని, అంతర్గత వైవిధ్యాన్ని చాటుకుంటుంది. ప్రతి సంవత్సరం జనవరి 26న రిపబ్లిక్ డే పరేడ్‌లో రాష్ట్రపతి భవన్ నుంచి ఎర్రకోట వరకు జరిగే సైనిక కవాతు, రాష్ట్ర ప్రభుత్వాల శకటాల విన్యాసం, కళా బృందాల ఆట΄ాటలు. చూడటానికి కళ్లు చాలవు. ఇదంతా కలిసి మన దేశం... మనమంతా కలిసి మన శక్తి అనే భావన ఈ సందర్భంలో కలుగుతుంది. అయితే ఈసారి ఈ ‘మన శక్తి’లో స్త్రీ శక్తికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, త్రివిధ దళాలుప్రాధాన్యం ఇచ్చాయి. అందువల్ల ఈ పరేడ్ స్త్రీ శక్తికి నిదర్శనంగా నిలువనుంది. ముగ్గురు మహిళా సైనికాధికారులు పరేడ్‌లోపాల్గొనే త్రివిధ దళాల కవాతు బృందాలకు పురుష ఆఫీసర్లు నాయకత్వం వహించి ముందు నడవడం ఆనవాయితీ. ఈసారి ముగ్గురు మహిళా ఆఫీసర్లకు నాయకత్వ స్థానం దొరికింది. నావికా దళంలో నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్‌గా పని చేస్తున్న లెఫ్టినెంట్ కమాండర్ దిశా అమృత్ (29) 144 మంది నావికులతో కూడిన కవాతు బృందాలకు నాయకత్వం వహించనుంది. బెంగళూరుకు చెందిన దిశ అమృత్ 2016లో నావికా దళంలో చేరక ముందు ఐటి రంగంలో పని చేసింది. ఎన్సిసి కాడెట్‌గా ఉన్నప్పటి నుంచి రిపబ్లిక్ డే పరేడ్‌పాల్గొంటున్న ఆమె ఈసారి ఈ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో మిగ్– 17 పైలెట్‌గా ఉన్న స్కాడ్రన్ లీడర్ సింధు రెడ్డి తన దళం తరఫున 144 మంది గగన యోధులతో కవాతు నిర్వహించనుంది. ఇక మేడ్ ఇన్ ఇండియా ఆకాశ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ సిస్టమ్‌కు లెఫ్టెనెంట్ ఆకాష్ శర్మ నాయకత్వం వహించనుంది. ‘చిన్నప్పటి నుంచి టీవీలో చూసిన పరేడ్‌లో ఈసారి నేను పాల్గొనడం సంతోషంగా ఉంది’ అని శర్మ అంది. ఈ ముగ్గురు కాకుండా లెఫ్టినెంట్ డింపుల్ భాటి మోటార్ సైకిల్ విన్యాసాల దళంలో, మేజర్ మహిమ ‘కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్’ బృందాల నాయకత్వంలోపాల్గొననున్నారు. మహిళా శకటాలు ఈసారి పరేడ్‌లో 17 రాష్ట్రాల నుంచి, 6 మంత్రిత్వ శాఖల నుంచి, త్రివిధ దళాల నుంచి శకటాలుపాల్గొననున్నాయి. ఇవి కాకుండా డిఆర్డివో శకటం ఉంటుంది. అయితే వీటిలో చాలా శకటాలు ఈసారి మహిళా శక్తికి ప్రాధాన్యం,ప్రాముఖ్యం ఇచ్చాయి. మూడు సైనిక దళాలు ఈసారి మహిళా కేంద్రిత శకటాలను నడుపుతున్నాయి. టూరిజంలోనూ, సేంద్రియ వ్యవసాయంలోనూ స్త్రీల భాగస్వామ్యంలో వారి స్వయం సమృద్ధికిపాటుపడతాం అనే థీమ్‌తో త్రిపుర శకటం ఉండనుంది. పశ్చిమ బెంగాల్ శకటం యునెస్కో గుర్తింపు పొందిన దుర్గా పూజను ‘మానవత్వానికి అమూర్త వారసత్వ సంపదగా’ అభివర్ణిస్తూ ముందుకు సాగనుంది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ‘సకల సజీవిత్వాలను సమృద్ధి చేసే అమృత స్త్రీతత్వం’ థీమ్‌తో శకటం నడపనుంది. కేంద్ర హోమ్ శాఖ అయితే ఆరు కేంద్ర బలగాలలో స్త్రీ పోరాట పటిమను ప్రదర్శించే శకటంను ఎంచుకుంది. కేరళ మహిళా సాక్షరత శకటాన్ని, కర్నాటక మహిళా స్వయం సమృద్ధి శకటాన్ని ఈ పరేడ్ దారుల్లో నడిపించనున్నాయి. కళకళలాడే నృత్యాలు వీరందరూ కాకుండా వివిధ రాష్ట్రాల సాంస్కృతిక బృందాలలో విద్యార్థునులు, యువతలు, మహిళా కళాకరులు విశేష సంఖ్యలోపాల్గొననున్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి మొదలు వీరంతా తమ సాంస్కృతిక విన్యాసాలను ప్రదర్శించనున్నారు. లెఫ్టెనెంట్ ఆకాష్ శర్మ, స్కాడ్రన్ లీడర్ సింధు రెడ్డి, లెఫ్టినెంట్ కమాండర్ దిశా అమృత్ చారిత్రక దృశ్యం దిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్ నేత్రపర్వంగా ఉండటమే కాదు, దేశభక్తి భావాలు ఉ΄÷్పంగేలా కూడా చేస్తుంది. ఈసారి రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రత్యేకత... సరిహద్దు భద్రతాదళం (బీఎస్ఎఫ్) ‘క్యామెల్ కాంటింజెంట్’లో తొలిసారిగా ΄ాల్గొంటున్న మహిళా సైనికులు... దిల్లీలో ఘనంగా జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్)కు చెందిన ‘క్యామెల్ కాంటింజెంట్’ 1976 నుంచి భాగం అవుతోంది. ఈసారి జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌లో మహిళా సైనికులు ‘క్యామెల్ కాంటింజెంట్’లో భాగం కావడం చారిత్రక ఘట్టం కానుంది. గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌కు చెందిన ఇరవై నాలుగు మంది మహిళా సైనికులకు రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌లో క్యామెల్ రైడింగ్‌లో శిక్షణ ఇచ్చి పన్నెండు మందిని ఎంపిక చేశారు. ‘రిపబ్లిక్ డే పరేడ్‌లో ΄ాల్గొనడం ఒక సంతోషం అయితే క్యామెల్ కాంటింజెంట్‌లో భాగం కావడం మరింత సంతోషం కలిగిస్తుంది’ అంటుంది బృందంలో ఒకరైన అంబిక. ‘రిపబ్లిక్ డే ఉత్సవాల్లో క్యామెల్ రైడర్స్‌ను చూసి అబ్బురపడేదాన్ని. ఇప్పుడు నేను అందులో భాగం కావడం గర్వంగా ఉంది’ అంటుంది సోనాల్. విజయ్‌చౌక్ నుంచి ఎర్రకోట వరకు కర్తవ్యపథ్ మీదుగా క్యామెల్ రైడర్స్ కవాతు నిర్వహిస్తారు. రిపబ్లిక్‌డే తరువాత జరిగే రీట్రీట్ సెరిమనీలో కూడా ఈ బృందం ΄ాల్గొనబోతోంది. అమృత్‌సర్‌లో జరిగిన బీఎస్ఎఫ్ రైజింగ్ డే పరేడ్‌లో ఈ బృందం ΄ాల్గొని ప్రశంసలు అందుకుంది. ఉమెన్ రైడర్స్ కోసం ఆకట్టుకునే యూనిఫాంను కూడా రూ΄÷ందించారు. ప్రముఖ డిజైనర్ రాఘవేంద్ర రాథోడ్ దీన్ని డిజైన్ చేశారు. మన దేశంలోని వివిధ ్ర΄ాంతాలకు చెందిన క్రాఫ్ట్ ఫామ్స్‌ను ఈ డిజైన్ ప్రతీకాత్మకంగా ప్రతిబింబిస్తుంది. రాజస్థాన్‌లోని మెవాడ్ సంప్రదాయానికి చెందిన తల΄ాగా మరో ఆకర్షణ. మన దేశంలో భద్రతావసరాలు, సాంస్కృతి కార్యక్రమాల్లో ఒంటెలను ఉపయోగిస్తున్న ఏకైక సైనిక విభాగం బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) సాంస్కృతిక కార్యక్రమాల్లో బీఎస్ఎఫ్ క్యామెల్ కాంటింజెంట్ కవాతులకు ప్రత్యేకత ఉంది. ఉమెన్ రైడర్స్ రాకతో కవాతులలో రాజసం ఉట్టిపడుతుంది. మేము సైతం: ఉమెన్ రైడర్స్, ఆకట్టుకునే యూనిఫాం: ప్రముఖ డిజైనర్ రాఘవేంద్ర రాథోడ్ డిజైన్ చేశారు. -
Republic Day 2023: ఢిల్లీ కర్తవ్యపథ్‌లో భారీగా రిపబ్లిక్ డే రిహార్సల్స్ (ఫోటోలు)
-
ఢిల్లీకి కోనసీమ ‘ప్రభ’.. ప్రభుత్వానికి కోనసీమ వాసుల కృతజ్ఞతలు
కృష్ణా, గోదావరి (కేజీ) బేసిన్ ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ‘డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ’ తన సంస్కృతి సంప్రదాయాలతో మరోసారి జాతీయస్థాయి ఖ్యాతినార్జించనుంది. అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్నతోటలో జరిగే తీర్థానికి వచ్చే ఏకాదశ రుద్రుల ప్రభల నమూనా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో రాష్ట్ర శకటంపై కొలువుదీరనుంది. –సాక్షి అమలాపురం తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమైన సంక్రాంతి పండుగ కనుమ రోజు జరిగే జగ్గన్నతోట తీర్థానికి 11 గ్రామాలకు చెందిన ప్రభలు వస్తాయి. ప్రభ మీదనే పరమేశ్వరుని ఉత్సవ విగ్రహాలు ఉంచి ఊరేగింపుగా తీర్థాలకు తీసుకువస్తారు. దీనికి 450 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రభలపై పరమేశ్వరుని ప్రతిరూపాలు ఇక్కడకు వచ్చి లోక కళ్యాణార్థం చర్చలు జరుపుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అరుదైన గుర్తింపు గంగలకుర్రు అగ్రహారానికి చెందిన శివ కేశవ యూత్ సభ్యులు ఈ తీర్థ విశేషాలను దేశ ప్రధాని నరేంద్ర మోదీకి వివరిస్తూ 2020లో మెయిల్ చేశారు. మోదీ తీర్థం ప్రాశస్త్యాన్ని అభినందించారు. ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌కు వెళ్లే రాష్ట్ర ప్రభుత్వ శకటంపై జగ్గన్నతోట తీర్థానికి వచ్చే ఏకాదశ రుద్రులను ప్రదర్శనకు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించినట్టయ్యింది. ప్రభుత్వ నిర్ణయానికి కోనసీమ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోనసీమలోని పంట కాలువలు, వరి చేలు, కొబ్బరి తోటలు, రహదారుల మీదుగా ఊరేగే ప్రభలు ఈ ఏడాది ఢిల్లీలోని గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో రాష్ట్ర శకటంపై ఊరేగనున్నాయి. చదవండి: రిపబ్లిక్ డే పరేడ్ రిహార్సల్స్‌లో ఏపీ ప్రభల తీర్థ శకటం ముచ్చట గొల్పుతున్న ఏకాదశ రుద్రులు పరేడ్ శకటంపై ఉంచే ప్రభలను తాటి శూలం, టేకు చెక్క, మర్రి ఊడలు, వెదురు బొంగులతో సంప్రదాయ బద్ధంగా తయారు చేశారు. రంగు రంగుల నూలుదారాలు (కంకర్లు), కొత్త వస్త్రాలు, నెమలి పింఛాలతో అలంకరించారు. శకటానికి మూడు వైపులా మూడు చొప్పున తొమ్మిది చిన్న ప్రభలు, శకటం మధ్యలో రెండు పెద్ద ప్రభలు నిర్మించారు. కొబ్బరి చెట్లు, మేళతాళాలు, గరగ నృత్యకారులు, వేదపండితులు, పల్లకీ, దానిని మోస్తున్న కార్మికుల బొమ్మలు, తీర్థానికి గూడెడ్ల బండ్ల మీద వచ్చే వారి నమూనాలతో శకటాన్ని తీర్చిదిద్దారు. వరి కుచ్చులు, గుమ్మడి కాయలు, ఇతర కూరగాయలతో అలంకరించారు. గరగ ప్రదర్శనకు అవకాశం పరేడ్‌లో ప్రదర్శనకు అంబాజీపేట మండలం ముక్కామలకు చెందిన పసుపులేటి నాగబాబు గరగ బృందం ఎంపికైంది. ఈ బృందంలో సుమారు 24 మంది ఉన్నారు. గతంలో నాగపూర్ కల్చరల్ సెంటర్ ద్వారా ఈ బృందం 15 సార్లు పరేడ్‌లో పాల్గొంది. అయితే ఈసారి ప్రభల తీర్థం శకటం ప్రదర్శన సందర్భంగా ఈ బృందానికి నేరుగా పాల్గొనే అవకాశం లభించింది. మన ప్రాంతానికి దక్కిన గుర్తింపు ప్రభల తీర్థం అంటే మన సంప్రదాయం. రిపబ్లిక్ డే పరేడ్‌లో ఏకదశ రుద్రుల కొలువు దీరడం అంటే అది మన తీర్థానికి, మన ప్రాంతానికి దక్కిన గుర్తింపు. ఆ తీర్థంలో మాది ముఖ్యపాత్ర కావడం మా పూర్వ జన్మసుకృతం. రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. – పూజ్యం శ్రీనివాస్, అర్చకుడు స్వతంత్రంగా తొలిసారి గతంలో పలుమార్లు రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొన్నాం. రాష్ట్రపతులు శంకర్ దయాళ్ శర్మ, వెంకటరామన్, అబ్దుల్ కలాం, ప్రతిభాపాటిల్, ప్రధానులు రాజీవ్‌గాంధీ, పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్ ముందు మా ప్రదర్శన జరిగింది. కోనసీమ ప్రభలు పరేడ్‌కు వెళుతున్నందున స్వతంత్రంగా తొలిసారి మా బృందం ప్రదర్శనకు సిద్ధమైంది. – పసుపులేటి నాగబాబు, గరగ బృందం గురువు -
రిపబ్లిక్ డే పరేడ్ రిహార్సల్స్‌లో ఏపీ ప్రభల తీర్థ శకటం
ఢిల్లీ: రిపబ్లిక్ డే పరేడ్ డ్రస్ రిహార్సల్స్ల్లో ఏపీ శకటం అలరించింది. రిపబ్లిక్ డే పరేడ్ వేడుకల్లో భాగంగా ఈ రోజు ఢిల్లీలో నిర్వహించిన పరేడ్ డ్రస్ రిహార్సల్స్ల్లో ఏపీలోని కోనసీమ ప్రభల తీర్థ శకటం ఆకట్టుకుంది. పరేడ్ అగ్రభాగంలో ఆంధ్రప్రదేశ్ శకటం చూపరులను విశేషంగా అలరించింది. శివపార్వతుల విగ్రహాలతో ప్రభల తీర్థాన్ని పరేడ్ డ్రస్ రిహార్సల్స్‌లో ప్రదర్శించగా, ముందు భాగంగా జోడెడ్ల బండిపై రైతన్న కూర్చొని ఉన్నాడు. -
రిపబ్లిక్ డే పరేడ్‌లో ఏపీ శకటం ప్రబల తీర్థం
న్యూఢిల్లీ: జనవరి 26న దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలకు.. ఈసారి ఆంధ్రప్రదేశ్ శకటం ఎంపిక అయ్యింది. అనేక రాష్ట్రాల పోటీ మధ్యలో ఏపీ శకటం ప్రబల తీర్థం పరేడ్‌కు ఎంపికైంది. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు మొత్తం 17 శకటాలు ఎంపికయ్యాయి. కోనసీమలో ప్రబలతీర్ధం పేరుతో.. సంక్రాంతి ఉత్సవం ఇతివృత్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ శకటం ఈ అవకాశం దక్కించుకుంది. ఈ మేరకు కేంద్ర రక్షణశాఖ కార్యాలయం వెల్లడించింది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో మకర సంక్రాంతి సందర్భంగా వీటిని ప్రదర్శిస్తారని.. సంప్రదాయానికి అద్దం పట్టే విధంగా ప్రబల తీర్థం శకటం ఉందని తెలిపింది. గ్రీన్ హరిత విప్లవానికి ఇది ఉదాహరణగా పేర్కొంది. ఏపీ దేశానికి అన్నపూర్ణ, రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా అభివర్ణించింది. కాగా విలువైన సంస్కృతికి నిలయం ఆంధ్రప్రదేశ్ వివిధ రాష్ట్రాల నుంచి రిపబ్లిక్ డే పరేడ్‌కు శకటాలను కేంద్రం ఎంపిక చేస్తుంది. దక్షిణ భారతదేశం నుంచి ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, రాష్ట్రాలకు అవకాశం వచ్చింది. సాక్షి, ఢిల్లీ: రైతే రారాజు అనే ఇతివృత్తంతో రూపొందించిన శకటం.. ప్రభల తీర్థం అని రాజ్యసభ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో కోనసీమ ప్రబల తీర్థం రిపబ్లిక్ డే వేడుకలకు ఎంపికైందని, 400 ఏళ్ల విశిష్ట చరిత్ర ఉన్న సంస్కృతికి ప్రబల తీర్థం ఒక నిరద్శనమని పేర్కొన్నారాయన. చదవండి: AP: దేశంలో పెద్ద మంచినీటి సరస్సు మన రాష్ట్రంలోనే.. ప్రత్యేకతలివే! -
రిపబ్లిక్ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ శకటం ఎంపిక
సాక్షి, ఢిల్లీ: దేశ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఈసారి ఆంధ్రప్రదేశ్ శకటం ఎంపిక అయ్యింది. ఈ విషయంపై బుధవారం అధికారిక ప్రకటన వెలువడింది. కోనసీమలో ప్రబలతీర్ధం పేరుతో, సంక్రాంతి ఉత్సవం ఇతివృత్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ శకటం ఈ అవకాశం దక్కించుకుంది. వివిధ రాష్ట్రాల నుంచి రిపబ్లిక్ డే పరేడ్‌కు శకటాలను కేంద్రం ఎంపిక చేస్తున్న విషయం తెలిసిందే. దక్షిణ భారత దేశం నుండి కేరళ , తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అవకాశం కల్పించారు ఈసారి. -
బాలీవుడ్ పాటకు నేవీ సిబ్బంది వార్మప్!
Republic Day Parade Rehearsal Warm-Up: ఇంతవరకు ఆర్మీ సిబ్బంది పరేడ్‌లో భాగంగా బాలీవుడ్‌లోని పలు ప్రముఖ దేశ భక్తిపాటలకు డ్యాన్స్‌లు చేసిన వైరల్ వీడియోలు చూశాం. అంతెందుకు భారత సరిహద్దుల్లో గడ్డకట్టే చలిలో కాపలాకాస్తున్న జవాన్లు సైతం కొన్ని ప్రముఖ బాలీవుడ్ పాటలకు నృత్యం చేసి అందరీ మన్నలను పొందారు . అచ్చం అలానే నేవీ సిబ్బంది బాలీవుడ్ పాటకు అనుగుణంగా కదులుతూ తమ రోజువారి వ్యాయమాన్ని చేసి అందరీ దృష్టిని ఆకర్షించారు. అసలు విషయంలోకెళ్తే....భారత నేవీ సిబ్బంది వార్మప్ ఎక్స్‌ర్‌సైజ్‌లో భాగంగా బాలీవుడ్ పాట "దునియా మే లోగాన్ కో" పాటకు లయబద్దంగా డ్యాన్స్‌లు చేశారు. ఈ మేరకు న్యూఢిల్లీలోని విజయ్ చౌక్‌లో భారత్ నావికాదళ సిబ్బంది రిపబ్లిక్ డే పరేడ్ రిహార్సల్‌కి సంబంధించిన వార్మ్ అప్ ఎక్స్‌ర్‌సైజ్‌లో భాగంగా బాలీవుడ్ పాటకు అనుగుణంగా డ్యాన్స్ చేశారు. అంతేకాదు డిఫెన్స్ సిబ్బంది నేవీ యూనిఫాం ధరించి, రైఫిల్స్ పట్టుకుని, అప్నా దేశ్ సినిమా నుంచి ఆర్డీ బర్మన్, ఆశా భోంస్లే పాడిన దునియా మే లోగోన్ కో లయకు అనుగుణంగా నృత్యం చేశారు. అయితే ఇది రిపబ్లిక్ డే వేడుకల్లో భాగం కాదని నేవీ అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ మేరకు మై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. What a sight! This video will definitely give you goosebumps!🇮🇳 🇮🇳 Are you ready to witness the grand 73rd Republic Day celebrations with us? Register now and book you e-Seat today! https://t.co/kJFkcXoR2K @DefenceMinIndia @AmritMahotsav pic.twitter.com/3WZG30DWQ0 — MyGovIndia (@mygovindia) January 22, 2022 (చదవండి: రోడ్లపై నెమళ్ల షికారు: మిస్మరైజింగ్ వైరల్ వీడియో!!) -
గణతంత్ర దినోత్సవం; అలా ఇది నాలుగోసారి!
లాస్ట్ మినిట్‌లో ‘అయామ్ సారీ’ అనేశారు బోరిస్ జాన్సన్. బ్రిటన్ ప్రధాని ఆయన. ముందనుకున్నట్లుగా నేటి మన గణతంత్ర దినోత్సవానికి జాన్సన్ రావడం లేదు. వచ్చే పరిస్థితి లేదు. బ్రిటన్‌లో కరోనా ‘రెండో రూపం’ దాల్చింది. అందుకే సెంట్రల్ లండన్‌లోని డౌనింగ్ స్ట్రీట్‌లో ఉన్న వాళ్ల ప్రధాని పాలనా భవనం ఇండియాకు ‘సారీ’ నోట్ పంపించింది. డిసెంబర్లోనే ఆయన కు ఆహ్వానం పంపాం. ఓకే కూడా అన్నారు. జనవరి కంతా సీన్ మారి పోయింది. 55 ఏళ్ల తర్వాత మళ్లీ ఇదే అతిథి లేకుండా మన రిపబ్లిక్ పరేడ్ జరగబోవడం. ఇంకో అతిథిని పిలవొచ్చు. అయితే అప్పటికే సమయం మించిపోయింది. ఈరోజు జరుగుతున్నది 72 వ గణతంత్ర దినోత్సవం. ఇండియా ఆవిర్భవించాక ఇంతవరకు మూడుసార్లు మాత్రమే ముఖ్య అతిథి లేకుండా రిపబ్లిక్ డే జరిగింది. నేటి పరేడ్ కూడా పూర్తిగా ఇక మన ఇంటి కార్యక్రమం. మనలో మన మాట... అతిథి లేకపోతేనేం! ఈ కార్యక్రమాన్ని నేరుగా సందర్శించే వారు, టీవీలలో వీక్షించే వారు అందరూ అతిథులే ఈసారికి! రిపబ్లిక్ పరేడ్‌లో ప్రధాని ఇందిరాగాంధీ (1967) అతిథి లేని రిపబ్లిక్ ‘డే’లు మూడంటే మూడేసార్లు 1952లో, 1953లో, 1966లో అతిథి లేకుండా మన రిపబ్లిక్ డే పరేడ్లు జరిగాయి. 1966లో అతిథి లేకపోవడమూ, రాకపోవడమూ కాదు. రాజకీయంగా మనం కొంచెం అస్థిమితంగా ఉన్నాం. ఇండో–పాక్ యుద్ధాన్ని ముగింపునకు తెచ్చేందుకు శాంతి ఒప్పందం విషయమై రష్యాలోని తాష్కెంట్‌కు వెళ్లిన అప్పటి మన ప్రధాని లాల్‌బహుదూర్ శాస్త్రి ఒప్పందంపై సంతకాలు అయిన రెండో రోజే 1966 జనవరి 11న హటాత్తుగా మరణించారు. ప్రధాని లేకుండా ఒక్క రోజైనా దేశం ఉండకూడదు. అదే రోజు గుల్జారీలాల్ నందా దేశ ప్రధాని అయ్యారు. జనవరి 24 వరకు ప్రధానిగా ఉన్నారు. జనవరి 24న ఇందిరాగాంధీ ప్రధాని అయ్యారు. ఇక రిపబ్లిక్ డేకి ఉత్సవాలకు ఉన్న సమయం 48 గంటలు. అతిథిని పిలవలేకపోయాం. ఆ ముందు కూడా 1952, 1953 లలో ఎవర్నీ ఆహ్వానించలేదు. అందుకు ప్రత్యేక కారణం అంటూ లేదు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, భారత ప్రధాని మోదీ (ఫైల్ ఫొటో) అసలు అతిథి ఎందుకు? ఇది మరీ బాగుంది. అతిథి వస్తే ఆ కళే వేరుగా ఉండదా! మన మిలటరీని చూపించుకోవచ్చు. మన ప్రజల్ని, మన సంప్రదాయాల్ని, మనం ఇచ్చే గౌరవ మర్యాదల్ని అతిథికి చూపించవచ్చు. ఇవన్నీ పైపైన. రాజనీతి వ్యూహాలు కొన్ని ఉంటాయి. బ్రిటన్ ప్రధానినే ఈసారి ఎందుకు ఆహ్వానించామంటారు? కారణం ఉంది. బ్రిటన్ ఐరోపా సమాఖ్య నుంచి అధికారికంగా బయటికి వచ్చేసి ఉంది. ఇండియా ఆర్.సి.ఇ.పి. (రీజనల్ కాంప్రెహె న్సివ్ ఎకనమిక్ పార్ట్నర్షిప్) లోకి వెళ్లేందుకు సంశయిస్తోంది. ఆర్.సి.ఇ.పి. మీద ఇప్పటికే ఆసియాదేశాలు చాలావరకు సంతకాలు చేసేశాయి. బ్రిటన్‌కి, ఇండియాకు గ్రూప్‌లో ఒకరిగా ఉండటం ఇష్టం లేదు. అందుకే బ్రిటన్ బయటికి వచ్చేస్తే, ఇండియా లోపలికి వెళ్లడం లేదు. ఈ సమయంలో లండన్, ఢిల్లీ ఒకటిగా ఉంటే.. వాణిజ్యం, పరిశ్రమల రంగాల్లో ఏ ప్రయోజనాలైతే కలిసి సాధిస్తామని ఆ గ్రూపులు అంటున్నాయో వాటినే ఈ రెండు దేశాలూ కలిసి వేరుగా సాధించుకోవచ్చు. అందుకు ఒక సోపానం గౌరవ ఆతిథ్యం కూడా. తొలి అతిథి సుకర్నోతో ప్రధాని నెహ్రూ తొలి అతిథి సుకర్ణో 1947లో మనకు స్వాతంత్య్రం వచ్చింది. రెండున్నరేళ్లకు 1950లో రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చుకున్నాం. ఆ తెచ్చుకున్న తేదీ జనవరి 26. అదే రిపబ్లిక్ డే. అదే గణతంత్ర దినం. ఆ ఏడాది మన గెస్టు.. స్వతంత్ర భారత గణతంత్ర ఉత్సవానికి తొలి ముఖ్య అతిథి.. ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్ణో. అప్పుడు మన రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్. మన ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. మన తొలి రిపబ్లిక్ డేకి సుకర్ణోను ఆహ్వానించడానికి తగిన కారణమే ఉంది. మనకు 47లో స్వాతంత్య్రం వస్తే, వాళ్లకు 45లో వచ్చింది. ఇంచుమించు అదే సమయంలో ఆసియా, ఆఫ్రికాల్లోని దేశాలు సామ్రాజ్యవాద శక్తుల నుంచి విముక్తి పొందిన తొలినాళ్ల నడకలో ఉన్నాయి. అవన్నీ.. మన ఇండియా సహా.. లోలోపల ఒక స్నేహ వలయంలా ఏర్పడ్డాయి. ఆ స్నేహంతోనే మనం సుకర్ణోను ఆహ్వానించాం. తొలి రిపబ్లిక్ పరేడ్ (1950) తొలి పరేడ్ రాజ్‌పథ్‌లోనే! తొలి రిపబ్లిక్ వేడుకలు (1950) కూడా ఇప్పుడు జరుగుతున్నట్లే రాజ్‌పథ్‌లోనే జరిగాయి. ఆ ఏడాది రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ ఓపెన్ టాప్ గుర్రాల బగ్గీలో కూర్చొని రాష్ట్రపతి భవన్ నుంచి పరేడ్ గ్రౌడ్స్కి బయల్దేరారు. పరేడ్ ను చూడ్డానికి వచ్చిన వారందరికీ ప్రభుత్వం స్వీట్లు పంచిపెట్టింది. తర్వాతి పరేడ్లు వేర్వేరు ప్రాంతాల్లో జరిగాయి. ఎర్రకోటలో ఒకసారి, ఇర్విన్ స్టేడియంలో ఒకసారి, రామ్‌లీలా మైదానంలో ఒకసారి.. ఇలా. 1955 నుంచి మాత్రం రాజ్‌పథ్‌లోనే రిపబ్లిక్ డేను నిర్వహిస్తున్నారు. -
ఈసారి పరేడ్‌లో ఒక ఫైటర్ ఒక టాపర్
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ నుంచి రాజ్‌పథ్ మీదుగా ఇండియా గేట్ వరకు ఎనిమిది కి.మీ. దూరం సాగవలసిన రిపబ్లిక్ డే పరేడ్ ఈ ఏడాది మునుపటంత సందడితో ఉండబోవడం లేదు. ఎప్పుడూ లక్షమంది వరకు వీక్షకులను అనుమతించేవారు. ఈ ఏడాది ఆ సంఖ్యను ఇరవై ఐదు వేలకు కుదించారు. ఆ ఇరవై ఐదు వేల మందిలో నాలుగు వేల మంది మాత్రమే సాధారణ ప్రజలు. మిగతావారంతా వి.ఐ.పి.లు, వి.వి.ఐ.పీలు. ఎప్పుడూ చిన్నాపెద్దా అందరూ పరేడ్‌ను చూడ్డానికి వచ్చేవారు. ఈ ఏడాది పదిహేనేళ్ల వయసు లోపువారికి, అరవై ఐదేళ్లు దాటిన వారికి రాజ్‌పథ్ ప్రవేశాన్ని నిషేధించారు. బయటి అతిథులు కూడా ఎవరూ రావడం లేదు. కారణం తెలిసిందే. సోషల్ డిస్టెన్స్. అయితే.. ఇన్ని నిరుత్సాహాల నడుమ రెండంటే రెండే ఉల్లాసకరమైన విషయాలుగా కనిపిస్తున్నాయి. ఫ్లయింట్ లెఫ్ట్‌నెంట్ భావనా కాంత్ మన వాయుసేనలోని ఫైటర్ జెట్‌తో గగనతలంలో విన్యాసాలు చేయబోతున్నారు! రిపబ్లిక్ డే పరేడ్‌లో ఒక మహిళా ఫైటర్ పైలట్.. యుద్ధ విమానాన్ని చక్కర్లు కొట్టించబోవడం ఇదే మొదటిసారి. అలాగే దివ్యాంగి త్రిపాఠీ అనే విద్యార్థినికి పరేడ్ గ్రౌండ్స్‌లోని ప్రధాన మంత్రి బాక్స్‌లో కూర్చొని వేడుకలను తిలకించే అవకాశం లభించడం దేశంలోని బాలికలు, మహిళలందరికీ స్ఫూర్తినిచ్చే పరిణామం. భావనా కాంత్ (28) భారతదేశపు తొలి మహిళా ఫైటర్ పైలట్. జనవరి 26 న ఆమె రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొన్న తొలి మహిళా ఫైటర్ పైలట్ అవుతారు. భారత వాయుసేన ఆమెకు ఈ అరుదైన, ఘనమైన, చరిత్రాత్మక అవకాశాన్ని కల్పించింది. 2016 లో తొలి ఫైటర్ పైలట్‌గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐ.ఎ.ఎఫ్) లోకి వచ్చారు భావన. ఇంచుమించుగా ఆమెతో పాటే అవని చతుర్వేది, మోహనా సింగ్ ఫైటర్ పైలట్ శిక్షణలో చేరారు. అప్పటి వరకు మన సైన్యంలో మహిళా ఫైటర్ పైలట్లే లేరు. మూడేళ్ల అంచెలంచెల శిక్షణానంతరం 2019 మే లో యుద్ధ విమానాలు నడిపేందుకు భావన పూర్తి అర్హతలు సంపాదించారు. ప్రస్తుతం ఆమె రాజస్థాన్‌లోని వైమానిక స్థావరంలో విధి నిర్వహణలో ఉన్నారు. మిగ్–21 యుద్ధ విమానాన్ని అన్ని కోణాల్లో మలుపులు తిప్పి శత్రువు వెన్ను విరచడంలో నైపుణ్యం ఉన్న యోధురాలు భావనా కామత్ ఇప్పుడు. భావన 1992 డిసెంబర్ 1న బిహార్‌లోని దర్భంగా లో జన్మించారు. అయితే ఆమె పెరిగింది అక్కడికి సమీపంలోని బెగుసరాయ్‌లోని రిఫైనరీ టౌన్షిప్లో. ఆమె తండ్రి తేజ్ నారాయణ్.. ఇంజనీర్. ఆ టౌన్‌షిప్‌లోని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్లో ఆయన ఉద్యోగం. భావన తల్లి రాధాకాంత్ గృహిణి. భావన తమ్ముడు నీలాంబర్, భావన చెల్లి తనూజ. వారిద్దరికీ భావనే అన్నిటా స్ఫూర్తి. భావనకు డ్రైవింగ్ అంటే ఇష్టం. అందుకే కావచ్చు డ్రైవింగ్‌కి అత్యున్నతస్థాయి అనుకోదగిన ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ పైలటింగ్‌ను కెరీర్‌గా ఎన్నుకున్నారు. ఇంకా ఆమెకు ఖోఖో, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, డిబేట్స్, సినిమాలు ఇష్టం. టౌన్‌షిప్‌లోని స్కూల్లో చదువు పూర్తయ్యాక భావన బెంగళూరులోని బి.ఎం.ఎస్. కాలేజ్‌లో మెడికల్ ఎలక్ట్రానిక్స్‌లో ఇంజనీరింగ్ చేశారు. తర్వాత టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో కొన్నాళ్లు పని చేశారు. ఎయిర్ ఫోర్స్‌లో జాయిన్ అయ్యేందుకు కామన్ అడ్మిషన్ టెస్ట్ రాసి ఉత్తీర్ణులయ్యారు. హైదరాబాద్ హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ట్రైనింగ్ అయ్యాక మేడ్చెల్ జిల్లాలోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్అకాడమీ నుంచి ఫ్లయింగ్ ఆఫీసర్‌గా బయటికి వచ్చారు. భారత రాష్ట్రపతి గత ఏడాది ఆమెకు నారీ శక్తి పురస్కారం ప్రదానం చేశారు. ∙ ∙ ఇక రిపబ్లిక్ డే పరేడ్‌ను పీఎం పక్కన కూర్చొని వీక్షించేందుకు ప్రత్యేక ఆహ్వానాన్ని పొందిన దివ్యాంగీ త్రిపాఠీ (18) ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ అమ్మాయి. 2020 సీబీఎస్ఇ 12వ తరగతి పరీక్షల్లో 99.6 శాతం మార్కులతో జిల్లాలోనే టాపర్‌గా నిలవడంతో దివ్యాంగికి ఈ అరుదైన అవకాశం లభించింది. ఆమెతో పాటు ఈ అవకాశం దేశంలోని మిగతా రాష్ట్రాల టాపర్స్కీ దక్కింది. ఇప్పుడు ఆమెకు స్నేహితుల నుంచి, బంధువుల నుంచి ఎదురౌతున్న ప్రశ్న ఒక్కటే. ‘ప్రధాని నరేంద్ర మోదీ పక్కన కూర్చొని ఉన్నప్పుడు నువ్వు ఆయనతో ఏం మాట్లాడతావు?’ అని! దివ్యాంగి తండ్రి ఉమేశ్‌నాథ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్. తల్లి ఉష గృహిణి. ఈ నెల 13న కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ‘పరేడ్’ను చూసేందుకు ఆహ్వానం వచ్చిందని ఆమె ఎంతో సంతోషంతో తెలిపారు. గత ఏడాది ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్ -
డిమాండ్లు తీర్చకుంటే ట్రాక్టర్ల పరేడ్
న్యూఢిల్లీ: ఈనెల 4న జరిగే చర్చల్లో ప్రభుత్వం తమ డిమాండ్లను తీర్చకపోతే 26వ తేదీన రిపబ్లిక్ దినోత్సవం రోజున ఢిల్లీ వైపు ట్రాక్టర్లతో పెరేడ్ చేపడతామని 40 రైతు సంఘాల కూటమి ‘సంయుక్త కిసాన్ మోర్చా’హెచ్చరించింది. తమ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి సానుకూల స్పందన రానందున తీవ్ర నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించింది. గణతంత్ర దినోత్సవం పెరేడ్ అనంతరం కిసాన్ పెరేడ్ పేరిట తమ ట్రాక్టర్ల ర్యాలీ ఉంటుందని రైతు నేత దర్శన్ పాల్ సింగ్ చెప్పారు. ఈ పెరేడ్ సమయం, మార్గాన్ని త్వరలో వెల్లడిస్తామన్నారు. ముందుగా ప్రకటించిన విధంగానే కేఎంపీ రహదారిపై ట్రాక్టర్ ర్యాలీ 6న ఉంటుందనీ, రిపబ్లిక్ డే పెరేడ్‌కు ఇది రిహార్సల్ అని చెప్పారు. వచ్చేదఫా చర్చలపై ఆశతోనే ఉన్నామని, కానీ ఇప్పటివరకు జరిగిన పరిణామాలను చూస్తే ప్రభుత్వంపై తమకు నమ్మకం పోయిందని రైతుసంఘ నేత అభిమన్యుకుమార్ తెలిపారు. తమ డిమాండ్ మేరకు సాగు చట్టాలు రద్దు చేయడం లేదా తమను బలవంతంగా ఖాళీ చేయించడం మాత్రమే ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ అని రైతు నేతలు తేల్చి చెప్పారు. తమ డిమాండ్లలో సగానికిపైగా ఆమోదం పొందాయని చెప్పడం అబద్ధమని స్వరాజ్ ఇండియా నేత యోగేంద్ర యాదవ్ విమర్శించారు. చట్టాలు రద్దు చేసేవరకు నిరసనలు కొనసాగిస్తామన్నారు. శాంతియుతంగా నిరసన ప్రదర్శన నిర్వహించడం అందరి హక్కని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని, అందువల్ల తాము శాంతియుతంగానే నిరసనలు కొనసాగిస్తామని మరోనేత బీఎస్ రాజేవల్ చెప్పారు. ఢిల్లీ సరిహద్దులోని ఘాజీపూర్ వద్ద మరో రైతు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాంపూర్ జిల్లా బిలాస్‌పూర్‌కు చెందిన సర్దార్ కశ్మీర్ సింగ్(75) శనివారం మొబైల్ టాయిలెట్లో ఉరి వేసుకుని తనువు చాలించారు. ఆయన వద్ద సూసైడ్ నోట్ లభించిందని పోలీసులు తెలిపారు. -
‘మహా వివక్షపై సుప్రియా ఫైర్’
సాక్షి, న్యూఢిల్లీ : ఈ ఏడాది ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మహారాష్ట్ర శకటాలను తొలగించడంపై పాలక శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి నేతలు మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్ తర్వాత తిరస్కరణకు గురైన మరో విపక్ష రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. తమ ప్రభుత్వంపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని కూటమి నేతలు ఆరోపించారు. మహారాష్ట్ర పట్ల కేంద్రం పక్షపాత వైఖరిని ప్రదర్శించిందని దీనిపై మోదీ సర్కార్ వివరణ ఇవ్వాలని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కుమార్తె, ఆ పార్టీ నేత సుప్రియా సూలే డిమాండ్ చేశారు. దేశమంతటా జరిగే ఈ వేడుకలో అన్ని రాష్ట్రాలకూ కేంద్రం ప్రాతినిథ్యం ఇవ్వాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పక్షపాతం చూపుతూ విపక్ష పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల పట్ల సవతి తల్లి ప్రేమ చూపుతోందని ఆమె దుయ్యబట్టారు. గణతంత్ర వేడుకల నుంచి మహా శకటాన్ని తిరస్కరిస్తూ కేంద్రం వివక్ష చూపడాన్ని తప్పుపట్టారు. రెండు రాష్ట్రాల ప్రతిపాదనలను మీరు (కేంద్రం) ఎందుకు తిరస్కరించారో వివరణ ఇవ్వాలని, దీనిపై మహారాష్ట్ర సీఎం దర్యాప్తు జరిపించాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కోరారు. -
మరో రాష్ట్రానికి షాకిచ్చిన కేంద్రం..
సాక్షి, న్యూఢిల్లీ : కేరళకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. దేశ గణతంత్ర దినోత్సవం వేడకల్లో తమ శకటాన్ని ప్రదర్శించాలనుకున్న కేరళ ఆశలపై కేంద్రం నీళ్లుచల్లింది. శకట ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలన్న విజ్ఞప్తిని కేంద్ర రక్షణశాఖ తిరస్కరించింది. వివిధ కారణాలతో శకటాన్ని అనుమతించడంలేదని శుక్రవారం ఓ ప్రకటక ద్వారా వెల్లడించింది. కాగా కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం అమలును ఉపసంహరించాలని కోరుతూ కేరళ అసెంబ్లీలో చట్టానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కేరళలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా పౌరసత్వ చట్టాన్ని అమలు చేయబోమని విజయన్ చేశారు. అంతేకాకుండా సీఏఏ, ఎన్ఆర్సీ వంటి వివాదాస్పద చట్టాలను కేరళ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. (శకటాల తిరస్కరణ కుట్ర: సేన, తృణమూల్) కాగా పబ్లిక్‌డే పరేడ్‌లో తమ శకటాలని ప్రదర్శించాలన్న మహారాష్ట్ర, బెంగాల్, బిహార్ ప్రభుత్వాల విజ్ఞప్తిని కేంద్రం ఇదివరకే తిరస్కరించిన విషయం తెలిసిందే. వివిధ కారణాలు చూపుతూ ఆ రాష్ట్ర శకటాలని నిరాకరించింది. 2020 గణతంత్ర దినోత్సవ కవాతులో మహారాష్ట్ర, బెంగాల్ ప్రభుత్వాల శకటాలని అనుమతించబోమని రక్షణ శాఖ ప్రకటించింది. ఈ నిర్ణయంపై మహారాష్ట్ర, బెంగాల్ ప్రభుత్వాలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. శివసేన రాజ్యసభ సభ్యుడు సంజయ్‌రౌత్ దీని వెనుక కేంద్రం కుట్ర ఉందని, అదేమిటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎంపీ సుప్రియా సూలే ఈ విషయంలో కేంద్రాన్ని తప్పుబట్టారు. కేంద్రం చర్య మహారాష్ట్ర, బెంగాల్ ప్రభుత్వాలకు అవమానకరమని ఆమె వ్యాఖ్యానించారు. బెంగాల్‌పై కేంద్రం వివక్షతతో వ్యవహరిస్తోందని, పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వ్యతిరేకించినందున రాష్ట్రాన్ని లక్ష్యంగా చేసుకుంటోందని తృణమూల్ ఎంపీ సౌగతా రాయ్ అన్నారు. పరేడ్‌లో పాల్గొనే శకటాల జాబితాను శుక్రవారం ప్రభుత్వం విడుదల చేసింది. -
శకటాల తిరస్కరణ కుట్ర: సేన, తృణమూల్
ముంబై/కోల్‌కతా: రిపబ్లిక్‌డే పరేడ్‌లో తమ శకటాలని ప్రదర్శించాలన్న మహారాష్ట్ర, బెంగాల్ ప్రభుత్వ ఆశలని కేంద్రం నీరుగార్చింది. వివిధ కారణాలు చూపుతూ ఆ రాష్ట్ర శకటాలని తిరస్కరించింది. 2020 గణతంత్ర దినోత్సవ కవాతులో మహారాష్ట్ర, బెంగాల్ ప్రభుత్వాల శకటాలని అనుమతించబోమని రక్షణ శాఖ ప్రకటించింది. ఈ నిర్ణయంపై మహారాష్ట్ర, బెంగాల్ ప్రభుత్వాలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. శివసేన రాజ్యసభ సభ్యుడు సంజయ్‌రౌత్ దీని వెనుక కేంద్రం కుట్ర ఉందని, అదేమిటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ‘కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండిఉంటే రాష్ట్ర బీజేపీ ఇలాగే మౌనంగా ఉండేదా’అని సంజయ్ ప్రశ్నించారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎంపీ సుప్రియా సూలే ఈ విషయంలో కేంద్రాన్ని నిందించారు. కేంద్రం చర్య మహారాష్ట్ర, బెంగాల్ ప్రభుత్వాలకు అవమానకరమని ఆమె వ్యాఖ్యానించారు. ‘దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో మహారాష్ట్ర, బెంగాల్ రెండూ కీలక పాత్ర పోషించాయని, స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఇరు రాష్ట్రాల ప్రజలను, అమరవీరులను ఈ చర్య ద్వారా కేంద్రం అవమానించింది’అని కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి సంజయ్ దత్ అన్నారు. శకటాల ప్రదర్శన తిరస్కరణపై బెంగాల్ ప్రభుత్వం స్పందించింది. బెంగాల్‌పై కేంద్రం వివక్షతతో వ్యవహరిస్తోందని, పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వ్యతిరేకించినందున రాష్ట్రాన్ని లక్ష్యంగా చేసుకుంటోందని తృణమూల్ ఎంపీ సౌగతా రాయ్ అన్నారు. నిపుణుల కమిటీ అభ్యంతరాలు వ్యక్తం చేసినందునే బెంగాల్ శకటాన్ని తిరస్కరించినట్లు రక్షణ శాఖ వెల్లడించింది.