కళాశాల విద్యార్థిని ఉరి వేసుకు ని ఆత్మహత్య చేసుకున్న ఘటన తరమణిలో చోటు చేసుకుంది. వివరాలు... తరమణి, భారతీయార్ నగరం
అన్నానగర్: కళాశాల విద్యార్థిని ఉరి వేసుకు ని ఆత్మహత్య చేసుకున్న ఘటన తరమణిలో చోటు చేసుకుంది. వివరాలు... తరమణి, భారతీయార్ నగరం వీధికి చెందిన మురుగన్ కుమార్తె నిర్మల(18). ఈమె మేడవాక్కంలోని ప్రైవేటు కళాశాలలో, బీబీఏ చదువుతున్నారు. ఇలా ఉండగా ఆదివారం రాత్రి నిర్మల ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న వేళచ్చేరి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.