ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘పుష్ప 2: ది రూల్’. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 1895 కోట్లు రాబట్టి అనేక రికార్డ్స్‌ను క్రియేట్ చేసింది. ఈ చిత్రం భారీ విజయం అందుకోవడంతో తాజాగా ‘థ్యాంక్స్ మీట్’ ఏర్పాటు చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ మూవీలో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటించారు. సంధ్య థియేటర్ ఘటన తర్వాత జరిగిన ఈ కార్యక్రమంలో బన్నీ తొలిసారి ఈ సినిమా గురించి మాట్లాడారు. ఈ వేదికపై అల్లు అర్జున్ మాట్లాడుతూ.. 'పుష్ప 2’(Pushpa 2) సినిమా రిలీజ్ సమయానికి మరో హిందీ చిత్రం రిలీజ్ కావాల్సింది. కానీ వాళ్లు వాయిదా వేసుకున్నారు. ఇలా ప్రతి ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ లభించింది.
పుష్ప సమయంలోనే కోవిడ్ ప్రారంభమైంది. ఈ సినిమా అసలు అవుద్దా అనిపించింది. కోవిడ్ టైమ్‌లో కూడా చాలా కష్టపడ్డాం. ముఖ్యంగా జాతర షూటింగ్ లాస్ట్ వరకు చూస్తానా అనిపించేది . మైత్రి మూవీస్ లాంటి ప్రొడ్యూసర్స్ లేకపోతే పుష్ప లాంటి సినిమా రాదు. ఈ చిత్రాన్ని ఆగస్టు 15న రిలీజ్ చేయాలనుకున్నాం. కానీ, చేయలేకపోయాం. డిసెంబరు 5న రిలీజ్ చేశాం. ‘పుష్ప’ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఐదేళ్ల ప్రయాణంలోని ప్రతి క్షణం నాకు ముఖ్యమే. 5 సంవత్సరాలు సుకుమార్ ఏది చెపితే అది పిచ్చొల్లులాగా వింటూనే పనిచేశాం.
సినిమాలో ఏది బాగుందని ప్రశంసలు దక్కినా అది డైరెక్టర్ గొప్పతనమే. విజయంలోని క్రెడిట్‌ను తాను తీసుకోకుండా సుకుమార్ అందరికీ పంచిచ్చేస్తుంటాడు. కానీ, ఈ విజయంలోని పూర్తి క్రెడిట్ తనకే సొంతం దేవిశ్రీ లేకుండా ‘పుష్ప’ను ఊహించడం చాలా కష్టం. తను ఈ సినిమాకు ఓ గొప్ప శక్తిని అందించాడు. ఈ సినిమాగానీ హిట్టైతే ఈ కష్టం అంతా నా ఫ్యాన్స్ కు అంకితం చేయాలనుకున్నాను... అంకితం చేస్తున్నాను. ‘పుష్ప 3’ గురించి నాకు, సుకుమార్‌గారికి తెలియదు. కానీ, అదొక అద్భుతంలా అయితే ఉంటుంది (నవ్వుతూ)’’ అని అల్లు అర్జున్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment