అమ్మతో మొదటి సెల్ఫీ.. | 'One day is not enough to thank moms' tweets Rakul | Sakshi
Sakshi News home page

అమ్మతో మొదటి సెల్ఫీ..

Published Sun, May 8 2016 4:02 PM | Last Updated on Sun, Sep 3 2017 11:41 PM

'One day is not enough to thank moms' tweets Rakul

అమ్మ.. అనంతమైన ప్రేమకు అసలైన అర్థం. ప్రాణం పణంగా పెట్టి బిడ్డకు జన్మనిస్తుంది.. ఆజన్మాంతం ప్రాణంగా ప్రేమిస్తుంది. ప్రపంచంలో ప్రత్యామ్నాయం దొరకనిది ఏదైనా ఉంటే.. అది అమ్మ ప్రేమే. ఎవరెంత చెప్పినా.. ఇంకా మిగిలే ఉంటుంది అమ్మ గురించి. ఈ గజిబిజి  బతుకుల్లో 'అమ్మ' కోసం ప్రత్యేకంగా రూపొందించుకున్న రోజే 'మదర్స్ డే'. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ దేశాల్లో మే నెలలోని రెండవ ఆదివారాన్ని మదర్స్ డే గా సెలబ్రేట్ చేసుకుంటారన్న విషయం తెలిసిందే.

ఆదివారం మదర్స్ డే సందర్భంగా సెలబ్రిటీలంతా 'సెల్ఫీ'లతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. అమ్మతో ఆత్మీయంగా దిగిన ఫొటోలు ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి మాధ్యమాల్లో కనువిందు చేస్తున్నాయి. అమ్మకు థాంక్యూ చెప్పడానికి ఒక్క రోజు సరిపోదు.., అమ్మను మించిన ఆనందమే లేదు.. అంటూ మదర్స్ డే సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ నటులు అల్లు అర్జున్, రానా, త్రిష, రకుల్ ప్రీత్, కాజల్, తమన్నా, హన్సిక తదితరులు అమ్మతో దిగిన సెల్ఫీలను, ఫొటోలను పోస్ట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకీ మీరు తీసుకున్నారా.. అమ్మతో సెల్ఫీ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement