TV Actress Sameera Sahrif Introduced Her Baby Boy Arhan, Pic Goes Viral - Sakshi
Sakshi News home page

Sameera Sahrif : తన చిన్నారి ఫోటోను రివీల్‌ చేసిన బుల్లితెర నటి

Published Mon, Oct 18 2021 12:59 PM | Last Updated on Mon, Oct 18 2021 3:08 PM

TV Actress Sameera Sahrif Introduced Her Baby Boy Arhan, Pic Goes Viral - Sakshi

TV Actress Sameera Sahrif Introduced Her Baby Boy Arhan: ప్రముఖ బుల్లితెర నటి, యాంకర్‌ సమీరా తొలిసారిగా తన చిన్నారిని పరిచయం చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన కొడుకు ఫోటోను అభిమానులతో షేర్‌ చేసుకుంది. 'మా ఆనందాలకు చిరునామా..మా బేబీ సయ్యద్ అర్హాన్‌ను మీకు పరిచయం చేస్తున్నాం. చిన్నప్పటి నుంచి నాకు పిల్లలంటే ఎంతో ఇష్టం. నేను ఎదుగుతున్న కొద్దీ ఆ ఇష్టం మరింత పెరిగింది. నా మేనకోడళ్లు, అల్లుళ్లు, ఫ్రెండ్స్‌ పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకున్నాను.

ఇప్పడు నా కన్నబిడ్డ ఇప్పుడు నా చేతుల్లో ఉండటం అన్నది మాటల్లో చెప్పలేని ఆనందాన్ని కలిగిస్తుంది. దీనికి కారణం అయిన దేవుడికి ధన్యవాదాలు. థ్యాంక్యూ అర్హాన్‌..మమ్మల్ని తల్లిదండ్రులుగా సెలక్ట్‌ చేసుకున్నందుకు. నీకు బెస్ట్‌ మథర్‌గానే కాకుండా, బెస్ట్‌ ఫ్రెండ్‌గా కూడా ఉంటానని మాటిస్తున్నాను' అంటూ ఎమోషనల్‌ పోస్ట్‌ను పంచుకుంది. కాగా 2006 లో ఆడపిల్ల అనే సీరియల్ తో కెరీర్ ప్రారంభించిన సమీరా ముద్దుబిడ్డ, అభిషేకం, భార్యమణి, మూడు ముళ్ల బంధం వంటి ఎన్నో సీరియల్స్ లో నటించింది. ప్రస్తుతం సీరియల్స్‌కు బ్రేక్‌ ఇచ్చి సొంతంగా యూట్యూబ్‌ ఛానల్‌తో ఎంతోమంది ఎంటర్‌టైన్‌ చేస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement