బద్రుకా కాలేజి శుభారంభం | Badruka College Beats St Marys Carrom Opener | Sakshi
Sakshi News home page

బద్రుకా కాలేజి శుభారంభం

Published Sat, Aug 17 2019 10:00 AM | Last Updated on Sat, Aug 17 2019 10:00 AM

Badruka College Beats St Marys Carrom Opener - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బద్రుకా కాలేజి ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఆర్ట్స్‌ నిర్వహిస్తోన్న ఇంటర్‌ కాలేజి పురుషుల క్యారమ్స్‌ టోర్నమెంట్‌లో ఆతిథ్య బద్రుకా కాలేజి జట్టు శుభారంభం చేసింది. బద్రుకా కాలేజిలో జరిగిన రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో బద్రుకా కాలేజి 2–0తో సెయింట్‌ మేరీస్‌ (యూసుఫ్‌గూడ)పై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో ఎంజే ఇంగ్లీష్‌ కాలేజి 2–0తో ఎస్‌పీ కాలేజిపై విజయం సాధిం చింది. అంతకుముందు జరిగిన రౌండ్‌–1 మ్యాచ్‌లో ఎంజే ఇంగ్లిష్‌ కాలేజి 2–0తో సెయింట్‌ జోసెఫ్‌ డీసీపై గెలుపొందింది.  టోర్నీ ప్రారంభ కార్యక్రమంలో రిటైర్డ్‌ ఐపీఎస్‌ విజయ రామారావు ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో బద్రుకా కాలేజి  జనరల్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ టీఎల్‌ఎన్‌ స్వామి, ప్రిన్సిపాల్‌ డా.సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

రౌండ్‌–1 ఫలితాలు:
మాతృశ్రీ ఇంగ్లీష్‌ కాలేజి 2–0తో ఇస్లామియా ఇంగ్లీష్‌ కాలేజిపై విజయం.
మెస్కో కాలేజి 2–0తో అవంతి
డీసీపై విజయం.
 ఎస్‌పీ కాలేజి 2–1తో నిజామ్‌ డీసీపై విజయం.
ఓయూ సైన్స్‌ కాలేజి 2–0తో వసుంధర డీసీపై విజయం.
వెస్లీ కాలేజి 2–0తో హెచ్‌ఎంవీ డీసీపై విజయం.
శివ శివాని డీసీ 2–1తో అన్వర్‌ ఉల్‌ ఉలూమ్‌ డీసీపై విజయం.

రౌండ్‌–2 ఫలితాలు
 ఐఐఎంసీ కాలేజి 2–0తో రైల్వే డీసీపై విజయం.
 ఓయూ కామర్స్‌ కాలేజి 2–1తో ఏవీ కాలేజిపై విజయం.
 భవన్స్‌ సైనిక్‌పురి కాలేజి 2–0తో ప్రభుత్వ సిటీ కాలేజిపై విజయం.
 మాతృశ్రీ ఇంగ్లిష్‌ కాలేజి 2–1తో మెస్కో కాలేజిపై విజయం.
 ఓయూ సైన్స్‌ కాలేజి 2–0తో లయోలా అకాడమీ కాలేజిపై విజయం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement