న్యూ ఢిల్లీ:
బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే ఆయనతో చర్చకు సిద్ధమని ఆమ్ ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్ తెలిపారు. శనివారం ఆప్ మానిఫెస్టోను కేజ్రీవాల్ విడుదల చేశారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ...ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కిరణ్ బేడీ స్థానంలో అమిత్ షాను ప్రకటిస్తే తనతో చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు.
ఇంతకు ముందు కిరణ్ బేడీని బహిరంగ చర్చకు రావాలని కేజ్రీవాల్ సవాలు విసిరారు. అందుకు తాను సిద్ధమేనని, కానీ ఇప్పుడు కాదు అసెంబ్లీలో చర్చిద్దామని కిరణ్ బేడీ సమాధానమిచ్చారు. కేజ్రీవాల్, కిరణ్ బేడీలు ఇద్దరూ అన్నా హజారే చేపట్టిన అవినీతి నిర్మూలన ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత కేజ్రీవాల్ అమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు. 49 రోజుల పాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా కూడా వ్యవహరించారు.