
సాక్షి, హైదరాబాద్: సీఎస్‌ఐసీఈ జాతీయ క్యారమ్ చాంపియన్‌షిప్‌లో ఏపీ–తెలంగాణ జట్టు రాణించింది. సెయింట్ జోసెఫ్ స్కూల్ (మలక్‌పేట్) ఆధ్వర్యంలో ఆర్‌ఎఫ్‌సీ వేదికగా జరిగిన ఈ టోర్నీలో ఏపీ–తెలంగాణ జట్లు వివిధ వయో విభాగాల్లో ఆరు పతకాలను గెలుచుకున్నాయి. అండర్–17 బాలికల విభాగంలో విజేతగా నిలిచిన ఏపీ తెలంగాణ జట్టు.... అండర్–14 బాలికల కేటగిరీలో రన్నరప్‌గా నిలిచింది. అండర్–19 బాలబాలికల, అండర్–17 బాలుర, అండర్–14 బాలుర విభాగాల్లో మూడో స్థానాన్ని దక్కించుకుంది. శుక్రవారం జరిగిన టోర్నీ ముగింపు కార్యక్రమంలో ప్రపంచ క్యారమ్ చాంపియన్ అపూర్వ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేసింది. ఈ కార్యక్రమంలో సీఐఎస్‌సీఈ విద్యాధికారి గోడ్విన్ డేనియల్, కార్యదర్శి మారుతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment