
సాక్షి, హైదరాబాద్: జాతీయ జూనియర్ క్యారమ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎస్‌కే హుస్నా సమీరా ఆకట్టుకుంది. నాగ్‌పూర్‌లో జరిగిన ఈ టోర్నీలో బాలికల సింగిల్స్ విభాగంలో ఆమె కాంస్యాన్ని సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో సమీరా 12–8, 9–8తో అభినయ (తమిళనాడు)పై విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment