రాష్ట్ర స్థాయి సీనియర్ క్యారమ్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్థాయి సీనియర్ గ్రీన్ క్యారమ్ టోర్నీలో ప్రపంచ చాంపియన్ అపూర్వ సెమీస్‌లోకి దూసుకెళ్లింది. ఆనంద్‌నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పోర్ట్స్ అకాడమీలో జరుగుతోన్న ఈ టోర్నీలో ఆరుసార్లు జాతీయ చాంపియన్ నిర్మల కూడా తన పునరాగమనాన్ని విజయాలతో ప్రారంభించింది. రెండేళ్ల తర్వాత తిరిగి బరిలోకి దిగిన ఆమె కూడా సెమీఫైనల్‌కు చేరుకుంది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో ఎస్.అపూర్వ (ఎల్‌ఐసీ) 25–0, 25–0తో బి. శ్రీవిద్యపై గెలుపొందగా... పి. నిర్మల (ఎల్‌ఐసీ) 25–6, 25–0తో తేజస్వి (ఆక్సెంచర్)ని ఓడించింది. ఇతర మ్యాచ్‌ల్లో నందిని (డెలాయిట్) 24–7, 25–2తో శ్రీచందనపై, సవితా దేవి (పోస్టల్) 25–0, 25–0తో కె. పద్మజపై గెలుపొందారు.
పురుషుల సింగిల్స్ విభాగంలో వి. అనిల్‌కుమార్, డి. రవీందర్ గౌడ్ క్వార్టర్స్‌కు చేరుకున్నారు. ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల్లో వి. అనిల్ కుమార్ (ఏజీఏపీ) 25–4, 25–17తో ఎస్. సాయి (ఎస్‌ఎస్‌సీఏ)పై, రవీందర్ గౌడ్ (ఏజీఏపీ) 25–0, 25–1తో సయ్యద్ జుబేర్ అహ్మద్‌పై నెగ్గారు. ఇతర ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల్లో సూర్యప్రకాశ్ 25–10, 25–18తో బిసిల్ ఫిలిప్స్‌పై, నవీన్ 25–18, 25–4తో అబ్దుల్‌పై, నజరుల్లా 22–8, 25–24తో ఎస్‌కే జాఫర్‌పై, ఎస్. ఆదిత్య 22–5, 11–16, 25–0తో వసీమ్‌పై, మొహమ్మద్ అహ్మద్ 24–5, 25–17తో కృష్ణపై, హకీమ్ 25–9, 17–20, 25–7తో దినేశ్‌బాబుపై విజయం సాధించారు. మరోవైపు రెండోరౌండ్‌లో సంచలన విజయం సాధించిన లలిత్ స్వామి మూడోరౌండ్ మ్యాచ్‌లో 0–25, 5–25తో సాయి (ఎస్‌ఎస్‌సీఏ) చేతిలో పరాజయం పాలయ్యాడు.
పురుషుల డబుల్స్ క్వార్టర్స్ ఫలితాలు
ఎస్. సాయి–నరేశ్ ద్వయం 25–0, 22–17తో గిరిధర్– సునీల్ జంటపై, ఆర్.డి.దినేశ్ బాబు–ఎల్. సూర్యప్రకాశ్ ద్వయం 16–13, 25–18తో వి. అనిల్ కుమార్–సందీప్ జంటపై, హకీమ్–ఎ.శ్రీనివాస రావు ద్వయం 25–12, 21–8తో ప్రసాద్–ఇమ్రాన్ అలీ ఖాన్ జంటపై, మొహమ్మద్ అహ్మద్–మొహమ్మద్ ద్వయం 18–11, 22–3తో సయ్యద్ మోయిజ్–నజరుల్లా జంటపై గెలుపొందాయి.
సెమీస్‌లో అపూర్వ, నిర్మల
Published Tue, Feb 28 2017 10:31 AM | Last Updated on Tue, Sep 5 2017 4:51 AM
Advertisement
Advertisement