హైదరాబాద్ ఏజీ జట్టుకు టైటిల్ | hyderabad ag team wins title | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ ఏజీ జట్టుకు టైటిల్

Published Sat, Jan 7 2017 10:54 AM | Last Updated on Thu, Mar 28 2019 6:19 PM

హైదరాబాద్ ఏజీ జట్టుకు టైటిల్ - Sakshi

హైదరాబాద్ ఏజీ జట్టుకు టైటిల్

సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ అకౌంటెంట్ జనరల్ (ఏజీ) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ఏజీ జట్టు సత్తా చాటింది. లాల్‌బహదూర్ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో హైదరాబాద్ జట్టు టైటిల్‌ను కై వసం చేసుకుంది. ఫైనల్లో హైదరాబాద్ ఏజీ జట్టు పెనాల్టీ షూటౌట్‌లో 3-2 గోల్స్ తేడాతో ఏజీ కర్ణాటక జట్టుపై విజయం సాధించింది.
 
 నిర్ణీత సమయంతో ఇరు జట్లు గోల్స్ చేయకపోవడంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. హైదరాబాద్ జట్టు తరఫున తట్టమ్ నాయుడు, నిజామ్, సయ్యద్ ఖలీల్ గోల్స్ చేయగా...మురళి, నబిల్ ఏజీ కర్ణాటక జట్టుకు గోల్స్ అందించారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో అర్జున అవార్డు గ్రహీత హబీబ్, ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎల్‌వీ సుధీర్ కుమార్ పాల్గొన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement