sameera
-
ప్రాణం లేని బిడ్డను నెలరోజులు కడుపులో మోసిన నటి.. ఎట్టకేలకు..! (ఫోటోలు)
-
ప్రాణం లేని బిడ్డను నెల రోజులు కడుపులో మోశా.. నటి భావోద్వేగం
బుల్లితెర నటి, యాంకర్ సమీరా (Sameera Sherief) విషాద వార్తను పంచుకుంది. మరోసారి తల్లి కాబోతున్నానన్న ఆనందం తనకు ఎంతోకాలం నిలవలేదంది. కడుపులోనే బిడ్డ కన్నుమూసిందంటూ ఏడ్చేసింది. ఈ విషయాన్ని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వెల్లడించింది. నేను మొదటిసారి 2020లో తొలిసారి గర్భం దాల్చాను. ఆ సమయంలో నేను మిస్టర్ అండ్ మిసెస్ చిన్నతిరై అనే రియాలిటీ షో చేస్తున్నాను. తొలిసారి గర్భస్రావంషూటింగ్ అయిపోయాక హాస్పిటల్‌కు వెళ్దామనుకున్నాను. చెన్నైకి చేరుకోగానే తీవ్ర రక్తస్రావమైంది (Miscarriage). ఫస్ట్ ప్రెగ్నెన్సీలో గర్భస్రావమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని డాక్టర్స్ చెప్పారు. అలా మొదటి బిడ్డనే కోల్పోయాను. దేవుడి దయ వల్ల ఏడాది తిరగకముందే మరోసారి గర్భం దాల్చాను. 2021 జనవరిలో ప్రెగ్నెంట్ అయ్యాను. అప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాను.. అలా అర్హాన్ పుట్టాడు.అంతా బాగుందని తెలిసి..2023 నవంబర్‌లో మళ్లీ ప్రెగ్నెంట్ అయ్యాను. ఇంట్లో అందరూ ఎగ్జయిట్ అయ్యారు. అర్హాన్ అయితే నా కడుపులో బిడ్డతో మాట్లాడేవాడు. రెండుసార్లు స్కానింగ్‌కు వెళ్లినప్పుడు బేబీ బాగుందన్నారు. పన్నెండోవారంలో మరోసారి స్కానింగ్‌కు వెళ్లాను. ఎనిమిదో వారంలోనే బిడ్డ ఎదుగుదల ఆగిపోయింది. తన గుండె కొట్టుకోవడం లేదని డాక్టర్ చెప్పింది. నాలుగువారాలు ప్రాణం లేని బిడ్డను మోశాఅంటే నాలుగువారాల నుంచి బేబీ నా పొట్టలోనే ఉంది. నన్ను వదిలి వెళ్లాలనుకోవడం లేదు. మా కలలు కుప్పకూలిపోయినట్లనిపించింది. ఎంతగానో ఏడ్చాము. ఈ లోకంలో ఆ బిడ్డతో నేను కలిసిలేకపోయినా చనిపోయిన తర్వాత మాత్రం మళ్లీ తనను కలుస్తాను. డిసెంబర్ 31న టాబ్లెట్స్ ద్వారా గర్భంలోని శిశువును తీసేశాం అని చెప్తూ ఎమోషనలైంది.ఎవరీ సమీరా?నటి సమీరా ఆడపిల్ల అనే సీరియల్‌తో పాపులారిటీ తెచ్చుకుంది. అభిషేకం, ముద్దు బిడ్డ, భార్యామణి, మూడు ముళ్ల బంధం.. ఇలా ఎన్నో సీరియల్స్‌లో నటించింది. ఆ తర్వాత ‘అదిరింది’ షోకి కొద్ది రోజులుపాటు యాంకర్‌గానూ పని చేసింది. అనంతరం సడన్‌గా బుల్లితెరకు దూరమైపోయింది. సమీరా 2019లో అన్వర్ జాన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోగా వీరికి 2021లో బాబు పుట్టాడు.చదవండి: గతేడాది ఒకేచోట సంక్రాంతి సెలబ్రేషన్స్.. ఈసారి మాత్రం! -
అందమైన చీరలో బ్యూటీ విత్ టాలెంట్.. ఎవరీమె?
-
చేగువేరా బయోపిక్ 'చే' ఎలా ఉందంటే..
టైటిల్: ‘చే’ నటీనటులు:లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్, పసల ఉమామహేశ్వర్, బి.ఆర్ సభావత్ నాయక్ తదితరులు నిర్మాణ సంస్థ: బ్యానర్: నేచర్ ఆర్ట్స్ నిర్మాతలు: సూర్య , బాబు, దేవేంద్ర రచయిత, దర్శకుడు: బి.ఆర్ సభావత్ నాయక్ సంగీతం: రవిశంకర్ సినిమాటోగ్రఫీ: కళ్యాణ్ సమి, జగదీష్ విడుదల తేది: డిసెంబర్ 15, 2023 కథేంటంటే.. విప్లవం బాట పట్టిన 'చే' (సభావత్ నాయక్) పలు దేశాలు తిరుగుతూ పీడిత జనాన్ని చైతన్య పరుస్తుంటాడు. ఓ సారి పోలీసుల ఎదురుకాల్పుల్లో గాయపడతాడు. గాయపడిన 'చే'ను గిరిజన గ్రామస్తులు కాపాడుతారు. ఆ క్రమంలో సింగి (లావణ్య) 'చే'ను ప్రేమిస్తుంది. శరీరకంగానూ దగ్గరవుతుంది. ఆకలి, నిరక్షరాస్యత, అనారోగ్యం తదితర సమస్యలపై దృష్టిపెడతాడు. కేవలం కడుపు నింపుకోవటం కోసమే పని చేసే పరిస్థితి నుండి ప్రపంచాన్ని మరింత మెరుగుపరచాలని ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో పోలీసుల చేతిలో తన దళ సభ్యులు చనిపోతారు. చివరికి 'చే' కూడా బొలీవియా సైనిక దళాలకు బందీగా చిక్కుతాడు. ఆ తర్వాత ఏమైందీ? తను ప్రేమించిన అమ్మాయి ఎలా ఉంది? అనేదే ఈ సినిమా కథ. ఎవరెలా చేశారంటే.. చేగువేరా పాత్రలో బిఆర్ సభావత్ నాయక్ చక్కగా నటించాడు. ఈ తరం ప్రేక్షకులకు చేగువేరా ఎలా ఉంటాడో పూర్తిస్థాయిలో చూపించాడు. లీడ్ రోల్లో సభావత్ నాయక్ చెప్పిన డైలాగ్‌లు ఈ సినిమా హైలైట్ పాయింట్స్‌గా చెప్పుకోవచ్చు. చే కు జంటగా నటించిన లావణ్య తన పాత్రలో చక్కగా నటించింది. ఒక అందమైన అమాయకపు గిరిజన అమ్మాయిగా నటించి తన పాత్రకు పరిపూర్ణత తెచ్చింది. ఇక ఇతర పాత్రల్లో నటించిన పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్, పసల ఉమామహేశ్వర్ తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. విశ్లేషణ విప్లవం అనగానే ప్రపంచవ్యాప్తంగా అందరికి గుర్తొచ్చే పేరు చేగువేరా. అలాంటి వీరుడి జీవిత చరిత్రను తెరకెక్కించిన మూవీ ‘చే’.సాధారణ కథతో పాటు, చేగువేరా లైఫ్ గురించి బయట ప్రపంచానికి తెలియని విషయాలను కూడా ఎంతో ఆసక్తిగా తెరకెక్కించాడు దర్శకుడు బి.ఆర్ సభావత్ నాయక్. సినిమాలోని పాత్రలు ఇండియాలో మాదిరిగానే కనిపిస్తాయి. ఇంకా చెప్పాలంటే గిరిజనులను పోలి ఉంటాయి. చేగువేరా బయోపిక్‌ను మన నెటివికి దగ్గరగా చూపించాలన్న ఉద్దేశంతోనే సినిమా తీసినట్టు మనకు అర్థమవుతుంది. చరిత్రను తెరపై చూపించడం చిన్న విషయం కాదు..ఉన్నది ఉన్నట్లు చూపించకపోతే చరిత్రకారులు ఒప్పుకోరు.. సినిమాటిక్ లిబర్టీ తీసుకోకపోతే ప్రేక్షకులకు బోర్ కొడుతుంది. ‘చే’ విషయంలో కూడా అదే జరిగింది. చాలా వరకు చేగువేరా జీవితాన్ని నేచురల్ గా చూపించే ప్రయత్నం దర్శకుడు చేశాడు. కమర్షియల్ హంగులకి పెద్దపీట వేయలేదు. చాలా నిజాయితీగా సినిమాను తెరకెక్కించాడు. టెక్నికల్ విషయాలకొస్తే..రవిశంకర్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్. సినిమాటోగ్రాఫర్లు కళ్యాణ్ సమి, జగదీష్ పనితీరు బాగుంది.ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది.నిర్మాణ విలువలు పర్వాలేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని ఓ అతిసాధారణ వ్యక్తి ఇలాంటి సందేశాత్మక చిత్రాన్ని తెరకెక్కించడం నిజంగా అభినందించాల్సిందే. -
బుల్లితెర నటి పోస్ట్.. ఇది మీ పర్సనల్ అంటూ నెటిజన్స్ ఫైర్!
ఆడపిల్ల సీరియల్‌తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన నటి సమీరా. ఆ తర్వాత జీవితం, అభిషేకం, ఆడపిల్ల, అన్నా చెల్లెల్లు, భార్యామణి, డా. చక్రవర్తి, ముద్దు బిడ్డ, మూడు మూళ్ళ బంధం, ప్రతిబింబం, భార్యామణి, మంగమ్మ గారి మనవరాలు లాంటి సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులను అలరించింది. తమిళంలోనూ 'రెక్క కట్టి పరాక్కుదు మనసు' అనే సీరియల్లో కనిపించింది. అయితే పెళ్లి తర్వాత నటనకు కాస్తా విరామం ప్రకటించింది. పిల్లలు పుట్టాక ప్రస్తుతం కుటుంబానికే ఎక్కువ సమయం కేటాయిస్తోంది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న భామ.. ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తూ ఉంటోంది. తాజాగా సమీరా చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది అయితే ఆమె షేర్ చేసిన ఫోటోలో పెదవికి రక్త కారుతూ కనిపించింది. ఆ ఫోటోతో పాటు ఓ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. ఇదొక హెచ్చరిక అంటూ పోస్ట్ చేయగా.. దీనిపై నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: నా సొంతింటికి వచ్చినట్లు ఉంది.. చెన్నైకి వెళ్లను: సీనియర్ నటి పాకీజా) సమీరా ఇన్‌స్టాలో రాస్తూ..'ట్రిగ్గర్ హెచ్చరిక. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎవరినీ బాధపెట్టకూడదు. ప్రతి ఒక్కరి కథకు అవగాహన ఉంటుంది. ఇది కేవలం జ్ఞాపకశక్తి కోసం క్లిక్ చేసిన చిత్రం. నా ఫీడ్‌లో చేరుతుందని ఎప్పుడూ అనుకోలేదు! కానీ నేను దీని గురించి మీ ఆలోచనలను తెలుసుకోవాలనుకుంటున్నా. ఇది చూస్తే నేను నా సోదరీమణులు,స్నేహితులు, భర్తతో గొప్పగా గొడవపడినట్లు కనిపిస్తోంది. భర్తకు, భార్యతో కచ్చితంగా ఏదో తప్పు జరుగుతోంది.' అంటూ రాసుకొచ్చింది. అంతేకాకుండా..' భర్తతో చాలా మంచి సమయాన్ని గడిపాను. కానీ ఏదో ఒక సమయంలో మా ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. నేను అన్వర్ జాన్ని వివాహం చేసుకోక ముందు కూడా నా శరీరంపై గాయాలు ఉండేవి. అవి నిజానికి నా మేనల్లుడు అయాన్ చేసినవి. అన్వర్ జాన్ తన మేనల్లుడు ప్రిన్స్ వల్ల గాయాలు అయ్యేవి. కానీ నేను, నా భర్త పెద్దగా గొడవ పడినట్టుగా ఈ పిక్‌లో కనిపిస్తోంది. కానీ ఇది అర్హాన్ పొరపాటుతో జరిగింది. కానీ మీరు ఈ ఫోటో చూడగైనే కచ్చితంగా నా భర్తతో గొడవ వల్లే జరిగి ఉంటుందని అనిపించి ఉండొచ్చు. అవును మేము గొడవపడతాం. కానీ ఒకరినొకరు విపరీతంగా ప్రేమిస్తాం. మీలో ఎంతమంది జీవితంలో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు? ఈ పోస్ట్‌తో.. మీరు ఎవరినీ జడ్జ్ చేయవద్దనేది నా సలహా.' అంటూ సమీరా రాసుకొచ్చింది. అయితే సమీరా పోస్ట్‌పై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. ఇది చిన్న పిల్లలు ఉన్న అందరి ఇళ్లలో జరిగేదే అంటూ గడ్డి పెడుతున్నారు. దయచేసి ఇలాంటి నాన్సెన్స్ పోస్టులు పెట్టొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. మరికొందరేమో మాకు కూడా ఇలాంటి సంఘటనలు చాలాసార్లు జరిగాయని చెబుతున్నారు. మీరు ఇలాంటి పోస్టులు చేయడం వల్ల వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపొచ్చు అంటూ సలహాలు కూడా ఇస్తున్నారు. అసలు ఇలాంటి పోస్టులు పెడుతూ మీ సమయం ఎందుకు వృథా చేసుకుంటున్నారని కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: పాకీజాను వీడని ఆర్థిక కష్టాలు.. షాపుల వద్ద భిక్షాటన చేస్తూ!) View this post on Instagram A post shared by Sameera Sherief (@sameerasherief) -
చాలా మంది అలా చేసేవారు.. కానీ నేను మాత్రం: జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్
సమీరా రెడ్డి అంటే ఇప్పటి టాలీవుడ్ అభిమానులకు పరిచయం లేకపోవచ్చు. కానీ అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ సరసన నరసింహుడు చిత్రంతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది భామ. అంతకుముందే బాలీవుడ్ ఆరంగ్రేటం చేసింది సమీర. ఆ తర్వాత చిరంజీవి సరసన జై చిరంజీవ, ఎన్టీఆర్‌తో అశోక్, రానా మూవీ కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రంలో నటించింది. ఆ తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది ముంబయి ముద్దుగుమ్మ. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన సమీర పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గతంలో తనకు ఎదురైన అనుభవాలను వివరించింది సమీరా రెడ్డి. అప్పట్లో చిత్ర పరిశ్రమలో నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ గ్లామర్ కోసం శస్త్రచికిత్సలు చేసుకునేవారని తెలిపింది. కానీ నేను మాత్రం అలాంటి వాటికి జోలికి వెళ్లలేదని అన్నారు. నేను ఇండస్ట్రీలో ప్రవేశించాక దాదాపు 10 ఏళ్ల క్రితం ముక్కుతో పాటు చెస్ట్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునేవారని పేర్కొంది. తనను కూడా చేయించుకోవాలని సలహా ఇచ్చారని.. కానీ నేను అలాంటి వాటిని పట్టించుకోలేదని తెలిపారు. కానీ ఇదంతా వారి వ్యక్తిగత నిర్ణయమని.. వారికి ఇష్టంతోనే చేసేవారని వెల్లడించింది. సమీర వెండితెరకు దూరమయ్యాక 2014లో అక్షయ్ వర్దేను వివాహం చేసుకుంది. ఈ జంటకు కొడుకు హన్స్ (7), కుమార్తె నైరా (2)ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది భామ. -
ప్రముఖ బుల్లితెర నటి సమీరా ఇల్లు ఎంత బాగుందో చూశారా?
బుల్లితెర ఆడియన్స్‌కు నటి సమీరా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఆడపిల్ల, అభిషేకం, భార్యామణి, ముద్దు బిడ్డ, మూడుముళ్ల బంధం, మంగమ్మగారి మనవరాలు, తోటికోడలు.. ఇలా ఎన్నో సీరియల్స్‌లో నటించిందామె. ఓ పక్క సీరియల్స్ చేస్తూనే అడపాదడపా షోలలోనూ పాల్గొంటోంది సమీరా. 'పాగల్ నిలవు' సీరియల్‌తో తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె అదే సీరియల్లో నటించిన అన్వర్‌ను పెళ్లాడింది. వీరికి గతేడాది ఓ బాబు జన్మించాడు. తాజాగా ఆమె హైదరాబాద్‌లోని తన ఇంటిని చూపిస్తూ హోమ్ టూర్ వీడియో చేసింది. తన కష్టార్జితానికి ప్రతిరూపమే ఈ ఇల్లని, ఇందులో తన పేరెంట్స్‌తో కలిసి ఉన్నానని, తన పెళ్లి, తన చెల్లి పెళ్లి కూడా ఈ ఇంట్లోనే జరిగిందని తెలిపింది. తన ఇంట్లో మూడు బెడ్రూమ్లు ఉన్నాయంది సమీరా. ముందుగా తన బెడ్రూమ్ను అంతా కలియతిరిగి చూపించింది. తన కొడుకు కోసం బేబీ మానిటర్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపింది. మరో గదిని పరిస్థితులను బట్టి రకరకాలుగా వాడుతున్నామని చెప్పింది. ప్రస్తుతానికైతే దాన్ని స్టోర్ రూమ్‌లా మార్చామంది. మరో బెడ్రూమ్ తన తల్లిదండ్రులదని చెప్పింది. తనకు వచ్చిన అవార్డులను షోకేజీలా బయట పెట్టినని, దాన్ని ఓ బ్యాగ్‌లో పెట్టేసి అటక మీద పెట్టేస్తానంది. ఎందుకంటే అవార్డుల కన్నా మంచి ప్రశంసలే తనకు విలువైనవని పేర్కొంది. చదవండి: కోట్లలో మోసపోయిన హీరోయిన్ రిమీ సేన్ -
తొలిసారి తన కొడుకును పరిచయం చేసిన నటి సమీరా
TV Actress Sameera Sahrif Introduced Her Baby Boy Arhan: ప్రముఖ బుల్లితెర నటి, యాంకర్ సమీరా తొలిసారిగా తన చిన్నారిని పరిచయం చేసింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా తన కొడుకు ఫోటోను అభిమానులతో షేర్ చేసుకుంది. 'మా ఆనందాలకు చిరునామా..మా బేబీ సయ్యద్ అర్హాన్‌ను మీకు పరిచయం చేస్తున్నాం. చిన్నప్పటి నుంచి నాకు పిల్లలంటే ఎంతో ఇష్టం. నేను ఎదుగుతున్న కొద్దీ ఆ ఇష్టం మరింత పెరిగింది. నా మేనకోడళ్లు, అల్లుళ్లు, ఫ్రెండ్స్ పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకున్నాను. ఇప్పడు నా కన్నబిడ్డ ఇప్పుడు నా చేతుల్లో ఉండటం అన్నది మాటల్లో చెప్పలేని ఆనందాన్ని కలిగిస్తుంది. దీనికి కారణం అయిన దేవుడికి ధన్యవాదాలు. థ్యాంక్యూ అర్హాన్..మమ్మల్ని తల్లిదండ్రులుగా సెలక్ట్ చేసుకున్నందుకు. నీకు బెస్ట్ మథర్గానే కాకుండా, బెస్ట్ ఫ్రెండ్‌గా కూడా ఉంటానని మాటిస్తున్నాను' అంటూ ఎమోషనల్ పోస్ట్‌ను పంచుకుంది. కాగా 2006 లో ఆడపిల్ల అనే సీరియల్ తో కెరీర్ ప్రారంభించిన సమీరా ముద్దుబిడ్డ, అభిషేకం, భార్యమణి, మూడు ముళ్ల బంధం వంటి ఎన్నో సీరియల్స్ లో నటించింది. ప్రస్తుతం సీరియల్స్‌కు బ్రేక్ ఇచ్చి సొంతంగా యూట్యూబ్ ఛానల్‌తో ఎంతోమంది ఎంటర్టైన్ చేస్తుంది. View this post on Instagram A post shared by Sameera Sherief (@sameerasherief) -
లంగా ఓణిలో నవ్య స్వామి.. సమంతకు తప్పని అగచాట్లు
సమంత ఇంట్లోకి మరో క్యూట్ కుక్క పిల్ల వచ్చింది. ఇంట్లో ఆ కుక్కపిల్ల చేస్తున్న రచ్చ గురించి సమంత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఫెస్టివల్ మూడ్ అంటూ బుల్లితెర నటి నవ్యస్వామి లంగా ఓణిలో దర్శనమిచ్చింది యాంకర్ సమీరా పండండి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ ఫోటోని అభిమానులతో పంచుకుంది. View this post on Instagram A post shared by S (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Navya Swamy (@navya_swamy) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Syed Anwar (@syedanwarofficial) View this post on Instagram A post shared by Kushboo Sundar (@khushsundar) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) -
పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన యాంకర్ సమీరా
బుల్లితెర నటి, యాంకర్ సమీరా పండంటి మగబిడ్డకు జన్మనించింది. ఈ విషయాన్ని ఆమెఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. సెప్టెంబర్ 4న తమ కుటుంబంలోకి ఓ మగబిడ్డ వచ్చాడని సమీరా చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన ఓ ఫోటోను కూడా పంచుకుంది. తనకు తోడుగా నిలిచిన అభిమానులకు, కరోనా సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ డెలివరీ చేసిన వైద్యులకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. కాగా, 2006 లో ఆడపిల్ల అనే సీరియల్ తో కెరీర్ ప్రారంభించిన సమీరా బుల్లితెర నటుడు ప్రభాకర్ తో ఎన్నో సీరియల్స్ లో నటించింది. ముద్దుబిడ్డ, అభిషేకం, భార్యమణి, మూడు ముళ్ల బంధం వంటి ఎన్నో సీరియల్స్ లో ఆమె నటించింది. ఆ తర్వాత నాగబాబు జడ్జీగా వ్యవహరించిన ‘అదిరింది’ షోకి కొద్ది రోజులుపాటు యాంకర్‌గా చేసింది.ఈ తర్వాత ఈ యంకరమ్మ బుల్లితెరకు దూరమైంది. View this post on Instagram A post shared by Syed Anwar (@syedanwarofficial) -
గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ సమీరా.. ఆ ఫోటోతో అలా..
యంకర్‌గా, నటిగా తెలుగు బుల్లితెరను అలరించిన సమీరా షరీఫ్ తాజాగా ఓ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే తాను ఓ బిడ్డకు తల్లి కాబోతున్నానని ప్రకటించింది. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉండే ఈ యాంకరమ్మ.. తన ప్రెగ్నెన్సీ విషయాన్ని అభిమానులలో చాలా ఢిపరెంట్‌గా పంచుకుంది. సమీరాతో పాటు ఆమె భర్త అన్వర్ ఒకే కలర్ టీషర్ట్స్ ధరించి, దానిపై ‘ఈ విషయం మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది.. త్వరలో మాకు ఓ బేబీ రాబోతుంది'' అని రాసుకొచ్చారు. ఈ ఫోటోని సమీరా తన ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతంఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ దంపతులకు నెటిజన్లు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా, 2006 లో ఆడపిల్ల అనే సీరియల్ తో కెరీర్ ప్రారంభించిన సమీరా బుల్లితెర నటుడు ప్రభాకర్ తో ఎన్నో సీరియల్స్ లో నటించింది. ముద్దుబిడ్డ, అభిషేకం, భార్యమణి, మూడు ముళ్ల బంధం వంటి ఎన్నో సీరియల్స్ లో ఆమె నటించింది. ఆ తర్వాత నాగబాబు జడ్జీగా వ్యవహరించిన ‘అదిరింది’ షోకి కొద్ది రోజులుపాటు యాంకర్‌గా చేసింది.ఈ తర్వాత ఈ యంకరమ్మ బుల్లితెరకు దూరమైంది. View this post on Instagram A post shared by Sameera Sherief (@sameerasherief) -
హాట్ ఫోటోలతో హీట్ పెంచుతున్న టీవీ నటి సమీర
-
అనంతపురం అమ్మాయి లోకాన్ని చుట్టేస్తోంది
అనంతపురం నుంచి సమీరా ఖాన్ అనే అమ్మాయి హిమాలయాల్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే నేపాల్‌లోని అమా దబ్లమ్ పర్వతాన్ని అధిరోహించింది. ఎవరెస్ట్‌ను అందరిలా నేపాల్ వైపు నుంచి కాక టిబెట్ వైపు నుంచి ఎక్కడానికి ప్రయత్నిస్తోంది. సైకిల్ మీద దేశంలోని ఈ మూల నుంచి ఆ మూలకు తిరిగేసిన సమీరా ఖాన్‌కు తల్లిదండ్రులు లేరు. కుటుంబ మద్దతు లేకపోయినా అమ్మాయిలు తాము అనుకున్నది సాధించగలరు అని ఎవరెస్ట్ శిఖరం మీద నుంచి అరచి చెప్పాలని ఉందని సమీరా అంటోంది. సమీరా ఖాన్ మన తెలుగమ్మాయి అయినా తెలుగువారి కంటే ఈశాన్య రాష్ట్రాల్లో చాలామందికి తెలుసు. పర్వతాలు ఎక్కాలనే సంకల్పంతో తరచూ ఆవైపే తిరుగుతుంటుంది సమీరా. నేపాల్, టిబెట్‌లకు పక్కింటికి వెళ్లినట్టు వెళుతుంటుంది. ‘పర్వతాన్ని అధిరోహించడం ఏదో సరదా కాదు నాకు. అదొక జీవన విధానం’ అంటుంది సమీరా. అనంతపురంకు చెందిన సమీరా ఖాన్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఒక సంస్థలో పని చేస్తోంది. కాని టైలర్‌గా పని చేసే తండ్రి ఐదేళ్ల క్రితం మరణించాక ఆమె ఈ ప్రపంచమే తన ఇల్లు అనుకుంది. ఆమెకు తొమ్మిదేళ్ల వయసున్నప్పుడు తల్లి చనిపోయింది. ఐదుమంది సంతానం లో చివరిదైన సమీరా ఇంటి నుంచి ఏ మద్దతు కోరకుండా ఒక్కదానిగా ఏదైనా సాధించాలనుకుంది. ‘నాకు సైక్లింగ్ అంటే చాలా ఇష్టం. దేశంలో దాదాపు వెయ్యి కిలోమీటర్లు సైకిల్ మీద ఒక్కదాన్నే తిరిగాను’ అంటుంది సమీరా. కాని ఆమెకు ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది. ‘నేను పదో క్లాసు వరకు చదువుకున్నాను. ఆ తర్వాత కుటుంబ అవసరాల కోసం బెంగళూరులో ఒక బి.పి.ఓలో పని చేశాను. ఒక్కదాన్నే ప్రపంచం చూడటం మొదలుపెట్టాక ధైర్యం వచ్చింది. సైకిల్ వేసుకొని ఒక్కదాన్నే చుట్టుపక్కల రాష్ట్రాలకు వెళ్లి రావడం మొదలుపెట్టాను’ అంది సమీరా ఖాన్. ‘2014లో కశ్మీర్‌కు వరదలు వచ్చినప్పుడు వాలెంటీర్‌గా పని చేయడానికి వెళ్లాను. ఆ సమయంలో రెండు రోజులు ట్రెక్కింగ్ చేశాను. ధైర్యం వచ్చింది. ప్రతికూల పరిస్థితుల్లో ఎలా ఉండాలో అర్థమైంది. పర్వతారోహణ మీద ఆసక్తి ఏర్పడింది. నేపాల్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో దాదాపు 500 కిలోమీటర్ల ట్రెక్కింగ్ పూర్తి చేశాను. నా శక్తి ఇంకా పెరిగినట్టనిపించింది. నేపాల్‌లో, హిమాలయాల్లో ఉన్న నాలుగు పెద్ద పర్వతాలు ఎక్కాను. ఇక ఎవరెస్ట్ మిగిలింది. దానిని అందరూ సులువని నేపాల్ వైపుగా ఎక్కుతారు. ఏదో ఎక్కామంటే ఎక్కాం అని చెప్పడానికి ఎక్కడం ఎందుకు? నేను టిబెట్ వైపు నుంచి చాలా నైపుణ్యంతో సవాలుతో ఎవరెస్ట్ ఎక్కాలని నిర్ణయించుకున్నాను’ అంది సమీరా ఖాన్. ట్రెక్కింగ్, పర్వతారోహణలో సమీరా ఖాన్ ఆమె ఇంతవరకూ పర్వతారోహణలో ట్రైనింగ్ తీసుకోలేదు. లండన్ వెళ్లి ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటోంది. దానికి రెండు మూడు లక్షలు కావాలి. ఎవరెస్ట్ అధిరోహణకు కూడా కొన్ని లక్షల ఖర్చు ఉంది. ‘నా దగ్గర కొంత డబ్బు ఉంది. ఇంకొంత స్పాన్సర్షిప్ కావాలి. ప్రభుత్వాన్ని సంప్రదిస్తే పర్వతారోహణ ఒక క్రీడ కాదు అని చెప్పి పంపించేశారు. ఏం చేయాలి’ అంది ఈ సాహసి. ‘నాకు స్త్రీలు ఏదైనా సాధించగలరు అని చెప్పాలని ఉంది. ఈ సమాజంలో నా గొంతు వినిపించాలని ఉంది. ఎవరెస్ట్ అధిరోహించి, ఆ యోగ్యతతో నేను చెప్పాలనుకున్నది స్త్రీల తరఫున అరచి చెప్తాను’ అంటోంది సమీరా ఖాన్. ఆమె పట్టుదల చూస్తుంటే త్వరలోనే స్త్రీల తరఫున ఒక గట్టి గొంతు వింటాం. – సాక్షి ఫ్యామిలీ -
ఆమె వివరాల కోసం నెట్లో గాలింపు..
ఫ్యాషన్ సంతోషాన్నిస్తుంది. కొత్తగా కనిపిస్తాం కదా.. అందుకు! హార్పర్స్ ఫ్యాషన్ పత్రిక కూడా.. కొత్తగా కనిపించబోతోంది. ఎడిటర్‌గా సమీరా నాజర్ వచ్చారు. తొలి ‘నాన్–వైట్’ ఎడిటర్! ఆమెకు ఇప్పుడు రెండు సంతోషాలు. కొత్త ఉద్యోగం. కాఫీ కలిపిచ్చే ఏడేళ్ల కొడుకు. నూట యాభై మూడేళ్ల చరిత్ర కలిగిన మహిళల ఫ్యాషన్ మాస పత్రిక ‘హార్పర్స్ బజార్’ యూఎస్ ఎడిషన్‌కు ఎడిటర్–ఇన్–చీఫ్‌గా సమీరా నాజర్ రాబోతున్నారని ఈ నెల 9న ఆ పత్రిక యాజమాన్యం ప్రటించగానే సమీర ఎవరన్న వివరాల కోసం నెట్లో గాలింపు మొదలయింది. అయితే ఆమె గురించి అందుబాటులో ఉన్న వ్యక్తిగత సమాచారం ఆమె శరీర కొలతలకు మాత్రమే పరిమితమై ఉంది! యాభై ఆరేళ్ల సమీరా ఫ్యాషన్ రంగ ప్రముఖురాలు అవడం వల్ల కావచ్చు.. ఆమె ధరించే లోదుస్తులు, యాక్సెసరీల సైజ్లు మాత్రమే ఎక్కువగా ఫోకస్ అయ్యాయి. 2020 నాటికి ఆమె సంపద ఇరవై కోట్ల రూపాయలు. ఇంతవరకే ఆమె బయోడేటా! జూలైలో హార్పర్స్ బజార్ బాధ్యతల్ని స్వీకరిస్తున్న సందర్భంగా ఆ సంతోషాన్ని పంచుకోవడం కోసం ఇటీవల సమీర తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన రెండు నిముషాల వీడియోలో కూడా.. ‘లెబనాన్ తండ్రికీ, ట్రినిడాడ్ తల్లికీ పుట్టిన కూతురిగా గర్విస్తూ, కొత్త అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాను’ అన్నంతవరకే ప్రధానంగా మాట్లాడారు. తన కెరీర్ చుట్టూ తిరగడం తప్ప, దాన్ని దాటుకుని లోపలకి వెళ్లే అవకాశాన్ని సమీర ఎవరికీ ఇచ్చినట్లు లేరు. ఇక ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమానికి ప్రాముఖ్యం చేకూరుతున్న సందర్భంలో సమీర ‘హార్పర్స్ బజార్’లోకి రావడం అన్నది ఉద్యమం ప్రభావం వల్లనేతే కాకపోవచ్చు. ఫ్యాషన్‌రంగంలో, జర్నలిజంలో ఆమె ప్రతిభా సామర్థ్యాలు ఆమెకు ఉన్నాయి. హార్పర్స్లోకి వచ్చే ముందువరకు సమీర అమెరికాలోనే మరో ప్రసిద్ధ ఫ్యాషన్ పత్రిక ‘వ్యానిటీ ఫెయిర్’కు ఐదేళ్లపాటు ఫ్యాషన్ డైరెక్టర్‌గా ఉన్నారు. దానికిముందు ప్రఖ్యాత ‘ఎల్’ (ఇ.ఎల్.ఎల్.ఇ) మ్యాగజీ¯Œ కు ఫ్యాషన్ డైరెక్టర్‌గా, ‘ఇన్‌స్టెయిల్’ పత్రికకు స్టెయిల్ డైరెక్టర్‌గా పని చేశారు. కెనడాలోని మాంట్రియల్లో పుట్టిన సమీర కెరీర్ అమెరికన్ ‘ఓగ్’ పత్రికలో ఫ్యాషన్ అసిస్టెంట్‌గా మొదలైంది. మాట్రియల్లో స్కూలు, కాలేజీ అయ్యాక జర్నలిజంలో మాస్టర్స్ డిగ్రీ చెయ్యడానికి న్యూయార్క్‌కి మారిపోయారు. అక్కడే ఉండిపోయారు. కొన్నాళ్ల క్రితం ‘ది కట్’ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రమే ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి కొద్దిగా బయటపడ్డారు. ఆ కొద్దిగా.. ఆమె ఏడేళ్ల కొడుకు లెక్స్! కన్నబిడ్డ కాదు. సమీర దత్తత తీసుకున్న కొడుకు. ఆమె అవివాహిత. ఒక కార్యక్రమంలో ఆడియన్స్‌కి లెక్స్ని చూపిస్తూ.. ‘‘తల్లిని కావడం, తొలిసారి నా కొడుకు చేతిని పట్టుకోవడం నా జీవితంలో నేను గర్వించిన క్షణాలు’’ అని అన్నారు సమీర. ‘ది కట్’ ఇంటర్వ్యూలోనే సమీర మరొక విషయం కూడా చెప్పారు. లెక్స్ తనకు కాఫీ, జ్యూస్ తయారు చేయడంలో చక్కగా సహాయపడతాడట! ‘గుడ్ బాయ్’ అని తన కొడుకుని ఎన్నిసార్లయినా మెచ్చుకోడానికి తగినంత ప్రేమ తల్లిపైన లెక్స్కూ ఉన్నట్లుంది. ‘‘నన్ను విడిచి ఉండలేడు’’ అంటారు సమీర. కొడుకు, కెరీర్ ఈ ప్రపంచంలోని ఆమెకు గల రెండు గర్వకారణాలు. లాక్‌డౌన్‌కు ముందు లెక్స్ని రోజూ తనే స్కూల్లో దింపి ఆఫీస్‌కి వెళ్లేవారు సమీర. అయితే ఊరికే దింపడం కాదు. లెక్స్ క్లాసు రూములోకి వెళ్లి, లెక్స్ బెంచీ మీద తను కూడా కూర్చొని లెక్స్‌తో మాట్లాడుతూ.. క్లాస్ బెల్లు కొట్టేవరకు ఉండి వచ్చేసేవారు. మళ్లీ స్కూళ్లు మొదలయ్యాయి. మళ్లీ కొడుతోపాటు వెళ్లి, కాసేపు క్లాస్‌రూమ్‌లో కూర్చొని వస్తారు సమీర. జూలై 6 తర్వాత కూడా ఇందులో మార్పేమీ ఉండకపోవచ్చు. అది ఆమె కొత్త డ్యూటీలో జాయిన్ అవబోతున్న రోజు. -
ఇంటివాడైన గాయకుడు రషీద్
నిజామాబాద్ ,డిచ్పల్లి: రేలారే.. రేలా.. ఫేమ్, ప్రముఖ జానపద అంధ గాయకుడు మహమ్మద్ రషీద్, మరో అంధ గాయకురాలు సమీరా(దీప)ను పెళ్లి చేసుకుని ఆదివారం ఓ ఇంటివాడయ్యాడు. రషీద్ అచ్చమైన పల్లె పాటలతో రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులను సంపాందించుకున్నాడు. మండలంలోని నడపల్లి జీపీ పరిధిలో గల గాంధీనగర్ కాలనీకి చెందిన రషీద్, వరంగల్ అర్బన్ జిల్లా ఫాతిమానగర్‌కు చెందిన సమీరా ఇద్దరూ హైదరాబాద్ బేగంపేట్ దేవనర్ ఫౌండేషన్‌లో చదువుకున్నారు. అదే సమయంలో రషీద్ టీవీ షోలతో బిజీతో చదువుకు తాత్కాలికంగా దూరం కావాల్సి వచ్చింది. తిరిగి మూడేళ్ల క్రితం రషీద్ డిగ్రీలో చేరడంతో మరోసారి ఇద్దరు ఒకే చోట కలిశారు. ఇద్దరు గాయకులు కావడంతో పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. గిరిజన కుటుంబానికి చెందిన దీప తల్లిదండ్రులు రాజేశ్వరి, రామదాస్ మరణించడంతో తాత కోక్యా, నానమ్మ పుల్లమ్మ వద్ద పెరిగింది. రషీద్‌తో పెళ్లి కోసం దీప తన పేరును సమీరాగా మార్చుకుంది. ఇరు కుటుంబాలు వీరి ప్రేమను ఆమోదించడంతో ఆదివారం డిచ్పల్లి మండలం ఘన్‌పూర్‌లోని షాదీఖానాలో పెళ్లి జరిపించారు. కట్న కానుకలు తీసుకోకుండా మతాంతర వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచిన రషీద్, సమీరా జంటను బంధువులు, కుటుంబీకులతో పాటు ఇరువర్గాల పెద్దలు, మండల ప్రజలు అభినందించి ఆశీర్వదించారు. -
సమాజానికి దిక్సూచి
దిలీప్‌కుమార్ సలాది, ‘ఛత్రపతి’ శేఖర్, సమ్మెట గాంధీ, చాందిని, సమీరా, స్వప్నిక, బిత్తిరి సత్తి, రాకేష్, మల్లాది భాస్కర్, సుమన్, రజితసాగర్, అరుణ్‌బాబు, ధన్వి కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘దిక్సూచి’. దిలీప్‌కుమార్ సలాది దర్శకత్వంలో నర్సింహరాజు రాచూరి, శైలజా సముద్రాల నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ మూడో వారంలో రిలీజ్ కానుంది. దిలీప్‌కుమార్ సలాది మాట్లాడుతూ– ‘‘డివోషనల్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. సమాజానికి ఓ దిక్సూచి అవుతుంది. 1970లో జరిగిన సెమీ పీరియాడికల్ మూవీ. మా నిర్మాత రాజుగారు ఆస్ట్రేలియన్ సిటిజన్. నేను చైల్డ్ ఆర్టిస్టుగా చాలా చిత్రాలు చేశా. హీరోగా నాకు నేనే ఓ పాత్ర రాసుకున్నా. ఇదే నిర్మాతతో, మరో కంపెనీతో అసోసియేట్ అయి ఏడాదికి మూడు సినిమాలు నిర్మిస్తాం. ఉగాదికి మరో సినిమా ఆరంభిస్తాం’’ అన్నారు. ‘‘మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది. సిగరెట్, మందు వంటివాటిని చూపించడం లేదు. దిలీప్‌కుమార్ మంచివాడు. అతనిలోని ప్రతిభ బయటకు రావాలంటే మంచి జరగాలి. అందుకే ఈ సినిమా చేశాం. ఫైట్లు పెద్దగా లేవు’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి కెమెరా: జయకృష్ణ, రవికొమ్మి, సంగీతం: పద్మనాభ్ భరద్వాజ్. -
మావుళ్లమ్మ సన్నిధిలో పాడటం అదృష్టం
పశ్చిమగోదావరి, భీమవరం (ప్రకాశం చౌక్) : శ్రీమావుళ్లమ్మ అమ్మవారి 55 వార్షికోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా ఆలయం వద్ద ఏర్పాటు చేస్తున్న నాటకాలు, కూచిపూడి నృత్యాలు, సంగీత విభావరిలు, భజనలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. మంగళవారం అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడం జరిగింది. ఆలయ అర్చకులు చిన్ని, సుబ్రహ్మణ్యం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇక అమ్మవారి ఉత్సవాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన పంచమ వేద నాట్య నిలయం హైదరాబాద్ వారిచే ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు ఆకట్టుకున్నాయి. రాత్రి 8 గంటలకు సోని ఆర్కెస్ట్రా భీమవరం వారిచే ప్రముఖ సినీనేపథ్య గాయని సమీరా భరద్వాజ్, హనుమాన్లు కాంబినేషన్లో సాగిన సంగీత విభావరి ఎంతో ఆకట్టుకుంది. జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చి సంగీత విభావరి తిలకించారు. అమ్మవారి ఉత్సవాల్లో నేడు : శ్రీమావుళ్లమ్మ అమ్మవారి 55 వార్షికోత్సవాల్లో బుధవారం సాయంత్రం 5 గంటలకు సినీ మ్యూజికల్ నైట్, రాత్రి 8 గంటలకు రెండు రత్నములు నాటకం కార్యక్రమాలు ఉంటాయి.భీమవరం శ్రీమావుళ్లమ్మ వారి సన్నిధికి వచ్చి పాట పాడడం తన అదృష్టమని వర్ధమాన సినీగాయని సమీరా భరద్వాజ్ అన్నారు. భీమవరం వచ్చిన ఆమె మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడారు. సాక్షి: ఇప్పటివరకు ఎన్ని సినిమాలకు ఎన్ని పాటలు పాడారు? సమీరా: 15 సినిమాలకు 20 పాటలు. సాక్షి: మీరు పాడిన మొదటి సినిమా ఎవరు అవకాశం ఇచ్చారు? సమీరా: నేను మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వద్ద 6 నెలల పాటు పనిచేశాను. ఆయన బ్రూస్లీ సినిమాలో మొదటి అవకాశం ఇచ్చారు. సాక్షి: మీ స్వస్థలం? ఏం చదువుకున్నారు? సమీరా:విజయవాడ. నాన్న చంద్రశేఖర్ చెన్నై ఐటీసీలో పనిచేస్తారు. మేం చెన్నైలో ఉంటున్నాం. బీకాం చేసి సీఎస్ చేశాను. సాక్షి: గుర్తింపు తెచ్చిన సినిమాలు? పాటలు? సమీరా: సరైనోడు, శతమానం భవతి, అర్జున్‌రెడ్డి తదితర హిట్ చిత్రాల్లో పాడాను. సరైనోడులో తెలుసా.. తెలుసా.. పాటకు టీ ఎస్సార్ అవార్డు, అర్జున్‌రెడ్డిలో మధురమే పాటకు మిర్చి మ్యూజిక్ అవార్డు వచ్చింది. సాక్షి: ఎన్ని కొత్త సినిమాల్లో పాడబోతున్నారు. సమీరా: 5 కొత్త సినిమాలకు పాడుతున్నాను. సాక్షి: సంగీత ప్రావిణ్యం ఉందా? సమీరా:కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను. సాక్షి: మీకు ఇష్టమైన సింగర్, మ్యూజిక్ డైరెక్టర్స్? సమీరా:నాకు సింగర్స్ చిత్ర, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కార్తీక్ ఇష్టం. మ్యూజిక్ డైరెక్టర్స్ మణిశర్మ, కిరవాణి అంటే ఇష్టం. -
పెద్దక్క
‘‘హలో లక్ష్మి! బయలు దేరావా? వాళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి అమ్మోళ్ళింటికి వచ్చే లోపల మనం అక్కడకు చేరుకోవాలి. ఇప్పుడే శైలజకు కూడా ఫోన్ చేశాను. తనని కూడా అక్కడకు చేరుకోమని చెప్పాను. ఈ పాటికి తనూ ప్రయాణంలో ఉంటుంది. నీవు త్వరగా వచ్చేయ్!’’ అని ఫోన్ పెట్టేసింది అక్క నా సమాధానం కోసం ఎదురుచూడకుండా మా పెద్దక్క ఎప్పుడూ అంతే. తనే మాకు మార్గదర్శి. మా అమ్మ తర్వాత అమ్మలాంటిది. మా సంతోషమే తన సంతోషం. మా చిన్నతనంలో నేను, మా చిన్నక్క శైలజ, అన్నయ్య రవి అల్లరి పనులు చేసినప్పుడు మా అమ్మ నుంచి దెబ్బలు తప్పించడంలో ఎప్పుడూ ముందుండేది. ‘‘ఏం ఆలోచిస్తున్నావు? మీ అన్నయ్య గురించేనా? హ్యాపీగా ఉందా!’’ కారు స్టీరింగ్ తిప్పుతూ పక్కనే కూర్చున్న నావైపు చూసి అడిగారు మా ఆయన. ‘‘ఎప్పుడూ ఫేస్బుక్, వాట్సాప్‌లలో మాట్లాడుకోవడమే గానీ నేరుగా చూసి ఎన్నాళ్ళైంది అన్నయ్యను. ఐదు సంవత్సరాల తర్వాత అమెరికా నుంచి వస్తున్నాడు అన్నయ్య. మన పెళ్ళైన మూడేళ్ళకు అమెరికాకు వెళ్ళాడు. మళ్ళీ ఇప్పుడు వస్తున్నాడు. ఆ మాత్రం ఆనందం ఉండదా?‘’ అన్నాను. ఇలా అన్నయ్య గురించి ఆలోచిస్తుండగానే మళ్ళీ పెద్దక్క నుంచి ఫోన్ వచ్చింది... ‘‘ఎక్కడికొస్తున్నారు? నేనూ, మీ బావ ఇక్కడకు వచ్చేశాం.శైలజ, వాళ్ళాయన గురునాథం కూడా ఇక్కడకు చేరుకున్నారు. మీకోసం ఎదురు చూస్తున్నాం. త్వరగా వచ్చేయండి.‘’ అని ఫోన్ కట్ చేసింది అక్క. మా కుటుంబంలో ఏ కార్యమైనా చేయాలంటే ముందుగా మా పెద్దక్క, బావతోనే సంప్రదిస్తారు మా అమ్మా,నాన్న. మా నాన్న స్కూలు టీచర్ అయినప్పటికీ, మా అక్క పెళ్ళికి బాగా ఖర్చవడం చేత ఆ అప్పులను తీర్చడంలో మానాన్న ఇబ్బందులు పడుతున్నసమయంలో మా పెద్దక్కే మాకు ఎంతో సహాయపడింది. మేము వేసవి సెలవులకు పెద్దక్క వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు మాకు కావలసినవి అన్నీ కొనిచ్చేది. మేము ఊరి నుంచి వచ్చేటప్పుడు సంచి నిండా పచ్చిశనక్కాయలు, సున్నుండలు, పప్పుచెక్కలు, బొబ్బట్లు వేసి పంపించేది. అంతేకాదు మా అందరికీ బట్టలు కొని, కుట్టించి మరీ పంపేది. కారు మా ఇంటి ముందు ఆగింది. మేము కారు దిగి ఇంటి కాంపౌండ్ వాల్ గేటు తీసుకుని లోపలికి వెళ్తుండగా మా పెద్దక్క ఎదురొచ్చి.. ‘‘ఏంటి పిల్లాడు వంశీ రాలేదా!’’ అని అడిగింది.‘‘వాడు వాళ్ళ నానమ్మతో తర్వాత వస్తానన్నాడు. అందుకే మేమిద్దరమే వచ్చాం అక్కా’’ అన్నాను. ‘సరే లోపలికెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. ఈ లోపల కాఫీ తెస్తాను’’ అంటూ మా వెనుకే వచ్చి హాల్లోంచి వంటగదిలోకి వెళ్ళింది అక్క. హాల్లో ఉన్న మా అమ్మా నాన్న, మా చిన్నక్క, బావలతో కుశల ప్రశ్నల తర్వాత... నేను, మా ఆయన ఫ్రెష్అప్ అయ్యి మళ్ళీ హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చోగానే కాఫీ మా చేతికి అందించింది మా పెద్దక్క. కాఫీ తాగుతూ అందరం సరదాగా మాట్లాడుకుంటుండగా... వీధిలోంచి కారు శబ్దం వినిపించడంతో అందరం ఇంటిగుమ్మం దాటి వీధిలోకి రాగానే మా అన్నయ్య పక్కన పాప సమీర, వదినతో బాబు సాహిత్ కారు దిగి వస్తున్నారు. మా అన్నయ్యను చూడగానే మా అందరి కళ్ళు ఒక్కసారిగా మెరిసిపోయాయి. అదే భావన అన్నయ్య, వదిన కళ్ళల్లో కూడా కనిపిస్తున్నాయి. ఇంటి గుమ్మం దాటి విశాలమైన హాలు మధ్య భాగంలో చతురస్రాకారంగా అమర్చిన సోఫాలలో ఒకదానిపై మా అన్నయ్య కూర్చోగానే,అన్నయ్యకు ఇరువైపులా అమ్మా నాన్న కూర్చున్నారు. వారికెదురుగా పెద్దక్క, చిన్నక్కకు మధ్యలో నేను కూర్చున్నాను. మాకు కుడివైపు బిందు వదిన. ఆమెకిరువైపులా సాహిత్, సమీర కూర్చుంటే, ఎడమవైపు ఉన్న సోఫాలో పెదబావ, చినబావకు మధ్యలో మా ఆయన కూర్చున్నారు. ‘‘ఏం అక్కా సౌమ్య, సుధ వాళ్ళు రాలేదా!‘’ అని ఇంజనీరింగ్ చదువుతున్న పెద్దక్క కూతుర్ని గురించి అడిగాడు అన్నయ్య.‘‘వాళ్ళకి ఇవాళ్ట్నుంచి సెమిష్టర్ పరీక్షలురా. హాస్టల్లోనే చదువుకుంటున్నారు. ఈ ఆదివారం ఇంటికొస్తానన్నారు‘’ అని పెద్దక్క చెప్పింది. ఆ తరువాత...చిన్నక్క కొడుకు నవీన్‌ని దగ్గరకు తీసుకుని ‘‘ఏం చదువుతున్నావురా?‘’ అని అడిగాడు.‘సిక్త్స్ క్లాస్ మామయ్య’’ అన్నాడు వాడు.‘‘ఏం బుజ్జి! మీ వాడెక్కడ?’’ అని నాతో అనగానే–‘రేపు నాన్నమ్మతో వస్తాన్నాడు అన్నయ్య!’ అన్నాను. తర్వాత మా పెదబావ వ్యవసాయం, యల్.ఐ.సి పాలసీల గురించి, మా చినబావ స్కూలు విషయాలు, మా ఆయన మెడికల్ ప్రాక్టీసు గురించి వాకబు చేశారు అన్నయ్య.చాలాకాలం తర్వాత మా కుటుంబ సభ్యులంతా ఒకే దగ్గర చేరి పరస్పర ప్రేమానురాగాలు పంచుకోవడం చూసి మా అమ్మ ముఖం సంతోషంతో వెలిగిపోయింది. మా నాన్న మనస్సులో ఉప్పొంగుతున్న ఉత్సాహం కళ్ళల్లో కనిపించడం నేను గమనించాను. ఆరోజు నుంచి మా అన్నయ్య, వదినలకు ఇష్టమైనవి అన్నీ.. మా అక్కాచెల్లెళ్లమే స్వయంగా వండి వడ్డించాము. చూస్తుండగానే వారం గడిచిపోయింది. ఈ మధ్యలో ఓరోజు అందరం తిరుమలకు వెళ్ళొచ్చాము. సినిమాలు, బంధువుల ఇండ్లకు తిరగడంతోనే మరో వారం గడిచిపోయింది. అన్నయ్య అమెరికాకువెళ్ళడానికి ఇక రెండు రోజులే మిగిలింది. అప్పుడే అందరి గుండెల్లో గుబులు మొదలైంది. ఈ రెండురోజుల్లో ఒకరోజు ప్యాకింగ్ కే సరిపోయింది. ఇక అన్నయ్య వెళ్ళవలసిన రోజు రానే వచ్చింది. ఆరోజు సాయంత్రం అన్నయ్య బయలుదేరుతున్న సమయంలో అందరి కళ్ళల్లో బాధ దోబూచులాడుతోంది. అమ్మ కన్నీళ్ళను ఆపుకోలేకపోయింది. నాన్న మాత్రం మనస్సులోని బాధను బయటకుకనబడకుండా అవస్థ పడుతున్నాడు.. ఇది గమనించిన అన్నయ్య అమ్మా, నాన్నలను దగ్గరకు తీసుకుని ‘‘ఆరునెలల్లో మళ్ళీ వస్తానులేమా!’’ అని చెప్పడంతో అమ్మ మనస్సు కాస్త కుదుటపడింది. అన్నయ్య వాళ్ళు ఎక్కిన కారు వీధి మలుపు తిరిగేంతవరకు మేము చేతులు ఊపుతూనే ఉన్నాము నిర్లిప్త హృదయాలతో..ఆరోజు రాత్రి అమ్మోళ్ళింటిలోనే ఉండి, మరుసటిరోజు ఉదయమే మా ఇండ్లకు వెళ్ళిపోయాము. కానీ పెద్దక్క, బావ మాత్రం రెండ్రోజులాగి వెళ్తాము అని చెప్పి అక్కడే ఉండిపోయారు. మేము ఇంటికి వచ్చిన మరుసటిరోజు సాయంత్రమే పెద్దక్క నుంచి ఫోన్ వచ్చింది..‘హలో లక్ష్మి! నాన్న ఈరోజు ఉదయం కడుపు నొప్పిగా ఉందని చెప్పిన కాసేపటికే కళ్ళు తిరిగి పడిపోవడంతో వెంటనే నేను, మీ బావ, అమ్మతో పాటు మన ఊరిలోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కి తీసుకొచ్చాము. డాక్టర్లు పరీక్షించి ఐసీయూలోకి తీసుకెళ్ళారు. ఇంకా ఏమీ చెప్పలేదు. మీరు కంగారు పడతారని ఉదయం నుంచి చెప్పలేదు. మీరు వెంటనే హాస్పిటల్ దగ్గరకు వచ్చేయండి’’ అని మాట తడబడుతూ చెప్పడంతో ఇక నా మనస్సు మనస్సులో లేదు. కాళ్ళు, చేతులు వణుకుతున్నాయి. నోట మాటరావడంలేదు.వెంటనే నేను, మా ఆయన బయలుదేరి హాస్పిటల్ దగ్గరకు చేరుకునేసరికి రాత్రి ఎనిమిదైంది. అప్పటికే శైలజక్క, గురునాథం బావ అక్కడున్నారు. డాక్టర్ అన్నీ రిపోర్టులు చూసాక...‘‘ఈ పెద్దాయనకు రెండూ కిడ్నీలు పూర్తిగా పాడైపోయాయి. వెంటనే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తే తప్ప బతికే అవకాశాలు చాలా తక్కువ. మీరు సాధ్యమైనంత త్వరగా కిడ్నీ డోనర్ని సంపాదించగలిగితే అంత మంచిది. ఈ లోపల మేము డయాలసిస్ చేస్తూ కొంత వరకు కాపాడగలం’’ అని చెప్పడంతో మా అందరికీ నెత్తిమీద పిడుగు పడినట్లయింది. విషయం అన్నయ్యకు తెలిసినట్లుంది. అమెరికా నుంచి ఫోన్ చేశాడు పెద్దక్కకు.. ‘‘అక్కా!ఎంత ఖర్చైయినా పర్వాలేదు. నాన్నకు మెరుగైన వైద్యం అందించండి. నేను వీలు చూసుకుని వస్తాను’’ అని చెప్పాడు. డబ్బైతే ఖర్చుపెట్టగలంగానీ, కిడ్నీని ఎక్కడ్నుంచి తేగలం? తెలిసి, తెలిసి ప్రాణాన్ని ఎవరు పణంగా పెట్టగలరు!.‘‘ఏవండీ! నాన్నకు కిడ్నీ ఇస్తానండి!. ఒక కిడ్నీతో మనిషి బతకచ్చటగా!’’ అని నేను మా ఆయనతో చెప్పగానే..‘‘లక్ష్మీ! నీకేమైనా పిచ్చా! నీకేదైనా అయితే మా పరిస్థితి ఏంటి? నీవు ఎట్టి పరిస్థితులలో కిడ్నీ ఇవ్వటానికి లేదు’’ అని మా ఆయన ఖచ్చితంగా చెప్పడంతో నాన్నకు ఏమీచేయలేని నిస్సహాయక స్థితిలో మౌనంగా ఉండిపోయాను. ఇక చిన్నక్క ఇవ్వడానికి అవకాశమేలేదు.ఎందుకంటే తనకు ఈ మధ్యే గాల్ బ్లాడర్‌లో స్టోనుందని ఆపరేషన్ చేశారు. పెద్దక్క ఇస్తుందనుకుంటే మా ఆయన లాగ పెదబావ కూడా ఒప్పుకోకపోతే నాన్న పరిస్థితి ఏమిటి? అని నేను ఆలోచిస్తుండగా...‘‘ఏంటే! ఆలోచిస్తున్నావు? నాన్నకేమీ కాదు. ఎవరో ఒకరు డోనర్ దొరక్కుండా పోరు. నేను, మీ బావ అమ్మతో ఉంటాము. మీ ఆయనకు అక్కడ ప్రాక్టీసు దెబ్భతింటుంది. శైలజా! మీరు కూడా వెళ్ళండి. ఇద్దరూ రేపు స్కూలుకు వెళ్ళాలికదా! అవసరమైతే ఎల్లుండి వస్తురుగానీ’’ అని అక్క చెప్పడంతో మేము ఆ రాత్రి హాస్పిటల్ లోనే ఉండి, ఉదయమే ఇంటికి వచ్చేశాం. రోజుమార్చి రోజు నేను, చిన్నక్క హాస్పిటల్‌కి వెళ్ళి నాన్నను చూసొస్తున్నాం. పెద్దక్కను మధ్యలో ఇంటికి పంపిస్తూ...ఇలా పదిరోజులు గడిచినప్పటికీ డోనర్ ఎవరూ దొరకలేదు. ఆరోజు నేను వంటింట్లో ఉండగా పెద్దక్క నుంచి ఫోన్... ‘‘ఏయ్ లక్ష్మీ! నాన్న ఇక మనల్ని వదలి ఎక్కడికీ పోరు. కిడ్నీ ఇచ్చే డోనర్ దొరికారు. రేపే ఆపరేషన్. అయితే డోనర్ తన పేరు బయటపెట్టొద్దనిడాక్టరుతో రిక్వెస్ట్ చేశాడంట. అందుకే డాక్టరు ఎంత అడిగినా చెప్పలేదు.రేపు సౌమ్య, సుధా వాళ్ళు హాస్టల్ నుంచి ఇంటికొస్తానన్నారు. వాళ్ళని కూడా తీసుకుని వీలైనంత త్వరగా హాస్పిటల్ దగ్గరకు వచ్చేస్తాను.హాస్పిటల్ వద్ద అమ్మా, నాన్న దగ్గర మీ బావ ఒక్కరే ఉన్నారు . మీరు ఉదయాన్నే వచ్చేయండి’’ అని ఉత్సాహంగా చెప్పింది పెద్దక్క.అక్క మంచి కబురు చెప్పటంతో నా మనస్సు కుదుటపడింది. మరుసటిరోజు నేను, మా ఆయన హాస్పిటల్ దగ్గరకు వెళ్ళేసరికి పెదబావ ఒక్కరే అమ్మతో ఉన్నారు. అమ్మ ముఖంలో కాస్త తెంపు కనిపిస్తోంది. మేము వెళ్ళిన కాసేపటికి చిన్నక్క, బావ వచ్చారు. ఆపరేషన్‌కు ముందు ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసిన తర్వాత నర్సులు పెదబావ దగ్గరకు వచ్చి పేపర్స్ పై సంతకాలు తీసుకున్నారు. తర్వాత నాన్నను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళారు.‘‘ఏంటి బావా! అక్క ఇంకారాలేదు. సౌమ్య, సుధా వాళ్ళను తీసుకుని త్వరగా ఇక్కడకు వచ్చేస్తానంది’’ అని అన్నాను. ‘‘పిల్లలు రావడం లేటైనట్టుంది. వచ్చేస్తుందిలే. మనమందరం ఉన్నాంగా!’’ అన్నాడు బావ. ఆపరేషన్ సక్సెస్ అవ్వాలని మనస్సులో దేవుణ్ణి ప్రార్థించుకున్నప్పటికీ నాకు గుండెల్లో ఆందోళన తగ్గడంలేదు. నాకే కాదు మా అందరి పరిస్థితీ అలానే ఉంది. నాన్నను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళిన మూడుగంటల తర్వాత తీసుకొచ్చారు. ఆపరేషన్ సక్సెస్ అని డాక్టర్లు చెప్పడంతో మేమందరం ఊపిరిపీల్చుకున్నాం. కానీ ఇంకో గంట వరకు ఎవ్వరూ పేషెంట్‌ను చూడటానికి వీల్లేదని డాక్టర్లు సూచించడంతో మేము వెయిటింగ్ హాల్లోనే కూర్చున్నాం. ఇంతలో నర్సు వచ్చి డాక్టర్ రమ్మంటున్నాడని పెదబావను తీసుకెళ్ళింది. బావ వెళ్ళిన కాసేపటి తర్వాత... డాక్టరు బావనెందుకు రమ్మన్నారో ఆత్రుతతో డాక్టర్ ఉండే రూము దగ్గరకు వెళ్ళాను. డాక్టర్ బావ భుజం తట్టి ఏదో చెప్తున్నాడు. డాక్టర్ రూమ్‌కి అద్దాలు ఉండడం వల్ల బయటకు ఏమీ వినిపించడంలేదు. అటుగా వెళ్తున్న నర్సును పిలిచి అడిగాను..‘‘సిస్టర్ మానాన్నకు ఏం పర్వాలేదు కదా! డాక్టర్ మా బావతో ఏం చెప్తున్నాడో అర్థం కావటంలేదు’’ అన్నాను. ‘‘మీ నాన్నకు ఏం పర్వాలేదు మేడమ్! సరియైన సమయానికి డోనర్ దొరకడం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు’’ అని చెప్పింది.‘‘సిస్టర్ ఇంతకీ మా నాన్నకు కిడ్నీ ఇచ్చిన డోనర్ ఎవరో మీకు తెలుసా?’’ అని అడిగాను. ‘‘ఎవరో మాకు తెలియదు మేడమ్! ఇప్పుడు రూమ్ నెంబర్ 306 లో అబ్జర్వేషన్లో ఉంది. ఆ రూమ్ ఇన్చార్జ్ నర్సుని అడిగితే చెప్తుంది’’ అని చెప్పి వెళ్ళిపోయింది. నేను ఆ రూము దగ్గరకు వెళ్ళేసరికి అప్పుడే డోర్ తీసుకుని నర్సు బయటకు వచ్చింది. ‘‘సిస్టర్ కిడ్నీ డొనేట్ చేసిన వారి డీటెయిల్స్ చెప్పగలరా?’’ అడిగాను.‘‘ఇంతకీ మీరెవరు?’’‘‘ఈ రూములో ఉండే పేషంటే మానాన్నకు కిడ్నీ డొనేట్ చేశారని తెలిసింది.దయచేసి వారి డీటెయిల్స్ చెప్పగలరా సిస్టర్!’’ అని అడిగాను. ‘‘మేడమ్! ఆ పేషంట్ డీటెయిల్స్ ఈ ఫైల్లో ఉన్నాయి చూడండి’’ అని ఫైల్ నా చేతికందించింది. ఆ ఫైల్లో డోనర్ నేమ్ దగ్గర సుజాత, వైఫ్ఆఫ్ గురు దశరథప్రకాశరావు అని ఉంది. ఏంటి మా అక్కా, బావ పేర్లు ఉన్నాయి! అని ఆశ్చర్యంతో.. నేను చూస్తున్నది నిజమేనా అనుకుంటుండగా.. అప్పుడే అక్కడికి మా పెదబావ వచ్చారు. ‘‘ఏంబావా! ఈ ఫైల్లో మీపేరు, అక్క పేరు ఉన్నాయి. కిడ్నీ ఇచ్చింది అక్కేనా!’’ అని ఆత్రుతతో అడిగాను. ‘‘అవును లక్ష్మి! ఎంత వద్దంటున్నా.. మా నాన్నను ఎలాగైనా బ్రతికించుకోవాలని, మా నాన్నకు ఏమైనా అయితేనేను తట్టుకోలేనని, దయచేసి నేను కిడ్నీ ఇవ్వటానికి ఒప్పుకోండి అని నాతో మీ అక్క అడిగేసరికి కాదనలేకపోయాను’’ అని బావ చెప్తుంటే..నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. ‘‘సిస్టర్ ఇప్పుడు మా అక్కను చూడచ్చా’’ అని అడిగాను. ‘‘ఇక పది నిమిషాల్లో స్పృహ వస్తుంది. అప్పుడు మీరు చూడచ్చు. రూము లోపలికెళ్ళి కూర్చోండి’’ అని చెప్పింది.మేము రూములోకి వెళ్ళిన కాసేపటికి అక్కకు స్పృహ వచ్చింది. అక్క దగ్గరకు పోవడానికి నాకు ధైర్యం చాలడంలేదు. మమ్మల్ని దగ్గరకు రమ్మని కళ్ళతో సైగ చేసింది.అక్కను చూస్తుంటే నాన్నను కాపాడిన ప్రాణదేవత మంచంపై పవళించినట్లు కనిపిస్తోంది. నేను అక్క దగ్గరకు వెళ్ళి రెండు కాళ్ళను నా చేతులతో పట్టుకోగానే నా మనస్సులోని బాధ కళ్ళ నుంచి కన్నీళ్ళ రూపంలో జాలువారి అక్క పాదాలపై పడింది. ‘‘ఏయ్! పిచ్చి పిల్లా! ఇప్పుడు నాకేం అయిందని! ఊరుకో. అవునూ నాన్న ఎలా ఉన్నాడు?’’ అని అడిగింది. అప్పుడే నర్సు లోపలికి వచ్చి ‘‘మీనాన్నగారికి స్పృహ వచ్చిందంట. డాక్టరు మిమ్మల్ని రమ్మంటున్నాడు’’ అని చెప్పింది. ‘‘సిస్టర్ మా నాన్నను నేనూ చూడాలి. నన్ను కూడా అక్కడికి తీసుకెళ్ళండి’’ అని చెప్పింది పెద్దక్క.‘‘ఇప్పుడు మీరు నడవటానికి వీల్లేదండి. రెండు రోజుల వరకు బెడ్ రెస్ట్ తీసుకోవాలి’’ చెప్పింది నర్సు. ‘‘ఏవండీ! నన్ను స్ట్రెచర్ పై నైనా నాన్న దగ్గరకు తీసుకెళ్ళమని డాక్టర్‌తో చెప్పండి. నేను ఇప్పుడే నాన్నను చూడాలి. అయితే నాన్నకి నేను కనిపించకూడదు’’ అని అక్క పట్టుపట్టడంతో డాక్టరు పర్మిషన్తో నాన్న రూము దగ్గరకు అక్కను తీసుకెళ్ళాము. మేమందరమూ రూములోనికి వెళ్ళినప్పటికీ, అక్క మాత్రం బయట కిటికీ నుంచే చూస్తానంది.నాన్న మా అందరితో ఉత్సాహంగా మాట్లాడుతుండడం వలన కలిగే ఆనందం... మా కంటే రూమ్ కిటికీ అద్దానికి వేసిన కర్టెన్ నుంచి చాటుగా చూస్తున్న పెద్దక్క కళ్ళల్లోనే ఎక్కువగా నాకు కనిపించింది. - దేవీప్రసాద్ ఒబ్బు -
సమీరాకు కాంస్యం
సాక్షి, హైదరాబాద్: జాతీయ జూనియర్ క్యారమ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎస్కే హుస్నా సమీరా ఆకట్టుకుంది. నాగ్‌పూర్‌లో జరిగిన ఈ టోర్నీలో బాలికల సింగిల్స్ విభాగంలో ఆమె కాంస్యాన్ని సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో సమీరా 12–8, 9–8తో అభినయ (తమిళనాడు)పై విజయం సాధించింది. -
స్కూల్ వ్యాను ప్రమాదంలో చిన్నారి మృతి
పాఠశాల వ్యాను కింద పడి మూడేళ్ల చిన్నారి మృతిచెందింది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా కల్లూరులో గురువారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న మూడేళ్ల చిన్నారి సమీర ఎస్వీఎస్ పాఠశాలలో ఎల్కేజీ చదువుతోంది. పాఠశాలవ్యానుద్వార రాకపోకలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఈ రోజు స్కూలు వ్యానుదిగి ఇంటికి వెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు దాని కిందపడి మృతిచెందింది. -
బాటిల్ మూత ప్రాణం తీసింది
గొంతులో ఇరుక్కొని బాలుడి మృతి ఏడాదిన్నర బాలుడి గొంతులో వాటర్ బాటిల్ మూత ఇరుక్కోవడంతో మృతిచెందాడు. ఈ విషాదకర సంఘటన రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం కండ్లపల్లిలో బుధవారం జరిగింది. వివరాలు.. గ్రామంలోని జహంగీర్, రిజ్వానాబేగం దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఓ కుమారుడు, కూతురు పుట్టి ప్రసవ సమయంలోనే కన్నుమూశారు. అనంతరం ఎన్నో ఏళ్ల ప్రార్థనల తర్వాత వారికి పిల్లలు సమీరా(4), తబ్రేజ్ పుట్టారు. బుధవారం ఉదయం ఇంట్లో కుటుంబీకులంతా పనుల్లో నిమగ్నమయ్యారు. తబ్రేజ్ వాటర్ బాటిల్‌తో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో దాని మూత ఊడిపోగా దాన్ని నోట్లో పెట్టుకున్నాడు. ఇంతలోనే ఆ మూత గొంతులో ఇరుక్కుపోయింది. బాలుడి రోదనలతో తల్లిదండ్రులు వచ్చిచూడగా.. గొంతులో ఏదో తట్టుకుందని గమనించిన జహంగీర్ బాలుడి నోట్లో వేళ్లు పెట్టగా బాటిల్ మూత ఉంది. ఎంత ప్రయత్నించినా మూత బయటకు రాకపోవడంతో బాలుడిని తలకిందులుగా చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో వెంటనే ఆస్పత్రికి బయలుదేరారు. మార్గంమధ్యలోనే తబ్రేజ్ ఊపిరి ఆగిపోయింది. -
థైరోసినేమియా వ్యాధితో బాలుడి మృతి
డిచ్పల్లి, న్యూస్‌లైన్ : డిచ్పల్లి మండల కేం ద్రానికి చెందిన సుహాన్ అనే నాలుగేళ్ల బాలుడు థైరోసినేమియా అనే కాలేయ సంబంధిత వ్యాధి తో మృతిచెందాడు. ఆదివారం బాలుడి తల్లి సమీరా, మేనమామ సల్మాన్ డిచ్‌పల్లిలో విలేకరులతో మాట్లాడారు. వారు చెప్పిన ప్రకారం.. సుహాన్ గత ఆగస్టులో ఆనారోగ్యానికి గురికాగా తల్లి సమీరా జిల్లా ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యులకు చూయించింది. అక్కడి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యపరీక్షలు జరిపించింది. బాలుడికి థైరోసినేమియా వ్యాధి సోకినట్లు అక్కడి వైద్యులు చెప్పారు. ఈ వ్యాధి చికిత్స కోసం సుమారు రూ 19 లక్షలు ఖర్చవుతుందని, లక్షల్లో ఒకరికి ఇలాంటి వ్యాధి వస్తుందని వైద్యులు తెలిపా రు. కాలేయ మార్పిడి శస్త్రచికిత్సతో వ్యాధిని నయం చేయవచ్చని వైద్యులు సూచించారు. పేద కుటుంబం కావడంతో అంత డబ్బులు తేవాలో తెలియక బాలుడి కుటుంబం తల్లడిల్లింది. బాలుడి తండ్రి షబ్బీర్ కుటుంబపోషణ నిమిత్తం దుబాయ్‌కు వెళ్లాడు. దీంతో తల్లి సరీనా, మేనమామ సల్మాన్‌లు సుహాన్‌ను పట్టుకుని పలు ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స చేయాలని వైద్యుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. గత రచ్చబండలో తమకు ప్రభుత్వం ఇచ్చిన రేషన్‌కార్డు కూపన్ పనిచేయదని చెప్పారు. ఇటీవల డిచ్పల్లి, జక్రాన్‌పల్లి మండల కేంద్రాల్లో జరిగిన ఆరోగ్యశ్రీ మెగా వైద్య శిబిరాలకు వెళ్లి వైద్యులను సంప్రదించినా ఎవరూ సరైన విధంగా స్పందించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బాలుడి ప్రాణాలు రక్షించుకునేందుకు ఎలాంటి సలహాలు ఇవ్వలేదన్నారు. తమ కుమారుడికి జరిగిన అన్యాయం మరొక చిన్నారికి జరగ కుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తల్లి సమీరా విలేకరుల ఎదుట బోరున విలపించింది.బాధిత కుటుంబం స్వగ్రామం నందిపేట్ మండలం కౌల్పూర్ కాగా, కొద్ది నెలలుగా డిచ్పల్లి మండల కేంద్రంలో నివసిస్తున్నారు.