carrom championship
-
జాతీయ చాంపియన్ అపూర్వ
సాక్షి, హైదరాబాద్: సీనియర్ నేషనల్స్ క్యారమ్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటారు. ఎల్ఐసీ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ప్రపంచ చాంపియన్ అపూర్వ మహిళల సింగిల్స్ విభాగంలో తొలిసారి జాతీయ చాంపియన్‌గా అవతరించగా... పురుషుల టీమ్ విభాగంలో ఎస్. ఆదిత్య, మొహమ్మద్ అహ్మద్, యు.నరేశ్, వసీమ్, సందీప్, నందులతో కూడిన తెలంగాణ జట్టు విజేతగా నిలిచి స్వర్ణాన్ని గెలుచుకుంది. టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచిన 35 ఏళ్ల అపూర్వ మహిళల సింగిల్స్ ఫైనల్లో 25–11, 25–11తో రష్మి కుమారి (పీఎస్‌పీబీ)పై గెలుపొందింది. అంతకుముందు సెమీఫైనల్లో 18–8, 23–16తో ఖుష్బూ రాణిపై, క్వార్టర్స్‌లో 25–0, 22–8తో నీలమ్‌పై, ప్రిక్వార్టర్స్‌లో 24–9, 25–0తో శ్రుతి (మహారాష్ట్ర)పై గెలుపొందింది. ఈ సందర్భంగా సోమవారం మలక్‌పేట్‌లోని సిటీ టవర్స్‌లో స్కై స్పోర్ట్స్ సమ్మిట్ యాజమాన్యం జాతీయ చాంపియన్లుగా నిలిచిన అపూర్వ, తెలంగాణ పురుషుల జట్టును ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో స్కై స్పోర్ట్స్ సమ్మిట్ మేనేజింగ్ డైరెక్టర్ అబ్దుల్ ఖాదర్, తెలంగాణ క్యారమ్ సంఘం అధ్యక్షులు బీకే హరనాథ్, ఉపాధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. -
ఏపీ–తెలంగాణ జట్లకు 6 పతకాలు
సాక్షి, హైదరాబాద్: సీఎస్‌ఐసీఈ జాతీయ క్యారమ్ చాంపియన్‌షిప్‌లో ఏపీ–తెలంగాణ జట్టు రాణించింది. సెయింట్ జోసెఫ్ స్కూల్ (మలక్‌పేట్) ఆధ్వర్యంలో ఆర్ఎఫ్సీ వేదికగా జరిగిన ఈ టోర్నీలో ఏపీ–తెలంగాణ జట్లు వివిధ వయో విభాగాల్లో ఆరు పతకాలను గెలుచుకున్నాయి. అండర్–17 బాలికల విభాగంలో విజేతగా నిలిచిన ఏపీ తెలంగాణ జట్టు.... అండర్–14 బాలికల కేటగిరీలో రన్నరప్‌గా నిలిచింది. అండర్–19 బాలబాలికల, అండర్–17 బాలుర, అండర్–14 బాలుర విభాగాల్లో మూడో స్థానాన్ని దక్కించుకుంది. శుక్రవారం జరిగిన టోర్నీ ముగింపు కార్యక్రమంలో ప్రపంచ క్యారమ్ చాంపియన్ అపూర్వ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేసింది. ఈ కార్యక్రమంలో సీఐఎస్సీఈ విద్యాధికారి గోడ్విన్ డేనియల్, కార్యదర్శి మారుతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఫైనల్‌కు కార్తీక వర్ష, నందిని
సాక్షి, హైదరాబాద్: వీఏ శర్మ, వి. ఇందిరాంబ స్మారక తెలంగాణ రాష్ట్ర క్యారమ్స్ చాంపియన్‌షిప్‌లో సి. కార్తీక వర్ష (నాసర్ స్కూల్), కె. నందిని (ఏడబ్ల్యూఏఎస్‌ఏ) అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. ఖైరతాబాద్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో జూనియర్ బాలికల విభాగంలో టైటిల్‌పోరుకు అర్హత సాధించిన వీరిద్దరూ మహిళల కేటగిరీలో సెమీఫైనల్లో అడుగుపెట్టారు. సోమవారం జూనియర్ బాలికల సెమీస్ మ్యాచ్‌ల్లో కార్తీక వర్ష 25–8, 25–0తో సి. దీప్తిపై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో నందిని 25–6, 25–4తో కె. నవిత (ఏడబ్ల్యూఏఎస్‌ఏ)పై గెలుపొంది కార్తీక వర్షతో ఫైనల్‌పోరుకు సిద్ధమైంది. మహిళల క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో నందిని 22–14, 21–9తో లక్ష్మి (ఐబీఎమ్)పై, కార్తీక వర్ష 25–0, 25–3తో రమశ్రీ (పోస్టల్)పై, జయశ్రీ 25–0, 25–6 తో పద్మజపై, అపూర్వ (ఎల్ఐసీ) 25–0, 25–1తో మాధవిపై గెలుపొందారు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో జయశ్రీతో వర్ష, అపూర్వతో నందిని తలపడతారు. పురుషుల విభాగంలో శ్రీనివాస్ (ఐఓసీఎల్), నరేశ్ (ఏసీసీఏ), హకీమ్ (బీఎస్ఎన్ఎల్), ఆదిత్య సెమీస్‌లో అడుగుపెట్టారు. క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో శ్రీనివాస్ 25–9, 13–3తో మొహమ్మద్ అహ్మద్‌పై, నరేశ్ 17–11, 25–2, 16–13తో అనిల్ కుమార్‌పై, హకీమ్ 22–9, 25–0తో వసీమ్‌పై, ఆదిత్య 25–0, 17–20, 25–19తో నవీన్‌పై గెలిచి ముందంజ వేశారు. -
విజేత భవన్స్ కాలేజి
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ఇంటర్ కాలేజి పురుషుల క్యారమ్ టోర్నమెంట్లో భవన్స్ కాలేజి (సైనిక్‌పురి) జట్టు చాంపియన్‌గా అవతరించింది. బద్రుకా కాలేజి (కాచిగూడ) ఆధ్వర్యంలో ఈ టోర్నీని నిర్వహించారు. ఫైనల్లో భవన్స్ కాలేజి 2–0తో మఫకంజా (ఎంజే) ఇంజినీరింగ్ కాలేజిపై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో భవన్స్ కాలేజి 2–0తో ఉస్మానియా యూనివర్సిటీ ఆఫ్ కామర్స్ కాలేజిపై, ఎంజే కాలేజి 2–0తో మాతృశ్రీ ఇంజినీరింగ్ కాలేజిపై విజయాలు సాధించి తుది పోరుకు చేరుకున్నాయి. మూడో స్థానం కోసం జరిగిన పోరులో మాతృశ్రీ ఇంజినీరింగ్ కాలేజి 2–1తో ఉస్మానియా యూనివర్సిటీ కామర్స్ కాలేజిని ఓడించింది. బద్రుకా కాలేజి ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్ ప్రిన్సిపాల్ డా.సోమేశ్వర్ రావు విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఓయూ సెక్రటరీ ప్రొఫెసర్ బి.సునీల్ కుమార్, టోర్నీ సెక్రటరీ ప్రొఫెసర్ కె.దీప్లా తదితరులు హాజరయ్యారు. -
బద్రుకా కాలేజి శుభారంభం
సాక్షి, హైదరాబాద్: బద్రుకా కాలేజి ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్ నిర్వహిస్తోన్న ఇంటర్ కాలేజి పురుషుల క్యారమ్స్ టోర్నమెంట్లో ఆతిథ్య బద్రుకా కాలేజి జట్టు శుభారంభం చేసింది. బద్రుకా కాలేజిలో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో బద్రుకా కాలేజి 2–0తో సెయింట్ మేరీస్ (యూసుఫ్‌గూడ)పై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో ఎంజే ఇంగ్లీష్ కాలేజి 2–0తో ఎస్పీ కాలేజిపై విజయం సాధిం చింది. అంతకుముందు జరిగిన రౌండ్–1 మ్యాచ్‌లో ఎంజే ఇంగ్లిష్ కాలేజి 2–0తో సెయింట్ జోసెఫ్ డీసీపై గెలుపొందింది. టోర్నీ ప్రారంభ కార్యక్రమంలో రిటైర్డ్ ఐపీఎస్ విజయ రామారావు ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో బద్రుకా కాలేజి జనరల్ డైరెక్టర్ ప్రొఫెసర్ టీఎల్ఎన్ స్వామి, ప్రిన్సిపాల్ డా.సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రౌండ్–1 ఫలితాలు: మాతృశ్రీ ఇంగ్లీష్ కాలేజి 2–0తో ఇస్లామియా ఇంగ్లీష్ కాలేజిపై విజయం. మెస్కో కాలేజి 2–0తో అవంతి డీసీపై విజయం. ఎస్పీ కాలేజి 2–1తో నిజామ్ డీసీపై విజయం. ఓయూ సైన్స్ కాలేజి 2–0తో వసుంధర డీసీపై విజయం. వెస్లీ కాలేజి 2–0తో హెచ్ఎంవీ డీసీపై విజయం. శివ శివాని డీసీ 2–1తో అన్వర్ ఉల్ ఉలూమ్ డీసీపై విజయం. రౌండ్–2 ఫలితాలు ఐఐఎంసీ కాలేజి 2–0తో రైల్వే డీసీపై విజయం. ఓయూ కామర్స్ కాలేజి 2–1తో ఏవీ కాలేజిపై విజయం. భవన్స్ సైనిక్‌పురి కాలేజి 2–0తో ప్రభుత్వ సిటీ కాలేజిపై విజయం. మాతృశ్రీ ఇంగ్లిష్ కాలేజి 2–1తో మెస్కో కాలేజిపై విజయం. ఓయూ సైన్స్ కాలేజి 2–0తో లయోలా అకాడమీ కాలేజిపై విజయం. -
క్వార్టర్స్‌లో హకీమ్, అపూర్వ
సాక్షి, హైదరాబాద్: రణడే స్మారక క్యారమ్ టోర్నమెంట్లో నవీన్, ఎంఏ హకీమ్ నిలకడగా రాణిస్తున్నారు. కింగ్‌కోఠిలోని మహారాష్ట్ర మండల్ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో వీరిద్దరూ పురుషుల విభాగంలో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో హకీమ్ (బీఎస్ఎన్ఎల్) 20–6, 15–24, 18–10తో ఆర్డీ దినేశ్‌బాబు (ఏజీఏపీ)పై గెలుపొందాడు. మరో మ్యాచ్‌లో ఎస్. నవీన్ 25–16, 25–10తో అబ్దుల్ రెహమాన్‌ను ఓడించాడు. మహిళల విభాగంలో ఎస్. అపూర్వ (ఎల్ఐసీ), రమశ్రీ (పోస్టల్), జయశ్రీ (ఐఓసీఎల్) క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. మహిళల ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల్లో అపూర్వ 25–0, 25–0తో ఎ. గౌరి (వనిత)పై, రమశ్రీ 22–5, 22–0తో విజయలక్ష్మి (ఎన్ఎఫ్సీ)పై, జయశ్రీ 25–4, 25–0తో ఎస్పీ శ్వేతపై గెలుపొందారు. జూనియర్ బాలికల విభాగంలో శ్రేయస (వరంగల్), ఏడబ్ల్యూఏఎస్ఏకు చెందిన ప్లేయర్లు కె. సరస్వతి, సి. దీప్తి, కె. నవిత, జి. భార్గవి ప్రిక్వార్టర్స్‌లో గెలిచి ముందంజ వేశారు. శ్రేయస 25–0, 25–0తో సమన్య (డీపీఎస్)పై, సరస్వతి 25–0, 25–0తో శ్రీనిత్య (బిర్లా గర్ల్స్)పై, దీప్తి 11–14, 13–12, 23–0తో ప్రమీషా (వరంగల్)పై, నవిత 20–14, 18–9తో సాయి కీర్తన (ఏడబ్ల్యూఏఎస్‌ఏ)పై, భార్గవి 17–9, 23–0తో శ్రీవల్లి (వీ–10)పై విజయం సాధించారు. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్: నరేశ్ (ఏసీసీఏ) 25–18, 25–5తో కిరణ్‌కుమార్‌పై, వసీమ్ (ఏసీసీఏ) 18–16, 25–14తో షారు క్ ఖాన్‌పై, ఆదిత్య 25–19, 19–17తో ఉద య్ కుమార్ (ఏజీఏపీ)పై, అనిల్‌కుమార్ 25–14, 25–0తో రాజకిషోర్పై, శ్రీనివాస్ (ఐఓసీఎల్) 23–18, 25–6తో గోపీకృష్ణపై గెలిచారు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్: లక్ష్మి 23–9, 12–23, 25–6తో పద్మజపై, కార్తీక వర్ష (ఎన్ఏఎస్ఆర్) 25–5, 25–4తో ప్రమీషా (వరం గల్)పై, మాధవి 21–15, 21–5తో ఇందిరా ప్రియదర్శిని (డీబీఐటీ)పై, నందిని (ఏడ బ్ల్యూఏఎస్ఏ) 25–13, 23–12తో సునీత (డీఎల్ఆర్ఎల్)పై, మణి 25–14, 21–124, 23–7తో సుజాతపై విజయం సాధించారు. -
భవన్స్ జట్టుకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ఇంటర్ కాలేజి పురుషుల క్యారమ్స్ టోర్నమెంట్లో సికింద్రాబాద్ భవన్స్ సైనిక్‌పురి డిగ్రీ కాలేజి జట్టు టైటిల్‌ను కైవసం చేసుకుంది. గండిపేట్ సీబీఐటీ కాలేజి ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నీలో ఎంజేసీఈటీ రన్నరప్‌గా నిలవగా, ఐఐఎంసీ మూడో స్థానాన్ని దక్కించుకుంది. టైటిల్‌పోరులో భవన్స్ 2–1తో ఎంజేసీఈటీపై విజయం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో ఐఐఎంసీ 2–1తో ఆతిథ్య సీబీఐటీని ఓడించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో భవన్స్ సైనిక్‌పురి 3–0తో ఐఐఎంసీపై, ఎంజేసీఈటీ 3–0తో సీబీఐటీపై గెలుపొందాయి. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో సీబీఐటీ కాలేజి వ్యాయామ విద్య డిపార్ట్మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ శ్యామ్ మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఓయూ ఐసీటీ కార్యదర్శి ప్రొఫెసర్ కె. దీప్లా, కార్యనిర్వాహక కార్యదర్శి రాజేశ్వరి పాల్గొన్నారు. -
సమీరాకు కాంస్యం
సాక్షి, హైదరాబాద్: జాతీయ జూనియర్ క్యారమ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎస్కే హుస్నా సమీరా ఆకట్టుకుంది. నాగ్‌పూర్‌లో జరిగిన ఈ టోర్నీలో బాలికల సింగిల్స్ విభాగంలో ఆమె కాంస్యాన్ని సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో సమీరా 12–8, 9–8తో అభినయ (తమిళనాడు)పై విజయం సాధించింది. -
సెమీస్‌లో అపూర్వ, నిర్మల
రాష్ట్ర స్థాయి సీనియర్ క్యారమ్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్థాయి సీనియర్ గ్రీన్ క్యారమ్ టోర్నీలో ప్రపంచ చాంపియన్ అపూర్వ సెమీస్‌లోకి దూసుకెళ్లింది. ఆనంద్‌నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పోర్ట్స్ అకాడమీలో జరుగుతోన్న ఈ టోర్నీలో ఆరుసార్లు జాతీయ చాంపియన్ నిర్మల కూడా తన పునరాగమనాన్ని విజయాలతో ప్రారంభించింది. రెండేళ్ల తర్వాత తిరిగి బరిలోకి దిగిన ఆమె కూడా సెమీఫైనల్‌కు చేరుకుంది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో ఎస్.అపూర్వ (ఎల్ఐసీ) 25–0, 25–0తో బి. శ్రీవిద్యపై గెలుపొందగా... పి. నిర్మల (ఎల్ఐసీ) 25–6, 25–0తో తేజస్వి (ఆక్సెంచర్)ని ఓడించింది. ఇతర మ్యాచ్‌ల్లో నందిని (డెలాయిట్) 24–7, 25–2తో శ్రీచందనపై, సవితా దేవి (పోస్టల్) 25–0, 25–0తో కె. పద్మజపై గెలుపొందారు. పురుషుల సింగిల్స్ విభాగంలో వి. అనిల్‌కుమార్, డి. రవీందర్ గౌడ్ క్వార్టర్స్‌కు చేరుకున్నారు. ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల్లో వి. అనిల్ కుమార్ (ఏజీఏపీ) 25–4, 25–17తో ఎస్. సాయి (ఎస్ఎస్సీఏ)పై, రవీందర్ గౌడ్ (ఏజీఏపీ) 25–0, 25–1తో సయ్యద్ జుబేర్ అహ్మద్‌పై నెగ్గారు. ఇతర ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల్లో సూర్యప్రకాశ్ 25–10, 25–18తో బిసిల్ ఫిలిప్స్‌పై, నవీన్ 25–18, 25–4తో అబ్దుల్పై, నజరుల్లా 22–8, 25–24తో ఎస్కే జాఫర్‌పై, ఎస్. ఆదిత్య 22–5, 11–16, 25–0తో వసీమ్‌పై, మొహమ్మద్ అహ్మద్ 24–5, 25–17తో కృష్ణపై, హకీమ్ 25–9, 17–20, 25–7తో దినేశ్బాబుపై విజయం సాధించారు. మరోవైపు రెండోరౌండ్లో సంచలన విజయం సాధించిన లలిత్ స్వామి మూడోరౌండ్ మ్యాచ్‌లో 0–25, 5–25తో సాయి (ఎస్ఎస్సీఏ) చేతిలో పరాజయం పాలయ్యాడు. పురుషుల డబుల్స్ క్వార్టర్స్ ఫలితాలు ఎస్. సాయి–నరేశ్ ద్వయం 25–0, 22–17తో గిరిధర్– సునీల్ జంటపై, ఆర్.డి.దినేశ్ బాబు–ఎల్. సూర్యప్రకాశ్ ద్వయం 16–13, 25–18తో వి. అనిల్ కుమార్–సందీప్ జంటపై, హకీమ్–ఎ.శ్రీనివాస రావు ద్వయం 25–12, 21–8తో ప్రసాద్–ఇమ్రాన్ అలీ ఖాన్ జంటపై, మొహమ్మద్ అహ్మద్–మొహమ్మద్ ద్వయం 18–11, 22–3తో సయ్యద్ మోయిజ్–నజరుల్లా జంటపై గెలుపొందాయి. -
అనిల్ కుమార్‌కు టాప్ సీడింగ్
సాక్షి, హైదరాబాద్: భారత్‌లో తొలిసారిగా గ్రీన్ క్యారమ్ బోర్డులపై జరుగనున్న తెలంగాణ రాష్ట్ర గ్రీన్ క్యారమ్ చాంపియన్‌షిప్‌లో ఏజీ ఆఫీస్‌కు చెందిన ప్లేయర్ వి. అనిల్ కుమార్ టాప్ సీడింగ్‌ను దక్కించుకున్నాడు. ఈ ఏడాదిలో సాధించిన పాయింట్ల ఆధారంగా ఆటగాళ్లకు సీడింగ్స్‌ను కేటాయించారు. మొహమ్మద్ అహ్మద్ రెండో సీడ్‌గా బరిలోకి దిగనుండగా... ఇండియన్ ఆయిల్ ప్లేయర్ కె. శ్రీనివాస్, వి. శివానంద రెడ్డి (పోస్టల్)లకు వరుసగా మూడు, నాలుగు సీడింగ్స్ దక్కాయి. శనివారం నుంచి జరుగనున్న ఈ చాంపియన్‌షిప్‌లో పురుషుల సింగిల్స్‌లో 224 మంది ఆటగాళ్లు... మహిళల విభాగంలో 40 మంది క్రీడాకారిణులు బరిలోకి దిగుతున్నారు. ఆరుసార్లు జాతీయ చాంపియన్ పి. నిర్మల (ఎల్ఐసీ) రెండేళ్ల తర్వాత తిరిగి ఈసారి టోర్నమెంట్లో పాల్గొంటున్నారు. ఆమెతో పాటు ప్రపంచ చాంపియన్ ఎస్. అపూర్వ (ఎల్ఐసీ) కూడా ఈ టోర్నీ బరిలోకి దిగుతుండటంతో మహిళల సింగిల్స్ పోటీలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టాప్–8 సీడింగ్ ప్లేయర్లు: 1. వి. అనిల్ కుమార్, 2. మొహమ్మద్ అహ్మద్, 3. కె.శ్రీనివాస్, 4. వి. శివానంద రెడ్డి, 5. సయ్యద్ జహీర్ (హైదరాబాద్), 6. ఎస్. ఆదిత్య (వి.10), 7. ఆర్డీ దినేశ్ బాబు (ఏజీఆఫీస్), 8. పి.పి. సురేశ్‌కుమార్ (ఇన్‌కం ట్యాక్స్). -
ఆదిత్య, అపూర్వలకు క్యారమ్ టైటిల్స్
సాక్షి, హైదరాబాద్: ఆర్బీఐ ఇంటర్ ఇన్స్టిట్యూషన్ క్యారమ్స్ చాంపియన్‌షిప్‌లో ఆదిత్య, అపూర్వ విజేతలుగా నిలిచారు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఆదిత్య (వీ10) 25-8, 25-17తో హకీమ్ (బీఎస్ఎన్ఎల్)పై విజయం సాధించగా... మహిళల ఫైనల్లో అపూర్వ (ఎల్ఐసీ) 25-10, 25-8తో తేజస్వి (ఆక్సెంచర్)ను ఓడించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో ఆదిత్య 13-14, 19-2, 25-6తో సూర్యప్రకాశ్‌పై, హకీమ్ 25-0, 25-12తో శివానంద రెడ్డిపై గెలుపొందారు. మహిళల సెమీస్‌లో అపూర్వ 18-4, 29-24, 25-14తో సవితా దేవిపై, తేజస్వి 19-6, 25-0తో నేహారెడ్డిపై పైచేయి సాధించారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఇన్చార్జి జనరల్ మేనేజర్ ఆర్.గోవిందరావు, బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ అజిత్, హెచ్ఆర్ఎండీ జనరల్ మేనేజర్ పి.కె.రౌత్, ఆర్బీఐ స్పోర్ట్స్ క్లబ్ ఉపాధ్యక్షులు సుధాకర్, కార్యదర్శి మనోజ్ కులకర్ణి పాల్గొన్నారు. -
ఏజీ ఆఫీస్ జట్టుకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్ ఇన్స్టిట్యూట్ క్యారమ్ చాంపియన్‌షిప్‌లో టీమ్ విభాగంలో ఏజీ ఆఫీస్ జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌ల్లో ఏజీ ఆఫీస్ 3-0తో ఆర్బీఐ జట్టును ఓడించింది. ఏజీ ఆఫీస్ తరఫున తొలి సింగిల్స్ గేమ్‌లో అనిల్ కుమార్ 25-0, 25-9తో గణేషన్‌పై, రెండో సింగిల్స్‌లో దినేశ్ బాబు 12-22, 22-19, 25-9తో సూర్యప్రకాశ్‌పై గెలువగా... డబుల్స్ గేమ్‌లో అంబురాజ్- సామ్టే జోడి 16-18, 24-3, 25-13తో రఘునాథ్- వీఎస్కే నాయుడు జంటపై గెలిచింది. ఈ టోర్నీలో బీఎస్ఎన్ఎల్ జట్టు 2-1తో పోస్టల్ జట్టుపై గెలిచి మూడోస్థానంలో నిలిచింది. -
క్వార్టర్ ఫైనల్లో శ్రీనివాస్
సాక్షి, హైదరాబాద్: ప్రశాంత్ రణడే స్మారక స్టేట్ ర్యాంకింగ్ క్యారమ్ టోర్నమెంట్లో జాతీయ చాంపియన్ కె. శ్రీనివాస్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. రాంకోఠిలోని మహారాష్ట్ర మండల్ కార్యాలయంలో సోమవారం జరిగిన నాలుగో రౌండ్లో శ్రీనివాస్ 25-0, 25-2తో ఎస్.సాయిపై అలవోక విజయం సాధించాడు. మిగతా మ్యాచ్‌ల్లో అనిల్ కుమార్ 25-0, 25-5తో శశి కుమార్‌పై, ఉస్మాన్ 25-15, 10-13, 25-18తో అంజి రెడ్డిపై, రవీందర్ గౌడ్ 25-0, 25-8తో అంజద్‌పై, అహ్మద్ 20-5, 19-5తో అశ్విన్ కుమార్‌పై, వసీమ్ 25-15, 25-20తో కృష్ణపై, షారుక్ ఖాన్ 19-20, 21-20, 24-23తో జహీర్ అహ్మద్‌పై, సూర్యప్రకాశ్ 25-0, 25-0తో సయీద్‌పై, హకీమ్ 25-12, 25-6తో షాబాజ్‌పై, నయ్యర్ 25-0, 25-0తో గంగదాస్పై, ప్రసాద్ 15-25, 25-15, 18-15తో మొయిజ్‌పై విజయం సాధించారు. మహిళల తొలిరౌండ్లో నందిని 25-0, 25-10తో సునీతపై, స్రవంతి 18-10, 12-23, 25-6తో శ్రీవిద్యపై, సాయిలక్ష్మి 19-18, 25-0తో సునీతపై, అపూర్వ 25-0, 25-0తో ప్రేరణపై, ప్రసన్న లక్ష్మి 25-12, 25-10తో శ్రీచందనపై గెలుపొందారు. -
30 నుంచి సౌత్‌జోన్ క్యారమ్ చాంపియన్‌షిప్
హైదరాబాద్ జట్లకు రవీందర్, సవిత నేతృత్వం సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ క్యారమ్ చాంపియన్‌షిప్‌నకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నెల 30 నుంచి జూన్ 1 వరకు జరిగే ఈ పోటీలకు కొంపల్లిలోని శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కాలేజీ వేదికగా నిలువనుంది. మహిళలు, పురుషుల విభాగాల్లో మూడు రోజుల పాటు ఈ టోర్నీ జరగనుంది. టీమ్ చాంపియన్‌షిప్‌తో పాటు మహిళలు, పురుషులు, జూనియర్ బాలురు, బాలికల సింగిల్స్ పోటీలు కూడా నిర్వహిస్తారు. టీమ్ ఈవెంట్ మాత్రం రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో, వ్యక్తిగత పోటీలు నాకౌట్ పద్ధతిలో జరుగుతాయి. ఈ టోర్నమెంట్లో ఆంధ్ర, హైదరాబాద్ జట్లతో పాటు కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, కర్ణాటక జట్లు పాల్గొంటాయి. ఇందులో పాల్గొనే హైదరాబాద్ జట్లను ఎంపిక చేశారు. పురుషుల జట్టుకు రవీందర్ గౌడ్ (ఏజీ ఆఫీస్), మహిళల బృందానికి సవితాదేవి సారథ్యం వహిస్తారు. సురేశ్ కుమార్ కోచ్‌గా వ్యవహరిస్తారు. పురుషుల జట్టు: రవీందర్ గౌడ్ (కెప్టెన్), ఎండీ అహ్మద్, నవీన్, వసీమ్, సాయి సంతోష్, సాయిబాబా, నరేశ్, మహేశ్, మేనేజర్: ఆర్. బాల రాజు. మహిళల జట్టు: సవితా దేవి (కెప్టెన్), శ్రీవాణి, పద్మజ, మాధవి, మౌనిక, అశ్విని, శ్వేత, సాయిలక్ష్మి, మేనేజర్: ఎస్. భావన. జూనియర్ బాలురు: కళ్యాణ్, రమేశ్, శ్యామ్, వినీత్; జూనియర్ బాలికలు: స్రవంతి, చరిష్మా గౌడ్, రాశి, అమృత. -
లక్ష్యం... ప్రపంచ చాంపియన్
క్యారమ్కు ఇప్పుడు విలువ పెరిగింది మంచి ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి జాతీయ ఆటగాడు శ్రీనివాస్ సాక్షి, హైదరాబాద్: చాలా మందిలాగే సరదాగా ఇంట్లో ఆడుకున్న ఆట ఇప్పుడు అతనికి ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. జాతీయస్థాయిలో విజేతగా నిలిపింది. క్యారమ్లాంటి క్రీడతో కూడా అంతర్జాతీయ స్థాయికి ఎదగవచ్చని నిరూపించిన ఆ కుర్రాడి పేరు కొమరవెల్లి శ్రీనివాస్. ఇటీవల వైజాగ్‌లో జరిగిన జాతీయ సీనియర్ క్యారమ్ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచిన శ్రీనివాస్, రాబోయే ఫెడరేషన్ కప్‌పై దృష్టి పెట్టాడు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తానని అతను ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడు. ఈ నెల 22 నుంచి వారణాసిలో జరిగే ఫెడరేషన్ కప్ పోటీలకు శ్రీనివాస్ సిద్ధమవుతున్నాడు. అన్న అండతో... హైదరాబాద్‌కే చెందిన శ్రీనివాస్ పెద్దన్న తిరుపతి ఇంట్లో క్యారమ్ ఆడటంతో పాటు స్థానికంగా చిన్న చిన్న పోటీల్లో పాల్గొనేవాడు. అదే స్ఫూర్తితో పదేళ్ల వయసులో ఆట నేర్చుకున్న శ్రీనివాస్ విక్టరీ ప్లేగ్రౌండ్‌లో కోచ్‌ల దృష్టిలో పడ్డాడు. కోచ్ శోభన్‌రాజ్ తీర్చిదిద్దడంతో రాష్ట్ర స్థాయిలో వరుస విజయాలు సాధించాడు. తొలి సారి అండర్-14 జాతీయ విజేతగా నిలవడంతో శ్రీనివాస్‌కు గుర్తింపు దక్కింది. వరుస విజయాలు... ఆ తర్వాత శ్రీనివాస్ ఒక్కసారిగా దూసుకొచ్చాడు. జూనియర్ నేషనల్స్‌లో విజేతగా నిలవడంతో పాటు ఫెడరేషన్ కప్, సీనియర్ నేషనల్స్‌లోనూ రాష్ట్ర జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆ తర్వాత వరల్డ్ చాంపియన్‌షిప్‌లో, సార్క్ పోటీల్లో కూడా నిలకడగా విజయాలు అందుకున్నాడు. శ్రీనివాస్ ప్రతిభను గుర్తించిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అతనికి 18 ఏళ్లు రాకముందే ప్రత్యేక కేటగిరీ కింద ఉద్యోగ అవకాశం కల్పించి ప్రోత్సహించింది. మరింతగా రాణిస్తా... క్యారమ్‌లో తాను సాధించిన విజయాల పట్ల 21 ఏళ్ల శ్రీనివాస్ సంతోషంగా ఉన్నాడు. ‘క్యారమ్‌ను అంతా ఫ్యామిలీ గేమ్‌గానే భావిస్తారు. బాగా ఆడేవారు కూడా అక్కడే ఆగిపోతారు. అయితే ఇల్లు విడిచి బయటికి వస్తే ఈ ఆట విస్తృతి ఏమిటో తెలుస్తుంది’ అని అతను చెప్పాడు. రెండేళ్ల క్రితం ప్రపంచ చాంపియన్‌షిప్‌లో శ్రీనివాస్ నాలుగో స్థానంలో నిలిచాడు. అంతర్జాతీయ స్థాయిలో అదే అతని అత్యుత్తమ ప్రదర్శన. అందుకే వచ్చే ప్రపంచ కప్‌ను లక్ష్యంగా చేసుకున్నాడు. ‘2016లో లండన్‌లో ఈ టోర్నీ జరగనుంది. దాని కోసం ఇప్పటినుంచే ప్రత్యేకంగా సిద్ధమవుతున్నాను. రోజుకు కనీసం 7 గంటల పాటు సాధన చేస్తున్నాను. జాతీయ స్థాయిలో, ఆసియా స్థాయిలో సాధించిన విజయాలు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. ఈ ఏడాది జరిగే వరల్డ్‌కప్‌లో రాణిస్తే వరల్డ్ చాంపియన్‌షిప్‌లో నా అవకాశాలు మెరుగ్గా ఉంటాయి’ అని శ్రీనివాస్ విశ్వాసం వ్యక్తం చేశాడు. శ్రీనివాస్ సాధించిన కొన్ని కీలక విజయాలు 2009- జాతీయ జూనియర్ చాంపియన్ 2011- ఆసియా చాంపియన్‌షిప్‌లో 2 స్వర్ణాలు, 1 రజతం 2011- సార్క్ క్రీడల్లో 2 స్వర్ణాలు 2012- శ్రీలంకతో టెస్టు సిరీస్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు 2012- వరల్డ్ చాంపియన్‌షిప్ సింగిల్స్‌లో నాలుగోస్థానం; డబుల్స్‌లో రజతం, టీమ్ ఈవెంట్లో స్వర్ణం 2013- ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం, 2 రజతాలు 2013- జాతీయ సీనియర్ చాంపియన్ 2014- అంతర్జాతీయ చాంపియన్ ఆఫ్ చాంపియన్స్ టోర్నీ విజేత పట్టుదలే అతని బలం సాధారణ ప్రతిభ ఉన్నా పట్టుదల, అంకితభావం ఉంటే పెద్ద స్థాయి విజయాలు దక్కించుకోవచ్చనేదానికి శ్రీనివాస్ మంచి ఉదాహరణ. అదే అతడిని ఇతర ఆటగాళ్లతో పోలిస్తే భిన్నంగా నిలబెడుతోంది. ముఖ్యంగా కొన్ని సార్లు పాకెటింగ్లో బలహీనంగా కనిపించినా చివరి వరకు పోరాడే తత్వంతోనే అతనికి మంచి ఫలితాలు వస్తున్నాయి. - శోభన్‌రాజ్, కోచ్