సౌత్ ఇండియాలో ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా ప్రేక్షకుల అభిమాన తారగా యమున కొనసాగింది. 1989లో విడుదలైన మౌన పోరాటం సినిమా ద్వారా ఈమె పేరుగడించింది. మామగారు, పుట్టింటి పట్టుచీర, ఎర్ర మందారం వంటి సూపర్ హిట్ చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు విపరీతంగా నచ్చేసింది. ఆమె జర్నీ సూపర్ స్పీడ్‌లో ఉన్న సమయంలోనే వివాహం జరగడం ఆపై... తరువాత కొంతకాలం సినిమాలలో నటించడం ఆపేసింది. కొంత విరామం తరువాత టి.వి.సీరియళ్లలో నటించడం ప్రారంభించింది. కానీ సుమారు పన్నెండేళ్ల క్రితం ఓ వ్యభిచార కేసులో యమున పట్టుబడింది అని వార్తలు వచ్చాయి.
ఈ ప్రభావం ఆమె కెరియర్‌పై కూడా పడింది. అయితే దీనిపై యమునకు న్యాయ స్థానం క్లీన్ చిట్ ఇచ్చింది. అందులో ఆమెకు సంబంధించి ఎలాంటి పాత్ర లేదని కోర్టు కూడా స్పష్టం చేసింది. కానీ ఆమెను సోషల్‌మీడియా మాత్రం వదలడం లేదు. ఆమెపై ఇప్పటికీ తప్పుడు థంబ్‌నైల్స్ పెట్టి వ్యూస్ కోసం కొందరు చేస్తున్న పని వల్ల ఆమెను క్షోభకు గురిచేస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై ఓ టీవీ ప్రొగ్రామ్‌కి హాజరైన యమున..ఈ విషయంపై మాట్లాడుతూ.. ఎమోషనల్ అయ్యారు.
'సోషల్ మీడియాలో నా గురించి బ్యాడ్‌గా రాసే మాటల వల్ల నా ఫ్యామిలీలో చాలామంది పక్కన పెట్టేశారు. అవన్నీ భరించలేక చనిపోదామని కూడా నిర్ణయించుకున్న. అప్పుడు పిల్లలు గుర్తుకొచ్చి ఏం చేసుకోలేకపోయాను.' అని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది.
ఇదే విషయంపై గతంలో యమున ఏం చెప్పింది..?
ఈ విషయంపై యమున గతంలో కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వార ఒక వీడియో చేసి తన బాధను పంచుకుంది. 'ఒక సమస్య వల్ల నేను బయటపడ్డాను.. అక్కడ ఏం జరిగిందో ఒక ఇంటర్వ్యూలో నేను చెప్పాను. ఈ విషయంలో న్యాయస్థానం కూడా క్లీన్ చిట్ ఇచ్చింది. కానీ నేను సోషల్ మీడియాను కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఇప్పటికీ నా గురించి, నా సంఘటన గురించి చెత్త థంబ్‌ననైల్స్‌తో వీడియోలు పెడుతున్నారు. అవి చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఎంత మోటివేట్ చేసుకున్నా, నేను కూడా మనిషినే కదా.. ఒకవేళ నేను చనిపోయినా వీళ్లు నన్ను వదలరు అనిపిస్తుంది.' అంటూ తన బాధను వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment