గణతంత్ర వేడుకలకు ఆహ్వానంపై రాజకీయాలు మొదలయ్యాయి. తమ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్‌నువేడుకలకు ఆహ్వానించకపోగా,
సాక్షి, న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకలకు ఆహ్వానంపై రాజకీయాలు మొదలయ్యాయి. తమ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్‌నువేడుకలకు ఆహ్వానించకపోగా, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీని విఐపీ ఎన్‌క్లోజర్‌లో ముందువరుసలో కూర్చోబెట్టారని ఆప్ నేత ఆశీష్ ఖేతాన్ విమర్శించారు. జాతీయ కార్యక్రమాలను రాజకీయ లబ్దికోసం ఉపయోగించుకోవడం ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఉపయోగించుకోవడం బాధాకరమని ఆయన అభిప్రాయపడ్డారు.మాజీ ముఖ్యమంత్రిగా తనను గణతంత్ర దినోత్సవ పరేడ్ కు ఆహ్వానించకపోవడంపట్ల కేజ్రీ వాల్ రెండురోజుల కిందటే అభ్యంతరం వ్యక్తం చేశారు.
అయితే మాజీ ముఖ్యమంత్రిని పరేడ్‌కు ఆహ్వానించే సంప్రదాయం లేదని బీజేపీ పేర్కొంది. సామాన్యుడినని చెప్పుకునే కేజ్రీవాల్‌కు ప్రత్యేకంగా ఎందుకు ఆహ్వానించాలని ఈశాన్య ఢిల్లీ ఎంపీ మనోజ్ తివారీ వ్యాఖ్యానిం చారు. పరేడ్‌కు హాజరుకావాలనుకుంటే కేజ్రీవాల్ సామాన్యుల మాదిరిగానే రావాలని ఆయన సూచించారు. అయితే కేజ్రీవాల్‌ను తోసిరాజని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్‌బేడీనిపరేడ్‌కు ఆహ్వానించడం చర్చనీయాం శంగా మారింది. దీనిపై ఆప్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పరేడ్‌కు ఆహ్వానం అందాలంటే కేజ్రీవాల్.. బీజేపీలో చేరాలంటూ కిరణ్ బేడీ చేసిన వ్యాఖ్య ఈ వివాదాన్ని మరింత తీవ్రం చేసింది.