ఎంతసేపూ నాన్న కొడుకులేనా?! ఇంటి పేరు నాన్నదే అయినా... కొట్టుకునే గుండె అమ్మదే కదా! నవమాసాలు మోసిందీ సద్గుణాల ఉగ్గు పట్టిందీ సంస్కారం రంగరించి పెంచిందీ అమ్మే కదా! వ్యవస్థలో విలువలు అడుగంటుతున్నప్పుడు స్త్రీలపై హింస అడవిలా అంటుకుంటున్నప్పుడు కూతుళ్లని జాగ్రత్తగా ఉండమని చెప్పడం కంటే.. కొడుకుల్ని బాధ్యతగా పెంచాలని ‘నిర్మల’అమ్మ అంటున్నారు.
మదర్స్ డే సందర్భంగా మీ బన్నీ చిన్నప్పటి విశేషాలు షేర్ చేసుకుంటారా?
నిర్మల: చిన్నప్పుడు చాలా కామ్‌గా ఉండేవాడు. టీచర్స్‌కు పెట్ స్టూడెంట్. అందరికీ చాలా ఇష్టం బన్నీ అంటే. నా చేతుల్లోనే ఎక్కువ తన్నులు తినేవాడు (నవ్వుతూ). దేని గురించో కాదు.. ఎగ్జామ్స్ అప్పుడు అయిపోయిన సబ్జెక్ట్ మళ్లీ ఫ్రెష్‌గా చెప్పేవాడు ఎగ్జామ్ ఉందని. అది తప్ప ఇంట్లో కానీ స్కూల్‌లో కానీ ఏ ఇబ్బంది పెట్టలేదు.
అంటే.. స్కూల్ నుంచి కంప్లైంట్స్ వచ్చేవి కాదేమో?
ఇంటి చుట్టుపక్కల పిల్లలతో ఆడుకున్నప్పుడు వాళ్ల నుంచి కానీ స్కూల్ నుంచి కానీ ఎలాంటి కంప్లైంట్స్ ఉండేవి కాదు. బన్నీ చాలా స్లోగా రాసేవాడు. అది టీచర్స్‌కు తెలుసు. అందుకే ఒక పీరియడ్ 45 మినిట్స్ అంటే.. వాడికి ఓ 15 మినిట్స్ ఎక్కువ ఇచ్చేవారు రాసుకోవడానికి.
మీరు ఫాస్ట్ లెర్నర్ అని సినిమాల్లో మీ ఎనర్జీని చూస్తే అనిపిస్తుంది.. స్లో గ్రాస్పరా?
బన్నీ: అవునండీ. చాలా స్లో లెర్నర్ని. వెంటనే గ్రాస్ప్ చేయలేను. మా తమ్ముడు శిరీష్ ఏదైనా ఇట్టే పట్టేస్తాడు. చాలా యంగ్ ఏజ్‌లో.. ఇంటర్నెట్ వస్తున్న కొత్తల్లోనే తను వెబ్‌సైట్ రన్ చేసేవాడు. అప్పుడు వాడికి 12 ఇయర్స్ అనుకుంటా. అప్పట్లో వాడికి ‘చైల్డ్ పెసిలిటే షన్’ కూడా చేశారు. బాక్సింగ్ అంటే రింగ్ లోపలా బయట, క్రికెట్ అంటే గ్రౌండ్ బయటా లోపల మొత్తం సబ్జెక్ట్ తెలుసుకుంటాడు.
మీ బన్నీ స్టార్ అవుతారని మీరు అనుకున్నారా?
నిర్మల: నిజం చెప్పాలంటే మా ముగ్గురి పిల్లల్లో బన్నీయే స్టార్ అవుతాడు అనిపించింది. చిప్పప్పుడు ఏ పార్టీ ఉన్నా మా ఇంట్లో అయినా చిరంజీవి గారింట్లో అయినా చాలా బాగా డ్యాన్స్ చేసేవాడు. ఫుల్ ఎనర్జీ ఉండేది.
సినిమా కోసం రిస్కీ ఫైట్స్ అవీ చేయాలి కదా.. ఓ మదర్‌గా ఎప్పుడైనా భయమేసిందా?
నిర్మల: నాకు పెళ్లి అయిన దగ్గరి నుంచి మా మామగారు (అల్లు రామలింగయ్య), మా ఆడపడుచు సురేఖ భర్త చిరంజీవిగారు అందరూ సినిమాలోనే ఉన్నారు. నాకు 18 ఏళ్లకే పెళ్లి అయిపోయింది. ఊహ తెలిసినప్పటి నుంచి సినిమా వాతావరణంలో పెరిగాను కాబట్టి అంత భయపడ్డ సందర్భాలు ఎక్కువగా ఏం లేవు.
మీ పిల్లల సినిమాల రిలీజ్ టైంలో టెన్షన్ పడతారా?
నిర్మల: మనుషులమే కదా. డెఫినెట్లీ ఉంటుంది.
బన్నీ: యాక్టర్ కంటే ప్రొడ్యూసర్‌కి ఇంకా ఎక్కువ టెన్షన్ ఉంటుంది. ప్రొడ్యూసర్‌గా మా నాన్న సినిమాల రిలీజ్ టెన్షన్ చూసినప్పుడు హీరోగా కొడుకు సినిమా రిలీజ్ అంటే చిన్న విషయమే.
బన్నీలో ఉన్న ప్లస్, మైనస్ పాయింట్స్?
నిర్మల: ఓపిక ఎక్కువ. అది ప్లస్. మైనస్ అంటే మొండితనం, షార్ట్ టెంపర్. కొంతమంది కోపంతో ఏదైనా అంటే రెండు మూడు రోజులు మాట్లాడరు. కానీ మా ఇంట్లో 5 నిమిషాల్లో మళ్లీ మామూలు అయిపోతుంది. షార్ట్ టెంపర్‌తో ఏదైనా అన్నా వెంటనే ‘ఆ.. ఏదో అలా అన్నాలే. సారీ’ అనేస్తాడు.
బన్నీ యాక్ట్ చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చినది?
నిర్మల: వేదం’ చాలా ఇష్టం.
బన్నీ: యాక్చువల్లీ ఫీచర్ ఫిల్మ్స్ కంటే నేను చేసిన షార్ట్ ఫిల్మ్ ‘ఐ యామ్ దట్ చేంజ్’ అమ్మకి చాలా ఇష్టం. అప్పుడు నాన్నతో ‘అమ్మకు బాగా నచ్చింది. నాకైతే ఆస్కార్ గెలిచినట్టు ఉంది’ అన్నాను. అమ్మకు ఫ్రెండ్స్, పూజలు, సినిమాలు ఇష్టం.
పిల్లల కోసం పూజలు, ఉపవాసాలు లాంటివి ఏవైనా చేస్తారా?
నిర్మల: చేయనండి. నా పిల్లలకు ఇది కావాలి, వాళ్లు ఇలా ఉండాలి అని పూజలు చేయను. ఎందుకంటే జరిగేది ఏదైనా జరుగుతుంది. మనం ఫేస్ చేయాలి అంతే. బన్నీ ఫస్ట్ మూవీ తేజ డైరెక్షన్‌లో చేయాల్సింది. అది క్యాన్సిల్ అయినప్పుడు నేను విజయవాడలో ఉన్నాను. అక్కణ్ణుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు నన్ను పికప్ చేసుకోవడానికి బన్నీ వచ్చాడు.
ఇంటికి వచ్చే దారిలో ‘సినిమా క్యాన్సిల్ అయింది’ అన్నాడు. నేను ఎక్కువ షాక్ అవ్వలేదు. ఏది జరిగినా మంచికే అని ఫీల్ అవుతాను. తనని ఓదార్చలేదు. ఈ ఇన్సిడెంట్ నుంచి ఏదైనా నేర్చుకున్నాడు అనుకున్నాను. రిజెక్షన్‌లో ఉన్న పెయిన్ తనకి తెలియాలి. దాంతో ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టి ముందుకు వెళ్తాడని అనుకున్నాను.
బన్నీ: అమ్మ బేసిక్‌గా దేనికీ సర్‌ప్రైజ్ అవ్వదు. అది గుడ్ అయినా బ్యాడ్ అయినా... సమానంగా తీసుకుంటుంది. బయట ఎవరో ఏదో మా గురించి రాస్తారు. మాట్లాడతారు. కామెంట్ చేస్తారు. వాటి గురించి ఇంట్లో పెద్దగా డిస్కస్ చేసుకుంటే బతకలేం. అమ్మ అస్సలు పట్టించుకోదు. జరిగేవి జరగనివ్వండి అన్నట్లు ఉంటుంది. ఎవరో మాట్లాడే మాటలకు మనం బాధపడిపోయి, డిస్కస్ చేసుకుంటే.. మన జీవితం వేరేవాళ్ల కంట్రోల్‌లో ఉన్నట్లే అనే ఫీల్ మాకు కలిగేలా చేసింది.
మీ అమ్మగారు వండే వాటిలో మీకు ఇష్టమైనది ఏది?
బన్నీ: కొన్ని సంవత్సరాలుగా వండటం లేదు. మా అమ్మ బాగా సోషల్ అయిపోయింది (నవ్వుతూ). కానీ అమ్మ వంట బాగా చేస్తుంది. చైనీస్ బాగా చేసేది. నూడుల్స్, మంచూరియా ఇవన్నీ బాగా చేస్తుంది. ఇండియన్ ఫుడ్ అంటే ఎవరైనా వండుతారు. ఇంతకు ముందు చైనీస్ తినాలంటే బయటకు వెళ్లి తినేవాళ్లం. అమ్మ చైనీస్, బేకింగ్.. ఇలా చాలా క్లాస్‌లకి వెళ్లి, అవన్నీ నేర్చుకుంది. ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే మాత్రం దగ్గరుండి అన్నీ చేయిస్తుంది.
మీ అమ్మగారిది చాలా ఫార్వాడ్ థింకింగ్ అనిపిస్తోంది.. సో.. స్నేహాగారితో మీ లవ్ గురించి చెప్పడానికి పెద్దగా టెన్షన్ పడలేదేమో? ముందు ఎవరికి చెప్పారు?
బన్నీ: ఇద్దరికీ కలిపి చెప్పాను. ‘స్నేహా అని నా ఫ్రెండ్. చాలా మంచి అమ్మాయి. రెడ్డీస్. మీకేమైనా అభ్యంతరమా?’ అన్నాను. ‘మేం చూసి చేసినా.. నీ అంతట నువ్వు సెలెక్ట్ చేసుకున్నా, నువ్వు హ్యాపీగా ఉండటమే ముఖ్యం. అభ్యంతరం లేదు’ అన్నారు. ఫస్ట్ నుంచి అమ్మ మోడ్రన్. నేను చాలా మంది దగ్గర చెబుతుంటా.
మోడ్రన్ అంటే మోడ్రన్ బట్టలు వేసుకోవటం, ఇంగ్లీష్ మాట్లాడటం కాదు. అలోచనా విధానం చాలా ఫార్వాడ్‌గా ఉండాలని. మా మదర్ ఆ టైపే. అంటే.. ప్రొగ్రెసీవ్ థింకింగ్ ఈజ్ మోడ్రన్. నన్ను ఎవరైనా మోస్ట్ మోడ్రన్ పర్సన్ ఎవరూ అని అడిగితే మా అమ్మ పేరు చెబుతాను.
ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అని ఇబ్బందిగా అనిపించలేదా.. పైగా మీ జనరేష¯Œ కు కొంచెం పట్టింపులు ఎక్కువగా ఉంటాయేమో ?
బన్నీ: నేను చెబుతానండి. ఇది జనరేషన్ మీద తోసేయకూడదు. మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. అంతకు ముందు జనరేషన్‌లో కూడా పట్టించుకోని వాళ్లు ఉన్నారు. ఇప్పటి జనరేషన్‌లో కూడా పట్టించుకుంటున్నవాళ్లు ఉన్నారు.
నిర్మల: నాకు క్యాస్ట్ పెద్దగా పట్టింపు లేదు. మన కల్చర్ అయితే చాలనుకున్నాను. కోడలితో మేం మాట్లాడగలిగితే చాలు. బావుంటే కొన్ని రోజులు వాళ్లతో ఉంటాం. లేదంటే దూరంగా ఉంటాం. కానీ లైఫ్ లాంగ్ కలిసి ఉండాల్సింది వాళ్లు. అందుకే చాయిస్ వాళ్లు తీసుకుంటే మంచిదని నమ్మాను.
ఇప్పటికీ మీ కొడుకు, కోడలు మీతోనే ఉంటున్నారు. ఉమ్మడి కుటుంబంలా ఉండాలన్నది మీ నిర్ణయమా?
నిర్మల: లేదు. నేను ఏ విషయంలోనూ ఎవరినీ ప్రెషర్ పెట్టను. ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయాలనే మెంటాలిటీ నాది. నేను నా కోడలితో ఫ్రెండ్లీగా ఉంటాను. వాళ్ల స్పేస్ వాళ్లకు ఇచ్చేస్తాం.
బన్నీ: నా పెళ్లయి ఆల్మోస్ట్ ఏడేళ్లు అవుతోంది. అమ్మకీ, స్నేహాకీ ఒక్క ఇష్యూలో కూడా డిఫరెన్స్ రాలేదు. గొడవపడలేదు. ఒకే ఇంట్లో ఉంటూ ఇలాంటి ఇష్యూలు ఏదీ రాలేదంటే ఆ క్రెడిట్ పూర్తిగా ఇద్దరికీ ఇవ్వాలి. అసలు ఎక్స్‌పెక్టేషన్స్ లేనప్పుడు ప్రాబ్లమ్స్ రావు. నా కొడుకు ఇలా ఉండాలి.. నా కోడలు ఇలా చేయాలి అని అనుకుంటే అప్పుడు ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. అది లేనప్పుడు డిజప్పాయింట్‌మెంట్ ఉండదు.
మీ అమ్మగారిలో మీకు నచ్చే క్వాలిటీస్, నచ్చనివి?
బన్నీ: చాలా ఉన్నాయి. ఇందాక అన్నట్టు చాలా మోడ్రన్‌గా ఆలోచించే తీరు. ఒక పెద్దింట్లో లేదా హై పొజిషన్‌లో ఉన్న లేడీకి కావల్సిన క్వాలిటీ ఏంటంటే న్యూట్రల్‌గా ఆలోచించటం. హైస్, లోస్‌ని ఒకేలా ట్రీట్ చేయగలగటం.
మా నాన్నగారు 500 కోట్లు సంపాదించినా మా అమ్మ ప్రవర్తనలో 1% మార్చు కూడా ఉండదు. అలాంటి లైఫ్ లీడ్ చేయటం బెస్ట్ క్వాలిటీ. ఇంకోటి ఏంటంటే చాలామంది పేరెంట్స్‌కు ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి.మేం పెద్దవాళ్లం అయ్యాక మావాడు ఇలా చూసుకోవాలని.. లేదా వేరే ఎక్సెపెక్టేషన్స్ ఉంటాయి. మా అమ్మ ఏదీ ఎక్స్‌పెక్ట్ చేయదు. అది వండర్‌ఫుల్ క్వాలిటీ.
నచ్చని విషయం అనను కానీ మా అమ్మ చాలా సింపుల్‌గా ఉంటుంది. ‘నీ దగ్గర బాగానే డబ్బులున్నాయి కదా.. ఎందుకింత సింపుల్‌గా ఉంటావ్’ అంటుంటా. నేనొకసారి డైమండ్ జ్యువెలరీ కొనిస్తే పెట్టుకోలేదు. ‘ఒక అమ్మకు కొనిచ్చే పొజిషన్‌లో ఉండటం కొడుకుగా నా అదృష్టం. నువ్వు రిసీవింగ్ ఎండ్‌లో ఉన్నప్పుడు తీసుకోవాలి కదా’ అంటుంటాను.
నిర్మల: నాకు ఎలా ఉంటుందంటే ఏదైనా ప్రకృతి విపత్తు జరిగినప్పుడు వాడు ఓ 20–30 లక్షలు డొనేట్ చేశాడని తెలిసినప్పుడు ఆ డైమండ్ నెక్లెస్ ఇచ్చినప్పుడు కంటే ఎక్కువ ఆనందం కలుగుతుంది.
అప్పట్లో అరవింద్‌గారు ప్రొడ్యూసర్‌గా బిజీగా ఉండేవారు. మరి.. మీ ముగ్గురి పిల్లలు (వెంకటేశ్, శిరీష్, అర్జున్) పెంచడానికి హెల్ప్ చేసేవారా?
నిర్మల: ఆడపిల్లలైతే కుదురుగా ఉంటారు. మగపిల్లలు కదా.. అస్సలు కుదురుగా ఉండేవారు కాదు. అరవింద్ గారు ఎంత బిజీగా ఉన్నా కూడా వీకెండ్స్‌లో మాత్రం వీళ్లను బయటకు తీసుకువెళ్లే వారు. ఒకళ్లు పబ్, ఒకళ్లు ఏదైనా మాల్.. ఇంకొరు ఇంకో చోట.. ఇలా పిల్లలు ఒక్కో చోట ఉండేవారు. మాల్ దగ్గర దిగబెట్టి, పికప్.. ఆ తర్వాత పబ్.. ఇలా డ్రాపింగ్, పికప్ చేసుకునేవారు.
బన్నీ: నేను అందరి కంటే కొంచెం వీక్ కాబట్టి నాతో ఎక్కువ ఉండేవారు. పైగా టీనేజ్ ప్రాబ్లమ్స్ కూడా నాకే ఎక్కువ ఉండేవి (నవ్వుతూ). సో..నా మీద కొంచెం రిస్ట్రిక్షన్స్ ఎక్కువ. శనివారం అయితే బయటకు వెళ్లిపోయేవాణ్ణి. వెళ్లొద్దనేవారు కాదు కానీ సేఫ్‌గా ఇంటికి రమ్మనేవారు.
జనరల్‌గా ఆడపిల్లలను జాగ్రత్తగా పెంచుతాం. ఇవాళ సమాజంలో అమ్మాయిలపై జరుగుతున్న దాడులు చూస్తుంటే.. మగపిల్లలను కూడా జాగ్రత్తగా పెంచాలనిపిస్తోంది. ముగ్గురు మగపిల్లల తల్లిగా మగపిల్లలు గల పేరెంట్స్ ఏదైనా చిన్న మెసేజ్?
నిర్మల: విలువలు గురించి ఇంట్లోనే చెబితేనే తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్.. ఆ మధ్య అయాన్ (అల్లు అర్జున్ కొడుకు) ‘మా ఇంట్లో’ అన్నాడు. ‘అలా అనకూడదమ్మా.. మన ఇంట్లో’ అనాలి అన్నాను. రెండోసారి ‘మా ఇంట్లో’ అనబోయి, ‘మన ఇల్లు’ అని దిద్దుకున్నాడు. అలాగే చిన్నప్పుడు పిల్లలు తప్పు చేస్తే.. ‘నువ్వు గుడ్ బోయ్ కదా.. ఎందుకిలా చేశావ్’ అంటే.. పిల్లల మనసులో ‘మనం గుడ్ కదా.. బ్యాడ్ యాక్టివిటీస్ చేయకూడదు’ అనే మైండ్ సెట్ పెరుగుతుంది.
ఇలా చెప్పకుండా జస్ట్ కోప్పడ్డామనుకోండి వాళ్ల మీద ఆ ఎఫెక్ట్ ఉండదు. మా అయాన్ సినిమాలు చూస్తాడు. వాడికి ‘బ్యాడ్ బాయ్స్ అంటే టీవీల్లో, సినిమాల్లో మాత్రమే ఉంటారు. బయట ఉండరు. వాళ్లు చేసేవి మనం చేయకూడదు’ అని చెబుతాం. ముగ్గురి పిల్లలకు చిన్నప్పుడు ఇలానే చెప్పేవాళ్లం. వాళ్లు చదువుకున్నది కో–ఎడ్యుకేషన్ స్కూల్స్‌లో. బాయ్స్‌తోనే కాదు గర్ల్స్‌తో కూడా ఫ్రెండ్లీగా ఉండేవాళ్లు. డిన్నర్ ఇవ్వాలంటే ఇంటికి తీసుకురమ్మనేవాళ్లం.
బాయ్స్‌ని ఎలా ట్రీట్ చేసేవాళ్లమో గర్ల్స్‌ని కూడా అలానే. అబ్బాయా? అమ్మాయి? అని కాదు.. ఫ్రెండ్ ఈజ్ ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి వాళ్లకు ఇలాంటి ఇన్‌పుట్స్ ఇస్తూ ఉండాలి. ఏదైనా చేస్తున్నప్పుడు చెయ్యొద్దు అనకూడదు. అలా చేస్తే ఏం జరుగుతుందో చెప్పాలి. ఎందుకంటే.. మన ఇంటి నుంచి సమాజంలోకి ఒక మనిషిని పంపిస్తున్నాం. ఆ మనిషి ఎవరికీ నష్టం చేయకూడదు కదా.
అలాగే మగపిల్లలు ఉన్న అమ్మలకు కొడుకులు ఆల్కహాల్‌కి అలవాటు పడిపోతారేమో? అనే భయం ఉంటుంది. మీకా టెన్షన్ ఉండేదా?
వద్దని ఎప్పుడూ చెప్పలేదండి. ఎందుకంటే బేసిక్‌గా అరవింద్‌గారు సిస్టమేటిక్‌గా ఉంటారు. ఇప్పుడు జనరల్ యంగ్‌స్టర్స్ వర్క్‌ని వేరేగా ఆల్కహాల్‌ని వేరేగా ఉంచుతున్నారు. పెద్దవాళ్ల ముందు ఎలా పడితే అలా ఉండరు. ‘మా ఏజ్‌కి రెస్పెక్ట్ ఇవ్వండి’ అని ఏ పేరెంట్ అయినా కోరుకుంటారు. మా పిల్లలు మా ముందు స్మోక్ చేయడం, ఆల్కహాల్ పుచ్చుకోవడం వంటివి చేయరు. పిల్లల పిల్లలు ఉంటున్నారు. వాళ్లు పెరిగే వయసు. అందుకని ఇంట్లో పార్టీలు జరిగితే వాళ్ల కళ్లకి కనిపించేవాటినే ప్రొజెక్ట్ చేస్తాం.
ఒకసారి అరవింద్‌గారు కొంచెం తాగిన గ్లాస్‌ని టేబుల్ మీద పెట్టి, మరచిపోయారు. అయాన్ వచ్చి ఇదేంటమ్మా ? అని అడిగితే.. అది తాతగారి జ్యూస్ నాన్నా అని చెప్పాను. అంతే కానీ ‘నీకెందుకు? నువ్వు చూడకూడదు’ అని చెబితే క్యూరియాసిటీ పెరుగుతుంది. చెడ్డ విషయాల గురించి తెలివిగా చెప్పడంవల్ల పిల్లలకు వాటి మీద క్యూరియాసిటీ పెరగదు.
శిరీష్‌కి పెళ్లి చేసేస్తే మీ ముగ్గురు పిల్లలు లైఫ్‌లో సెటిలైనట్లే కదా?
నిర్మల: లైఫ్‌లో సెటిల్‌మెంట్ అనేది ఉండదు. అరవింద్‌గారు నిర్మాత. ఆయన సినిమాలు తీస్తుండాలి. వెంకటేశ్ బిజినెస్ చూసుకుంటాడు. అది వాడు చేయాల్సిందే. బన్నీ, శిరీష్‌లు సినిమాలు చేయాల్సిందే. పెళ్లయితే సెటిలైనట్లు కాదు. లైఫ్ సైకిల్‌ని నడపాల్సిందే. ఎవరి లైఫ్ వారు లీడ్ చేయాలి. ఎవరి సొంతంగా వాళ్లు పరిగెత్తాలి. లైఫ్ అంటేనే పరుగు కదా.
బన్నీ: ‘నువ్వు సెటిల్ అయ్యావు’ అనేది ఏమీ ఉండదు. ఒకవేళ ఈ క్వొశ్చన్ నన్ను అడిగినా నాదీ సేమ్ ఆన్సర్. సెటిల్ అవ్వలేదు అనుకుంటాను.
పిల్లలపై నెగటీవ్ కామెంట్స్ విన్నప్పుడు ఫీల్ అవుతారా?
నిర్మల: బయట వాళ్లు చెప్పినప్పుడు పెద్దగా తీసుకోను. హీరోయిన్‌తో ఇలా ఉంది? అని అంటే పట్టించుకోను. వాళ్లు ఏదో రాసుకుంటారులే అని వదిలేస్తుంటాను. కానీ వాళ్లు నిజంగా తప్పు చేశారని నాకు అనిపిస్తే చాలా స్ట్రగుల్ అవుతాను. నా మనసుకు ఆ ఫీలింగ్ వచ్చిందంటే నేను పడే బాధను మాటల్లో చెప్పలేను.
అలా మిమ్మల్ని ఎప్పుడైనా ఇరుకుల్లో పడేసిన సందర్భాలు ఉన్నాయా?
చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి.
అప్పుడు పిల్లలతో కూర్చుని మాట్లాడతారా?
మాట్లాడను. నాకు కోపం వస్తే అస్సలు మాట్లాడను. దాన్ని బట్టి అర్థం చేసుకుంటారు. నిజమైన ఇష్యూలు జరిగినప్పుడు ఎవ్వరూ అరుచుకోరని నా అభిప్రాయం. చాలా సైలెన్స్ ఉంటుంది. అంతలా సైలెంట్ అయిపోయాం అంటే బాగా అప్‌సెట్‌లో ఉన్నాం అని అర్థం. అయితే నేను లైఫ్‌లో ‘హౌ’ (ఎలా) అనేది మాత్రమే నమ్ముతాను.
‘వై’ (ఎందుకు) అనేదానికి ఇంపార్టెన్స్ ఇవ్వను. పిల్లలు విషయం అనే కదా.. ఏదైనా జరగకూడనిది జరిగినప్పుడు.. ఎందుకిలా జరిగింది? అని మదనపడను. ఆ విషయాన్ని ఎలా డీల్ చేయాలని ఆలోచిస్తాను. ఎందుకంటే జరిగిందేదో జరిగిపోయింది. దాన్నుంచి ఎలా బయటపడాలన్నదే ముఖ్యం.
‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా చూశారా? బన్నీ యాక్టింగ్ సూపర్ అని ప్రశంసలు వస్తున్నాయి
నిర్మల: నాకు పర్సనల్‌గా ఆర్మీ అంటే చాలా గౌరవం. చిన్నప్పుడు మా అబ్బాయిలు ఆర్మీలో ఉంటే బావుండు అనుకున్నాను. కుదరలేదు. ఇప్పుడు ఏదో రకంగా ఆర్మీతో కనెక్షన్ కుదిరినందుకు చాలా ఆనందంగా ఉంది. నేను పేపర్ బాగా ఫాలో అవుతున్నాను. ఆర్మీ వాళ్ల ప్రతీ ఆర్టికల్ చూస్తుంటాను. పాకిస్థాన్ వార్, చైనా వార్ అన్ని విషయాలు తెలుసుకున్నాను.
ఫైనల్లీ.. నా పిల్లలు తప్పు చేయరు.. అనే భరోసా మీకు ఉందా?
బన్నీ: ఈ ప్రశ్నకు అమ్మ కాదు.. నేను చెబుతాను. మా ముగ్గురి బ్రదర్స్ తరఫున నేను గ్యారెంటీ ఇస్తున్నాను. వాళ్ల పెంపకంలో తప్పు జరగదు. మా మదర్, మా ఫాదర్. ఇద్దరి ఐడియాలజీస్ బావుంటాయి. అవి మాకు ఎంతో కొంత వచ్చాయి. ఆ కల్చర్‌లోనే మేంపెరిగాం.
‘నా పిల్లలు తప్పు చేయరు’ అని ఇప్పుడు అమ్మ గ్యారెంటీ ఇచ్చిందంటే.. రేపు పొరపాటున ఏదైనా తప్పు జరిగితే, అవిడ బాధపడుతుంది. మేం తప్పు చేస్తామని కాదు. యాక్సిడెంటల్ మిస్టేక్స్ ఉంటాయి కదా.. వాటి గురించి చెబుతున్నా. నేనూ, మా అన్నయ్య, తమ్ముడు శిరీష్.. మేం ముగ్గురుం ఎప్పుడూ వాళ్లు ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ తీసుకురాం. ఫెయిల్యూర్స్ రావచ్చు. కానీ బ్లండర్స్ చేయం.
ఆ రోజు అమ్మను పట్టుకుని ఏడ్చేశాను
మీ అమ్మ గారి గురించి మీకు గుర్తున్న సంఘటన?
ప్రతివారికీ అమ్మ గురించిన అనుభూతులు, జ్ఞాపకాలు బోలెడు ఉంటాయి. ఈ మదర్స్ డే సందర్భంగా మా అమ్మ గారి గురించి కొన్ని విషయాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మా అమ్మ పేరు కనకరత్నం. అమ్మకి నేను ఒక్కడినే కొడుకుని. నాకు చిన్నప్పటి నుండి కొంచెం శుభ్రం ఎక్కువ. స్నానానికి అందరికీ ఒక బకెట్ అవసరం అయితే నాకు మాత్రం రెండు బకెట్ల నీళ్లు కావాలి.
నేను రోజులాగానే ఓ రోజు స్నానానికి వెళ్లాను. ఆ రోజు మా ఇంట్లో మోటర్ చెడిపోయింది. ఆ విషయం నాకు తెలియదు. నేను స్నానానికి వెళ్లటం చూసిన మా అమ్మ హడావిడిగా బావి దగ్గరకు వెళ్లి రెండు బకెట్ల నిండా నీళ్లు తోడి మేడ మీదకు మోసుకొచ్చింది. బాత్రూమ్‌లో కుళాయిలో నుంచి నీళ్లు రావట్లేదని నేను బయటికి వస్తుంటే, నీళ్లు తెస్తూ అమ్మ ఎదురు వచ్చింది. అది చూసి ‘ఏంటమ్మా ఇది’ అని అడిగాను.
‘ఈ రోజు మోటర్ పాడైపోయింది, నీకు స్నానానికి ఎక్కువ నీళ్లు కావాలి కదా! అందుకే బావిలో నుంచి నీళ్లు తోడి తీసుకొస్తున్నాను’ అని చెప్పింది. అమ్మ ప్రేమకు చలించిపోయాను. ఆ రోజు మా అమ్మని పట్టుకొని ఏడ్చేశాను. ఆ సంఘటన ఈ రోజుకీ నా మనసులో గుర్తుండిపోయింది.
మీ అమ్మగారు మీకిచ్చిన బెస్ట్ గిఫ్ట్ ?
ఒక గిఫ్టని చెప్పలేను, నా పుట్టినరోజు జనవరి 10. ప్రతి సంవత్సరం నాకు మా అమ్మ ఆ రోజుకి తప్పనిసరిగా ఒక వాచీ ఇస్తుంది. నేను ఇంత పెద్దవాడినైనా నాకు మనవళ్లు పుట్టినా కూడా ఆవిడకు నేను చిన్నపిల్లవాడినే. ఇప్పటికీ ఆవిడ నాకు ఇంకా వాచీ బహూకరిస్తూనే ఉంది.
మీరు మీ అమ్మగారికి ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్?
నేను మా అమ్మ ఇచ్చినట్టు ప్రతి సంవత్సరం ఇవ్వట్లేదు కానీ, ఒక గిఫ్ట్‌ను మాత్రం ఆమె ఎంజాయ్ చెయ్యటం నాకు ఇంకా గుర్తు. నా భార్య నిర్మల వాళ్లది విజయవాడ. మొదటి కాన్పు కోసం మా ఆవిడ పుట్టింటికి వెళ్లింది. మా పెద్దబ్బాయి అల్లు వెంకటేశ్ (అల్లు బాబి) అక్కడే పుట్టాడు. వాడిని చూడటానికి మా అమ్మ హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చింది.
ఆ సమయంలో నా భార్య ఒడిలో నిద్రపోతున్న బాబుకి చక్కగా తువ్వాలు చుట్టబెట్టి అమ్మ చేతికి అందించాను. వాడిని చూడగానే ఆవిడకు పట్టరాని సంతోషం కలిగింది. వాడిని గుండెలకు హత్తుకుని ముద్దులాడింది. ‘చాలా సంతోషంగా ఉందిరా నాన్నా’ అని నన్ను ఆశీర్వదించింది. ఆ సమయంలో ఆవిడ కళ్లల్లో ఆనందబాష్పాలు నాకు ఇప్పటికీ ఇంకా గుర్తు. మనకు ఏ మంచి జరిగినా మొట్టమొదటగా సంతోషపడేది అమ్మేనని ఆ రోజు అనుభవపూర్వకంగా అర్థం చేసుకున్నాను.
Comments
Please login to add a commentAdd a comment