హైదరాబాద్ జట్లకు రవీందర్, సవిత నేతృత్వం
సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ క్యారమ్ చాంపియన్‌షిప్‌నకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నెల 30 నుంచి జూన్ 1 వరకు జరిగే ఈ పోటీలకు కొంపల్లిలోని శివశివాని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ కాలేజీ వేదికగా నిలువనుంది. మహిళలు, పురుషుల విభాగాల్లో మూడు రోజుల పాటు ఈ టోర్నీ జరగనుంది. టీమ్ చాంపియన్‌షిప్‌తో పాటు మహిళలు, పురుషులు, జూనియర్ బాలురు, బాలికల సింగిల్స్ పోటీలు కూడా నిర్వహిస్తారు. టీమ్ ఈవెంట్ మాత్రం రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో, వ్యక్తిగత పోటీలు నాకౌట్ పద్ధతిలో జరుగుతాయి. ఈ టోర్నమెంట్‌లో ఆంధ్ర, హైదరాబాద్ జట్లతో పాటు కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, కర్ణాటక జట్లు పాల్గొంటాయి. ఇందులో పాల్గొనే హైదరాబాద్ జట్లను ఎంపిక చేశారు. పురుషుల జట్టుకు రవీందర్ గౌడ్ (ఏజీ ఆఫీస్), మహిళల బృందానికి సవితాదేవి సారథ్యం వహిస్తారు. సురేశ్ కుమార్ కోచ్‌గా వ్యవహరిస్తారు.
పురుషుల జట్టు: రవీందర్ గౌడ్ (కెప్టెన్), ఎండీ అహ్మద్, నవీన్, వసీమ్, సాయి సంతోష్, సాయిబాబా, నరేశ్, మహేశ్, మేనేజర్: ఆర్. బాల రాజు. మహిళల జట్టు: సవితా దేవి (కెప్టెన్), శ్రీవాణి, పద్మజ, మాధవి, మౌనిక, అశ్విని, శ్వేత, సాయిలక్ష్మి, మేనేజర్: ఎస్. భావన. జూనియర్ బాలురు: కళ్యాణ్, రమేశ్, శ్యామ్, వినీత్; జూనియర్ బాలికలు: స్రవంతి, చరిష్మా గౌడ్, రాశి, అమృత.
30 నుంచి సౌత్‌జోన్ క్యారమ్ చాంపియన్‌షిప్
Published Wed, May 28 2014 12:03 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement