న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఇప్పటికే ఫ్రాన్స్ అధ్యక్షుడిని ప్రధాని మోదీ ఆహ్వానించగా.. ఇందుకు మెక్రాన్ కూడా అంగీకరించారు. ఈ మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎక్స్(ట్విటర్)లో స్పందించారు. నా ప్రియమైన మిత్రుడు మోదీ.. మీ ఆహ్వానానికి ధన్యవాదాలు. మీ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మీతో వేడుకలను జరుపుకోవడానికి నేను వస్తున్నాను’ అని పేర్కొన్నారు.
Thank you for your invitation, my dear friend @NarendraModi. India, on your Republic Day, I’ll be here to celebrate with you!
— Emmanuel Macron (@EmmanuelMacron) December 22, 2023
కాగా రిపబ్లిక్ డే పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యే ఆరో ఫ్రెంచ్ నేత మాక్రాన్. మాజీ ఫ్రెంచ్ ప్రధాన మంత్రి జాక్వెస్ చిరాక్ రెండుసార్లు(1976,1998) ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మాజీ అధ్యక్షులు వాలెరీ గిస్కార్డ్ డి ఎస్టేయింగ్, నికోలస్ సర్కోజీ, ఫ్రాంకోయిస్ హోలాండ్ వరుసగా 1980, 2008, 2016లో వేడుకలకు విచ్చేశారు.
మరోవైపు ఈ ఏడాది జులైలో పారిస్‌లో జరిగిన ఫ్రాన్స్ జాతీయ దినోత్సవమైన బాస్టిల్ డే పరేర్‌కు ప్రధాని మోదీ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఆ తర్వాత ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సుకు మెక్రాన్ వచ్చారు. ఇక గణతంత్ర దినోత్సవ వేడుకలకు భారత్ తన మిత్ర దేశాల నేతలను ఆహ్వానించడం 1950 నుంచి సంప్రదాయంగా వస్తోన్న విషయం తెలిసిందే.
చదవండి: నానమ్మ ఇందిరా గాంధీపై వరుణ్ ప్రశంసలు
Comments
Please login to add a commentAdd a comment