Yamuna
-
యమునలో విషపు నురుగులు
న్యూఢిల్లీ: యమునా నదిలో కాలుష్య స్థాయి మరింతగా పెరిగింది. కాళింది కుంజ్ ప్రాంతానికి చెందిన ఒక వీడియోలో యమునా నది ఉపరితలంపై విషపూరిత నురుగుతో కూడిన మందపాటి పొర కనిపిస్తోంది. ఈ నదిలో గత కొన్ని రోజులుగా నురుగు కనిపిస్తోంది.వారాంతాల్లో యమునా ఘాట్లను శుభ్రం చేసే ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఇక్కడి పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. నదిలో నురుగు ఎక్కువగా ఉందని, ఇది చర్మంతో పాటు కళ్లకు కూడా ప్రమాదకరంగా మారిందని తెలిపారు. ఢిల్లీలో వాయుకాలుష్యం, యమునలో విషపు నురుగలకు ఆప్ కారణమంటూ బీజేపీ విమర్శిస్తోంది.ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా యమునలో స్నానం చేసిన కొన్ని గంటలకు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన వైద్యులను సంప్రదించారు. వారు ఆయనకు చికిత్స అందించాక, విశ్రాంతి అవసరమని సూచించారు. యమునా ప్రక్షాళన విషయంలో కేజ్రీవాల్ ప్రభుత్వం మోసం చేసిందని వీరేంద్ర సచ్‌దేవా ఆరోపించారు. 2025 ఫిబ్రవరిలో బీజేపీ అధికారంలోకి వస్తే యమునా క్లీనింగ్ అథారిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. #WATCH | Delhi | Thick toxic foam seen floating on the Yamuna River in Kalindi Kunj, as pollution level in the river continues to remain high. pic.twitter.com/VZhXwvPNd4— ANI (@ANI) October 26, 2024ఇది కూడా చదవండి: దేశంలోని ప్రముఖ మహాలక్ష్మి ఆలయాలు -
యమునా హారతికి పోటెత్తిన జనం
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగే గంగా హారతి మాదిరిగా ఢిల్లీలోని వాసుదేవ్ ఘాట్‌పై యుమునా హారతి ప్రారంభమయ్యింది. ఢిల్లీ ప్రజలకు యమునా నదిపై ఉన్న ఆరాధనా భావాన్ని ఇది మరింత పెంపొందించనుంది. మార్చి 20న సాయంత్రం వేళ వాసుదేవ్ ఘాట్‌పై తొలిసారిగా యమునా హారతి కార్యక్రమం జరిగింది. దీనిని తిలకించేందుకు భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. ప్రస్తుతానికి యమునా నది ఒడ్డున వారానికి రెండు రోజులు అంటే మంగళవారం, ఆదివారం సాయంత్రం వేళల్లో హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. తరువాత క్రమంగా మిగిలిన రోజుల్లోనూ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. యమునా నది ఒడ్డున నిర్మించిన వాసుదేవ్ ఘాట్ ఇప్పుడు కాశీలోని ఘాట్లను తలపిస్తోంది. ప్రజలు కూడా ఈ ఘాట్‌ను వీక్షించేందుకు తరలివస్తున్నారు. యమునా నది ఒడ్డున సంప్రదాయబద్ధంగా నిర్వహించిన తొలి హారతి కారక్రమం విజయవంతంగా జరిగింది. మరోవైపు ఈ వాసుదేవ్ ఘాట్‌ను పరిశుభ్రంగా ఉంచేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి యమునా హారతి వీక్షించేందుకు వచ్చే భక్తుల నుంచి ఎటువంటి రుసుము వసూలు చేయడం లేదు. -
వారి వల్ల నా ఫ్యామిలీలో పక్కన పెట్టేశారు.. చనిపోదామనుకున్నా: నటి యమున
సౌత్ ఇండియాలో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా ప్రేక్షకుల అభిమాన తారగా యమున కొనసాగింది. 1989లో విడుదలైన మౌన పోరాటం సినిమా ద్వారా ఈమె పేరుగడించింది. మామగారు, పుట్టింటి పట్టుచీర, ఎర్ర మందారం వంటి సూపర్ హిట్ చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు విపరీతంగా నచ్చేసింది. ఆమె జర్నీ సూపర్ స్పీడ్‌లో ఉన్న సమయంలోనే వివాహం జరగడం ఆపై... తరువాత కొంతకాలం సినిమాలలో నటించడం ఆపేసింది. కొంత విరామం తరువాత టి.వి.సీరియళ్లలో నటించడం ప్రారంభించింది. కానీ సుమారు పన్నెండేళ్ల క్రితం ఓ వ్యభిచార కేసులో యమున పట్టుబడింది అని వార్తలు వచ్చాయి. ఈ ప్రభావం ఆమె కెరియర్‌పై కూడా పడింది. అయితే దీనిపై యమునకు న్యాయ స్థానం క్లీన్ చిట్ ఇచ్చింది. అందులో ఆమెకు సంబంధించి ఎలాంటి పాత్ర లేదని కోర్టు కూడా స్పష్టం చేసింది. కానీ ఆమెను సోషల్‌మీడియా మాత్రం వదలడం లేదు. ఆమెపై ఇప్పటికీ తప్పుడు థంబ్‌నైల్స్ పెట్టి వ్యూస్ కోసం కొందరు చేస్తున్న పని వల్ల ఆమెను క్షోభకు గురిచేస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై ఓ టీవీ ప్రొగ్రామ్‌కి హాజరైన యమున..ఈ విషయంపై మాట్లాడుతూ.. ఎమోషనల్ అయ్యారు. 'సోషల్ మీడియాలో నా గురించి బ్యాడ్‌గా రాసే మాటల వల్ల నా ఫ్యామిలీలో చాలామంది పక్కన పెట్టేశారు. అవన్నీ భరించలేక చనిపోదామని కూడా నిర్ణయించుకున్న. అప్పుడు పిల్లలు గుర్తుకొచ్చి ఏం చేసుకోలేకపోయాను.' అని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఇదే విషయంపై గతంలో యమున ఏం చెప్పింది..? ఈ విషయంపై యమున గతంలో కూడా తన ఇన్స్టాగ్రామ్ ద్వార ఒక వీడియో చేసి తన బాధను పంచుకుంది. 'ఒక సమస్య వల్ల నేను బయటపడ్డాను.. అక్కడ ఏం జరిగిందో ఒక ఇంటర్వ్యూలో నేను చెప్పాను. ఈ విషయంలో న్యాయస్థానం కూడా క్లీన్ చిట్ ఇచ్చింది. కానీ నేను సోషల్ మీడియాను కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఇప్పటికీ నా గురించి, నా సంఘటన గురించి చెత్త థంబ్ననైల్స్తో వీడియోలు పెడుతున్నారు. అవి చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఎంత మోటివేట్ చేసుకున్నా, నేను కూడా మనిషినే కదా.. ఒకవేళ నేను చనిపోయినా వీళ్లు నన్ను వదలరు అనిపిస్తుంది.' అంటూ తన బాధను వ్యక్తం చేసింది. View this post on Instagram A post shared by Y Yamuna (@actressyamunaofficial) -
చేస్తే హీరోయిన్ గా చేయాలని డిసైడ్ అయ్యాను
-
మీరు నవ్వుకోవడం కోసం అలా చేస్తారా..?
-
బెంగళూరులో మాకు వ్యాపారం ఉంది: నటి యమున
-
ఆ ఘటనను మర్చిపోయి చాలా సంతోషంగా ఉన్నాను..!
-
నాకు తెలియదు నేను ఇలా అయిపోతా అని అంత నా విధి
-
నేను ఫేక్ గా ఉండలేను..!
-
మౌన పోరాటం లో అలా నటించడం పై క్లారిటీ ఇచ్చిన యమునా
-
మత్స్యకారుల చేతికి డాల్ఫిన్.. ఇంటికెళ్లి కూర వండేసుకున్నాక..
మనదేశంలోని యమునా నది ప్రస్తుతం ఉప్పొంగి ప్రవహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపధ్యంలో యుమునలో రకరకాల చేపలు తేలియాడుతూ కనిపిస్తున్నాయి. గతంలో ఇన్ని చేపలు కనిపించేవి కాదని యమున పరీవాహక ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు. కాగా యమునా నదిలో ఇటీవలి కాలంలో డాల్ఫిన్లు కూడా కనిపిస్తున్నాయి. యూపీలోని కౌశంబి జిల్లాలో పిపరీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉంటున్న నలుగురు మత్స్యకారులు యమునలోని డాల్ఫిన్లను పట్టుకుని, కూర చేసుకుని తినేశారనే ఆరోపణలు వినిపించాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపధ్యంలో పోలీసులు నలుగురు మత్స్యకారులపై కేసు నమోదు చేశారు. పిపరీ పోలీసు అధికారి శ్రవణ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ జిల్లా అటవీశాఖ అధికారి రవీంద్ర కుమార్ నసీర్పూర్ గ్రామానికి చెందిన నలుగురు మత్స్యకారులపై ఫిర్యాదు చేశారన్నారు. ఆ మత్స్యకారుల తమ వలలో పడిన డాల్ఫిన్‌ను ఇంటికి తీసుకుపోయి, కూర వండుకున్నారని రవీంద్రకుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు. ఈ ఉదంతం గురించి పోలీసులు మాట్లాడుతూ ఆ మత్స్యకారులు డాల్ఫిన్‌ను తీసుకెళ్లడాన్ని ఎవరో వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారన్నారు. దీనిపై విచారణ జరిపి, నలుగురు మత్స్యకారులపై కేసు నమోదు చేశామన్నారు. వీరిలో రాజేష్ కుమార్ అనే నిందితుడిని అరెస్టు చేశామని, మిగిలినవారు పరారయ్యారని తెలిపారు. వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఇది కూడా చదవండి: అణుబాంబు ఆవిష్కర్తకు భారత పౌరసత్వం.. నెహ్రూ ఆఫర్‌ను తిరస్కరించిన ఓపెన్‌హైమర్! -
దంచికొడుతున్న వానలు.. మళ్లీ యమునకు పోటెత్తిన వరద.. రెడ్ అలర్ట్ జారీ
ఢిల్లీ: ఉత్తరాదిలో వర్షాలు కాస్త తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పుంజుకున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలు పలు రాష్ట్రాలను మళ్లీ వణికిస్తున్నాయి. ఇప్పటివరకు సంభవించిన వరదల భీబత్సం నుంచి తేరుకోకముందే మరోమారు ముప్పు పొంచి ఉంది. నిన్న రాత్రి ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో వానలు దంచికొట్టాయి. దీంతో ప్రయాగ్‌రాజ్ వద్ద గంగా, యమునా నది ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోయింది. వర్షాలకు తోటు రహదారులపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఉత్తరప్రదేశ్‌లో గంగ, యమునా నది ప్రవాహం ఉద్దృతంగా ప్రవహిస్తోంది. ఫఫమౌ వద్ద గంగా నది ప్రవాహం 11 సెంటీమీటర్ల నుంచి 24 సెంటీమీటర్ల వరకు పెరిగిపోయింది. నైనీ వద్ద యమునా నది 29 సెంటీమీటర్ల మేర పెరిగింది. ఉత్తరఖండ్‌లో చమోలీ జిల్లాలో జాతీయ రహదారి 7పై కొండచరియలు విరిగిపడ్డాయి. వర్షాలతో రాష్ట్రంలో రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. అటు అసోంలోనూ వరదలు సంభవించాయి. దాదాపు 47 జిల్లాలు వరదల్లో చిక్కుకున్నాయి. 32,400 మంది ప్రజలు వరదలకు ప్రభావితమయ్యారు. గత 24 గంటల్లో కురిసిన వర్షాలకు ఉత్తరప్రదేశ్‌లో 10 మంది వరకు మరణించారు. పంజాబ్, హర్యానాల్లో వర్షాలకు దాదాపు 55 మంది మృతి చెందినట్లు సమాచారం. ఇక వరదలతో అతలాకుతలం అయిన హిమాచల్ ప్రదేశ్‌లో ఇప్పటికే రూ.8000 కోట్ల నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గత మూడు రోజులుగా యమునా నది ప్రవాహం పెరగడంతో ఢిల్లీ వణికిపోయింది. ప్రస్తుతం పరిస్థితి కొంత మెరుగుపడినా ఇంకా కొన్ని ప్రాంతాలు వరద నీటిలోనే ఉన్నాయి. త్రాగునీటి వ్యవస్థ, విద్యుత్ సరఫరాకు ఇంకా కొన్ని ప్రాంతాల్లో అంతరాయం కొనసాగుతోంది. మళ్లీ ఇప్పుడు వర్షాల రావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. రాజ్‌ఘాట్ నుంచి నిజాముద్దీన్ మార్గంలో ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో ఐపీ ఫ్లైఓవర్ రింగ్ రోడ్డు కాకుండా వేరే మార్గంలో రావాలని వాహనదారులకు సూచనలు చేస్తున్నారు పోలీసులు. ఇదీ చదవండి: వరద గుప్పిట ఉండగానే మళ్లీ అందుకున్న భారీ వర్షం.. ఢిల్లీలో స్తంభించిన జనజీవనం -
దారి మరువని ‘యమున’.. గతాన్ని గుర్తుచేసుకుంటూ..
దేశరాజధాని ఢిల్లీలో కురిసిన భారీ వర్షాల కారణంగా యమునా నదికి వరదలు సంభవించాయి. దీంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. సుమారు 45 ఏళ్ల తరువాత యమునా నది తన మహోగ్రరూపాన్ని ప్రదర్శించింది. వరద ఉధృతికి నగరంలోని పలు ప్రాంతాలు జలమయం కాగా, వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. ప్రముఖ చారిత్రాత్మక ప్రాంతమైన ఎర్రకోట కూడా వరదలకు ప్రభావితమయ్యింది. కోటలోని తలుపుల వరకూ వరదనీరు చేసింది. ఈ నేపధ్యంలో పలువురు ఇంటర్నెట్ యూజర్స్ యమునా నది వరదలకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తున్నారు. యూజర్ హర్ష్ వత్స్ తన ట్విట్టర్ ఖాతాలో మునిగిన ఎర్రకోట ఫొటోతోపాటు మొఘలుల కాలంనాటి ఒక పెయింటింగ్ ఫొటోను షేర్ చేశారు. A river never forgets! Even after decades and centuries pass, the river would come back to recapture its borders. Yamuna reclaims it's floodplain. #Yamuna #DelhiFloods pic.twitter.com/VGjkvcW3yg — Harsh Vats (@HarshVatsa7) July 13, 2023 దీనిలో శతాబ్ధాల కిందట సంభవించిన యమునా నది వరదల దృశ్యం కనిపిస్తోంది. ఈ ఫొటోకు క్యాప్షన్‌గా ‘ఆ నది ఈ విషయాన్ని ఎన్నడూ మరచిపోలేదు. దశాబ్ధాలు గడిచిన తరువాత కూడా తన సరిహద్దులను స్వాధీనం చేసుకునేందకు తిరిగి వచ్చింది. యమున తిరిగి తన వరద ప్రభావిత ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది’ అని రాశారు. మరో యూజర్ ఇదేవిధమైన ఫొటోను షేర్చేస్తూ ‘ప్రకృతి ఎప్పుడూ తన మార్గంలోకి తిరిగివస్తుంది..#DelhiFloods2023 #Yamuna #RedFort." అని ట్యాగ్ చేశారు. మరికొందరు యూజర్స్ ఏఏ ప్రాంతాలలోకి యమున వరద నీరు ప్రవేశించిందో అవి శతాబ్ధాల క్రితం వరద ప్రవాహానికి గురైన ప్రాంతాలేనని, అందుకే యమున తిరిగి తన దారిని వెతుక్కుంటూ ఆయా ప్రాంతాలకు వచ్చిందని రాశారు. Nature always comes back to reclaim it's course....#DelhiFloods2023 #Yamuna #RedFort pic.twitter.com/woEieUoyaN — Rohit Sharma (@rohitzsharmaz) July 14, 2023 ఇది కూడా చదవండి: 18 వ అంతస్తు నుంచి ‘అమ్మా’ అంటూ కేక... తల్లి పైకి చూసేసరికి.. -
Yamuna River Waterlogging Images: యమునా ఉగ్రరూపం.. ఢిల్లీ వెన్నులో వణుకు (ఫొటోలు)
-
ఆరోజు హోటల్లో కావాలని ఇరికించారు.. ఇప్పటికీ వేధిస్తున్నారు : యమున
వెండితెరపై హీరోయిన్గా అలరించిన నటి యమున ఆ తర్వాత సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. తన అందం, అభినయంతో చక్కటి గుర్తింపు సొంతం చేసుకుంది. కెరీర్ పీక్స్ స్టేజ్‌లో ఉండగానే ఓ చేదు సంఘటన ఆమెకు ఎదురైంది. 2011లో బెంగుళూరులోని ఓ హోటల్లో వ్యభిచారం కేసులో యమున పట్టుబడిందనే వార్త అప్పట్లో ఇండస్ట్రీని షేక్ చేసింది. దీంతో యమున కెరీర్ ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయింది. ఆ తర్వాత ఈ విషయంలో తన తప్పేమీ లేదని, కావాలనే తనని ఇరికించారని ఇప్పటికే పలు ఇంటర్వ్యూలో యమున చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఇప్పటికీ తనను వేధిస్తున్నారని, ఆ సంఘటనకు సంబంధించి అసభ్యకరమైన థంబ్‌నైల్స్‌తో మానసికంగా హింసిస్తున్నారంటూ ఓ వీడియో ద్వారా ఆవేదనను వెల్లడించింది. ''ఆ సంఘటన తాలూకూ బాధ ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంది. ఆరోజు అసలేం ఏం జరిగిందన్నది ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో చెప్పేశాను. ఆ విషయంలో న్యాయస్థానం కూడా నాకు క్లీన్ చిట్ ఇచ్చి నన్ను గెలిపించింది.కానీ సోషల్‌మీడియాను మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఇప్పటికీ నా గురించి, నా సంఘటన గురించి చెత్త థంబ్ననైల్స్తో వీడియోలు పెడుతున్నారు. అవి చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఎంత మోటివేట్ చేసుకున్నా, నేను కూడా మనిషినే కదా.. ఒకవేళ నేను చనిపోయినా వీళ్లు నన్ను వదలరు అనిపిస్తుంది'' అంటూ తన బాధను వ్యక్తం చేసింది. View this post on Instagram A post shared by Y Yamuna (@actressyamunaofficial) -
యమునా నదిపై ఎంపీ సంచలన వ్యాఖ్యలు... ప్రూవ్ చేసిన అధికారి
యుమునా నది విషపూరితం అంటూ బీజేపీ ఎంపీ పర్వేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా ఢిల్లీ జల్ బోర్డ్ డైరెక్టర్ సంజయ్ శర్మతో వాదనకు దిగారు. ఉత్తరప్రదేశ్‌లో ప్రసిద్ధి గాంచిన ఛత్ పూజ సందర్భంగా వేలమంది స్నానం చేసే యమునా నదిలో స్నానం చేసి చూపించగలవా అంటూ ఛాలెంజ్ విసిరారు. దీంతో ఢిల్లీ జల్ బోర్డు డైరెక్టర్ సంజయ్ శర్మ ఆదివారం ఉదయం ఛత్ పూజకు ముందు యమునా నీటిలో స్నానం చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో...యమునా నది శుభ్రంగా సురక్షితంగా ఉందని చూపించారు. నది నీరు స్వచ్ఛమైనది, ప్రజలకు ఎలాంటి హాని కలిగించదన్నారు. బీజేపీ ఎంపి పర్వేష్ శర్మ నీటిలో విష రసాయనాలు చల్లారంటూ ఆరోపణలు చేశారు. అందుకే తాను అన్నమాట ప్రకారం స్నానం చేసి చూపించాను. నదిని శుద్ధి చేసే నిమిత్తం సంబంధిత అధికారుల అనుమతితో రసాయనాలను పిచికారి చేశాం. నీరు విషపూరితం కాదని నొక్కి చెప్పారు. ఈ మేరకు అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. यह दिल्ली के सांसद है लेकिन इनकी जुबान तो देखो कितनी ओछी और तुच्छ है और वो भी भारतीय सरकार के एक अधिकारी के प्रति। delhi jal board k director DTQC Sanjay Sharma ji ne yamuna k Pani me naha kar ye saaf kar diya ki yamuna ka pani puri tarah se saaf h @msisodia @ANI @CNNnews18 pic.twitter.com/tsEnXfrkKA — water treatment plant DJB (@delhijalboard0) October 30, 2022 (చదవండి: ఎట్టకేలకు డ్రీమ్ గర్ల్‌తో వివాహం...మోదీ, యోగీలకు ఆహ్వానం!) -
వరదలతో అతలాకుతలమైన అస్సాంలో ...ఓ విచిత్రమైన ఘటన: వీడియో వైరల్
గౌహతి: అస్సాంలో గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాల వల్ల వరదలు బీభత్సం సృష్టించాయి. రహదారులన్ని జలమయమైపోయాయి. ఈ మేరకు మొత్తం 36 జిల్లాలకు గానూ సుమారు 32 జిల్లాలు ఈ వరదలకు ప్రభావితమయ్యాయి. పైగా వరదలు, కొండచరియలు విరిగి పడటంతో దాదాపు 30 మంది మరణించారు. కేంద్రమంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి హిమంత బిస్వాశర్మ ద్వారా అస్సాం పరిస్థితి గురించి ఎప్పటికప్పుడూ తెలుసుకుంటున్నారు. బరాక్ వ్యాలీ ప్రాంతో రైలు, రోడ్డు మార్గం వరదల కారణంగా మరింత అధ్వాన్నంగా మారాయి. ఈ మేరకు అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న విషాదకర ఘటనలను వీడియోతీస్తుంటే...ఒక ఆశ్చర్యకరమైన ఘటన వీడియోలో బంధింపబడింది. నడుములోతు నీటిలో ఒకవ్యక్తి అప్పుడే పుట్టిన నవజాత శిశువుని తీసుకుని వస్తున్నాడు. ఆ ఘటన చూస్తుంటే చిన్న కృష్ణుడిని ఎత్తుకుని యుమునా నదిని దాటిని వాసుదేవుడిలా అనిపించింది. పైగా ఆవ్యక్తి తన బిడ్డను చూసుకుని మురిసిపోతూ ఆనందంగా నడుస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. Heartwarming picture from Silchar Floods! This video of a father crossing the waters with his newborn baby in Silchar reminds of Vasudeva crossing river Yamuna taking newborn Bhagwan Krishna over his head! Everyday is Father’s Day!@narendramodi @himantabiswa @drrajdeeproy pic.twitter.com/1PEfaiCxA5 — Sashanka Chakraborty 🇮🇳 (@SashankGuw) June 21, 2022 (చదవండి: ఇది మహారాష్ట్ర.. బీజేపీ ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి!: సంక్షోభ సంకేతాలపై శివసేన స్పందన) -
నటి యమున కొత్త ఇల్లు ఎంత బాగుందో చూడండి!
Actress Yamuna New Home Tour: బుల్లితెర ప్రేక్షకులకు మాత్రమే కాదు వెండితెర ఆడియన్స్‌కు కూడా బాగా సుపరిచితురాలు నటి యమున..ప్గతంలో పలు సినిమాల్లో నటించిన ఆమె తర్వాత టీవీ ఇండస్ట్రీలో కాలు మోపింది. అనేక సీరియళ్లలో నటిస్తూ బుల్లితెరపై స్థిరపడిపోయింది. ఎంతోమంది నటీనటులు వస్తూపోతున్నా యమున మాత్రం పోటీని తట్టుకుని ఇండస్ట్రీలో నిలబడింది. సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే యమున ఆ మధ్య హోమ్ టూర్ వీడియో చేసింది. దీన్ని పదిహేను లక్షల మంది వీక్షించారు. ఈ వీడియో పెట్టి నెల రోజులైందో లేదో మరో హోమ్ టూర్ వీడియో చేసింది యమున. భవిష్యత్తులో రిటైర్మెంట్ తీసుకున్నాక ప్రశాంతంగా గడిపేందుకు వీలుగా హైదరాబాద్ సిటీకి దూరంగా స్థలాన్ని కొనుగోలు చేసింది. మహేశ్వరం ప్రాంతంలో 360 గజాల్లో స్థలం సొంతం చేసుకుని తనకు నచ్చినట్లుగా ఇంటిని నిర్మించుకుంది. హాల్, పూజ గది, కిచెన్, డైనింగ్ ఏరియా, 3 బెడ్ రూమ్స్, ఒక ఆఫీస్ రూమ్ ఇలా అన్నింటినీ చూపించింది. భవిష్యత్తులో లిఫ్ట్ ఏర్పాటు చేసేందుకు వీలుగా కొంత ఖాళీ స్థలాన్ని ఉంచానంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇల్లు సింపుల్‌గా బాగుందని కామెంట్లు చేస్తున్నారు. ప్రశాంత వాతావారణంలో ఇల్లు కట్టుకోవడమే కాక అందంగా, నీట్‌గా డిజైన్ చేశారని మెచ్చుకుంటున్నారు. -
అందుకే నాకు ఫైర్ బ్రాండ్ ఇమేజ్!
-
అందుకే నాకు ఫైర్ బ్రాండ్ ఇమేజ్!
‘‘ప్రతీ ఒక్కటీ రాసిపెట్టిందే’’ అంటున్నారు నటి యమున. ఇంకా ‘సాక్షి’ టీవీతో ఆమె చెప్పిన విశేషాలు ఈ విధంగా.. తొలిసారి బాలచందర్‌గారి సినిమాలో చేశాను. ఆ సినిమా తర్వాత సరైన ఆఫర్లు రాలేదు. పొట్టిగా ఉన్నానని చిన్న పాత్రలు ఇస్తామన్నారు. హీరోయిన్‌గానే చేస్తానన్నాను. నా నటన చూసి ‘మౌన పోరాటం’లో ఆఫర్ ఇచ్చారు. ఇబ్బంది అనిపించినా ఆ సినిమాలో బ్లౌజ్ లేకుండా చేశాను. ⇒ కోపమొచ్చినా, సంతోషమొచ్చినా చూపిం చేస్తాను. ఏదీ మనసులో పెట్టుకోను. ఆ తత్వమే ఫైర్‌బ్రాండ్ ఇమేజ్ ఇచ్చింది. ⇒ చిరంజీవితో ‘కొదమ సింహం’, మోహన్‌బాబుతో ‘అల్లుడుగారు’, బాలకృష్ణతో ఓ సినిమా, రాజశేఖర్, శరత్‌కుమార్, మోహన్‌లాల్‌లతో.. ఇలా చాలా సినిమాలు మిస్సయ్యా. స్టార్ హీరోయిన్ కాలేదనే బాధ ఉంది. ఇప్పుడు సీరియల్స్‌లో బిజీగా ఉన్నందుకు హ్యాపీ. ⇒ ఎవరెవరినో నా భర్త అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి. నేను ఒక్కర్నే పెళ్లి చేసుకున్నా (నవ్వుతూ). కావాలంటే నన్ను అడగండి.. ఫ్యామిలీ ఫొటోస్ పంపిస్తా. నా భర్త పేరు జయంత్‌కుమార్. ఆయన సాఫ్ట్వేర్ ఉద్యోగి. -
భారీ వరద: ఢిల్లీకి పొంచి ఉన్న ముప్పు
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర భారతంలో కురుస్తున్న భారీ వర్షాలకు యమున నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వరదలతో 205 మీటర్ల ఎత్తులో నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో దేశ రాజధాని ఢిల్లీకి భారీ వరద ముంపు పొంచి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. యమునా నది వరద ఉధృతి క్రమంగా పెరుగుతుండటం ఢిల్లీ వాసులు ఆందోళనకు గురువతున్నారు. ఢిల్లీలో వరద పరిస్థితిపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమీక్షించారు. వరద మరింత పెరిగితే తీసుకోవాల్సిన చర్యలపై అధికారులను అప్రమత్తం చేశారు. గత కొద్దిరోజులుగా దక్షిణాదిని వణికిస్తోన్న వరదలు ఇప్పుడు ఉత్తర భారతంపై ప్రతాపాన్ని చూపుతున్న విషయం తెలిసిందే. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. పంజాబ్‌లో భారీ వర్షాల కారణంగా యమున, సట్లెజ్, బియాస్ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. -
సీఎం స్పందించే వరకు పోరాటం ఆగదు
సోమాజిగూడ: ముక్కుపచ్చలారని చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడులపై ముఖ్యమంత్రి స్పందించేవరకు తన పోరాటం ఆగదని సామాజిక కార్యకర్త నడింపల్లి యమునా పాథక్ అన్నారు. ఇటీవల వరంగల్‌లో జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ గురువారం ఆమె ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్త్రీలపై నిత్యం అత్యాచారాలు జరుగుతుంటే ప్రభుత్వం కనీసం స్పందిండం లేదన్నారు. అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునేవరకు తాను నిరాహార దీక్ష చేపడతానన్నారు. పోలీసులు నన్ను అరెస్టు చేసినా వరంగల్ వెళ్లి అక్కడే నిరాహారదీక్ష చేట్టనున్నట్లు ఆమె ప్రకటించారు. నిందితులను శిక్షించడంలోప్రభుత్వాలు విఫలం హిమాయత్‌నగర్: అత్యాచారాలకు పాల్పడుతున్న వారిని శిక్షించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని శ్వాస ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కళ్యాణి గొర్రె పేర్కొన్నారు. రంగల్లో 9 నెలల పసికందుపై ఓ కామాంధుడు అత్యాచారం చేయడం దారుణమన్నారు. రోజు రోజుకూ పసికందులు, బాలికలు, అమ్మాయిలు, మహిళలపై అత్యాచారాలు అధికమవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. కామాంధులపై కఠిన చర్యలు తీసుకుంటేనే అత్యాచారాలు తగ్గుముఖం పడతాయన్నారు. సోషల్‌మీడియా సైట్లలో సానుభూతి తెలిపితే ప్రయోజంన లేదని, నిందితులకు శిక్షపడేవరకు ఒత్తిడి తీసుకురావాలన్నారు. -
చదువుల తల్లికి కష్టమొచ్చింది!
లక్షల్లో ఫీజులుకట్టి చదివించినా అందరు పిల్లలు మంచి ఫలితాలను సాధించరు. కానీ కొందరు మాత్రం ఎన్ని ఇబ్బందులున్నా అద్భుత ఫలితాలను తమ సొంతం చేసుకుంటారు. అలాంటి కోవకు చెందిందే యమున. మొన్నటి డిగ్రీ ఫలితాల్లో 9.91 జీపీఏతో మంచి మార్కులు తెచ్చుకుంది. అయితే ఉన్నత చదువులకు ఆర్థిక ఇబ్బందులు తప్పలేదు. తల్లిదండ్రులు మృతిచెందారు. ముగ్గురు ఆడబిడ్డలే. ఓ సోదరికి వివాహమై భర్తతో ఉంది. మరో సోదరి కష్టంతో ఇప్పటిదాకా చదివింది యమున. అయితే ఉన్నత చదువులకు ఆర్థిక ఇబ్బందులు శాపంగా మారాయి. పలమనేరు: రామకుప్పం మండలం కవ్వంపల్లెకు చెందిన యమున పాఠశాల స్థాయి నుంచే బాగా చదువుతోంది. వీకోట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ చదివి 920 మార్కులు సాధించింది. దీంతో వీకోటకు చెందిన నలంద డిగ్రీ కళాశాల యాజమాన్యం ఆ విద్యార్థికి కళాశాల ఫీజు లేకుండానే అడ్మిషన్ ఇచ్చారు. బీఎస్సీ కంప్యూటర్స్‌లో 9.91 మార్కులు సాధించి యూనివర్సిటీ టాపర్స్ జాబితాలో చోటుదక్కించుకుంది. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అవ్వాలనే లక్ష్యం శిరీష ఎంసీఏ చేసి సాఫ్ట్వేర్ ఇంజినీర్ కావాలనే లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే కుటుంబ పరిస్థితులు, పేదరికం అవరోధంగా మారాయి. దీంతో ఇంటికే పరిమితమైంది. ఎంసీఏ చదివించేందుకు ఎవరైనా దాతలు స్పందిస్తే తన కలని సాకారం చేసుకుంటానంటోంది. ఉన్నత చదువులకు తప్పని ఆర్థిక ఇబ్బందులు యమున తండ్రి జయరామిరెడ్డి తొమ్మిదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయినా ఆయన భార్య నాగరత్నమ్మ ముగ్గురు ఆడపిల్లలను కూలినాలి చేసి పోషించింది. వీరికి రెండెకరాల మెట్టపొలం మినహా మరే ఆధారం లేదు. పెద్దకుమార్తెకు ఇన్ని కష్టాల నడుమే వివాహం చేసింది.. రెండో కుమార్తె శిరీష డిగ్రీదాకా చదివి ఆపై ఆర్థిక సమస్యలతో చదువుకు స్వస్తి పలకాల్సి వచ్చింది. 9నెలల క్రితం తల్లి నాగరత్నమ్మ సైతం అనారోగ్యంతో మృతిచెందింది. దీంతో ఇంట్లో ఇరువురు ఆడపిల్లలు మాత్రం మిగిలారు. తన లక్ష్యాన్ని చెల్లెలు ద్వారా సాకారం చేసుకోవాలన్న సోదరి శిరీష పక్కనే ఉన్న చిన్నబల్దారు హైస్కూల్లో విద్యావలంటీర్‌గా పనిచేస్తూ కుటుంబానికి దిక్కుగా మారింది. అయితే అక్కడ వీవీలకిచ్చే వేతనం చాలక, అదీనూ నెలనెలా సక్రమంగా రాక ఇబ్బందులు తప్పలేదు. ఈ నేపథ్యంలో యమున ఉన్నత చదువులకు ఆర్థిక సమస్య వెంటాడుతోంది. -
అమ్మను వచ్చాను. లేమ్మా..
అనంతపురం సెంట్రల్ :‘‘ముగ్గురు బిడ్డల్ని బాగా చదివించుకుంటిమే..ఎప్పటికైనా ఉద్యోగస్తురాలుగా చూడాలని కలలు కంటిమే.. ఇలా చూస్తాననుకోలేదు. మీ అమ్మను వచ్చాను. లేమ్మా..’’ అంటూ మార్చురీ గదిలో విగతజీవిగా పడి ఉన్న యమునపై పడి ఆమె తల్లి రాధమ్మ కన్నీటిపర్యంతమైంది. వివరాల్లోకి వెళితే.. నగరంలో శారదనగర్‌లోని శ్రీసాయి జూనియర్ కాలేజీలో సీఈసీ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న యమున(17) మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. కొత్తచెరువు మండల కేంద్రంలో నివాసముంటున్న రామాంజులు, రాధమ్మ దంపతులకు సంధ్య, సాయిలత, యమున, వంశీ సంతానం. రామాంజులు రిక్షా తొక్కుతూ, రాధమ్మ పుట్టపర్తిలో ఇళ్లలో పనిచేస్తూ పిల్లల్ని ప్రైవేటు కాలేజీల్లో చదివించుకుంటున్నారు. మూడవ కుమార్తె యమునను నగరంలో శ్రీసాయి రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో చదివిస్తున్నారు. బిడ్డల్ని ఉన్నత స్థానాల్లో చూడాలని కలలుగన్నారు. అయితే అర్ధంతరంగా మూడవ కుమార్తె యమున తనువు చాలించడంతో తట్టుకోలేకపోయారు. మార్చురీ గది దద్దరిల్లిలేలా ఆర్థనాదాలు చేశారు. ‘ఎందుకు ఇక్కడ పడుకున్నావ్ తల్లీ..’ అంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. పొంతనలేని యాజమాన్యం మాటలు: విద్యార్థి మృతిపై యాజమాన్యం చేసిన ప్రకటనలు ఒకదానికొకటి పొంతనలేకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. రెండు నెలల క్రితం ఆగస్టు 8న రాసిన ఓ లేఖను బయట పెట్టారు. ‘‘అమ్మా నాన్నా.. ప్రతి రోజూ నేను ఏడుస్తున్నాను. ఏడ్చి ఏడ్చి తలనొప్పి వస్తోంది. అందర్నీ నేను ఇబ్బంది పెడుతున్నా. సారీ అమ్మా.. సారీ నాన్న..’’ అంటూ రాసిన ఓ లేఖ దొరికింది. అయితే రెండు నెలల క్రితమే సూసైడ్ నోట్ రాసుకోవడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనికి తోడు తోటి విద్యార్థులు హ్యాండ్ రైటింగ్ యమునది కాదని తేల్చారు. అలాగే క్లాసులకు సక్రమంగా వెళ్లడం లేదని వార్డెన్ ఉదయాన్నే ఆఫీసురూంలో మందలించాడన్నారు. దీంతో రూంలోకి వెళ్లి తలుపులు వేసుకుందని, ఎంతసేపటికీ తీయకపోవడంతో తలుపులు బద్దలు కొట్టి చూసే సరికి ఉరివేసుకుందని చెప్పారు. విద్యార్థిని తల్లిదండ్రులు కూడా మా ఇంట్లో ఎలాంటి సమస్యలు లేవని, యాజమాన్యం వల్లే తమ కుమార్తె చనిపోయిందని బోరున విలపించారు. ఘటనపై వన్‌టౌన్ సీఐ సాయిప్రసాద్ బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా : ఫీజులు చెల్లించాలని కళాశాల యాజమాన్యం వేధించడం వల్ల విద్యార్థి యమున ఆత్మహత్య చేసుకుందని వైఎస్సార్ విద్యార్థి విభాగం నేతలు బండిపరుశురాం, నరేంద్రరెడ్డి, ఏఐఎస్ఎఫ్ నాయకులు జాన్సన్‌బాబు తదితరులు ఆరోపించారు. శ్రీసాయి కళాశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సదరు కళాశాల ఎదుట ధర్నా చేపట్టారు. విద్యార్థుల జీవితాలతో ప్రైవేటు, కార్పొరేట్ యాజమాన్యాలు చెలగాటమాడుతున్నాయని ఆరోపించారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
మస్కా!
పట్టుకోండి చూద్దాం హరి, యమునలు చిలకా గోరింకల్లా కనిపించి కనువిందు చేస్తారు. కొన్నిసార్లు మాత్రం... పాము, ముంగిసల్లా పోట్లాడుకొని చుట్టుపక్కల వాళ్లను భయపెడతారు. అందుకే వారి సంసారం చాలామందికి ఒక పజిల్లా అనిపిస్తుంటుంది. ‘వాళ్లు కలిసి ఉంటారా? కలిసి ఉన్నట్లు నటిస్తుంటారా?’ అనేది చాలామంది సందేహం. ఒక రోజు ఊరి నుంచి హరి నాన్నగారు నారాయణరావు వచ్చాడు. వారం రోజుల పాటు ఉన్నాడు. మామగారు రావడం, ఇంట్లో వారం రోజుల పాటు ఉండడం యమునకు నచ్చలేదు. అలా అని ముఖం మూడ్చుకొని కూర్చోలేదు. మామగారిని చాలా మర్యాదగా చూసుకుంది. అందుకేనేమో... నారాయణరావు వెళుతూ వెళుతూ కోడలితో అన్నాడు...‘‘నాకు కూతురు లేని లోటును తీర్చావు’’ యమున చిన్నగా నవ్వుతూ... ‘‘నా మామయ్యకు ఈ మాత్రం సేవ చేయాలేనా...’’ అంది. నారాయణరావు వెళ్లిపోయిన తరువాత ఇల్లు యుద్ధరంగంగా మారింది. ‘‘మీ ఇంట్లో వాళ్లకు సేవ చేయడానికి నన్ను పెళ్లి చేసుకున్నావా?’’ అని గట్టిగా అడిగింది యమున. ‘‘నీ బుద్ధ్ది మారదా? వచ్చిన వ్యక్తి మా నాన్నగారు... పరాయి వ్యక్తి కాదు... సొంత మామనే అవమానిస్తున్నావు. నువ్వు మనిషివా? రాక్షసివా!’’ ఆ రోజంతా తగాదా పడుతూనే ఉన్నారు భార్యాభర్తలు. ఇద్దరి మధ్య మాటలు లేవు. మరుసటి రోజు జ్వరంతో హరి ఆఫీసుకు వెళ్లలేదు. మంచంలో నిద్రపోయి దగ్గుతున్న హరి దగ్గరికి యమున వచ్చింది... ‘‘లేవండీ... హాస్పిటల్‌కు వెళదాం’’ అన్నది. ఈ మాటకు హరి చలించిపోయాడు. మరోమాట మాట్లాడకుండా భార్యతో పాటు హాస్పిటల్‌కు వెళ్లాడు. ‘‘నిన్నటి వరకు క్షణం తీరిక లేకుండా గొడవ పడ్డారు. ఇప్పుడు చూడు... ఎలా నవ్వుతూ వెళుతున్నారో’’ అనుకున్నారు ఇరుగు పొరుగు. హాస్పిటల్ నుంచి బయటికి వస్తున్నప్పుడు... ‘థ్యాంక్స్’ అన్నాడు హరి. ‘‘థ్యాంక్స్ చెప్పి నన్ను పరాయిదాన్ని చేస్తున్నావా?’’ అంది యమున. ‘‘అమ్మో... నీతో ఎలా మాట్లాడినా సమస్యే’’ అన్నాడు అభయ్ నవ్వుతూ యమున భుజం మీద చేయివేస్తూ. ‘‘రేపు ఆదివారం కదా... ఎప్పటిలాగే ఇంట్లో వంటావార్పు బంద్. యస్ఆర్నగర్లో రుచులు అనే కొత్త రెస్టారెంట్ పెట్టారు. రేపు అక్కడ భోజనం చేద్దాం’’ అంది యమున. ‘‘ఓకే’’ అని బదులిచ్చాడు హరి. ఆ తరువాత మూడు వారాల్లో... గోపి విషయంలో మాత్రం ఒకసారి తగాదా జరిగింది. గోపి, యమున కోలిగ్. గోపితో సన్నిహితంగా ఉండడం హరికి నచ్చలేదు. ‘‘అతడు నా అన్నలాంటి వాడు... ఏవేవో ఊహించుకొని మనసు పాడు చేసుకోకు’’ అని యమున వివరణ ఇవ్వడంతో తగాదా అక్కడికక్కడే ముగిసింది. ఆ తరువాత మూడు వారాలకు... ఆ రోజు ఆదివారం. యమున ఎవరినో కూరలు తరిగే కత్తితో పొడిచి చంపిందనే వార్త ఫోన్లో విని పరుగు పరుగునా పోలిస్‌స్టేషన్‌కు వెళ్లాడు హరి. ఇంట్లోకి దూరిన అగంతకున్ని ఆత్మరక్షణ కోసమే యమున హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ‘‘అసలు ఏం జరిగింది?’’ యమునను ప్రశ్నించాడు హరి. ‘‘డోర్‌బెల్ మోగగానే మీరేమో అనుకొని తీశాను. తలకు మాస్క్ వేసుకున్న ఒక వ్యక్తి నా మీదికి రాబోయాడు. ఏం చేయాలో తోచక... చేతిలో ఉన్న కూరగాయల కత్తితో పొడిచాను...’’ అని ఏడుస్తూ చెప్పింది యమున. ‘‘ఇందులో ఏదో తిరకాసు ఉంది. మీతో కొద్దిసేపు మాట్లాడాలి’’ అని తన గదిలోకి తీసుకెళ్లి యమునను ఎంక్వైరీ చేశాడు ఇన్స్పెక్టర్ నరసింహ. ఆమె చెప్పిన విషయం విని ఇన్స్పెక్టర్ ఆశ్చర్యపోయాడు. ఇంతకీ... యమున ఇన్స్పెక్టర్తో ఏం చెప్పింది? అసలు ఇన్స్పెక్టర్ యమునను ఎందుకు అనుమానించాడు? Ans:- ‘డోరు బెల్ మోగగానే మీరేమో అనుకొని తలుపు తీశాను’ అని చెప్పింది యమున. వచ్చింది భర్తే అని తెలిసినప్పుడు చేతిలో కత్తి పట్టుకొని ఎందుకు వెళ్లింది? ప్రతి ఆదివారం ఇంట్లో వంట చేయరు. మరి కూరలు తరిగే కత్తి ఆమె చేతిలో ఎందుకు ఉన్నట్లు?..’ ఈ కారణాలతోనే యమునను అనుమానించాడు ఇన్స్పెక్టర్. భర్తను చంపడానికే యమున కత్తితో వెళ్లింది. డోర్ తీసీతీయగానే... ఎదుటి వ్యక్తి ఎవరా? అనేది కూడా ఆలోచించకుండా ఆవేశంగా అగంతుకుడిని కత్తితో పొడిచింది.