nirmala
-
దండెత్తిన క్యాన్సర్‌పై ధ్యానమే సైన్యంగా...
నేను మూడుసార్లు క్యాన్సర్ బారిన పడ్డాను. 2003లో బ్రెస్ట్ క్యాన్సర్. 2022లో బ్రెయిన్ క్యాన్సర్. 2024లో మళ్లీ బ్రెయిన్ క్యాన్సర్. నా వయసు 70 ఏళ్లు. క్యాన్సర్‌పై గెలుస్తూనే ఉన్నాను. యోగా, ధ్యానం మనలోని శక్తులను బయటకు తీసి స్థిరంగా ఉంచుతాయి. ధ్యానం నాకు ఆయుధంగా పని చేసింది. క్యాన్సర్ అనగానే కంగారు పడతారు. చికిత్స తీసుకుంటూ పోరాడొచ్చు.. గెలవొచ్చు. క్యాన్సర్ వచ్చిన వారి వద్దకు వెళ్లి ఆ విషయమే చెప్పి కౌన్సెలింగ్ చేస్తుంటా’ అంటున్న హైదరాబాద్‌కు చెందిన నల్లూరి నిర్మల పరిచయం.‘యోగా మన శరీరానికి ఉండే శక్తుల్ని వెలికి తీస్తే ధ్యానం మన మనసుని నిశ్చలం చేస్తుంది. క్యాన్సర్ వంటి జబ్బులను ఎదుర్కొనడానికి శరీర బలం ఎంత అవసరమో అంతకంటే ఎక్కువగా మానసిక బలం అవసరం. క్యాన్సర్ అనగానే చాలామంది ఆందోళన చెందిన మనసును తద్వారా శరీరాన్ని బలహీన పరుచుకుంటారు. అప్పుడు వైద్యం అనుకున్నంత సమర్థంగా పనిచేయదు. అందుకే నేను నా జీవితంలో క్యాన్సర్‌ను ఎదుర్కొనడానికి యోగా, ధ్యానాలను ఆశ్రయించాను. చికిత్స సమయంలో శరీరం బలహీనంగా ఉంటుంది కనుక అన్నిసార్లు యోగా చేయలేము. కాని ధ్యానం చేయవచ్చు. నేను ధ్యానం వల్ల చాలా మటుకు అలజడిని దూరం చేసుకున్నాను. అందుకే పల్లెల్లో స్త్రీలకు అప్పుడప్పుడు యోగా, ధ్యానం గురించి ప్రచారం చేశాను. ఇక ఇప్పుడు చేస్తున్నదేమిటంటే క్యాన్సర్ బారిన పడిన వాళ్లను కలిసి వారి ఆందోళన దూరం చేయడం. నన్ను వారికి చూపించి నేను ఎదుర్కొన్నానంటే మీరూ ఎదుర్కొనగలరని ధైర్యం చెప్పడం. యోగా, ధ్యానాలను ఎలా చికిత్సలో భాగం చేసుకోవాలో సూచించడం’ అన్నారు 70 ఏళ్ల నల్లూరి నిర్మల. ఆమెను చూసినా, ఆమెతో మాట్లాడినా తీవ్ర అనారోగ్యాలలో ఉన్న వారు కచ్చితంగా ధైర్యం తెచ్చుకోగలరని అనిపిస్తుంది. ఆమె అంత ప్రశాంతంగా, దిటవుగా కనిపిస్తారు.చిన్నప్పటి నుంచి సవాళ్లేనల్లూరి నిర్మలది ప్రకాశం జిల్లా. ఆమె తండ్రి నల్లూరి అంజయ్య ప్రజల మనిషిగా గుర్తింపు పొందారు. వీరిది కమ్యూనిస్టు కుటుంబం. ఆడపిల్లలకు చదువు ముఖ్యమని తమ గ్రామంలోనే ఒక ప్రైవేటు పాఠశాల స్థాపించాడాయన. అలా నిర్మల చదువుకొని జీవిత బీమా సంస్థలో, తర్వాత కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్లో, ఆ తర్వాత కోటీలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్టెనోగ్రాఫర్‌గా పని చేశారు. 1977 నుంచి 2014 వరకు దాదాపు 37ఏళ్ళు అదే బ్యాంకులో పని చేసి ఉద్యోగ విరమణ పొందారు. అయితే నిర్మల చిన్నప్పటి నుంచి ఆరోగ్యపరమైన సవాళ్లను ఎదుర్కొన్నారు. వివాహమై ఇద్దరు పిల్లలు పుట్టాక గర్భసంచి తీసేయాల్సి వచ్చింది. ఆ తర్వాత 2003లో బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డారు. ‘ఆ సమయంలో నా భర్త వ్యాపార పరమైన నష్టాలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు నా అనారోగ్యం. అయినా సరే ఆ ఒత్తిడిని, ఈ ఒత్తిడిని ఎదుర్కొని బ్రెస్ట్ క్యాన్సర్‌ని జయించాను’ అని చెప్పారు నిర్మల. మరో రెండుసార్లు దాడిక్యాన్సర్ను జయించానని భావించిన నిర్మలను మరలా ఆ జబ్బు వెంటాడింది. 2022 లో బ్రెయిన్ క్యాన్సర్ నిర్మల శరీరంలోకి ప్రవేశించింది. మొదటిసారి తట్టుకున్నంతగా నిర్మల గారి శరీరం రెండవసారి తట్టుకోలేకపోయింది. అయినా తన మానసిక శక్తితో దాన్ని ఎలా అయినా ఓడించాలన్న సంకల్పంతో క్యాన్సర్‌ను తోక ముడుచుకునేలా చేశారామె. కాని మూడవసారి 2024లో మరలా బ్రెయిన్ క్యాన్సర్ తిరగబెట్టింది. ఇప్పుడు 70 ఏళ్ళ వయసులో కూడా నిర్మల దానితో పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ పోరాటానికి ఒక ఆయుధంగా ‘ప్రకృతి యోగా అండ్ నేచర్ క్యూర్’ని నిర్మల ఎంచుకున్నారు. డాక్టర్ సరస్వతి దగ్గర నిర్మల యోగాలో శిక్షణ తీసుకున్నారు. దానివల్ల నిర్మల జీర్ణవ్యవస్థ మెరుగైంది. కొన్ని ఆరోగ్య సమస్యలు నెమ్మదించాయి. నిర్మల పూర్తిస్థాయి శిక్షణ తీసుకుని అందరికీ ఆరోగ్యం మీద అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో యోగా క్యాంపులు నిర్వహించారు. ఇంటి దగ్గర కూడా యోగా తరగతులు నడిపారు. అలా ‘క్యాన్సర్’పై పోరాడుతూ యోగా–ప్రకృతి–ధ్యానం సమన్వయంతో జీవితాన్ని మళ్ళీ ఆరోగ్య పథంలోకి మళ్లించారు. స్త్రీలకు ఇంటా బయటా సమస్యలే‘స్త్రీలకు ఇంటా బయటా సమస్యలే. ఆ సమస్యలను చూస్తూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. అలా చేయొద్దని నేను కోరుతున్నాను. కుటుంబానికి సంబం«ధించి ఎన్ని బాధ్యతలున్నా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. ఆత్మన్యూనతా భావం విడనాడి ధైర్యంగా మసలుకోవాలి, ధ్యానం మీకు దారి చూపిస్తుంది’ అంటారామె. -
కర్నూలు విద్యార్థినిపై సమంత ప్రశంసలు... పోస్ట్ వైరల్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్ ఇండియన్ వర్షన్లో కనిపించనుంది. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ సరసన నటిస్తోంది. గతేడాది శాకుంతలం, ఖుషి సినిమాలతో అలరించింది. మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే రీ ఎంట్రీతో అదరగొడుతోంది. తాజాగా సమంత ఇంటర్ విద్యార్థినిపై ప్రశంసలు కురిపించింది. ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన నిర్మలను కొనియాడింది. ఈ రోజుల్లో తనే నాకు ఆదర్శం అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. అంతే కాకుండా ప్రముఖ పత్రిక క్లిప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. స్టార్ హీరోయిన్ సమంత ఇంటర్ విద్యార్థినిపై ప్రశంసలు కురిపించడంతో సామ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఇటీవల రిలీజైన ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో ఆలూరు కేజీబీవీలో చదివిన ఎస్ నిర్మల బైపీసీలో 440 కి 421 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది. బాల్య వివాహం నుంచి తప్పించుకుని మరీ తానేంటో నిరూపించుకుంది. అంతేకాదు ఐపీఎస్ ఆఫీసర్ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతే కాదు నిర్మల పదో తరగతిలోనూ 537 మార్కులు సాధించింది. నిరుపేదలైన నిర్మల తల్లిదండ్రులకు నలుగురు కుమార్తెలు, వీరిలో ముగ్గురికి ఇప్పటికే వివాహాలైనాయి. ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపి నిర్మలకి కూడా చిన్నతనంలోనే వివాహంచేయాలని భావించారు. కానీ చదువుకోవాలన్నపట్టుదలతో పోరాడి బాల్య వివాహంనుంచి తప్పించుకుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పరీక్షలో టాపర్‌గా నిలిచి తానేమిటో నిరూపించుకుంది. -
సర్కారు చేయూత.. చదువుల తల్లి కల సాకారం
ఆదోని రూరల్/ఆస్పరి: చదువుల్లో అత్యుత్తమంగా రాణిస్తున్న ఆ బాలికను పేదరికంతో తల్లిదండ్రులు చదువు మానిపించారు. ఆ చదువుల తల్లి పదో తరగతిలో 537 మార్కులు సాధించినా.. ఉన్నత చదువులు చదవాలనే ఆశ ఉన్నా.. ఆ ర్థిక పరిస్థితుల రీత్యా చదువుకు దూరమైంది. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ ఆమెకు వరమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా ఆదోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సాయిప్రసాదరెడ్డి గతేడాది జూన్‌లో బాలిక ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో తాను చదువుకుంటానంటూ బాలిక ఆయనకు మొరపెట్టుకోవడంతో ఎమ్మెల్యే ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కర్నూలు జిల్లా కలెక్టర్ సృజన ప్రత్యేక చొరవ తీసుకున్నారు. బాలికను కర్నూలు జిల్లా ఆస్పరి కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం(కేజీబీవీ)లో చేర్పించారు. అడుగడుగునా ప్రభుత్వ ప్రోత్సాహం అందించడంతో తాజాగా విడుదలైన మొదటి ఏడాది ఇంటర్ ఫలితాల్లో బైపీసీ విభాగంలో 440 మార్కులకు 421 మార్కులు సాధించి ఆ బాలిక టాపర్‌గా నిలిచింది. ‘కార్పొరేట్ కళాశాలల్లో చదివితేనే ఎక్కువ మార్కులు’ అనే అపోహను తుడిచిపెట్టేసి ప్రభుత్వ విద్యాసంస్థలో చదివి అత్యుత్తమ మార్కులను సొంతం చేసుకుంది. వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రోత్సాహంతో ఐపీఎస్ సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది చదువుల తల్లి నిర్మల. కూలి పనుల నుంచి కాలేజీకి పంపిన ప్రభుత్వం కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దహరివాణం గ్రామానికి చెందిన నిరుపేద దంపతులు హనుమంతమ్మ, శీనప్ప దంపతులకు నలుగురు ఆడపిల్లలు. ముగ్గురు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపించారు. నాలుగో కుమార్తె నిర్మలను స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదివించారు. పదో తరగతిలో 600కి 537 మార్కులు సాధించి నిర్మల సత్తా చాటింది. అయితే నిరుపేద కుటుంబం కావడంతో ఉన్నత చదువులు చదివించేందుకు నిర్మల తల్లిదండ్రులకు ఆ ర్థిక స్థోమత సరిపోలేదు. దీంతో ఆమెను చదువు మానిపించి తమతోపాటే కూలిపనులకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన.. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ఆదోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, అధికారులు ఆమె ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో ఇంటిలోనే ఉన్న నిర్మల ‘సార్ నేను చదుకుంటాను. నాకు సీటు ఇప్పించండి. మా అమ్మానాన్నలు పేదవాళ్లు. డబ్బులు పెట్టి చదివించలేని పరిస్థితి’ అని వేడుకుంది. చలించిపోయిన ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి వెంటనే ఆమెను కాలేజీలో చేర్పించాలని అప్పటి ఎంపీడీవో గీతావాణి, తహసీల్దార్ వెంకటలక్షి్మని ఆదేశించారు. మరోవైపు నిర్మలపై ‘సాక్షి’లో కథనం రావడంతో కర్నూలు జిల్లా కలెక్టర్ సృజన నిర్మలను తన కార్యాలయానికి పిలిపించారు. నిర్మల ఉన్నత చదువులకు ప్రభుత్వం సాయం అందిస్తుందని చెప్పి ఆమెను ఆస్పరి కేజీబీవీలో చేర్పించారు. ప్రభుత్వం అండగా నిలవడంతో రూపాయి కూడా ఫీజు కట్టకుండానే నిర్మల చదువుకుంది. అంతేకాకుండా ఆమెకు మెటీరియల్, పుస్తకాలను కూడా కలెక్టర్ అందించారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఓవైపు చదువుల్లోనే కాకుండా మరోవైపు ఆటల్లోనూ నిర్మల రాణిస్తోంది. గతేడాది కబడ్డీ పోటీల్లో రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపికైంది. ఈ క్రమంలో నిర్మలను జిల్లా కలెక్టర్ సృజన ప్రత్యేకంగా అభినందించారు. ఐపీఎస్ కావాలన్నదే నా జీవిత ఆశయం ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ సృజన నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. కలెక్టర్ మాటలను ఎప్పటికీ మర్చిపోలేను. నా చదువుకు మేడమ్ అన్నివిధాల సహకరిస్తున్నారు. ఐపీఎస్ కావాలన్నదే నా లక్ష్యం. – నిర్మల, విద్యా ర్థిని చాలా గర్వంగా ఉంది.. నిర్మల ఎంతో క్రమశిక్షణతో ఉంటుంది.. పాఠ్యాంశాలపై ఆసక్తి చూపుతోంది. స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ రూపకల్పన చేసిన పంచతంత్ర ప్రోగ్రామ్ ద్వారా డైలీ, వీక్లీ, గ్రాండ్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నాం. నిరంతర మూల్యాంకనంతోపాటు విద్యార్థుల సందేహలను నివృత్తి చేస్తున్నాం. ఈ టెస్ట్‌ల్లో నిర్మల మంచి మార్కులు తెచ్చుకుంది. ఆమె సాధిస్తున్న విజయాల పట్ల ఎంతో గర్వంగా ఉంది. – శారున్ స్మైలీ, ప్రిన్సిపాల్, కేజీబీవీ, ఆస్పరి, కర్నూలు జిల్లా -
మా అమ్మకు నన్ను పట్టించుకునే టైం కూడా ఉండేది కాదు
-
సీఎం జగన్‌కు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధన్యవాదాలు తెలిపారు
-
తల్లీకూతుళ్లు రోడ్డు దాటుతుండగా.. దూసుకొచ్చిన మృత్యువు!
మంచిర్యాల: కొత్త సంవత్సరం సందర్భంగా ప్రార్థనల్లో చర్చికి వెళ్తున్న తల్లీకూతురుపైకి లారీ మృత్యువు రూపంలో దూసుకువచ్చింది. జాతీయ రహదారి దాటుతుండగా ఇద్దరినీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్వరి చర్చి సమీపంలో ఆదివారం రాత్రి జరిగింది. మందమర్రి సీఐ మహేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. జిల్లాలోని నస్పూర్‌కు చెందిన వేల్పుల నిర్మల(44), వేల్పుల స్వాతి(21) ప్రార్థనల కోసం కాసిపేట సమీపంలోని కల్వరి బయల్దేరారు. చర్చి సమీపంలో రాత్రి వాహనం దిగి రోడ్డు దాటుతుండగా మందమర్రి నుంచి బెల్లంపల్లి వైపునకు వెళ్తున్న బొలేరో వ్యాన్ వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది. ఈ చర్చి సమీపంలోనే ఘటన జరుగడంతో స్థానికులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. కొన ఊపిరితో కొట్టుకుంటున్న వారిని 108లో బెల్లంపల్లి ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఇద్దరూ మృతిచెందినట్లు తెలిపారు. మృతుల వద్ద ఉన్న బ్యాగ్‌లో లభించిన ఆధార్‌కార్డు ఆధారంగా మృతులు నస్పూర్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఇదిలా ఉండగా ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదైనట్లు సీఐ తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇవి చదవండి: ఆర్టీసీ బస్సు, డీసీఎం ఘోర రోడ్డు ప్రమాదం! పొగ మంచు, అతివేగమే కారణమా? -
Andhra Pradesh: వారికి దారిచూపిన ‘గడప గడపకు’
కర్నూలు(సెంట్రల్) : నిర్మల కోరిక నెరవేరింది. చదువుకోవడానికి మార్గం సుగమమైంది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో.. తాను చదువుకుంటానని.. అందుకు తన తల్లిదండ్రులను ఒప్పించాలని ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డిని కోరడంతో కలెక్టర్ డాక్టర్ జి.సృజన స్పందించారు. బాలికను ఆస్పరి కస్తూర్బా జూనియర్ కాలేజీలో బైపీసీ గ్రూప్‌లో ఇంటర్ చదివేందుకు సీటు ఇప్పించారు. భవిష్యత్‌లోనూ ఆ బాలిక చదువుకు ఆటంకాలు లేకుండా చూస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఇందుకు అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భర్తిస్తుందని భరోసా ఇచ్చారు. ఆదోని మండలం పెద్ద హరివణంకు చెందిన శ్రీనివాసులు, అనుమంతమ్మ దంపతులకు నలుగురు కుమార్తెలు. వీరిలో నిర్మల చిన్న కుమార్తె. మిగిలిన ముగ్గురికి పెళ్లిళ్లయ్యాయి. నిర్మల చిన్నతనం నుంచే చదువులో రాణిస్తుండటంతో తల్లిదండ్రులు పదో తరగతి వరకు చదివించారు. 2022 మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షల్లో 537 మార్కులు తెచ్చుకుంది. అయితే తల్లిదండ్రుల ఆర్థిక స్థోమత ఆ బాలిక ఉన్నత చదువులకు శాపమైంది. చదువుకుంటానంటే తమకు అంత స్థోమత లేదని, ఇంటి దగ్గర ఉండాలని చెప్పారు. దీంతో గతేడాది ఇంటి దగ్గర ఉంటూ సాయంత్రం చిన్న పిల్లలకు ట్యూషన్లు చెబుతూ పొలం పనులకు వెళ్లేది. అయితే ఆ బాలికలో చదువుకోవాలన్న కోరిక మాత్రం అలానే ఉండిపోయింది. ఈ క్రమంలో బాలికకు ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం వరమైంది. ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, అధికారుల బృందం బుధవారం ఇంటింటికీ తిరుగుతూ ఆ బాలిక ఇంటికి చేరుకున్నారు. తాను పదో తరగతిలో మంచి మార్కులు తెచ్చుకున్నానని, తాను ఉన్నత చదువులు చదివేందుకు ఆర్థిక స్థోమత లేదని, ఆ దిశగా తనకు సాయం చేసి.. తన తల్లిదండ్రులను కూడా తనను చదివించేలా ఒప్పించాలని కోరింది. అందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. మరుసటి రోజు బాలిక ఉదంతం మీడియాలో రావడంతో పాటు ఎమ్మెల్యే కూడా ఆదేశించడంతో కలెక్టర్ డాక్టర్ సృజన వెంటనే స్పందించారు. బాలికను, ఆమె తల్లిదండ్రులను తన క్యాంపు కా>ర్యాలయానికి పిలిపించి మాట్లాడి.. నిర్మలను కాలేజీలో చే ర్పిం చేందుకు మార్గం సుగమం చేశారు. తాను ఐపీఎస్ అయి దేశానికి సేవ చేస్తానని నిర్మల సంతోషంగా చెప్పింది. -
కాల్చిన కొడవలితో దాడి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కొడవలితో భార్యపై భర్త హత్యాయత్నం చేసిన ఘ టన రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బుధవారం జరిగింది. కాల్చిన కొడవలితో దాడి చేయడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఒగ్గు నిర్మల(35), మల్లేశ్ దంపతుల మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. హమాలీ పనిచేసే మల్లేశ్.. వచ్చిన డబ్బులతో మద్యం తాగి రోజూ భార్యను కొడుతున్నాడు. బుధవారం ఉదయం బయటకు వెళ్లి ఇంటికొచ్చిన మల్లేశ్.. కొడవలిని కాల్చి పెట్టుకున్నాడు. పిల్లలు పాఠశాలకు వెళ్లగా నిర్మల ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇదే అదనుగా భావించిన మల్లేశ్ కాల్చిన కొడవలితో నిర్మల మెడ వెనుక భాగంలో పొడిచాడు. ఆమె కేకలు వేయడంతో ఇరుగుపొరుగు రావడం చూసి మల్లేశ్ పరారయ్యాడు. కుటుంబ సభ్యులు స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స చేసి కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. కొడవలిని కాల్చడంతో శరీరం లోపలి భాగాలకు తీవ్ర గాయాలు అయ్యి ఉండొచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు. కొడవలిని మెడ నుంచి తొలగించేందుకు ప్ర యత్నం చేస్తున్నారు. పరిస్థితి విషమంగానే ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. మల్లేశ్.. పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. -
ఆ హీరో అర్ధరాత్రి తాగి వచ్చి తలుపు తీయమని గొడవ చేశాడు: నటి
ఒకప్పుడు తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ వెన్నిరాడై నిర్మల. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం అనే బేధాలు లేకుండా దక్షిణాదిన అన్ని భాషల్లో నటించిందామె. వందలాది చిత్రాలు చేసిన ఆమె తన సహజ నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. వెన్నెలాడె చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఆమె హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నాలుగు వందలకు పైగా చిత్రాలు చేసింది. తెలుగులో భక్త ప్రహ్లాద, కరుణామయుడు, శ్రీ సీతారాముల కల్యాణం చూద్దము రారండి, కలిసుందాం రా, జయం మనదేరా, నిన్నే ప్రేమిస్తా వంటి అనేక తెలుగు చిత్రాలు చేసింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ఎదురైన చేదు అనుభవాన్ని చెప్పుకొచ్చింది. 'ఒక రోజు ఏమైందంటే.. సినిమా షూటింగ్ అయిపోయాక ఇంటికి వచ్చేశా. ఆ సినిమాలోని హీరో నా ఇంటికి అర్ధరాత్రి తాగి వచ్చి తలుపు తట్టాడు. నేను డోర్ ఓపెన్ చేయలేదు. అతడేమో అలాగే తలుపు తడుతూనే ప్లీజ్, డోర్ ఓపెన్ చేయండి, నేనేం చేయను.. జస్ట్ లోపలకు వచ్చి నీ పక్కనే నిద్రించి వెళ్లిపోతా అన్నాడు. తర్వాతి రోజు నుంచి నేను షూటింగ్‌కే వెళ్లలేదు సరికదా సినిమా కూడా చేయనని చెప్పేశాను. దర్శకనిర్మాతలు నన్ను ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ నా వల్ల కాదంటూ సినిమా నుంచి వైదొలిగాను. ఇలాంటివాటిని నేనస్సలు సహించను' అని చెప్పుకొచ్చింది నిర్మల. -
అమ్మ మనసు.. మా దగ్గర పెరిగిన అమ్మాయిని పెళ్లి చేసుకునే వాళ్లకు కొన్ని కండిషన్లు!
మన జీవితాన్ని మనం రాసుకుంటామా? మరెవరైనా రాస్తారా? యాగ్నెస్ నుదుటిన మదర్ థెరిసా అనే మకుటాన్ని చేర్చింది ఎవరు? అనుకోకుండా ఓ రోజు... నిర్మల అనే యువతి నలుగురు పిల్లలకు అమ్మ కావాలని రాసింది ఎవరు? యాభై ఏళ్లు వచ్చే లోపే డెబ్బై మంది పిల్లలకు తల్లయింది గూడపాటి నిర్మల. మరో ముగ్గురు పాపాయిలకు అమ్మమ్మ కూడా. గుడివాడలో పుట్టిన నిర్మలది ఆంగ్లో ఇండియన్ నేపథ్యం ఉన్న కుటుంబం. హైదరాబాద్, మోతీనగర్‌లో జీవోదయ హోమ్ ఫర్ చిల్డ్రన్‌లో నలభై మంది పిల్లలతో సాగుతోంది ఆమె జీవితం. అమ్మకు వైద్యం కోసం 2006లో హైదరాబాద్ వచ్చినప్పుడు ఆమె ఊహకు కూడా అందని విషయం ఇది. అలాంటి ఏ మాత్రం ఊహించని విషయాలు తన జీవితంలో ఎన్నో జరిగాయన్నారు నిర్మల. తాను ఒక డైరెక్షన్ అనుకుంటే తన ప్రమేయం లేకుండా ఏదో ఓ సంఘటన తన మార్గాన్ని మలుపు తిప్పుతూ వచ్చిందని చెప్పారామె. నాటి రైలు ప్రయాణం ‘‘అమ్మానాన్నలు స్కూల్ హెడ్మాస్టర్లు. ముగ్గురమ్మాయిల్లో పెద్దమ్మాయిని. ఇంటర్ తర్వాత లా చదవాలనేది నా కోరిక. అయితే ఆ సెలవుల్లో ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు ఓ సంఘటన... నా తోటి ప్రయాణికులు మాతోపాటు రైల్లో ప్రయాణిస్తున్న ఇద్దరు లెప్రసీ పేషెంట్లను నిర్దాక్షిణ్యంగా ప్లాట్‌ఫామ్ మీదకు తోసేశారు. ‘అదేంటి, అలా చేశారు’ అని అడిగితే ‘ఇదెవత్తో పిచ్చి పిల్లలా ఉంద’ని నన్ను ఈసడించుకున్నారు కూడా. అప్పటికి నాకు లెప్రసీ అంటే ఏమిటో తెలియదు. ఇంటికి వెళ్లి మా తాతయ్యను అడిగినప్పుడు వాళ్ల జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో చెప్పారాయన. అప్పుడు డిగ్రీకి చెన్నైకి వెళ్లి లెప్రసీ సంబంధిత కోర్సు చేశాను. అలాగే టీబీ, హెచ్ఐవీ నిర్మూలన సర్వీస్ కోర్సులు చేశాను. అమ్మ కోసం హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత ఓ ఆంగ్లో ఇండియన్ ఎంఎల్ఏ సూచనతో బోరబండ, పర్వత్ నగర్లో ఉన్న లెప్రసీ కాలనీలో సర్వీస్ మొదలు పెట్టాను. ఓ రోజు మాదాపూర్‌లో మాణింగ్ వాక్ చేస్తున్నప్పుడు నా కళ్ల ముందు ఓ దుర్ఘటన. ఓ తల్లిదండ్రులు ఆటో స్టాండ్ దగ్గర లగేజ్‌తో ఉన్నారు. వాళ్ల నలుగురు పిల్లల్ని అప్పుడే రోడ్డుకు ఒక పక్కగా ఉంచి, తల్లిదండ్రులు సామాను ఆటో దగ్గరకు తీసుకువెళ్తున్నారు. ఇంతలో పెద్ద పెద్ద బండరాళ్లతో ఓ లారీ... రాంగ్‌సైడ్ వచ్చి వాళ్లను ఢీకొట్టింది. తల్లిదండ్రులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం తెలుసుకుని ప్రాణాలు కోల్పోయిన వారి తల్లిదండ్రులు వచ్చారు. అంటే... నలుగురు చిన్న పిల్లల అమ్మమ్మ – తాత, నానమ్మ –తాతలన్నమాట. వాళ్లు ఆ పిల్లలను చూస్తూ ‘నష్టజాతకులు’ అని ఓ మాట అనేసి తమకేమీ పట్టనట్లు వెళ్లిపోయారు. లెప్రసీ కాలనీ సర్వీస్‌తో అప్పటికే ఆ పీఎస్ పరిధిలోని పోలీసులు పరిచయం అయ్యారు. వారు ఆ పిల్లలను స్టేట్ హోమ్‌లో చేర్చే బాధ్యత నాకప్పగించారు. నలుగురు పిల్లలకు గార్డియన్‌గా నేనే సంతకం చేసి స్టేట్‌హోమ్‌లో చేర్చాను. అయితే... ఆ బాధ్యత అంతటితో తీరలేదు. స్టేట్ హోమ్ నుంచి ఫోన్ కాల్ ఆ నలుగురు పిల్లల్లో పెద్దమ్మాయి లైన్లో ఉంది. ‘అమ్మా! మమ్మల్ని హోమ్‌లో చేర్చేటప్పుడు మీరు సంతకం చేశారట. హోమ్ వాళ్లు మమ్మల్ని బయటకు పంపించాలన్నా కూడా మీరే సంతకం చేయాలట. మీరు వచ్చి సంతకం చేస్తే మేము బయటకు వెళ్లిపోతాం. ఇక్కడ ఉండలేం’ ఇదీ ఆ ఫోన్ సారాంశం. ఎక్కడికి వెళ్తారు. నీకు పదేళ్లు కూడా లేవు. ఇద్దరు తమ్ముళ్లు, చెల్లికి ఏడాది కూడా నిండలేదు. వాళ్లను నువ్వు ఎలా చూసుకుంటావని అడిగితే సమాధానం లేదు. ‘ఎక్కడికో ఒక చోటకు వెళ్లిపోతాం, ఇక్కడ మాత్రం ఉండలేం’ అదే మంకుపట్టు. అప్పుడు పోలీసుల నుంచి ఓ రిక్వెస్ట్. ఆ పిల్లలను మీరు సంతకం చేసి బయటకు తీసుకురాకపోతే గోడదూకి వెళ్లిపోతారు. ఆ పోవడం రోడ్డు మీదకే. సిగ్నళ్ల దగ్గర బెగ్గర్‌గా మారిపోతారు. వాళ్లను దగ్గర పెట్టుకుని చదివించే మార్గం చూడమన్నారు. దాంతో వాళ్లను మా ఇంటికి తీసుకువచ్చాను. ఆలా ఆ రోజు నలుగురు పిల్లలకు అమ్మనయ్యాను. చంటిబిడ్డను చూసుకోవడానికి మా ఊరి నుంచి ఒక డొమెస్టిక్ హెల్పర్‌ను పిలిపించుకున్నాను. ఆ తర్వాత పోలీసుల నుంచి తరచూ ఓ ఫోన్. అమ్మానాన్నలకు దూరమైన పిల్లల్లో పోలీసుల దృష్టికి వచ్చిన వాళ్లను తెచ్చి వదిలిపెట్టసాగారు. అలా మూడు నెలలకు నా ఇల్లు ఇరవై మంది పిల్లల ఇల్లయింది. అంతమంది పిల్లలను ఇంట్లో ఉంచడానికి ఇంటి ఓనరు అభ్యంతరం చెప్పడంతో పూర్తి స్థాయి హోమ్ ప్రారంభించాను. ఇప్పుడు మా హోమ్ నుంచి మొత్తం డెబ్బై మంది పిల్లలు సహాయం పొందుతున్నారు. నలభై మంది ఈ హోమ్‌లో ఉన్నారు. పన్నెండు మంది అబ్బాయిలు విజయవాడలో ఉన్నారు. ఎనిమిది మంది సెమీ ఆర్ఫన్లకు ఈ హోమ్ నుంచే భోజనం వెళ్తుంది. వాళ్లకు తల్లి మాత్రమే ఉంటుంది. ఆమెకు తన పిల్లల్ని పోషించడానికి, చదివించడానికి శక్తి లేని పరిస్థితుల్లో పిల్లల చదువులు, భోజనం, దుస్తులు అన్నీ మా హోమ్ చూసుకుంటుంది. పిల్లలు మాత్రం ఉదయం వాళ్ల ఇంటి నుంచి స్కూలుకు వస్తారు, రాత్రికి తల్లి దగ్గరకు వెళ్లిపోతారు. ఇక కాలేజ్‌కెళ్లే వాళ్ల విషయానికి వస్తే... ఎనిమిది మంది ఇంటర్, ఒక అమ్మాయి డిగ్రీ చదువుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇరవై మంది నర్సింగ్, పాలిటెక్నిక్ చేస్తున్నారు. ఐదుగురు కర్నాటకలో మెడిసిన్, సాఫ్ట్వేర్ కోర్సుల్లో ఉన్నారు. మొదట నేను ఇంటికి తెచ్చుకున్న ఆ నలుగురు పిల్లల్లో పెద్దమ్మాయి, సంతకం చేస్తే వెళ్లిపోతానని ఫోన్ చేసిన అమ్మాయి కూడా ఇప్పుడు కర్నాటకలో మెడిసిన్ చేస్తున్న వాళ్లలో ఉంది. మా పిల్లల్లో ముగ్గురు పూనా, వైజాగ్, బెంగళూరుల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్లు ఒక్కొక్కరూ నలుగురు పిల్లల చదువు బాధ్యత తీసుకున్నారు. వాళ్లు ముగ్గురూ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నారు. ప్రసవాలు కూడా మా హోమ్‌లోనే. ఆ పిల్లలు నన్ను ‘అమ్మమ్మ’ అంటారు. ఆ చిన్న పిల్లలకు నలభై మంది పిన్నమ్మలు. మాది జగమంత కుటుంబం’’ అన్నారు నిర్మల తన పిల్లల మధ్య కూర్చుని వాళ్లను ముద్దు చేస్తూ. నిర్మల ఆఫీసు గదిలో గోడకు మదర్ థెరిసా ఒక బిడ్డను ఎత్తుకున్న ఫొటో ఉంది. ఈ మదర్... చుట్టూ పిల్లలతో ఆ మదర్‌కు మరోరూపంగా కనిపించింది. మా దగ్గర పెరిగిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చే వాళ్లకు కండిషన్లుంటాయి. వాళ్లను ఉద్యోగం మాన్పించకూడదు. పెళ్లికి ముందే కొంత మొత్తం అమ్మాయి పేరు మీద డిపాజిట్ చేయాలి. అనాథ అని సంబోధించరాదు. అలాగే తమ అభ్యుదయ భావాలను సమాజం ముందు ప్రదర్శించుకోవడానికి ‘అనాథను పెళ్లి చేసుకున్నాను’ అని చెప్పుకోరాదు. పాట నడిపేది నేను సింగర్‌ని. పాటలు పాడడం ద్వారా మంచి రాబడి ఉండేది. దాంతో హోమ్ నడపడం ఏ మాత్రం కష్టం కాలేదప్పట్లో. థైరాయిడ్ సమస్యతో గొంతుకు ఆపరేషన్ అయింది. ఇప్పుడు పాడలేను. ప్రధాన ఆదాయ వనరు ఆగిపోయింది. పిల్లలకు దుస్తులు, భోజనం వరకు ఇబ్బంది లేదు. మా హోమ్‌ని చూసిన వాళ్లు వాటిని విరాళంగా ఇస్తుంటారు. బర్త్‌డేలు మా పిల్లలతో కలిసి చేసుకోవడం కూడా మాకు బాగా ఉపకరిస్తోంది. స్కూలు, కాలేజ్ ఫీజులు, ఇంటి అద్దెకు మాత్రం డబ్బుగా కావాల్సిందే. డబ్బుగా ఇస్తే దారి మళ్లుతుందేమోననే సందేహం ఉంటుంది. నేను అభ్యర్థించేది ఒక్కటే. నా చేతికి డబ్బు ఇవ్వవద్దు. ఈ పిల్లలకు పుస్తకాలు కొనివ్వడం, స్కూల్కెళ్లి ఫీజులు చెల్లించడం స్వయంగా వారే చేయవచ్చు. ఏడాది పాటు ఒక బిడ్డను చదివించవచ్చు. మనసుంటే మార్గాలూ ఉంటాయి. – గూడపాటి నిర్మల, జీవోదయ హోమ్ ఫర్ చిల్డ్రన్ నిర్వహకురాలు – వాకా మంజులారెడ్డి ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి -
మాకు 400 ఓట్లు ఖాయం
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిర్మలకు 400 ఓట్లు వస్తాయని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ తమ పార్టీకి చెందిన 230 మంది ఓటర్లతో పాటు ఇతర పార్టీలకు చెందిన 170 మంది తమకు ఓటేశారని అంచనా వేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 230 ఓట్లు తమ అభ్యర్థినికి రాకపోతే అందుకు తానే బాధ్యత వహిస్తానన్నారు. ఫలితాలను చూశాక టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయాలా వద్దా అనేది స్పందిస్తానని చెప్పారు. మంత్రి హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికను ఏకగ్రీవం కాకుండా చేయడమే తమ మొదటి విజయమని చెప్పారు. ఈ ఎన్నికల ఫలితాలతో ట్రబుల్ షూటర్ హరీశ్‌రావు ట్రబుల్లో పడటం ఖాయమని వ్యాఖ్యానించారు. హరీశ్‌తో క్యాంపులు పెట్టించి టూరిస్ట్ బస్సు దగ్గరుండి ఎక్కించే పరిస్థితి తీసుకొచ్చామని జగ్గారెడ్డి చెప్పారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన వరి రైతు లేఖ రాసి ఆత్మహత్య చేసుకోవడం బాధ కలిగిస్తోందన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, వారి కోసం గాంధీభవన్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. -
ఆకలేస్తోంది.. లే అమ్మా
అశ్వారావుపేట రూరల్: తీవ్ర జ్వరంతో బాధ పడుతున్న ఓ తల్లి నిద్రలోనే మృతిచెందింది. ఇది తెలి యని ఆమె ఏడేళ్ల కుమారుడు అమ్మ ఒడిలోనే రా త్రంతా నిద్రించాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో చోటు చేసుకుంది. సంతల్లో ప్లాస్టిక్ సామాన్లు, బుడగలు అమ్ముకునేందుకు వచ్చిన నిర్మల (45) తన ఏడేళ్ల కుమారుడు కృష్ణతో కలిసి స్థానికంగా పాకలో నివాసముంటోంది. ఆమె రెండు రోజులుగా జ్వరంతో బాధ పడు తోంది. సోమవారం రాత్రి జ్వరం ఎక్కువ కావడంతో పరిస్థితి విషమించి మృతి చెందింది. ఈ విషయం తెలియని కొడుకు కృష్ణ రాత్రంతా తల్లి ఒడిలోనే నిద్రపోయాడు. తెల్లవారాక ఆకలి వేస్తోందంటూ తల్లిని నిద్ర లేపేందుకు ప్రయత్నించాడు. ఎంతకూ ఆమె లేవకపోవడంతో చుట్టుపక్కల వారికి చెప్పగా, వారు వచ్చి చూసేసరికే నిర్మల మృతి చెంది కనిపించింది. తన తల్లి జ్వరంతో నిద్రపోతోందని అమాయకంగా కృష్ణ చెబుతున్న మాటలు అందరినీ కంటతడి పెట్టించాయి. సమాచారం అందుకున్న ఎస్సై చల్లా అరుణ నిర్మల మృతదేహాన్ని మంగళవారం మార్చురీకి తరలించారు. మృతురాలి బంధువులు వరంగల్‌లో ఉన్నట్లు బాలుడి ద్వారా తెలియడంతో, వారు వచ్చాక మృతదేహాన్ని వారికి అప్పగించనున్నట్లు ఎస్సై తెలిపారు. -
స్నేహని పెళ్లి చేసుకుంటానని బన్నీ అన్నప్పుడు...
ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఇండస్ట్రీ అల్లు అరవింద్! ఇప్పటికీ బిజీ! కూర్చోడానికి కూడా ఖాళీ ఉండదు. అంత ఖాళీ లేనప్పుడు ఇప్పుడెలా కూర్చున్నారు?! ఇంత దగ్గరగా! ఇంత లవ్లీగా! ఇంత ప్లెజెంట్‌గా! ఇదంతా ఆయన బెటర్ హాఫ్ నిర్మల ఆయనకు ఇచ్చిన స్పేస్! స్పేస్ చేసుకోవడం కాదు.. స్పేస్ ఇచ్చుకోవడం ఉంటే.. ఆ దాంపత్యం ఎప్పటికీ స్వీట్ అండ్ స్ట్రాంగ్ అంటున్నారు.. మిస్టర్ అండ్ మిసెస్ అల్లు అరవింద్. మీ పెళ్లి బంధం ‘అల్లుకున్న’ రోజుల గురించి? అరవింద్: (నవ్వుతూ)... మా నాన్నగారు, నిర్మల పెదనాన్న ఫ్రెండ్స్. ‘మా అబ్బాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాను. మావాడు పల్లెటూరి అమ్మాయిని చేసుకోనంటున్నాడు. మినిమమ్ విజయవాడ అమ్మాయి అంటున్నాడు. చూడండి’ అని ఆయనతో మా నాన్నగారు అంటే, ‘మా తమ్ముడు కూతురు పెళ్లీడుకొచ్చింది. వాళ్లతో మాట్లాడతాను’ అన్నారాయన. ఆ తర్వాత నాన్నగారు వెళ్లి చూసొచ్చి, ‘అమ్మాయి బాగుంది. నాకు నచ్చింది’ అని చెప్పేశారు. నేను చూడ్డానికి వెళ్లాక పెద్దగా ఇంటర్వ్యూలు లేవు. అమ్మాయిని చూపించారు. అంతే.. తాంబూలాలు మార్చుకున్నారు. పెళ్లిచూపులకి, పెళ్లికి మధ్య గ్యాప్ ఎంత? అరవింద్: 1974లో మా పెళ్లి జరిగింది. పెళ్లి చూపులకి, పెళ్లికి మధ్య ఐదు నెలలు గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్‌లో ఓసారి కాఫీకి తీసుకెళదామని ట్రై చేశాను. ‘మా అమ్మను అడగండి’ అంది. ‘నువ్వు అడుగు. వాళ్లు పంపిస్తే వెళదాం’ అన్నాను. ఊహూ అంది. యాక్చువల్‌గా మా అత్తగారు పాతకాలం మనిషిలా ఉండరు. అప్పట్లో మా అత్తగారిని మ్యానేజ్ చేసుకుని ఉంటే, ఈవిడని కాఫీకి తీసుకెళ్లగలిగేవాడిని. ముందు అది తెలియలేదు. ఆ తర్వాత మా అత్తగారు పాతకాలపు మనిషి కాదని తెలిసింది. మీకు ముగ్గురు సిస్టర్స్. మీ పెళ్లయ్యేనాటికే వాళ్ల పెళ్లయిందా? అరవింద్: నా చెల్లి వసంత పెళ్లి, మా పెళ్లి ఒక్క రోజు తేడాలో జరిగింది. ఏప్రిల్ 7న మా పెళ్లి. 8న ఇద్దరి రిసెప్షన్ ఒకే రోజు జరిగింది. మరి.. పెళ్లయ్యాక కాఫీకి వెళ్లారా? నిర్మల: వెళ్లాం. మా రిసెప్షన్ మదరాసులో జరిగింది. ఆ వేడుక కోసం మా అమ్మానాన్న వచ్చారు. వాళ్లని రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్‌కి వెళ్లాం. ఇంటికి వచ్చేటప్పుడు భుహారీ హోటల్లో కాఫీ తాగాం. అప్పట్లో అది పెద్ద హోటల్. అరవింద్‌గారిలో మీకు నచ్చిన లక్షణాలు? నిర్మల: దేన్నీ సీరియస్‌గా తీసుకోరు. కూల్‌గా ఉంటారు. అది బాగా నచ్చుతుంది. అయితే మా పెళ్లయిన కొత్తలో ‘ఏంటీ.. ఏం చెప్పినా సీరియస్‌గా తీసుకోరు’ అనుకునేదాన్ని. అరవింద్: మామూలుగా భర్త అంటే కొంచెం సీరియస్‌గా అలా ఉంటారు కదా. నేనలా ఉండకపోయేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయింది. ఇంత లైట్‌గా ఉన్నారేంటి అనుకుంది. అయితే కొన్ని సందర్భాల్లో నా కోపం చూసి, ఓహో కోపం కూడా వస్తుందనుకుంది. మీ కుటుంబానికి సినిమా పరిశ్రమతో సంబంధం లేదు కదా.. మరి ‘అల్లువారింట్లో’ అడ్జస్ట్ కావడానికి ఇబ్బందిపడ్డారా? నిర్మల: మా నాన్నగారిది ఆయిల్ బిజినెస్. సినిమాలతో సంబంధం లేదు. దాంతో పూర్తిగా వేరే కల్చర్‌లోకి వచ్చినట్లు అనిపించింది. మాది బిజినెస్ ఫ్యామిలీ కాబట్టి ఇంట్లో చాలామంది పనివాళ్లు ఉండేవారు. నాన్న బిజినెస్ వ్యవహారాలు చూసుకునేదాన్ని. అంత లిబరల్గా పెంచారు. నన్ను క్వీన్లానే చూసుకున్నారు. మరి అత్తింట్లో కూడా క్వీన్లానే ఉన్నారా? నిర్మల: అరవింద్‌గారు, ఇంకా అందరూ అలానే చూసుకుంటారు (నవ్వుతూ). అరవింద్: అయితే తనకు కుటుంబ బాధ్యతలు ఎక్కువ. ఇంటికి పెద్ద కోడలిగా అన్నీ చూసుకుంది. పెళ్లికి ముందు ఉన్నంత లిబరల్గా అయితే లేదు. జాయింట్ ఫ్యామిలీనే కదా? నిర్మల: అవును. మా పెళ్లితో పాటు ఒక ఆడపడుచుకి పెళ్లయింది. తను కూడా కొన్నాళ్లు మాతోనే ఉంది. ఈయన అక్కగారు పెళ్లి చేసుకోలేదు. అప్పటికి సురేఖ (చిరంజీవి సతీమణి)గారికి కూడా పెళ్లి కాలేదు. సురేఖగారిది, నాదీ ఇంచు మించు ఒకే ఏజ్ కావడంతో బాగా కలిసిపోయేవాళ్లం. మా పుట్టింట్లో మా మేనత్తలతో కలిసి పెరిగాను. అలా ఉమ్మడి కుటుంబం నాకు అలవాటే. దాంతో ఇబ్బందిగా అనిపించలేదు. అరవింద్: తనకి మనుషులంటే ఇష్టం. చిరంజీవిగారు, సురేఖగారి పెళ్లి మీ చేతుల మీద జరిగిందనుకోవచ్చా? అరవింద్: అవును... దగ్గరుండి తనే బాధ్యతగా చేసింది. స్క్రీన్‌పై మీ మావయ్య (అల్లు రామలింగయ్య) గారు కనిపిస్తే చాలు నవ్వులే నవ్వులు. నటుడిగా అంత జోవియల్‌గా కనిపించిన ఆయన మీతో ఎలా ఉండేవారు? అరవింద్: ఈవిడకి ఆయన వెరీ గుడ్ ఫ్రెండ్. నిర్మల: అవును. మావయ్యగారు వెరీ ఫ్రెండ్లీ. అరవింద్: ఆయనకు భోజనం పెట్టడం అన్నీ చేసేది. వయసు పైబడిన తర్వాత నాన్నకు ఆరోగ్యం సహకరించకపోతే భోజనం తినిపించేది. మామాకోడలు అంత బాగుండేవాళ్లు. నిర్మల: నన్ను కూతుళ్లతో సమానంగా చూశారు. ఎప్పుడూ నన్ను పేరుతో పిలవలేదు. ‘అమ్మాయి’ అనే పిలిచేవారు. ఆయన షూటింగ్ నుంచి ఇంటికొచ్చాక వీళ్లెవరూ దొరికేవారు కాదు. దాంతో ఏదైనా చెప్పాలనుకుంటే నాతోనే షేర్ చేసుకునేవారు. అరవింద్: నాపై చాడీలు కూడా చెప్పేవారు. ‘ఆ వెధవ...’ అంటూ నన్ను తిట్టేవారు. మా కాపురంలో పుల్లలు పెట్టేవారు కూడా (నవ్వులు). నిర్మల: అవును.. ‘చూడమ్మాయి.. వాడు లేట్‌గా వస్తున్నాడంటే పని ఉందని కాదు.. నువ్వు జాగ్రత్తగా ఉండాలి’ అనేవారు. అరవింద్: ఎలా చెప్పేవారంటే.. ‘అమ్మాయి.. వాడు పది తర్వాత ఇంటికి వచ్చాడు. అంత పనేం లేదు. ఓ కంట కనిపెట్టు’ అనేవారు. అవి విన్నప్పుడు మీకు భయం అనిపించేదా? నిర్మల: అలా ఏం లేదు. మావయ్యగారు అలా అన్నారని ఆయనతో చెప్పేదాన్ని. ఇద్దరం నవ్వుకునేవాళ్లం. అరవింద్: నాన్నతో ఫ్రెండ్లీగా ఉండడంతో పాటు చాలా గౌరవం కూడా ఇచ్చేది. అంతెందుకు? ఇప్పటికీ మా అమ్మ అలా హాల్లోకి వస్తే టక్కున లేచి నిలబడుతుంది. నిర్మల: ఆ రోజుల్లో అత్తగారు అంటే.. అలానే గౌరవించేవాళ్లు. ఆరోగ్యం సహకరించినంత వరకూ అత్తయ్యగారే అన్నీ చూసుకున్నారు. వంట చేసేటప్పుడు మాత్రం ఏం చేయాలని మాట్లాడుకుని చేసేవాళ్లం. నేను నాన్‌వెజ్ పెద్దగా తిననని నా కోసం వేరే చేసేవారు. నాకు వేడిగా తినడం అలవాటు. అందుకని అందరి కోసం వెయిట్ చేయకుండా తినమనేవారు. దాంతో నాకు అమ్మ ఇంటికి, అత్తింటికి తేడా తెలియలేదు. అత్తగారిని చూడగానే లేచి నిలబడే జనరేషన్ నుంచి వచ్చారు. మారిన కాలంలో ఇప్పటి కోడళ్లు అలా చేయకపోవచ్చు. ఈ మార్పు? నిర్మల: ఆ రోజుల్లో అలా ఒక అలవాటు ఉండేది. అత్తయ్యగారు అని కాదు. అప్పట్లో పెద్దవాళ్లు ఎవరు వచ్చినా లేచి నిలబడటం అనేది ఒక పద్ధతి. అప్పట్లో ఆడవాళ్లు పెద్దగా బయటకు వెళ్లడం ఉండేది కాదు. ఇప్పుడు ఆడవాళ్లు బయటకు వెళుతున్నారు. నిరూపించుకుంటున్నారు. ఇప్పటి కోడళ్ల అలవాట్లు ఇప్పటి కాలానికి కరెక్ట్. అరవింద్: మీకో విషయం చెప్పనా.. మా ఆవిడని ‘ఉత్తమ అత్తగారు’ అని మా కోడళ్లే చెబుతారు. అందుకే ఇంకా ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నాం. అత్తాకోడళ్లు ఫ్రెండ్లీగా ఉంటారు. మా కోడళ్లు మా ఆవిడని ‘నో నాన్సెన్స్’ అత్తగారు అని అంటారు (నవ్వుతూ). ఉమ్మడి కుటుంబంలో గొడవలు లేకుండా ఉండాలంటే ఏదైనా టిప్స్? నిర్మల: నేను ఎంత వరకు ఉండాలో అంత వరకే ఉంటాను. కాలంతో పాటు మనం కూడా మారాలి. ఫలానా విషయం గురించి బన్నీకి చెప్పకపోయావా అమ్మా? అంటే బన్నీ గురించి మీకు తెలుసు కదా అత్తయ్యా అంటుంది. అరవింద్: వారి జీవితాలను ఓవర్‌ల్యాప్ చేయం. ఎవరి స్పేస్ వారికి ఇస్తాం. బాబీ, బన్నీ, శిరీష్.. ఈ ముగ్గురి మనవళ్లను చూసుకుని అల్లు రామలింగయ్యగారు మురిసిపోయిన విశేషాల గురించి? అరవింద్: పిల్లలతో బాగా ఆడుకునేవారు. మా పెద్దబ్బాయి బాబీ మీద ఒకసారి ఆయనకు ఎందుకో కోపం వచ్చింది. కర్ర తీసుకుని, వాడిని కొట్టడానికి ముందుకొస్తే, బాబీ పరిగెత్తాడు. కొంచెం పరిగెత్తాక ‘రేయ్.. ఆయాసం వస్తోంది. వచ్చి ఒక దెబ్బ తిని వెళ్లు’ అంటే, వాడు దగ్గరకొచ్చి ఒక్క దెబ్బ తిని వెళ్లాడు (నవ్వుతూ). అరవింద్‌గారు 45 ఏళ్ల వయసులో తన తండ్రితో చెంప దెబ్బ తిన్నారు. ఆ విషయాన్ని గతంలో ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనే చెప్పారు. ఆ చెంప దెబ్బ విషయం మీకు తెలుసా? అరవింద్: కారు ఫాస్ట్‌గా డ్రైవ్ చేసుకుంటూ, ఇంటికి రాగానే బ్రేక్ స్పీడ్‌గా వేశాను. నాన్నగారు విండ్ షీల్డ్‌కి కొట్టుకోబోయారు. ఆ కోపంతో నా చెంప మీద ఒక్కటిచ్చారు. మా ఆవిడ చూసేసిందేమోనని కంగారుపడ్డాను కానీ చూడలేదు. ఈ వయసులో కూడా నాన్నతో తన్నులు తిన్నాడనుకుంటుందేమోనని కంగారు. లోపలికెళ్లి నాన్న కొట్టిన విషయం చెప్పి, అమ్మ దగ్గర గొడవపడదామనుకున్నాను. కానీ అమ్మతో చెప్పేటప్పుడు తను వింటుందేమోనని మ్యాటర్‌ని సైలెంట్ చేసేశాను. కట్ చేస్తే.. బెడ్రూమ్లోకి వెళ్లగానే ఎందుకండీ మావయ్యగారు అలా కొట్టారు అంది. అబ్బా... తెలిసిపోయిందనుకున్నాను. తను వరండాలో నిలబడి చూసిందట. నాన్న నన్ను అలా కొట్టగానే భయపడి లోపలికి పారిపోయింది. పిల్లల పెంపకం బాధ్యతను ఇద్దరూ సమానంగా తీసుకున్నారా? అరవింద్: నేను బాధ్యత తీసుకోలేదు. ఆ అవసరం రాకపోవడం నా అదృష్టమనే చెప్పాలి. 1973లో ఇండస్ట్రీకి వచ్చినప్పటినుంచి ఈరోజు వరకూ బిజీగా ఉన్నాను. పిల్లల విషయాలను మా అమ్మ, నా పెద్ద చెల్లి వసంత, ఈవిడ.. ఈ ముగ్గురూ చూసుకున్నారు. మా చెల్లి కొన్నాళ్లు మాతోనే ఉంది. ఆవిడకి మేనల్లుళ్లు అంటే చాలా ప్రేమ. ఇప్పటికీ బాబీ, బన్నీ, శిరీష్ మా మీద కోపం వస్తే వాళ్ల మేనత్తకి కంప్లైంట్ చేస్తారు. బన్నీ (అల్లు అర్జున్)ని హీరోని చేయాలని ఎవరు అనుకున్నారు? నిర్మల: మా పెళ్లయిన నాలుగైదేళ్లకు చిరంజీవిగారితో సురేఖగారి పెళ్లి జరిగింది. ఆ తర్వాత చిరంజీవిగారి ఫంక్షన్స్ అవీ చూసి, బన్నీ హీరో అయితే బాగుంటుందనుకునేదాన్ని. ఇలాంటి ఫంక్షన్స్ జరుగుతాయి.. స్టేజ్ మీద బన్నీని చూసుకోవచ్చు అనే ఇమాజినేషన్ ఉండేది. కానీ ఎడ్యుకేషన్ పూర్తి చేసి, మెచ్యుర్టీ వచ్చాక ఇండస్ట్రీలోకి వెళితే బాగుంటుందనుకునేదాన్ని. అయితే తను ఇష్టపడితేనే.. నా అభిప్రాయాన్ని పాటించాలనుకునేదాన్ని కాదు. మీక్కూడా బన్నీని హీరోగా చూడాలని ఉండేదా? ఫస్ట్ సినిమా ‘గంగోత్రి’తో పోల్చితే ఆ తర్వాతి సినిమాల్లో బన్నీ మేకోవర్ సూపర్.. అలా మార్చుకున్న తీరు గురించి? అరవింద్: బన్నీకి పట్టుదల ఎక్కువ. అనుకుంటే సాధిస్తాడు. యానిమేషన్ స్కూల్లో అడ్మిషన్ కావాలి. రోజుకు పది నుంచి 12 గంటలు ప్రాక్టీస్ చేస్తే కానీ అక్కడ పాస్ అవుతారు. ఓ మూడు నెలలు ప్రతి రోజూ 12 గంటలు సాధన చేశాడు. అక్కడ అడ్మిషన్ వచ్చింది. బన్నీ మంచి యానిమేటర్. అయితే సీట్ వచ్చాక ‘గంగోత్రి’కి చాన్స్ వచ్చింది. ‘ఒక సెమిస్టర్ మానేయ్.. ‘గంగోత్రి’ క్లిక్ అయితే చూద్దాం’ అన్నాను. ‘గంగోత్రి’ తర్వాత ‘ఆర్య’ చేశాడు. ప్రూవ్ చేసుకున్నాడు. దాంతో హీరోగా కంటిన్యూ అయ్యాడు. అరవింద్‌గారికి ఇంటిని పట్టించుకునే తీరిక లేదు కాబట్టి ఈ విషయంలో మీ ఇద్దరి మధ్య వాదనలు జరిగేవా? నిర్మల: అలా ఏం లేదు. ఇల్లు బాగుండాలంటే నేనన్నా వర్క్ చేయాలి లేదా ఆయన అయినా వర్క్ చేయాలి. కుటుంబంలో అందరూ ఆనందంగా ఉండాలంటే ఆయన నాతోనే ఉండాలి అనుకుంటే కుదరదు. నేను ఈ జనరేషన్ వాళ్లకి అదే చెబుతాను. మనం అన్ని సౌకర్యాలు అనుభవించాలంటే జీవిత భాగస్వామికి తప్పనిసరిగా స్పేస్ ఇవ్వాలి. ఇప్పుడు అరవింద్గారినే తీసుకోండి.. ఆయన ఏ పనీ చెయ్యకుండా నాతోనే ఉండాలి అనుకుంటే గీతా ఆర్ట్స్‌లాంటి పెద్ద సంస్థను ఎలా మేనేజ్ చేస్తారు? మా పిల్లలకు అన్నీ సమకూర్చాలంటే ఆయన స్పేస్ ఆయనకు ఇవ్వాల్సిందే. అలా కాకుండా బాగా పని మీద ఉన్నప్పుడు ‘ఇంటికి రండి’ అని నేను సతాయించకూడదు. అలా ఇంట్లోవాళ్లు సతాయిస్తే.. ‘అయ్యో ఇంటికి వెళ్లాలా’ అని ఆలోచిస్తారు. ఆ ఆలోచన రాకుండా మేనేజ్ చేయటంలోనే నేను ఆయనకు స్పేస్ ఇచ్చినట్లు. తప్పనిసరిగా ఆయనకు ఆ క్రియేటివ్ స్పేస్ నేను ఇస్తాను. ఫైనల్లీ.. వైవాహిక జీవితం సాఫీగా సాగిపోవాలంటే ఏం చేయాలి? అరవింద్: భార్యాభర్తల మధ్య నమ్మకం ముఖ్యం. మా పెళ్లైన ఈ 45 సంవత్సరాల్లో ఇంత పెద్ద గ్లామర్ ఇండస్ట్రీలో నేను ఉన్నప్పటికీ ఏనాడూ తను నన్ను అనుమానించలేదు. అదే మా పెద్ద సక్సెస్. అసలు మనస్పర్థలను రోజుల తరబడి సాగనివ్వకూడదు. ఏదైనా సరే ఇద్దరూ కూర్చుని, మాట్లాడుకోవాలి. నిర్మల: మళ్లీ చెబుతున్నాను. పార్టనర్‌కి స్పేస్ ఇవ్వండి. మా ఇద్దరి విషయంలో మొదట్లోనే ఓ అగ్రిమెంట్ ఉంది. అదేంటంటే ‘క్యారెక్టర్ ఈజ్ యువర్సెల్ఫ్’. అంటే.. నువ్వేంటో అదే నీ క్యారెక్టర్ అని. ఆ క్యారెక్టర్ మీరు ఎలా చేసుకుంటారో అది మీ ఇష్టం. అందుకని ఇలా ఉండాలి.. అలా ఉండాలి అని మేం ఒకరికొకరు చెప్పుకోం. మన క్యారెక్టర్ ఎలా ఉంటే బాగుంటుందో అలా ఉంటాం. మా జీవితం హ్యాపీగా గడిచిపోవడానికి మెయిన్ రీజన్ ఇదే. భార్యాభర్తలు కష్ట సుఖాలను సమానంగా పంచుకుంటూ ముందుకెళ్లడం మంచి వైవాహిక జీవితానికి నిదర్శనం. మీ జీవితంలో జరిగిన ఓ విషాద ఘటన (కుమారుడు చనిపోవడం) తాలూకు బాధను ఎలా అధిగమించారు? అరవింద్: ఫ్యామిలీ సపోర్ట్ ముఖ్యం అండీ. నిర్మల కూడా చాలా ధైర్యం ఉన్న మనిషి. మా మూడో అబ్బాయి శిరీష్ పుట్టడం వెనకాల ఒక కారణం ఉంది. బన్నీ తర్వాత పుట్టిన అబ్బాయి చనిపోయాడు. ఆ బాబుకి ఐదేళ్లు. మాకు ఊహించని షాక్. ముగ్గురు బాబులు ఉన్నారు కదా, ఇక పిల్లలు వద్దనుకుని ఆపరేషన్ చేయించుకుంది. కానీ మూడో బాబు చనిపోయాక.. మళ్లీ తన కడుపున ఆ బాబు పుడతాడని, ‘రీకేనలైజేషన్’ (మళ్లీ పిల్లలు పుట్టడానికి) చేయించుకోవాలనుకుంది. 30ఏళ్ల క్రితం వైద్యశాస్త్రం ఇంత అభివృద్ధి చెందలేదు. అయినా తను ఆ నిర్ణయం తీసుకుంది. ‘మేజర్ ఆపరేషన్ సార్. మూడు గంటలు జరుగుతుంది. అయినా పిల్లలు పుట్టే చాన్స్ పది శాతమే’ అని డాక్టర్ అన్నారు. అప్పట్లో మూడు గంటల ఆపరేషన్ అంటే లైఫ్ రిస్క్ ఉంటుంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా.. వద్దని నిర్మలతో అన్నాం. గైనకాలజిస్ట్ కూడా ఇదే చెప్పారు. అయినా సరే నిర్మల ఒప్పుకోలేదు. ఆపరేషన్ చేయించుకుంది. కానీ, ఆ తర్వాత కొన్ని నెలల వరకూ గర్భం రాలేదు. దీంతో ఓ వైద్య పరీక్ష చేశాం. సారీ.. ఆపరేషన్ ఫెయిల్ అయ్యింది అన్నారు. ఈ విషయం ఆమెకు చెప్పడానికి సందేహించాం. కానీ తనకు తెలిసిపోయింది. అయితే ‘ఐ విల్ గెట్ బ్యాక్ మై సన్’ అంది నిర్మల. అన్నట్లుగానే.. ఆ తర్వాతి నెల తను ‘కన్సీవ్’ అయింది. అలా పుట్టిన బాబే శిరీష్. నిర్మల: ఆ బాబు చనిపోయాడు, నేను ఏడ్చినా, ఏం చేసినా రాడు. ఈ గ్యాప్‌ని ఎలా ఫిల్ చేసుకోవచ్చని ఆలోచించాను. అందుకే మొండిగా ఆపరేషన్ చేయించుకున్నాను. స్నేహాని పెళ్లి చేసుకుంటానని బన్నీ అన్నప్పుడు మీ ఇద్దరి రియాక్షన్? అరవింద్: అర్జున్ ఇంటర్‌క్యాస్ట్ మ్యారేజ్ విషయం మా ఇంట్లో అయిదు నిమిషాల్లోనే సెటిల్ అయ్యింది. ముందు స్నేహ విషయం బన్నీ తన అమ్మ దగ్గరే చెప్పాడు. నిర్మల: అర్జున్ వచ్చి స్నేహాని చేసుకుంటాను అంటే, నువ్వు చేసుకున్నా, మేం వేరే అమ్మాయిని చూసి చేసినా నువ్వు హ్యాపీగా ఉండాలి. మాకు ముఖ్యం అదే. నువ్వు హ్యాపీగా ఉంటే మేం హ్యాపీ అన్నాను. – డి.జి. భవాని -
ధైర్యం చేసి రాశా
‘‘టిపు చనిపోయి 220 ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికీ వార్తల్లో ఉంటున్నాడు. బ్రిటిషర్స్ మనల్ని వదిలి 72 ఏళ్లు అవుతున్నా.. క్రూర నియంతగా, ఇస్లాం మతోన్మాదిగా సుల్తాన్ మీద వాళ్లు వేసిన ముద్ర చెరిగిపోలేదు. ఈ వలస సామ్రాజ్యపు విధి విధానాలను సంస్కరించుకోవాల్సిన అవసరం ఎంతుందో.. వాళ్ల కోణంలోని మన చరిత్రను తిరగ రాసుకోవాల్సిన అవసరమూ అంతే ఉంది! అలాంటి ప్రయత్నమే ఈ ‘టిపు సుల్తాన్’ పుస్తకం’’ అని అంటున్నారు పుస్తక రచయిత్రి యార్లగడ్డ నిర్మల. ఆమె హైదరాబాద్ వాసి. హిస్టరీ డిపార్ట్మెంట్లో రీడర్‌గా పనిచేసి రిటైరయ్యారు. ‘టిపు సుల్తాన్’ రచన సందర్భంగా ఆమె గురించి ఆమె మాటల్లోనే.. ‘‘పుస్తకాలు చదవడం నా దిన చర్యలో భాగం.. చిన్నప్పటి నుంచి. మా నాన్న (జయ రావు) నేర్పిన అలవాటు. ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి. అమ్మ (మేరీ) టీచర్. వాళ్లిద్దరూ ఎడ్యుకేటెడ్స్, ఉద్యోగస్తులవడం వల్ల మా ఇద్దరినీ (అక్క, నేను) బాగా చదివించారు. ఆడపిల్లలకు అంత చదువెందుకని ఏ రోజూ అనుకోలేదు. తెలుగు మీడియంలో చదివించి విడిగా ఇంగ్లిష్ నేర్పించారు.. సాహిత్యం ద్వారా. ఇంగ్లిష్ లిటరేచర్‌లోని పెద్ద పెద్ద రైటర్స్ అంతా మా చిన్నప్పుడే మాకు పరిచయం అయ్యారు. అంతేకాదు హాలీవుడ్ క్లాసిక్స్ అన్నీ చూపించారు మాకు. ఇంగ్లిష్ భాష ఇంప్రూవ్‌మెంట్‌కు అదెంతో హెల్ప్ అయింది. ఇంకో రకంగా కూడా మేం అదృష్టవంతులమని చెప్పాలి. మా ఇష్టాయిష్టాల మీద మా అమ్మానాన్న ఏనాడూ పెత్తనం చెలాయించలేదు. ఇంటర్లో నాకు మంచి పర్సెంటేజ్ వచ్చింది. అప్పట్లో మెడిసిన్, ఇంజనీరింగ్‌లకు ఇప్పట్లా ఎంట్రన్స్ లేదు. మంచి పర్సెంటేజ్ ఉంటే చాలు సీట్ వచ్చేది. అట్లా నాకు ఇంటర్లో వచ్చిన మార్క్స్‌తో ఈజీగా మెడిసిన్‌లో సీట్ వచ్చేది. మా బంధువులంతా కూడా మా పేరెంట్స్ మీద ప్రెషర్ పెట్టారు నన్ను మెడిసిన్ చదివించమని. కాని నాన్న నన్ను ఫోర్స్ చేయలేదు. డిగ్రీలో బీఏ ఇంగ్లిష్ లిటరేచర్ తీసుకున్నా. ఎమ్మేలో హిస్టరీ తీసుకున్నా. ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యా. అప్పుడే గ్రూప్ వన్ కూడా రాశా. 23 ఏళ్లకే గ్రూప్ వన్ ఆఫీసర్ అయ్యా. కాని ఆ ఉద్యోగం అంత గొప్పగా అనిపించలేదు.అప్పటికే ఎంఫిల్ కూడా రాసి ఉన్నా. దాంతో గ్రూప్ వన్‌కి గుడ్‌బై చెప్పా. అప్పుడు మాత్రం పేరెంట్స్ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. ఎంఫిల్ కూడా ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యా. పీహెచ్డీ చేశా.. విజయనగర సామ్రాజ్యంలోని గుడుల మీద. ఆ థీసిస్‌ని పబ్లిష్ కూడా చేశా యూజీసీ గ్రాంట్స్‌తో. అమెరికా, యూరప్ కంట్రీస్లోని స్కాలర్స్ అందరూ నా థీసిస్‌ను రిఫరెన్స్‌గా తీసుకుంటూంటారు. యూజీసీ ఫెలో, ఏపీపీఎస్సీ క్యాండిడేట్ని. నన్ను గైడ్ చేసి, ఈ స్థాయిలో నిలబెట్టిన గైడ్.. ప్రొఫెసర్ పీసపాటి శ్రీరామ్ శర్మగారు. టిపు సుల్తాన్.. నిజాలు..! తెలుగు, ఇంగ్లిష్ సాహిత్యంతోపాటు చరిత్ర అన్నా చాలా ఇష్టం నాకు. చదువు థియరీ అయితే.. దానికి ప్రాక్టికల్స్ పర్యటన అని బలంగా నమ్మడమే కాదు ఆచరిస్తాను కూడా. అందుకే నా సేవింగ్స్ అన్నిటినీ పర్యటనకు వెచ్చించాను. సోలో ట్రావెలింగ్‌నే ఇష్టపడ్తా. పందొమ్మిదో శతాబ్దపు ఇంగ్లిష్ సాహిత్యాన్ని ప్రాక్టికల్‌గా ఎక్స్పీరియన్స్ చేసేందుకు యూరప్ వెళ్లాను. చరిత్రను అర్థం చేసుకోవడానికి ఆఫ్రికా దేశాలు తిరిగాను. చిత్రంగా అక్కడి ప్రతి మూల.. ప్రతి ప్రదేశంతో నాకు ఇదివరకే పరిచయం ఉన్నట్టనిపించింది. అదే సాహిత్యానికున్న గొప్పదనం. ప్రాంతాలనే కాదు మనం లేని కాలమాన పరిస్థితుల్లోకి మనల్ని తీసుకెళ్లి వాటితో మనల్ని మమేకం చేస్తుంది. అట్లాగే నేను చూసిన హాలీవుడ్ క్లాసిక్స్‌లోని ప్లేసెస్‌నీ చుట్టొచ్చాను. ‘ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లెస్’ అని బెర్నాడ్ షా సెలవిచ్చాడు కాని నేనైతే ‘నాలెడ్జ్ ఈజ్ హ్యాపీనెస్’ అనుకుంటాను. ఇదే సూత్రాన్ని నేను పనిచేసిన నాంపల్లి (హైదరాబాద్)లోని ఇందిరా ప్రియదర్శిని గవర్నమెంట్ డిగ్రీ మహిళా కాలేజ్ స్టూడెంట్స్ విషయంలోనూ అప్లయ్ చేశాను. నా పర్సనల్ ఇంటరెస్ట్‌తో యేడాదికి ఒకసారి ఆ పిల్లల్నీ స్టడీ టూర్‌కి తీసుకెళ్లేదాన్ని. అలా చరిత్ర చదివితే, ప్రపంచం చుడితే వచ్చిన జ్ఞానమే ఈరోజు టిపు సుల్తాన్ గురించి రాయడానికి తోడ్పడింది.టిపు సుల్తాన్ గురించి చాలా చదివాను. మరింతగా అర్థం చేసుకోవడానికి అనేకసార్లు మైసూర్ కూడా వెళ్లొచ్చాను. ఆ అనుభవం.. టిపు మీద వచ్చిన ఇంకా అనేక పుస్తకాలు.. ప్రపంచ ప్రసిద్ధి చెందిన చరిత్రకారులు ఆయన గురించి పలు సందర్భాల్లో ఇచ్చిన రిఫరెన్స్‌లు.. థీసిస్ మొదలైనవాటినన్నీ అధ్యయనం చేసి... విశ్లేషించి.. రెండేళ్లు శ్రమించి రాశాను. నాకు తెలుసు ఇప్పటి పరిస్థితుల్లో అది కాంట్రవర్షియల్ అని. కాని నిజం తెలియాలి కదా. అందుకే ధైర్యం చేశా. దానిమీద వచ్చే ఏ చర్చకైనా ఆధారాలతో రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాను కూడా. నిజానికి మన చరిత్రను కూలంకుషంగా చదివి.. నిశితంగా పరిశీలిస్తే.. ఈ నేలను ఏలిన ముస్లిం రాజులు తమ రాజ్య విస్తరణ కాంక్షనే బయటపెట్టుకున్నారు తప్ప సామాన్య ప్రజల విశ్వాసాలు, జీవన విధానాల జోలికి పోలేదు. పద్దెనిమిదో శతాబ్దంలో ఎందరో రాజులు పాలించారు. కాని టిపునే ఎందుకు వివాదాస్పదుడయ్యాడు? ఆ వివాదాల చారిత్రక నేపథ్యం ఏమిటి? మొదలైన అంశాల విశ్లేషణే నేను రాసిన ‘టిపు సుల్తాన్’. చిన్న మాట కాలం తెచ్చిన మార్పులను ఆహ్వానించాల్సిందే. అయితే విపరీతాలను నిలువరించాలంటే పాత టెక్నిక్స్‌ను ఉపయోగించాలి. ఆ పాత పద్ధతే పుస్తక పఠనం. ఇప్పుడు అవసరం. రీడింగ్ హాబీ సామాజిక స్పృహను కలిగిస్తుంది. భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవడం నేర్పిస్తుంది. ఇప్పుడు మన చదువులో సోషల్ సైన్సెస్ చోటు లేకుండా పోయింది కాబట్టి పుస్తక పఠనం కంపల్సరీ. అలాగే ఆడపిల్లలకు ఒక మాట. ధైర్యంగా ఉండాలి. సమస్యలుంటాయి. ఎదుర్కొనే స్థయిర్యాన్ని అలవర్చుకోవాలి. దీనికి చదువును మించిన ఆయుధం లేదు’’ అని చెప్తారు రైటర్, హిస్టారియన్ యార్లగడ్డ నిర్మల. – సరస్వతి రమ ఫొటో: మోహనాచారి ►నిర్మల అనేక కథలు, అనువాద కథలు రాశారు. ఇవన్నీ ప్రముఖ దినపత్రికలు, మ్యాగజైన్లలో ప్రచురితమయ్యాయి. ప్రముఖ రచయిత డాక్టర్ విజయభారతితో కలిసి అంబేడ్కర్ పుస్తకానికీ పనిచేశారు నిర్మల. ఆమె రాసిన తాజా పుస్తకం ‘టిపు సుల్తాన్’ను హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణ. -
చనిపోతాడని గెంటేసిన అద్దింటి యజమాని
ఒక కాకి చనిపోతే.. వంద కాకులు చేరుతాయి.. అది జాతి ప్రీతి. అదే మనిషి చనిపోతే.. చేరదీయడం కాదు.. కనీసం ఇంట్లో కూడా ఉండనివ్వరు ఇది మా‘నవ’నీతి. ఇక్కడ ఓ నేత కార్మికుడు చనిపోలేదు.. పక్షవాతంతో మంచానపడి బాధపడుతున్నాడు. అతడు చనిపోతే.. అశుభంగా భావించి.. ఇంట్లోంచి వెళ్లగొట్టారు ఓ ఇంటి యజమాని. ఇంకో ఇంట్లోకి వెళ్లడానికి బయానా ఇచ్చినా.. విషయం తెలిసి వారు కూడా నిరాకరించారు. మలిసంధ్యలో కాపాడాల్సిన కొడుకు కూడా తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు. దీంతో ఓ అద్దెబతుకు బస్టాండుపాలైంది. ఈ అమానవీయ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. సిరిసిల్లటౌన్: జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం కట్టలింగంపేటకు చెందిన చెన్న ఆనందం బతుకు దెరువు కోసం పదిహేనేళ్ల క్రితం సిరిసిల్ల పట్టణానికి వచ్చాడు. ఇక్కడ సాంచాలు నడిపిస్తూ భార్య నిర్మల, కొడుకు రాజు, ఇద్దరు కూతుళ్లను సాకాడు. ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్లు చేయడానికి నిర్మల బీడీలు చుడుతూ భర్త సంపాదనకు తోడుగా నిలిచింది. రెండో కూతురు లతను భర్త గొడవపడి పుట్టింటికి పంపించగా.. తల్లిదండ్రుల వద్దే ఆరేళ్ల బాబు గణేష్‌తో ఉంటోంది. వీరికి సొంతిల్లు లేకపోవడంతో పదిహేనేళ్లుగా అక్కడా.. ఇక్కడా అద్దె ఇళ్లలో ఉంటూ కాలం నెట్టుకొస్తున్నారు. ప్రస్తుతం బీవైనగర్ ప్రాంతంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. రెండేళ్ల క్రితం ఆనందంకు పక్షవాతం వచ్చి కాళ్లు చచ్చుబడి మంచానికి పరిమితమయ్యాడు. దీంతో అతడు చనిపోతే.. ఇంటికి అరిష్టంగా భావించిన అద్దింటి యజమాని ఇంట్లోంచి వెళ్లిపోవాలని చెప్పాడు. రెండ్రోజుల క్రితం అదే ప్రాంతంలో మరో ఇంట్లో ఉండటానికి ఆనందం కుటుంబసభ్యులు బయానా ఇచ్చారు. గురువారం రాత్రి ఇంటి యజమాని బలవంతంగా ఖాళీ చేయించగా.. బయానా ఇచ్చిన కొత్తింటికి వెళ్లారు. వారికి అక్కడా పరాభవమే ఎదురైంది. ఆ ఇంటి యజమాని కూడా ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో దిక్కుమొక్కులేని స్థితిలో ఆ నేతన్న కుటుంబం అర్ధరాత్రి పూట కొత్త బస్టాండుకు చేరి చెట్టుకింద తలదాచుకుంది. చెప్పలేని ఆవేదన.. కష్టజీవులైన ఆ కుటుంబం బతుకు బస్టాండు పాలు కావడంతో చెప్పలేని ఆవేదనతో రగిలిపోయారు. ప్రయోజకుడైన కొడుకు కూడా మలిసంధ్యలో ఉన్న తల్లిదండ్రులను వదిలి అత్తింటివారితో ఉండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచానికి పరిమితమైన ఆనందం, నిలువనీడ లేకుండా బస్టాండు వద్ద చెట్టుకింద ఉన్న విషయంపై స్థానికులు స్పందించి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. తమ కష్టాలను మీడియా ముందు కన్నీరు పెట్టుకుంటూ చెప్పిన వైనం అందరినీ కంటతడి పెట్టించింది. అభాగ్య బతుకును ఆదుకోవాలని పోస్టింగులు చేయడంతో మానవతావాదులు స్పందించి విషయాన్ని స్థానిక తహసీల్దార్‌కు సమాచారం ఇవ్వగా వెంటనే స్పందించారు. విద్యాశాఖ అ«ధికారులతో మాట్లాడి ఎమ్మార్సీ భవనంలో ఉండటానికి ఆశ్రయం ఇవ్వాలని సూచించడంతో అధికారులు వారిని అక్కడకు తరలించారు. చంద్రంపేటకు చెందిన వీరబోయిన చందు బాధితులకు రూ.2వేలు ఆర్థిక సాయం చేశాడు. -
డోపింగ్‌లో దొరికిన నిర్మల
న్యూఢిల్లీ: భారత మహిళా అథ్లెట్ నిర్మలా షెరాన్ డోపింగ్‌లో దొరికింది. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిర్వహించిన పరీక్షల్లో ఆమె నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలింది. దీంతో భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) నిర్మలపై వేటు వేసింది. జకార్తా ఆసియా క్రీడల్లో 400 మీటర్ల పరుగు పందెంలో పోటీపడిన ఆమె నాలుగో స్థానంలో నిలిచింది. ఈ డోపింగ్ వ్యవహారంపై ఏఎఫ్ఐ చీఫ్ అదిలె సుమరివాలా స్పందించారు. ‘ఆసియా క్రీడల కోసం ఏఎఫ్ఐ ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరాలకు నిర్మలా ఎప్పుడూ హాజరు కాలేదు. ఎక్కడ ఉందో అనే వివరాలను మాకెప్పుడు చెప్పలేదు. అందుకే రిలే ఈవెంట్లలో ఆమెను ఎంపిక చేయలేదు. డోపీగా తేలడంతో నాలుగేళ్ల పాటు నిషేధం విధిస్తున్నాం’ అని సుమరివాలా అన్నారు. -
ఎన్నికల బరిలో జగ్గారెడ్డి సతీమణి నిర్మల?
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కాంగ్రెస్ పార్టీకి చెందిన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి అరెస్టుతో నియోజకవర్గ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ముందస్తు ఎన్నికల దిశగా అన్ని రాజకీయ పక్షాలు సన్నద్ధమవుతున్న వేళ విదేశాలకు మహిళల అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డి అరెస్టు స్థానికంగా చర్చనీయాంశమైంది. శాసనసభ రద్దు నేపథ్యంలో టీఆర్ఎస్ ఇప్పటికే తమ అభ్యర్థిగా తాజా, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేరును ప్రకటించింది. ఈ నెల 15, 16 తేదీల్లో కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. తొలి జాబితాలోనే సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్‌రెడ్డి పేరును ప్రకటించడం దాదాపు ఖాయమైంది. ఈ తరుణంలో జగ్గారెడ్డి అరెస్టుతో సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థి ఎవరనే అంశంపై చర్చ జరుగుతోంది. జగ్గారెడ్డి బెయిలు, కేసులు తదితర అంశాలపై ఎప్పటిలోగా స్పష్టత వస్తుందనే అంశంపై కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు, ఆయన అనుచరులకు స్పష్టత లేకుండా పోయింది. కేసులు, కోర్టులు తదితర అంశాలు మరికొంత కాలం కొనసాగితే జగ్గారెడ్డి స్థానంలో ఆయన భార్య, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు నిర్మల పార్టీ అభ్యర్థిగా తెరమీదకు వస్తారనే ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా నిర్మల నియోజకవర్గంలో పర్యటిస్తూ, కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఒకవేళ నిర్మలను అభ్యర్థిగా ప్రకటిస్తే ఓటర్లను ఎంత మేర ప్రభావితం చేస్తారనే కోణంలోనూ పార్టీలోనూ, బయటా చర్చ జరుగుతోంది. మరోవైపు గురువారం రాత్రి సంగారెడ్డిలో నిర్వహించిన మైనారీటీల సమావేశంలో తన భర్త అరెస్టుపై నిర్మల చేసిన వ్యాఖ్యలు ఆమె రాజకీయ ఆగమనానికి సంకేతంగా కాంగ్రెస్ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. ఆరోపణల పర్వం.. విదేశాలకు మహిళలకు అక్రమంగా రవాణా చేసిన కేసులో జగ్గారెడ్డిని సోమవారం అర్థరాత్రి హైదరాబాద్ నార్త్ జోన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. జగ్గారెడ్డి అరెస్టు తర్వాత ఆయన బాధితలం అంటూ ఒక్కొక్కరుగా బయటకి వచ్చి ఆయనపై ఫిర్యాదులు, ఆరోపణల పర్వానికి తెరలేపారు. ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో జగ్గారెడ్డి గీత కార్మికుల సొసైటీ నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేశారని కొందరు ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఆయన అనుచరుడిగా పనిచేసిన కాలంలో పార్టీ కార్యక్రమాల నిర్వహణకు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకుండా అప్పుల పాలు చేశారని సంగారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ గోవర్దన్ నాయక్ ఆరోపణలకు దిగారు. బుధవారం మరికొందరు కూడా జగ్గారెడ్డి తమను మోసం చేశారంటూ కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల్లో ఫిర్యాదులు అందజేశారు. స్వాతంత్య్ర సమరయోధులకు అమీన్పూర్లో భూ కేటాయింపుల్లో జగ్గారెడ్డి కీలకంగా వ్యవహరించారని, రూ.40 కోట్లతో సదరు భూములను కొనుగోలు చేసి నష్టపోయిన తమను ఆదుకోవాలని బాధితులు జాయింట్ కలెక్టర్‌కు విన్నవించారు. రామచంద్రాపురం మండలం ఈదుల నాగులపల్లి 135 సర్వే నంబరు 140 ఎకరాల భూమి విషయంలోనూ జగ్గారెడ్డి తమను మోసం చేసి, రూ.160 కోట్లకు విక్రయించారని మరికొందరు ప్రెస్‌మీట్ నిర్వహించారు. జగ్గారెడ్డి అరెస్టు అనంతరం బాధితులు రచ్చకెక్కుతుండడం స్థానికంగా చర్చనీయాంశమైంది. మరోవైపు జగ్గారెడ్డి విదేశాలకు మహిళలను అక్రమ రవాణా తెలిసి చేసిన తప్పుగా టీఆర్ఎస్ తాజా, మాజీ ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, చింతా ప్రభాకర్ ఆరోపిస్తున్నారు. -
‘కేసీఆర్, హరీశ్‌లను అరెస్ట్ చేయాలి’
హైదరాబాద్: నకిలీ పాస్‌పోర్టు కుంభకోణం కేసు లో కేసీఆర్, హరీశ్‌రావులను కూడా అరెస్టు చేయాలని మాజీ ఎమ్మె ల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (జగ్గారెడ్డి) సతీమణి నిర్మల డిమాండ్ చేశారు. ఈ కేసులో అసలు నిందితులైన కేసీఆర్, హరీశ్‌రావులను వదిలిపెట్టి తన భర్తను అక్రమంగా ఇరికించారన్నారు. చంచల్‌గూడ జైల్లో ఉన్న జగ్గారెడ్డిని బుధవారం ఆమె ములాఖత్‌లో కలసి వెళ్లారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అధికారులు సాధారణ ములాఖత్ ఇచ్చారని, జాలీ మధ్యలోంచి మాటలు స్పష్టంగా వినపడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగ్గారెడ్డి మచ్చలేని మనిషి అని కేసీఆర్ ఎలా ఎదిగారో ప్రజలందరికీ తెలుసన్నారు. జగ్గారెడ్డిని కలిసినవారిలో కుమారుడు భరత్‌సాయిరెడ్డి, కూతురు జయలక్ష్మీ ఉన్నారు. -
సన్నాఫ్ నిర్మల
ఎంతసేపూ నాన్న కొడుకులేనా?! ఇంటి పేరు నాన్నదే అయినా... కొట్టుకునే గుండె అమ్మదే కదా! నవమాసాలు మోసిందీ సద్గుణాల ఉగ్గు పట్టిందీ సంస్కారం రంగరించి పెంచిందీ అమ్మే కదా! వ్యవస్థలో విలువలు అడుగంటుతున్నప్పుడు స్త్రీలపై హింస అడవిలా అంటుకుంటున్నప్పుడు కూతుళ్లని జాగ్రత్తగా ఉండమని చెప్పడం కంటే.. కొడుకుల్ని బాధ్యతగా పెంచాలని ‘నిర్మల’అమ్మ అంటున్నారు. మదర్స్ డే సందర్భంగా మీ బన్నీ చిన్నప్పటి విశేషాలు షేర్ చేసుకుంటారా? నిర్మల: చిన్నప్పుడు చాలా కామ్‌గా ఉండేవాడు. టీచర్స్‌కు పెట్ స్టూడెంట్. అందరికీ చాలా ఇష్టం బన్నీ అంటే. నా చేతుల్లోనే ఎక్కువ తన్నులు తినేవాడు (నవ్వుతూ). దేని గురించో కాదు.. ఎగ్జామ్స్ అప్పుడు అయిపోయిన సబ్జెక్ట్ మళ్లీ ఫ్రెష్‌గా చెప్పేవాడు ఎగ్జామ్ ఉందని. అది తప్ప ఇంట్లో కానీ స్కూల్లో కానీ ఏ ఇబ్బంది పెట్టలేదు. అంటే.. స్కూల్ నుంచి కంప్లైంట్స్ వచ్చేవి కాదేమో? ఇంటి చుట్టుపక్కల పిల్లలతో ఆడుకున్నప్పుడు వాళ్ల నుంచి కానీ స్కూల్ నుంచి కానీ ఎలాంటి కంప్లైంట్స్ ఉండేవి కాదు. బన్నీ చాలా స్లోగా రాసేవాడు. అది టీచర్స్‌కు తెలుసు. అందుకే ఒక పీరియడ్ 45 మినిట్స్ అంటే.. వాడికి ఓ 15 మినిట్స్ ఎక్కువ ఇచ్చేవారు రాసుకోవడానికి. మీరు ఫాస్ట్ లెర్నర్ అని సినిమాల్లో మీ ఎనర్జీని చూస్తే అనిపిస్తుంది.. స్లో గ్రాస్పరా? బన్నీ: అవునండీ. చాలా స్లో లెర్నర్ని. వెంటనే గ్రాస్ప్ చేయలేను. మా తమ్ముడు శిరీష్ ఏదైనా ఇట్టే పట్టేస్తాడు. చాలా యంగ్ ఏజ్‌లో.. ఇంటర్నెట్ వస్తున్న కొత్తల్లోనే తను వెబ్సైట్ రన్ చేసేవాడు. అప్పుడు వాడికి 12 ఇయర్స్ అనుకుంటా. అప్పట్లో వాడికి ‘చైల్డ్ పెసిలిటే షన్’ కూడా చేశారు. బాక్సింగ్ అంటే రింగ్ లోపలా బయట, క్రికెట్ అంటే గ్రౌండ్ బయటా లోపల మొత్తం సబ్జెక్ట్ తెలుసుకుంటాడు. మీ బన్నీ స్టార్ అవుతారని మీరు అనుకున్నారా? నిర్మల: నిజం చెప్పాలంటే మా ముగ్గురి పిల్లల్లో బన్నీయే స్టార్ అవుతాడు అనిపించింది. చిప్పప్పుడు ఏ పార్టీ ఉన్నా మా ఇంట్లో అయినా చిరంజీవి గారింట్లో అయినా చాలా బాగా డ్యాన్స్ చేసేవాడు. ఫుల్ ఎనర్జీ ఉండేది. సినిమా కోసం రిస్కీ ఫైట్స్ అవీ చేయాలి కదా.. ఓ మదర్‌గా ఎప్పుడైనా భయమేసిందా? నిర్మల: నాకు పెళ్లి అయిన దగ్గరి నుంచి మా మామగారు (అల్లు రామలింగయ్య), మా ఆడపడుచు సురేఖ భర్త చిరంజీవిగారు అందరూ సినిమాలోనే ఉన్నారు. నాకు 18 ఏళ్లకే పెళ్లి అయిపోయింది. ఊహ తెలిసినప్పటి నుంచి సినిమా వాతావరణంలో పెరిగాను కాబట్టి అంత భయపడ్డ సందర్భాలు ఎక్కువగా ఏం లేవు. మీ పిల్లల సినిమాల రిలీజ్ టైంలో టెన్షన్ పడతారా? నిర్మల: మనుషులమే కదా. డెఫినెట్లీ ఉంటుంది. బన్నీ: యాక్టర్ కంటే ప్రొడ్యూసర్‌కి ఇంకా ఎక్కువ టెన్షన్ ఉంటుంది. ప్రొడ్యూసర్‌గా మా నాన్న సినిమాల రిలీజ్ టెన్షన్ చూసినప్పుడు హీరోగా కొడుకు సినిమా రిలీజ్ అంటే చిన్న విషయమే. బన్నీలో ఉన్న ప్లస్, మైనస్ పాయింట్స్? నిర్మల: ఓపిక ఎక్కువ. అది ప్లస్. మైనస్ అంటే మొండితనం, షార్ట్ టెంపర్. కొంతమంది కోపంతో ఏదైనా అంటే రెండు మూడు రోజులు మాట్లాడరు. కానీ మా ఇంట్లో 5 నిమిషాల్లో మళ్లీ మామూలు అయిపోతుంది. షార్ట్ టెంపర్‌తో ఏదైనా అన్నా వెంటనే ‘ఆ.. ఏదో అలా అన్నాలే. సారీ’ అనేస్తాడు. బన్నీ యాక్ట్ చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చినది? నిర్మల: వేదం’ చాలా ఇష్టం. బన్నీ: యాక్చువల్లీ ఫీచర్ ఫిల్మ్స్ కంటే నేను చేసిన షార్ట్ ఫిల్మ్ ‘ఐ యామ్ దట్ చేంజ్’ అమ్మకి చాలా ఇష్టం. అప్పుడు నాన్నతో ‘అమ్మకు బాగా నచ్చింది. నాకైతే ఆస్కార్ గెలిచినట్టు ఉంది’ అన్నాను. అమ్మకు ఫ్రెండ్స్, పూజలు, సినిమాలు ఇష్టం. పిల్లల కోసం పూజలు, ఉపవాసాలు లాంటివి ఏవైనా చేస్తారా? నిర్మల: చేయనండి. నా పిల్లలకు ఇది కావాలి, వాళ్లు ఇలా ఉండాలి అని పూజలు చేయను. ఎందుకంటే జరిగేది ఏదైనా జరుగుతుంది. మనం ఫేస్ చేయాలి అంతే. బన్నీ ఫస్ట్ మూవీ తేజ డైరెక్షన్లో చేయాల్సింది. అది క్యాన్సిల్ అయినప్పుడు నేను విజయవాడలో ఉన్నాను. అక్కణ్ణుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు నన్ను పికప్ చేసుకోవడానికి బన్నీ వచ్చాడు. ఇంటికి వచ్చే దారిలో ‘సినిమా క్యాన్సిల్ అయింది’ అన్నాడు. నేను ఎక్కువ షాక్ అవ్వలేదు. ఏది జరిగినా మంచికే అని ఫీల్ అవుతాను. తనని ఓదార్చలేదు. ఈ ఇన్సిడెంట్ నుంచి ఏదైనా నేర్చుకున్నాడు అనుకున్నాను. రిజెక్షన్లో ఉన్న పెయిన్ తనకి తెలియాలి. దాంతో ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టి ముందుకు వెళ్తాడని అనుకున్నాను. బన్నీ: అమ్మ బేసిక్‌గా దేనికీ సర్ప్రైజ్ అవ్వదు. అది గుడ్ అయినా బ్యాడ్ అయినా... సమానంగా తీసుకుంటుంది. బయట ఎవరో ఏదో మా గురించి రాస్తారు. మాట్లాడతారు. కామెంట్ చేస్తారు. వాటి గురించి ఇంట్లో పెద్దగా డిస్కస్ చేసుకుంటే బతకలేం. అమ్మ అస్సలు పట్టించుకోదు. జరిగేవి జరగనివ్వండి అన్నట్లు ఉంటుంది. ఎవరో మాట్లాడే మాటలకు మనం బాధపడిపోయి, డిస్కస్ చేసుకుంటే.. మన జీవితం వేరేవాళ్ల కంట్రోల్లో ఉన్నట్లే అనే ఫీల్ మాకు కలిగేలా చేసింది. మీ అమ్మగారు వండే వాటిలో మీకు ఇష్టమైనది ఏది? బన్నీ: కొన్ని సంవత్సరాలుగా వండటం లేదు. మా అమ్మ బాగా సోషల్ అయిపోయింది (నవ్వుతూ). కానీ అమ్మ వంట బాగా చేస్తుంది. చైనీస్ బాగా చేసేది. నూడుల్స్, మంచూరియా ఇవన్నీ బాగా చేస్తుంది. ఇండియన్ ఫుడ్ అంటే ఎవరైనా వండుతారు. ఇంతకు ముందు చైనీస్ తినాలంటే బయటకు వెళ్లి తినేవాళ్లం. అమ్మ చైనీస్, బేకింగ్.. ఇలా చాలా క్లాస్‌లకి వెళ్లి, అవన్నీ నేర్చుకుంది. ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే మాత్రం దగ్గరుండి అన్నీ చేయిస్తుంది. మీ అమ్మగారిది చాలా ఫార్వాడ్ థింకింగ్ అనిపిస్తోంది.. సో.. స్నేహాగారితో మీ లవ్ గురించి చెప్పడానికి పెద్దగా టెన్షన్ పడలేదేమో? ముందు ఎవరికి చెప్పారు? బన్నీ: ఇద్దరికీ కలిపి చెప్పాను. ‘స్నేహా అని నా ఫ్రెండ్. చాలా మంచి అమ్మాయి. రెడ్డీస్. మీకేమైనా అభ్యంతరమా?’ అన్నాను. ‘మేం చూసి చేసినా.. నీ అంతట నువ్వు సెలెక్ట్ చేసుకున్నా, నువ్వు హ్యాపీగా ఉండటమే ముఖ్యం. అభ్యంతరం లేదు’ అన్నారు. ఫస్ట్ నుంచి అమ్మ మోడ్రన్. నేను చాలా మంది దగ్గర చెబుతుంటా. మోడ్రన్ అంటే మోడ్రన్ బట్టలు వేసుకోవటం, ఇంగ్లీష్ మాట్లాడటం కాదు. అలోచనా విధానం చాలా ఫార్వాడ్గా ఉండాలని. మా మదర్ ఆ టైపే. అంటే.. ప్రొగ్రెసీవ్ థింకింగ్ ఈజ్ మోడ్రన్. నన్ను ఎవరైనా మోస్ట్ మోడ్రన్ పర్సన్ ఎవరూ అని అడిగితే మా అమ్మ పేరు చెబుతాను. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అని ఇబ్బందిగా అనిపించలేదా.. పైగా మీ జనరేష¯Œ కు కొంచెం పట్టింపులు ఎక్కువగా ఉంటాయేమో ? బన్నీ: నేను చెబుతానండి. ఇది జనరేషన్ మీద తోసేయకూడదు. మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. అంతకు ముందు జనరేషన్లో కూడా పట్టించుకోని వాళ్లు ఉన్నారు. ఇప్పటి జనరేషన్లో కూడా పట్టించుకుంటున్నవాళ్లు ఉన్నారు. నిర్మల: నాకు క్యాస్ట్ పెద్దగా పట్టింపు లేదు. మన కల్చర్ అయితే చాలనుకున్నాను. కోడలితో మేం మాట్లాడగలిగితే చాలు. బావుంటే కొన్ని రోజులు వాళ్లతో ఉంటాం. లేదంటే దూరంగా ఉంటాం. కానీ లైఫ్ లాంగ్ కలిసి ఉండాల్సింది వాళ్లు. అందుకే చాయిస్ వాళ్లు తీసుకుంటే మంచిదని నమ్మాను. ఇప్పటికీ మీ కొడుకు, కోడలు మీతోనే ఉంటున్నారు. ఉమ్మడి కుటుంబంలా ఉండాలన్నది మీ నిర్ణయమా? నిర్మల: లేదు. నేను ఏ విషయంలోనూ ఎవరినీ ప్రెషర్ పెట్టను. ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయాలనే మెంటాలిటీ నాది. నేను నా కోడలితో ఫ్రెండ్లీగా ఉంటాను. వాళ్ల స్పేస్ వాళ్లకు ఇచ్చేస్తాం. బన్నీ: నా పెళ్లయి ఆల్మోస్ట్ ఏడేళ్లు అవుతోంది. అమ్మకీ, స్నేహాకీ ఒక్క ఇష్యూలో కూడా డిఫరెన్స్ రాలేదు. గొడవపడలేదు. ఒకే ఇంట్లో ఉంటూ ఇలాంటి ఇష్యూలు ఏదీ రాలేదంటే ఆ క్రెడిట్ పూర్తిగా ఇద్దరికీ ఇవ్వాలి. అసలు ఎక్స్పెక్టేషన్స్ లేనప్పుడు ప్రాబ్లమ్స్ రావు. నా కొడుకు ఇలా ఉండాలి.. నా కోడలు ఇలా చేయాలి అని అనుకుంటే అప్పుడు ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. అది లేనప్పుడు డిజప్పాయింట్మెంట్ ఉండదు. మీ అమ్మగారిలో మీకు నచ్చే క్వాలిటీస్, నచ్చనివి? బన్నీ: చాలా ఉన్నాయి. ఇందాక అన్నట్టు చాలా మోడ్రన్‌గా ఆలోచించే తీరు. ఒక పెద్దింట్లో లేదా హై పొజిషన్లో ఉన్న లేడీకి కావల్సిన క్వాలిటీ ఏంటంటే న్యూట్రల్‌గా ఆలోచించటం. హైస్, లోస్ని ఒకేలా ట్రీట్ చేయగలగటం. మా నాన్నగారు 500 కోట్లు సంపాదించినా మా అమ్మ ప్రవర్తనలో 1% మార్చు కూడా ఉండదు. అలాంటి లైఫ్ లీడ్ చేయటం బెస్ట్ క్వాలిటీ. ఇంకోటి ఏంటంటే చాలామంది పేరెంట్స్‌కు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి.మేం పెద్దవాళ్లం అయ్యాక మావాడు ఇలా చూసుకోవాలని.. లేదా వేరే ఎక్సెపెక్టేషన్స్ ఉంటాయి. మా అమ్మ ఏదీ ఎక్స్పెక్ట్ చేయదు. అది వండర్ఫుల్ క్వాలిటీ. నచ్చని విషయం అనను కానీ మా అమ్మ చాలా సింపుల్‌గా ఉంటుంది. ‘నీ దగ్గర బాగానే డబ్బులున్నాయి కదా.. ఎందుకింత సింపుల్‌గా ఉంటావ్’ అంటుంటా. నేనొకసారి డైమండ్ జ్యువెలరీ కొనిస్తే పెట్టుకోలేదు. ‘ఒక అమ్మకు కొనిచ్చే పొజిషన్లో ఉండటం కొడుకుగా నా అదృష్టం. నువ్వు రిసీవింగ్ ఎండ్‌లో ఉన్నప్పుడు తీసుకోవాలి కదా’ అంటుంటాను. నిర్మల: నాకు ఎలా ఉంటుందంటే ఏదైనా ప్రకృతి విపత్తు జరిగినప్పుడు వాడు ఓ 20–30 లక్షలు డొనేట్ చేశాడని తెలిసినప్పుడు ఆ డైమండ్ నెక్లెస్ ఇచ్చినప్పుడు కంటే ఎక్కువ ఆనందం కలుగుతుంది. అప్పట్లో అరవింద్‌గారు ప్రొడ్యూసర్‌గా బిజీగా ఉండేవారు. మరి.. మీ ముగ్గురి పిల్లలు (వెంకటేశ్, శిరీష్, అర్జున్) పెంచడానికి హెల్ప్ చేసేవారా? నిర్మల: ఆడపిల్లలైతే కుదురుగా ఉంటారు. మగపిల్లలు కదా.. అస్సలు కుదురుగా ఉండేవారు కాదు. అరవింద్ గారు ఎంత బిజీగా ఉన్నా కూడా వీకెండ్స్‌లో మాత్రం వీళ్లను బయటకు తీసుకువెళ్లే వారు. ఒకళ్లు పబ్, ఒకళ్లు ఏదైనా మాల్.. ఇంకొరు ఇంకో చోట.. ఇలా పిల్లలు ఒక్కో చోట ఉండేవారు. మాల్ దగ్గర దిగబెట్టి, పికప్.. ఆ తర్వాత పబ్.. ఇలా డ్రాపింగ్, పికప్ చేసుకునేవారు. బన్నీ: నేను అందరి కంటే కొంచెం వీక్ కాబట్టి నాతో ఎక్కువ ఉండేవారు. పైగా టీనేజ్ ప్రాబ్లమ్స్ కూడా నాకే ఎక్కువ ఉండేవి (నవ్వుతూ). సో..నా మీద కొంచెం రిస్ట్రిక్షన్స్ ఎక్కువ. శనివారం అయితే బయటకు వెళ్లిపోయేవాణ్ణి. వెళ్లొద్దనేవారు కాదు కానీ సేఫ్‌గా ఇంటికి రమ్మనేవారు. జనరల్‌గా ఆడపిల్లలను జాగ్రత్తగా పెంచుతాం. ఇవాళ సమాజంలో అమ్మాయిలపై జరుగుతున్న దాడులు చూస్తుంటే.. మగపిల్లలను కూడా జాగ్రత్తగా పెంచాలనిపిస్తోంది. ముగ్గురు మగపిల్లల తల్లిగా మగపిల్లలు గల పేరెంట్స్ ఏదైనా చిన్న మెసేజ్? నిర్మల: విలువలు గురించి ఇంట్లోనే చెబితేనే తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్.. ఆ మధ్య అయాన్ (అల్లు అర్జున్ కొడుకు) ‘మా ఇంట్లో’ అన్నాడు. ‘అలా అనకూడదమ్మా.. మన ఇంట్లో’ అనాలి అన్నాను. రెండోసారి ‘మా ఇంట్లో’ అనబోయి, ‘మన ఇల్లు’ అని దిద్దుకున్నాడు. అలాగే చిన్నప్పుడు పిల్లలు తప్పు చేస్తే.. ‘నువ్వు గుడ్ బోయ్ కదా.. ఎందుకిలా చేశావ్’ అంటే.. పిల్లల మనసులో ‘మనం గుడ్ కదా.. బ్యాడ్ యాక్టివిటీస్ చేయకూడదు’ అనే మైండ్ సెట్ పెరుగుతుంది. ఇలా చెప్పకుండా జస్ట్ కోప్పడ్డామనుకోండి వాళ్ల మీద ఆ ఎఫెక్ట్ ఉండదు. మా అయాన్ సినిమాలు చూస్తాడు. వాడికి ‘బ్యాడ్ బాయ్స్ అంటే టీవీల్లో, సినిమాల్లో మాత్రమే ఉంటారు. బయట ఉండరు. వాళ్లు చేసేవి మనం చేయకూడదు’ అని చెబుతాం. ముగ్గురి పిల్లలకు చిన్నప్పుడు ఇలానే చెప్పేవాళ్లం. వాళ్లు చదువుకున్నది కో–ఎడ్యుకేషన్ స్కూల్స్‌లో. బాయ్స్‌తోనే కాదు గర్ల్స్‌తో కూడా ఫ్రెండ్లీగా ఉండేవాళ్లు. డిన్నర్ ఇవ్వాలంటే ఇంటికి తీసుకురమ్మనేవాళ్లం. బాయ్స్‌ని ఎలా ట్రీట్ చేసేవాళ్లమో గర్ల్స్‌ని కూడా అలానే. అబ్బాయా? అమ్మాయి? అని కాదు.. ఫ్రెండ్ ఈజ్ ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి వాళ్లకు ఇలాంటి ఇన్పుట్స్ ఇస్తూ ఉండాలి. ఏదైనా చేస్తున్నప్పుడు చెయ్యొద్దు అనకూడదు. అలా చేస్తే ఏం జరుగుతుందో చెప్పాలి. ఎందుకంటే.. మన ఇంటి నుంచి సమాజంలోకి ఒక మనిషిని పంపిస్తున్నాం. ఆ మనిషి ఎవరికీ నష్టం చేయకూడదు కదా. అలాగే మగపిల్లలు ఉన్న అమ్మలకు కొడుకులు ఆల్కహాల్‌కి అలవాటు పడిపోతారేమో? అనే భయం ఉంటుంది. మీకా టెన్షన్ ఉండేదా? వద్దని ఎప్పుడూ చెప్పలేదండి. ఎందుకంటే బేసిక్‌గా అరవింద్‌గారు సిస్టమేటిక్‌గా ఉంటారు. ఇప్పుడు జనరల్ యంగ్‌స్టర్స్ వర్క్‌ని వేరేగా ఆల్కహాల్‌ని వేరేగా ఉంచుతున్నారు. పెద్దవాళ్ల ముందు ఎలా పడితే అలా ఉండరు. ‘మా ఏజ్‌కి రెస్పెక్ట్ ఇవ్వండి’ అని ఏ పేరెంట్ అయినా కోరుకుంటారు. మా పిల్లలు మా ముందు స్మోక్ చేయడం, ఆల్కహాల్ పుచ్చుకోవడం వంటివి చేయరు. పిల్లల పిల్లలు ఉంటున్నారు. వాళ్లు పెరిగే వయసు. అందుకని ఇంట్లో పార్టీలు జరిగితే వాళ్ల కళ్లకి కనిపించేవాటినే ప్రొజెక్ట్ చేస్తాం. ఒకసారి అరవింద్‌గారు కొంచెం తాగిన గ్లాస్‌ని టేబుల్ మీద పెట్టి, మరచిపోయారు. అయాన్ వచ్చి ఇదేంటమ్మా ? అని అడిగితే.. అది తాతగారి జ్యూస్ నాన్నా అని చెప్పాను. అంతే కానీ ‘నీకెందుకు? నువ్వు చూడకూడదు’ అని చెబితే క్యూరియాసిటీ పెరుగుతుంది. చెడ్డ విషయాల గురించి తెలివిగా చెప్పడంవల్ల పిల్లలకు వాటి మీద క్యూరియాసిటీ పెరగదు. శిరీష్‌కి పెళ్లి చేసేస్తే మీ ముగ్గురు పిల్లలు లైఫ్‌లో సెటిలైనట్లే కదా? నిర్మల: లైఫ్‌లో సెటిల్మెంట్ అనేది ఉండదు. అరవింద్‌గారు నిర్మాత. ఆయన సినిమాలు తీస్తుండాలి. వెంకటేశ్ బిజినెస్ చూసుకుంటాడు. అది వాడు చేయాల్సిందే. బన్నీ, శిరీష్‌లు సినిమాలు చేయాల్సిందే. పెళ్లయితే సెటిలైనట్లు కాదు. లైఫ్ సైకిల్ని నడపాల్సిందే. ఎవరి లైఫ్ వారు లీడ్ చేయాలి. ఎవరి సొంతంగా వాళ్లు పరిగెత్తాలి. లైఫ్ అంటేనే పరుగు కదా. బన్నీ: ‘నువ్వు సెటిల్ అయ్యావు’ అనేది ఏమీ ఉండదు. ఒకవేళ ఈ క్వొశ్చన్ నన్ను అడిగినా నాదీ సేమ్ ఆన్సర్. సెటిల్ అవ్వలేదు అనుకుంటాను. పిల్లలపై నెగటీవ్ కామెంట్స్ విన్నప్పుడు ఫీల్ అవుతారా? నిర్మల: బయట వాళ్లు చెప్పినప్పుడు పెద్దగా తీసుకోను. హీరోయిన్‌తో ఇలా ఉంది? అని అంటే పట్టించుకోను. వాళ్లు ఏదో రాసుకుంటారులే అని వదిలేస్తుంటాను. కానీ వాళ్లు నిజంగా తప్పు చేశారని నాకు అనిపిస్తే చాలా స్ట్రగుల్ అవుతాను. నా మనసుకు ఆ ఫీలింగ్ వచ్చిందంటే నేను పడే బాధను మాటల్లో చెప్పలేను. అలా మిమ్మల్ని ఎప్పుడైనా ఇరుకుల్లో పడేసిన సందర్భాలు ఉన్నాయా? చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. అప్పుడు పిల్లలతో కూర్చుని మాట్లాడతారా? మాట్లాడను. నాకు కోపం వస్తే అస్సలు మాట్లాడను. దాన్ని బట్టి అర్థం చేసుకుంటారు. నిజమైన ఇష్యూలు జరిగినప్పుడు ఎవ్వరూ అరుచుకోరని నా అభిప్రాయం. చాలా సైలెన్స్ ఉంటుంది. అంతలా సైలెంట్ అయిపోయాం అంటే బాగా అప్సెట్లో ఉన్నాం అని అర్థం. అయితే నేను లైఫ్‌లో ‘హౌ’ (ఎలా) అనేది మాత్రమే నమ్ముతాను. ‘వై’ (ఎందుకు) అనేదానికి ఇంపార్టెన్స్ ఇవ్వను. పిల్లలు విషయం అనే కదా.. ఏదైనా జరగకూడనిది జరిగినప్పుడు.. ఎందుకిలా జరిగింది? అని మదనపడను. ఆ విషయాన్ని ఎలా డీల్ చేయాలని ఆలోచిస్తాను. ఎందుకంటే జరిగిందేదో జరిగిపోయింది. దాన్నుంచి ఎలా బయటపడాలన్నదే ముఖ్యం. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా చూశారా? బన్నీ యాక్టింగ్ సూపర్ అని ప్రశంసలు వస్తున్నాయి నిర్మల: నాకు పర్సనల్‌గా ఆర్మీ అంటే చాలా గౌరవం. చిన్నప్పుడు మా అబ్బాయిలు ఆర్మీలో ఉంటే బావుండు అనుకున్నాను. కుదరలేదు. ఇప్పుడు ఏదో రకంగా ఆర్మీతో కనెక్షన్ కుదిరినందుకు చాలా ఆనందంగా ఉంది. నేను పేపర్ బాగా ఫాలో అవుతున్నాను. ఆర్మీ వాళ్ల ప్రతీ ఆర్టికల్ చూస్తుంటాను. పాకిస్థాన్ వార్, చైనా వార్ అన్ని విషయాలు తెలుసుకున్నాను. ఫైనల్లీ.. నా పిల్లలు తప్పు చేయరు.. అనే భరోసా మీకు ఉందా? బన్నీ: ఈ ప్రశ్నకు అమ్మ కాదు.. నేను చెబుతాను. మా ముగ్గురి బ్రదర్స్ తరఫున నేను గ్యారెంటీ ఇస్తున్నాను. వాళ్ల పెంపకంలో తప్పు జరగదు. మా మదర్, మా ఫాదర్. ఇద్దరి ఐడియాలజీస్ బావుంటాయి. అవి మాకు ఎంతో కొంత వచ్చాయి. ఆ కల్చర్‌లోనే మేంపెరిగాం. ‘నా పిల్లలు తప్పు చేయరు’ అని ఇప్పుడు అమ్మ గ్యారెంటీ ఇచ్చిందంటే.. రేపు పొరపాటున ఏదైనా తప్పు జరిగితే, అవిడ బాధపడుతుంది. మేం తప్పు చేస్తామని కాదు. యాక్సిడెంటల్ మిస్టేక్స్ ఉంటాయి కదా.. వాటి గురించి చెబుతున్నా. నేనూ, మా అన్నయ్య, తమ్ముడు శిరీష్.. మేం ముగ్గురుం ఎప్పుడూ వాళ్లు ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ తీసుకురాం. ఫెయిల్యూర్స్ రావచ్చు. కానీ బ్లండర్స్ చేయం. ఆ రోజు అమ్మను పట్టుకుని ఏడ్చేశాను మీ అమ్మ గారి గురించి మీకు గుర్తున్న సంఘటన? ప్రతివారికీ అమ్మ గురించిన అనుభూతులు, జ్ఞాపకాలు బోలెడు ఉంటాయి. ఈ మదర్స్ డే సందర్భంగా మా అమ్మ గారి గురించి కొన్ని విషయాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మా అమ్మ పేరు కనకరత్నం. అమ్మకి నేను ఒక్కడినే కొడుకుని. నాకు చిన్నప్పటి నుండి కొంచెం శుభ్రం ఎక్కువ. స్నానానికి అందరికీ ఒక బకెట్ అవసరం అయితే నాకు మాత్రం రెండు బకెట్ల నీళ్లు కావాలి. నేను రోజులాగానే ఓ రోజు స్నానానికి వెళ్లాను. ఆ రోజు మా ఇంట్లో మోటర్ చెడిపోయింది. ఆ విషయం నాకు తెలియదు. నేను స్నానానికి వెళ్లటం చూసిన మా అమ్మ హడావిడిగా బావి దగ్గరకు వెళ్లి రెండు బకెట్ల నిండా నీళ్లు తోడి మేడ మీదకు మోసుకొచ్చింది. బాత్రూమ్లో కుళాయిలో నుంచి నీళ్లు రావట్లేదని నేను బయటికి వస్తుంటే, నీళ్లు తెస్తూ అమ్మ ఎదురు వచ్చింది. అది చూసి ‘ఏంటమ్మా ఇది’ అని అడిగాను. ‘ఈ రోజు మోటర్ పాడైపోయింది, నీకు స్నానానికి ఎక్కువ నీళ్లు కావాలి కదా! అందుకే బావిలో నుంచి నీళ్లు తోడి తీసుకొస్తున్నాను’ అని చెప్పింది. అమ్మ ప్రేమకు చలించిపోయాను. ఆ రోజు మా అమ్మని పట్టుకొని ఏడ్చేశాను. ఆ సంఘటన ఈ రోజుకీ నా మనసులో గుర్తుండిపోయింది. మీ అమ్మగారు మీకిచ్చిన బెస్ట్ గిఫ్ట్ ? ఒక గిఫ్టని చెప్పలేను, నా పుట్టినరోజు జనవరి 10. ప్రతి సంవత్సరం నాకు మా అమ్మ ఆ రోజుకి తప్పనిసరిగా ఒక వాచీ ఇస్తుంది. నేను ఇంత పెద్దవాడినైనా నాకు మనవళ్లు పుట్టినా కూడా ఆవిడకు నేను చిన్నపిల్లవాడినే. ఇప్పటికీ ఆవిడ నాకు ఇంకా వాచీ బహూకరిస్తూనే ఉంది. మీరు మీ అమ్మగారికి ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్? నేను మా అమ్మ ఇచ్చినట్టు ప్రతి సంవత్సరం ఇవ్వట్లేదు కానీ, ఒక గిఫ్ట్‌ను మాత్రం ఆమె ఎంజాయ్ చెయ్యటం నాకు ఇంకా గుర్తు. నా భార్య నిర్మల వాళ్లది విజయవాడ. మొదటి కాన్పు కోసం మా ఆవిడ పుట్టింటికి వెళ్లింది. మా పెద్దబ్బాయి అల్లు వెంకటేశ్ (అల్లు బాబి) అక్కడే పుట్టాడు. వాడిని చూడటానికి మా అమ్మ హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చింది. ఆ సమయంలో నా భార్య ఒడిలో నిద్రపోతున్న బాబుకి చక్కగా తువ్వాలు చుట్టబెట్టి అమ్మ చేతికి అందించాను. వాడిని చూడగానే ఆవిడకు పట్టరాని సంతోషం కలిగింది. వాడిని గుండెలకు హత్తుకుని ముద్దులాడింది. ‘చాలా సంతోషంగా ఉందిరా నాన్నా’ అని నన్ను ఆశీర్వదించింది. ఆ సమయంలో ఆవిడ కళ్లల్లో ఆనందబాష్పాలు నాకు ఇప్పటికీ ఇంకా గుర్తు. మనకు ఏ మంచి జరిగినా మొట్టమొదటగా సంతోషపడేది అమ్మేనని ఆ రోజు అనుభవపూర్వకంగా అర్థం చేసుకున్నాను. -
ఆస్కీ నూతన డీజీగా ప్రొఫెసర్ నిర్మల
హైదరాబాద్: అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఆస్కీ) నూతన డైరెక్టర్ జనరల్ (డీజీ)గా ప్రొఫెసర్ నిర్మల అఫ్సింగీకర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆస్కీ చైర్మన్ పద్మనాభయ్య ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆర్‌హెచ్.ఖ్వాజా రాజీనామా చేయటంతో ఆమెను నియమించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..సంస్థ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో భౌతిక శాస్త్రంలో ఎంటెక్ చేసిన నిర్మల, ఐఐఎం బెంగళూర్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. ఆమె సేవలకు గుర్తింపుగా పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు లభించాయి. -
పెళ్లికూతురి తల్లి ఎంతపని చేసింది..
సాక్షి, హైదరాబాద్ : ముహుర్త బలం గట్టిగా ఉంటేనే వివాహ బంధం కలకాలం నిలుస్తుందని నమ్మకం. అందుకే పెళ్లి ముహుర్తానికి అంత ప్రాధాన్యత ఇస్తారు. అయితే అనుకున్న ముహుర్తానికి తాళి కట్టలేదని పీటల మీద నుంచి కూతుర్ని తీసుకు వెళ్లిపోయింది ఓ తల్లి. ఈ సంఘటన పటాన్చెరు మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...ఇస్నాపూర్ కు చెందిన వెంకటేష్‌కు సింధూజ అనే యువతితో నిశ్చితార్ధం జరిగింది. మార్చి 14వ తేదీ 7 గంటల36 నిమిషాలకు పెళ్లి ముహుర్తం. ఇస్నాపూర్‌లోని పెళ్లికొడుకు నివాసంలో పెళ్లి కార్యక్రమం జరుగుతోంది. ముహుర్తానికి పెళ్లికొడుకు వెంకటేష్, పెళ్లి కూతురు సింధుజ కూడా పెళ్లిపీటలపై కూర్చొవడానికి సిద్దమయ్యారు. అంతే అక్కడ ప్రత్యక్షమైన పెళ్లికూతురు తల్లి నిర్మల ముహుర్తం దాటి పోయిందంటూ కూతుర్ని బలవంతంగా పీటలపై నుంచి లేపి, అక్కడ నుంచి తీసుకు వెళ్లిపోయింది. దీంతో చివరి నిమిషంలో పెళ్లి నిలిచిపోయింది. సినిమా ట్విస్ట్ ను తలపించేలా జరిగిన ఈ ఘటనతో పెళ్లికొడుకు బంధువులు షాక్ తిన్నారు. కాగా జిల్లాకు చెందిన పెళ్లిళ్ల పేరయ్య ఈ సంబంధం కుదిర్చినట్లు పెళ్లికొడుకు తరపు బంధువులు తెలిపారు. అయితే పెళ్లి కూతురు బీదరాలు కావడంతో పెళ్లి ఖర్చుల నిమిత్తం 50 వేల రూపాయలతో పాటు బంగారు ఉంగరాన్ని కూడా ఇచ్చామని చెబుతున్నారు. పెళ్లి కూతురు సింధూ, ఆమె తల్లి నిర్మల మాత్రమే పెళ్లికి వచ్చారన్నారు. చివరకు పెళ్లికొడుకు బంధువుల ఫిర్యాదు మేరకు పెళ్లి కూతురు తల్లి నిర్మలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
అనుకున్న ముహుర్తానికి తాళి కట్టలేదని..
-
చాక్లెట్ రేప్..ర్ర్
చాక్లెట్‌ని రంగుల కాగితంలో.. అదే.. రేపర్లో చుడతారు. ఆ రంగుల రేపర్లో ఒక దరిద్రుడు తన వాంఛను చుట్టి పిల్లల్ని ట్రాప్ చేస్తే... బాల్యాన్ని నలిపేస్తే.. ఒళ్లంతా పుండ్లు వచ్చేస్తాయి! జీవితంలో ఎప్పటికీ మానని గాయాలుగా అవి మిగిలిపోతాయి. ఆ రోజు భయం భయంగా ఇంట్లో అడుగుపెట్టానో లేదో.. ‘చిన్నదాన్ని చూసుకో’ అని చెప్పేసి – ఉరుకులు పరుగుల మీద పనికి పోయింది మా అమ్మ. ఐదు రూపాయల నోటు చేతిలో పెడితే.. మారు మాట్లాడకుండా కొంగున కట్టుకుంది. నా వైపు కన్నెత్తయినా చూడలేదు. ‘ఎవరిచ్చారు’ అని కూడా అడగలేదు. బండ చాకిరీ చేస్తుంది మా అమ్మ. మా నాన్న మమ్మల్ని వదిలేసి పోయినప్పట్నుంచీ తను బండరాయి మల్లే తయారైంది. ఒక్కోసారి కోపంతో ఊగిపోతూ నన్నూ నా ఇద్దరు చెల్లెళ్లన్నీ కొట్టేది. పెద్ద పెద్ద కేకలేసేది. మాకు నాలుగు మెతుకులు కతకడానికి నానా యాతన పడుతుండేది. తిండిబెట్టి, వంద రూపాయలు ఇస్తామంటే ఒక ఇంట్లో నన్ను పనికి పెట్టింది. ఆ ఇంటాయన నా ఒంటి మీద కన్నేశాడు. ఆ రోజు ఆయన నన్ను ఎక్కడెక్కడో ముట్టుకున్నాడు. అయోమయంగా అన్పించింది. అసలు ఏం చేస్తున్నాడో ఎందుకట్టా చేస్తున్నాడో తెలియక భయమైంది. చెప్పుకోలేని చోట్ల మంట. నొప్పి. ఇంటికి వెళ్లే ముందు ఆయన ఐదు రూపాయలిచ్చి ఎవ్వరికీ చెప్పొద్దన్నాడు. చెబితే మా అమ్మను పనిలో నుంచి తీయించేస్తానని బెదిరించాడు. మేముండే రేకుల షెడ్లో నుంచి బయటకు తోలిస్తానని భయపెట్టాడు. వీధి పంపులోంచి నీళ్లు తెచ్చి ఇంట్లో డ్రమ్ములు నింపడం నా పనే. కానీ ఆ రోజు ఆ పనే కాదు, ఏ పనీ చేయలేక మా అమ్మ చేతిలో దెబ్బలు తిన్నాను. కానీ నేనేం చేయను? లోపటి వాపులతో నడవడమే కష్టమైంది. ఒంట్లో ఓపిక లేనట్టు అనిపించింది. మర్నాడు పని మానేస్తానన్నా. అమ్మ తిట్టి రెండు తగిలించింది. ఇంట్లో బువ్వ లేదంది. పని చేసి నాలుగు మెతుకులు తిని రమ్మంది. కానీ ఆ ఇంటాయన సంగతి నేనెట్టా చెప్పేది? ఆయన మమ్మల్ని ఏమయినా చేస్తే? మా అమ్మని పనిలో నుంచి తీసేయిస్తే? – ఇలాంటి ఆలోచనలతో పనికి పోక తప్పింది కాదు.ఆ ఇంటాయన బయటకు పోయేవాడు కాదు. భార్యాభర్తలు గొడవ పడుతుండేవాళ్లు. భార్యా పిల్లలు బయటకు పోయాక నన్ను గదిలోకి లాక్కుపోయేవాడాయన. తను చెప్పినట్టు చేయకపోతే గదిమేవాడు. గిచ్చేవాడు. నా శరీరాన్ని నలిపేసేవాడు. ఒక్కోసారి జనం లేని చోట్లకి తీసుకుపోయి పాడుచేసేవాడు. కానీ కడుపు నిండా అన్నం పెట్టేవాడు. అప్పుడప్పుడూ తినడానికి ఏదైనా ఇచ్చేవాడు. డబ్బులు కూడా చేతిలో పెట్టేవాడు. నెలరోజుల తర్వాత – నన్నూ మా అమ్మనూ పోలీసులు స్టేషన్‌కి తీసుకుపోయారు. మా అమ్మ భయంతో ఒణికిపోయింది. ఆ ఇంటాయన గురించి చాలా ప్రశ్నలు వేశారు నన్ను. మా అమ్మను తిట్టారు. చిన్న పిల్లల్ని పనిలో పెట్టకూడదంట. చట్టం ఒప్పుకోదంట. మా అమ్మ తప్పు చేసిందంట. పోలీసులు ఇట్టా చెబుతుంటే మా అమ్మ కొంగుతో కళ్లు అద్దుకుంటూ కిక్కురుమనలేదు.ఆ రోజు నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు జరిపారు. ఇంటాయనపై కేసు పెట్టారు. ఆ ఇంటాయన నన్ను పాడు చేసినట్టు వాళ్ల ఆవిడే పోలీసులకు చెప్పిందంట. అంటే జరిగిందంతా ఆవిడకు తెలుసన్నమాట!ఆ రోజు మా అమ్మ బాగా ఏడ్చింది. తను అంతగా ఏడవడం ఎప్పుడూ చూడలేదు నేను. ఏడుస్తూనే ఇల్లొదిలి పోయిన మా నాన్నను చావు తిట్లు తిట్టింది. కసి తీరా కేకలేసింది. నన్ను ఓ ఎన్జీవోకి చెందిన హాస్టల్‌కి పంపారు. అక్కడ ఆరునెలలపాటు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఓ రోజు బడికి పంపిస్తామంటే వద్దని ఏడ్చి మొత్తుకున్నాను. మరి కొన్నాళ్లు కౌన్సెలింగ్ ఇచ్చి.. బడికి పోయేదానికి ఒప్పించారు.బళ్లో నాకెవ్వరూ దోస్తులుండేవాళ్లు కాదు. అసలు నేనెవ్వరితో మాట్లాడలేకపోయేదాన్ని. ఎవ్వరితో కలవలేక పోయేదాన్ని. ఏమీ చదవలేకపోయేదాన్ని. అందరూ అదోలా చూస్తుంటే భయంతో ముడుచుకుపోయేదాన్ని. చదువుపై ధ్యాస లేకపోవడంతో పదో తరగతి తప్పాను. దీంతో నాకు కంప్యూటర్ ట్రైనింగ్ ఇప్పించారు. ఇప్పుడు ఉద్యోగం చేసుకుంటున్నా.నా చెల్లెళ్లకి ఆసరా అవుతున్నా. నన్ను ఆగం చేసిన వాడికి శిక్ష పడింది. ఇప్పుడు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ పెళ్లి చేసుకోవాలనిపించడం లేదు. చేదు గుర్తుల బరువు మోయలేకపోతున్నాను. నన్ను నేను గౌరవించుకోలేకపోతున్నాను. ఒక్కోసారి నా మీద నాకే కోపమొస్తుంది.నా జీవితం ఎట్టా ఉండబోతుందో.. అనే ఆలోచన వచ్చినప్పుడు చాలా భయం పుడుతోంది. రక్షించుకునే శిక్షణ ఇవ్వాలి సాధారణంగా పిల్లల్ని లైంగికంగా లోబరచుకునేవాడు అందరి ముందూ వాళ్లను తిడుతుంటాడు. ఎవ్వరూ లేనప్పుడు ప్రేమ కరబరుస్తుంటాడు. చాక్లెట్లో ఇంకోటో పెట్టి లొంగదీసుకోవాలని చూస్తుంటాడు. ఎవ్వరికీ చెప్పొద్దని బెదిరిస్తుంటాడు. ఈ విషయాలపై పిల్లలకు అవగాహన కల్పించాలి. చూపులు – స్పర్శ – మాటలు – ప్రవర్తన వంటి వాటిల్లో్ల తేడాలను గమనించగలిగే శిక్షణ ఇవ్వాలి. ఏం జరిగినా / జరుగుతున్నా దాచిపెట్టవద్దని, మౌనంగా ఉండొద్దని చెప్పాలి. ఈ విషయాల్లో తల్లిదండ్రులకు శిక్షణ ఇవ్వడం చాలా అవసరం. తెలిసినవారి చేతుల్లోనే పిల్లలు అత్యాచారాలకు గురవుతున్న కేసులు భారీగా చోటు చేసుకుంటున్న నేపథ్యంలో – వారికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తల్లిదండ్రులకు వివరించాలి. ఇంట్లో అయినా, బయట అయినా వాళ్లని ఒంటరిగా వదిలిపెట్టరాదనే విషయాన్ని గుర్తింపచేయాలి. తమ మనోభావాల్ని, భయాల్ని స్వేచ్ఛగా వ్యక్తం చేయగల వాతావరణాన్ని ఇంట్లో నెలకొల్పాలి. పిల్లలపై జరిగిన లైంగిక దాడుల్ని ‘పరువు’ పేరిట ఏ ఒక్కరికీ చెప్పకుండా దాచిపెడదామనుకుంటే, బాధితులకు తగిన సపోర్ట్ ఇవ్వకుంటే మొదటికే మోసమొస్తుంది. బాధితురాలి జీవితమే ప్రమాదంలో పడుతుంది. ఈ కర్తవ్యాలు నిర్వహించాల్సింది ప్రధానంగా ప్రభుత్వాలే. పిల్లల భద్రతకు గ్యారెంటీ ఇవ్వాల్సింది ప్రభుత్వాలే. ప్రమాదాల్లో ఉన్న పిల్లలకోసం హెల్ప్లైన్లు ఏర్పాటు చేస్తే చాలదు. దానిపై తగిన ప్రచారం కూడా కల్పించాలి. తప్పు చేసిన వాళ్లకు శిక్షలు పడాలి. – సిస్టర్ లిస్సీ జోసెఫ్, ప్రెసిడెంట్, నేషనల్ వర్కర్స్ మూవ్మెంట్ సహాయాలన్నీ వెంటనే అందాలి నిర్మల లాంటి బాలికలు కుటుంబాల్లో, నివాస ప్రదేశాల్లో హింసను చూస్తూ పెరుగుతున్నారు. లైంగిక హింస సహా రకరకాల హింసలకు గురవుతున్నారు. అయితే దీన్ని హింస అంటారనీ, దీన్ని వ్యతిరేకించాలనీ వాళ్లకి తెలియదు. చూడటానికి వాళ్లు మామూలుగానే కనిపిస్తారు. మామూలుగానే మాట్లాడతారు. వాళ్లల్లో విచారం కనిపించదు. హింసాత్మక అనుభవాల గురించి వాళ్లు ఏమీ చెప్పుకోరు. మాట్లాడరు. వాళ్ల చుట్టూ ఉండే జనానికి వాటి గురించి వినే టైమ్ గానీ / ఆలోచించే తీరిక గానీ ఉండవు. ఇప్పుడున్న స్థితి పట్ల అభ్యంతరాలూ ఉండవు. దీని వెనుక వ్యవస్థాగత కారణాలున్నాయి. ఇలాంటి నేపథ్యం ఉన్న చోట నిర్మల లాంటి పిల్లల్ని అమాయకత్వమూ నిస్సహాయత్వమూ ఆవరించి ఉంటాయి. సాంఘికంగా చితికిపోయిన, మాససికంగా డిప్రెస్డ్గా ఉన్న ఈ బాధితులకు ఎంతో శక్తి ఇవ్వాల్సి వుంది. వీళ్ల చేత హింసను గుర్తింపచేయడం, దాని బారి నుంచి బయటకు లాగడం ఒక పెద్ద సవాల్. వీళ్లకి చట్టపరమైన సాయమొక్కటే చాలదు. శారీరక – మానసిక – ఆర్థికపరమైన సాంత్వన కల్చించడం చాలా అవసరం. ఇలాంటి వాళ్లందరినీ రీహాబిలిటేషన్ సెంటర్లకు తరలించడం సరి కాదు. వారిని మెయిన్ స్ట్రీమ్‌లోనే ఉంచాలి. పని విషయంలో వాళ్ల ఎంపికను గౌరవించాలి. వాళ్లకు షెల్టర్ ఉండాలి. బాధితులకు ఇలాంటి సాయాలన్నీ తక్షణం అందాలి. కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. ‘రేప్’ చుట్టూ అల్లుకున్న భావజాలాన్నీ భాషనూ మార్చడం అతి పెద్ద కర్తవ్యం. – వంగూర్ ఉషారాణి, డైరెక్టర్, ‘సన్నిహిత’ (నిర్మల కేస్ స్టడీ) – హృదయ -
టీచర్ జాబ్ రాదేమోనని యువతి ఆత్మహత్య
పరిగి : జీవితంలో ఇక టీచర్ ఉద్యోగం సాధించలేనేమోనన్న ఆందోళనతో ఓ యువతి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. మహబూబ్‌నగర్ జిల్లా మూసపేట మండలం వేములకు చెందిన ఎన్.చంద్రయ్య చిన్న కుమార్తె నిర్మల(30) డీఎస్సీకి ప్రిపేర్ అవుతోంది. గతంలో 2సార్లు డీఎస్సీ రాసినా కొద్దిలో తప్పిపోయింది. టీఆర్టీ నోటిఫికేషన్ రాగానే పరీక్షకు హాజరయ్యేందుకు దరఖాస్తు చేసుకుంది. వచ్చే నెల 4న ఫిజికల్ సైన్స్‌లో స్కూల్ అసిస్టెంట్ కోసం టీఆర్టీ రాయాలి. ఈ సారీ పోటీ ఎక్కువగా ఉందంటూ ఇటీవల ఓ పత్రికలో వచ్చిన కథనం చదివి తీవ్ర ఆందోళనకు గురైంది. ఇదే సమయంలో ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే కుటుంబ సభ్యులు వికారాబాద్ మిషన్ ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు. గతేడాది అనారోగ్య కారణంతో తల్లి మృతిచెందగా అప్పట్నుంచీ నిర్మల మరింత కుంగిపోసాగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. -
ఒకటిని దిద్దండి
పక్కింటావిడ దొంగలాగా వచ్చి తొంగి చూస్తుంది. ‘అన్నయ్యగారు ఊర్నుంచి రాలేదా వొదినా’ అంటుంది. తల అడ్డంగా ఊపాల్సి వస్తుంది. ఎదురింటావిడ పోలీసులాగా జబర్దస్తీగా దూరుతుంది. ‘అయితే మా తమ్ముడు ఫలానా ఊర్లో బ్యాంక్ ఉద్యోగం చేస్తున్నాడంటావ్’ అని గోడ మీద ఫొటో ఏమైనా దొరుకుతుందేమో అన్నట్టు మెడ అటూ ఇటూ తిప్పుతుంది. హౌస్ ఓనర్ భార్య ‘అమ్మాయ్... ఈసారి కూడా నువ్వే వెళతావా... మీ ఆయన రాడా?’ అని ఆదరంగా కూపీ లాగుతుంది. హౌస్ ఓనర్‌కు ఈ ములాజా కూడా లేదు. ‘ఫలానా తేదీ లోపల మీ ఆయన్ను ప్రవేశ పెట్టకపోతే ఇంటి నుంచి వెళ్లగొడతా’ అని అల్టిమేటమ్ జారీ చేస్తాడు. అందరికీ సున్నా కావాలి. ఒకటి పక్కన సున్నా. తను పుట్టింది. మనిషి. చదువుకుంది. మనిషి. ఉద్యోగం చేయగలదు. మనిషి. జీవితాన్ని తన పద్ధతిలో తాను ఎదుర్కోగలదు. మనిషి. తనకో విలువుంది. మనిషి. ఆమెకై ఆమె ఒకటి. కాని ఎప్పుడైతే పెళ్లి చేసుకుందో అప్పటి నుంచి ఆమె సున్నా అయిపోయింది. ఆ సున్నా పక్కన మొగుడు అనే ఒకటి ఉంటేనే దానికి విలువ. మొగుడు నిలబడితేనే ఆమె పది. లేకపోతే సున్నా. కాని వాడో సన్నాసి వెధవ. నాలుగేళ్లు రాచి రంపాన పెట్టాడు. పేరుకు సంసారం. ఇంట్లో ఉంటేగా. పేరుకు కాపురం. బాధ్యత తీసుకుంటేగా. వాడున్నప్పుడు కూడా తను ఒకటిలానే ఉంది. తనే గుట్టుగా సంసారాన్ని ఈదుకుంటూ వచ్చింది. డెలివరీ బిల్లుకు డబ్బు తెస్తానని పత్తా లేకుండా పోతే ఉన్న ఒక గాజును అమ్మి బయటపడింది. వాడొక సున్నా. వాడేనా? లోకంలో ఎన్ని సున్నాలు. అనుమానించే సున్నాలు. పో... మీ పుట్టింటికి పోయి డబ్బు పట్రా అనే సున్నాలు. తాగొచ్చి పడిపోయే సున్నాలు. తందనాలాడే సున్నాలు. జీవితంలో ఒక్కసారి కూడా భోజనం చేశావా అని అడగని ఏబ్రాసి సున్నాలు. అలాంటి సున్నాలతో గుణకారం జరిగితే తన జీవితం నిండు సున్నా అని కనిపెట్టింది. వదిలేసి వచ్చేసింది. ఆరేళ్ల కొడుకు అప్పుడప్పుడు అడుగుతాడు– ‘నాన్న ఏడమ్మా?’ ‘నాన్న రాడమ్మా. నాన్నకూ మనకూ కటీఫ్’. ‘నాన్న ఎలా ఉంటాడమ్మా?’ ‘నువ్వు పెద్దయ్యాక చూద్దువులే నాన్నా’. నాన్నొక వెధవ అని తెలియడం కన్నా నాన్న ఎలా ఉంటాడో తెలియకపోవడం మేలు కదా అనుకుంది. కాని లోకం ఊరుకుంటుందా? ఒంటరి ఆడది జీవిస్తుందంటే అదీ మొగుడి ప్రమేయం లేకుండా జీవిస్తుంది అంటే దానికి సయించదు. అలా ఒంటరిగా జీవించేవాళ్లు సంసారులు కారు. ఎందుకు కారో. సింగిల్ ఉమన్ అంటే కచ్చితంగా బహిష్కృతురాలే. ఈ బహిష్కారం ఎవరు విధించారో? ఓయ్... ఇది నేను. ఈజీవితమే సత్యం. ఇలా సత్యంగా బతకడమే నా జీవితపు సత్యం అంటే వినరు. అబద్ధం చెప్పాలి. మా ఆయన లండన్‌లో ఉన్నాడు. అబద్ధం చెప్పాలి. మా ఆయన దుబాయ్‌లో ఉన్నాడు. అబద్ధం చెప్పాలి. మా ఆయనకు సెలవు దొరకదు. అబద్ధం చెప్పాలి. మా ఆయన దగ్గరకు నేనే వెళ్లి రావాలి. అబద్ధం చెప్పాలి. స్త్రీని అబద్ధంగా మార్చే ఈ సంఘనీతి మారదా? ఈ అబద్ధాన్ని చెప్పీ చెప్పీ, చెప్పలేక వాళ్లెలా కోత అనుభవిస్తారో లోకం చూడదా? సున్నాలను వెతికే పెద్దలారా ఒకటిని ఒకటిగా ఉండనివ్వండి. కథ ముగిసింది. కొండేపూడి నిర్మల రాసిన ‘అబద్ధం’ కథ ఇది. వివక్ష అంటే పుట్టుకలోనూ పెంపకంలోనూ పెరుగుదలలోనూ సకల అవకాశాలలోనూ ప్రదర్శించేది మాత్రమే కాదు. జీవన సందర్భాలలోనూ ప్రదర్శించి హింసించేది వివక్ష. టూలెట్ బోర్డులు మనం ఎన్ని చూస్తుంటాం. ‘ఫ్యామిలీకి మాత్రమే’ అని ఉంటుంది. ‘సింగిల్ ఉమన్‌కు మాత్రమే’ అని ఎప్పుడైనా చూడగలమా? పిల్లాడి స్కూల్ అడ్మిషన్లో తండ్రి పేరు రాయకపోతే అడ్మిషన్ దొరికే రోజులు చూస్తున్నామా? మెట్టెలు మంగళసూత్రాలు లేకపోతే చాలు అర్ధరాత్రి మిస్డ్ కాల్ ఇవ్వొచ్చు అని మగాళ్లు స్వీయ అనుమతి తీసుకోని రోజులు చూస్తున్నామా? ఆమెకో ఇల్లుంటే ఏమిటి నష్టం? ఆమెకో జీవితం ఉంటే ఏమిటి నష్టం? ఇంకోణ్ణి చేసుకుంటే వాడు మొదటివాడులా ఉండడని గ్యారంటీ ఏమిటనే భయంతో ఆమె అలాగే ఉండిపోతే ఏమిటి నష్టం. సున్నాలు చుట్టడం మానండి. ఒకటిని దిద్దండి. - కొండేపూడి నిర్మల