ఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికల తరుణంలో యమునా (yamuna) నదిపై రాజకీయ రంగు పులుముకుంది. ఢిల్లీకి జీవనాడి యమునాపై బీజేపీ (bjp) విషం కక్కుతోందంటూ ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (arvind kejriwal) వ్యాఖ్యలపై కేంద్ర హోమంత్రి అమిత్‌షా ఎదురుదాడికి దిగారు. కేజ్రీవాల్ చిల్లర రాజకీయాలు చేసే బదులు ఆ విషం పేరేంటే బయట పెట్టాలని సూచించారు. గురువారం రోహిణిలో బీజేపీ ఎన్నికల ర్యాలీ నిర్వహించింది.
ఈ ర్యాలీలో అమిత్ షా మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో ఓటమి ఖాయమని కేజ్రీవాల్‌కు అర్ధమైంది. అందుకే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే యమునా వాటర్‌లో విషం కలిపారని ఆరోపిస్తున్నారు. యమునా నదిలో విషం ఉందన్న ల్యాబ్ రిపోర్టును విడుదల చేయాలి.
అబద్ధాల పుట్ట
ఎన్నికల్లో గెలవాలంటే అబద్ధాలు చెప్పడం మానేయమని కేజ్రీవాల్‌కు చెప్పాలనుకుంటున్నాను. ఢిల్లీ ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం యమునా నీళ్లలో విషం కలిపిందని అంటున్నారు. యమునాలో విషం కలిపితే ఏ విషం కలిపారు? విషయం ఉన్నట్లు లేబొరేటరీలో గుర్తించారు. అంతేకాదు, ఆప్ ప్రభుత్వం మద్యం దుకాణాలను మూసివేస్తామని హామీ ఇచ్చిందని, బదులుగా ఆలయాలు,స్కూల్ పరిసర ప్రాంతాల్లో తెరిచారు. కోట్ల విలువైన మద్యం కుంభకోణంలో జైలు పాలయ్యారు’ అని అమిత్ షా ఆరోపించారు.
తనను తాను నిజాయితీ పరుడినని చెప్పుకుని తిరిగే కేజ్రీవాల్ మద్యం కుంభకోణం, జల్ బోర్డులో రూ. 28400 కోట్ల కుంభకోణం, రేషన్ పంపిణీలో రూ. 5,400 కోట్ల కుంభకోణంలో ప్రమేయం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment