
పుష్ప సినిమా 'ఊ అంటావా మామ' సాంగ్ ట్రెండ్ అయిన విషయం తెలిసిందే.. పుష్ప2లో కిస్.. కిస్.. కిస్సిక్ సాంగ్ వైరల్ అయింది. అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) తెరకెక్కించిన చిత్రం ‘పుష్ప 2 ది రూల్’. ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ కోసం నటి శ్రీలీల (Sreeleela) తనదైన గ్లామర్, స్టెప్పులతో దుమ్మురేపింది. అయితే, ఇప్పుడు ఆ సాంగ్ మేకింగ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. అత్యంత వేగంగా అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న దక్షిణాది పాటగా కిస్సిక్ రికార్డు సృష్టించింది. ఈ సాంగ్‌కు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిగా.. చంద్రబోస్ సాహిత్యం అందించారు. సింగర్ సుభ్లాషిణి ఆలపించారు. ఇప్పటికే ఫుల్ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో ఉంది. తాజాగా మేకింగ్ వీడియో రిలీజ్ చేయడంతో నెట్టింట ట్రెండ్ అవుతుంది. కిస్సిక్ అంటూ మీరూ చూసేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి.