ఢిల్లీ: ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ బాలేదన్న యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్(Yogi Adityanath) వ్యాఖ్యలతో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఏకీభవించారు. ఢిల్లీ నగరంలో లా అండ్ ఆర్డర్ అనేది కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతిలో ఉందని, ఆ విషయాన్ని ఆయనకే మీరు కాస్త కూర్చొని చెప్పండని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు.
ఢిల్లీ నగరంలో లా అండ్ ఆర్డర్‌ను ఎలా మరుగుపరుచాలో అమిత్ షాకు కాస్త దిశా నిర్దేశం చేయండి యోగీ జీ అంటూ కేజ్రీవాల్ సెటైర్లు వేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు(Delhi assembly election 2025) ఫిబ్రవరి 5వ తేదీన జరుగనున్న నేపథ్యంలో ఇటు ఆప్, అటు బీజేపీలు తమ ప్రచార జోరును కొనసాగిస్తున్నాయి. కౌంటర్‌కు రీ కౌంటర్ అన్నట్లు సాగుతోంది ఇర పార్టీల ప్రచారం. దీనిలోభాగంగా యోగీ ఆదిత్యానాథ్ మాట్లాడిన మాటలకు కేజ్రీవాల్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
మీరు చెప్పింది నిజమే యోగీ జీ..
‘ నిన్న( గురువారం) యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఒక మంచి విషయం చెప్పారు. దీనికి ఢిల్లీ ప్రజల కూడా మద్దతుగా నిలుస్తారు. ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ బాలేదని యోగి అన్నారు. దాంతో ఢిల్లీ ప్రజలు వంద శాతం ఏకీభవిస్తారు. ఢిల్లీలో గ్యాంగ్‌స్టర్లు చాలా ఫ్రీగా తిరుగుతున్నారు. ఢిల్లీలో చాలా గ్యాంగ్‌స్టర్ గ్రూపులున్నాయి. వీరంతా ఢిల్లీ నగరాన్ని విభజించి వారి వారి కార్యకలాపాల్ని ఎంతో స్వేచ్ఛగా చేసుకుంటున్నారు. ఇక్కడ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్‌లని బెదిరించి వారి అరాచకాల్ని సాగిస్తున్నాయి గ్యాంగ్‌స్టర్ గ్రూపులు.
ప్రధానంగా ఇక్కడ వ్యాపారాలు చేస్తున్న బడా వ్యాపారస్తులకు ఏ రోజు సుఖం లేదు. రోజూ ఏదొక గ్యాంగ్‌స్టర్‌గ్రూప్ నుంచి వారు బెబెదిరింపు కాల్స్ రిసీవ్ చేసుకుంటూనే ఉన్నారు. వారి కుటుంబాల్ని చంపేస్తామంటూ మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల్ని గ్యాంగ్‌స్టర్ గ్రూపులు వసూలు చేస్తూ ఉంటాయి. ఢిల్లీలో జరిగే గ్యాంగ్ వార్స్‌కి అక్కడి రోడ్లే సాక్ష్యం. ఢిల్లీలో మహిళలు ఇళ్లు ాదాటి బయటకు రావాలంటే చాలా భయానక పరిస్థితులు ఉన్నాయి. ఢిల్లీ నగరంలో చిన్న పిల్లలు, మహిళలు తరచు కిడ్నాప్‌లకు గురౌవుతుంటారు. ఇక్కడ గ్యాంగ్‌స్టర్‌లకు కత్తుల్ని వారి వద్దనున్న మారణాయుధాల్ని చాలా బహిరంగంగా వాడుతుంటారు. హత్యలు, చైన్ స్నాచింగ్‌లు, దొంగతనాలు నిత్యం ఏదో మూలన జరుగుతూనే ఉంటాయి. ఢిల్లీ ప్రజలు చాలా భయాందోళన మధ్య బ్రతుకుతున్నారనేది నిజం’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
ఢిల్లీలో శాంతి భద్రతల బాధ్యత అమిత్ షాదే..
‘యూపీలో లా అండ్ ఆర్డర్ అనేది ఎంతో అమోగంగా ఉందన్నారు. ఒక ఫిక్స్‌డ్ లా అండ్ ఆర్డర్ యూపీలో ఉందన్నారు. యూపీలో గ్యాంగ్‌స్టర్ గ్రూపులను కట్టడి చేశామని చెప్పారు యోగీ జీ. అక్కడ లా అండ్ ఆర్డర్ బాగుందా.. బాలేదా అనేది నాకైతే తెలీదు. ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ మాత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) చేతుల్లో ఉంది. మరి మీరు(యోగీ ఆదిత్యానాథ్) యూపీలో లా అండ్ ఆర్డర్ ఏదైతే మెరుగైందని చెప్పారో అదే విషయాన్ని అమిత్ షాకు కూడా చెప్పి ఢిల్లీ నగరంలో శాంతి భద్రతల్ని మెరుగుపర్చండి. ఢిల్లీలో గ్యాంగ్‌స్టర్‌లకు ఎలా అడ్డుకట్ట వేయాలో కాస్త అమిత్ షా జీకి చెప్పండి యోగీ జీ’ అని కేజ్రీవాల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Comments
Please login to add a commentAdd a comment