BBA
-
బీబీఏ, బీసీఏ కోర్సు కనీస ఫీజు రూ.18 వేలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో తొలిసారి ప్రవేశపెట్టిన బీసీఏ, బీబీఏ కోర్సులకు ఏడాదికి కనీస ఫీజును రూ.18 వేలుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. 2024–25, 2025–26 విద్యా సంవత్సరాలకు ఈ ఫీజులు వర్తిస్తాయని ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సుమారు 35 ఇంజనీరింగ్ కళాశాలల్లో ఈ డిగ్రీ కోర్సులు తొలిసారిగా అందుబాటులోకి వచ్చాయి. ఇందులో గరిష్ట ఫీజు రూ.30 వేలుగా నిర్ణయించారు. వాస్తవానికి బీబీఏ, బీసీఏ కోర్సులకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీ) నుంచి అనుమతులు తీసుకోవాల్సి రావడంతో డిగ్రీ ప్రవేశాల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. కాగా, రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్ రెండు సార్లు వాయిదా పడింది. అయితే ఏఐసీటీఈ బీబీఏ, బీసీఏ కోర్సులు కోసం దరఖాస్తు చేసుకున్న ఇంజనీరింగ్ కళాశాలలు అనుమతివ్వడం, రాష్ట్ర ప్రభుత్వం వాటిని పరిశీలించి తొలిసారిగా ఫీజులు నిర్ణయించడంలో డిగ్రీ అడ్మిషన్లు అనుకున్న సమయంలో పూర్తి కాలేదు. గురువారం నుంచి డిగ్రీ ప్రవేశాలకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు చేసుకున్న అభ్యర్థులు ఆప్షన్లు ఎంపిక చేసుకుంటున్నారు. 5వ తేదీ వరకు ఆప్షన్ల ఎంపికకు ఉన్నత విద్యామండలి అవకాశం కల్పించగా.. 6వ తేదీ ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చని సూచించింది. 10వ తేదీన డిగ్రీ సీట్లు కేటాయింపు చేపట్టి 12వ తేదీ తరగతులు ప్రారంభించనుంది. సీట్లు పొందిన అభ్యర్థులు 16వ తేదీలోగా ఆయా కళాశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. 1.63 లక్షల దరఖాస్తులు ఏపీలోని డిగ్రీ కోర్సుల్లో మొత్తం 3.50 లక్షల సీట్లుండగా.. ఏటా 50 శాతం లోపు సీట్లు భర్తీ అవుతున్నాయి. ఈ ఏడాది 1.63 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఇటీవల బీబీఏ, బీసీఏ కోర్సులకు డిమాండ్ పెరగడంతోనే ఇంజనీరింగ్ కాలేజీలు సైతం ఈ కోర్సులను ప్రవేశపెట్టడం గమనార్హం. వీటితో పాటు మొత్తం డిగ్రీ కాలేజీల్లో దాదాపు 800 కళాశాలల్లో బీబీఏ, బీసీఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. -
ఛత్తీస్‌గఢ్‌కు మన పాఠాలు!
సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు తెలంగాణ ఆచార్యులు బోధించనున్నారు. ఇందుకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య సూత్రప్రాయమైన అంగీకారం కుదిరింది. త్వరలోనే ఈ మేరకు ఒప్పందం కూడా జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. హైదరాబాద్ జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూహెచ్) ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించనుంది. దీనిపై ఇప్పటికే రెండు రాష్ట్రాలకు చెందిన విశ్వవిద్యాలయాల ప్రతినిధులు పలు దఫాలుగా చర్చించారు. ఉన్నత విద్యలో జేఎన్టీయూహెచ్ తీసుకొస్తున్న సంస్కరణలు ఛత్తీస్‌గఢ్ వర్సిటీలను ఆకర్షించాయి. ప్రస్తుత పరిస్థితుల్లో తమ రాష్ట్రంలో నెలకొన్న ప్రొఫెసర్ల కొరతను కూడా ఆ రాష్ట్రం పరిగణలోనికి తీసుకుంది. ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందించేందుకు జేఎన్‌టీయూహెచ్‌ని సరైన భాగస్వామిగా ఎంచుకుంది. ముందుగా బీబీఏ డేటా అనలిస్ట్ కోర్సును ప్రారంభించాలని భావిస్తోంది. ఆ తర్వాత మరికొన్ని కోర్సులకు మన రాష్ట్ర అధ్యాపకుల తోడ్పాటు తీసుకునే అవకాశం ఉంది. కోర్సు నిర్వహణ, ఇతర అంశాలపై మరింత లోతుగా చర్చించాల్సి అవసరం ఉందని, ఆ తర్వాత అఖిల భారత సాంకేతిక విశ్వవిద్యాలయంతో పాటు మరికొన్ని సంస్థల అనుమతి తీసుకోవాల్సి ఉందని జేఎన్టీయూహెచ్ అధికారులు తెలిపారు. డిమాండ్ దృష్ట్యానే.. బీబీఏ డేటా అనలిస్ట్ కోర్సు గత కొంత కాలంగా ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. ఈ–కామర్స్ వ్యవస్థ బలపడుతున్న నేపథ్యంలో ఈ రంగంలో నిపుణుల అవస రం ఉందని అన్ని సర్వేలు చెబుతున్నాయి. భారత్‌లో డేటా అనలిస్ట్ పూర్తి చేసిన విద్యార్థులు అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాల్లో మంచి వేతనాలతో ఉపాధి పొందుతు న్నారు. మన దేశంలోనూ డేటా అనలిస్టుల కొరత 60 శాతం వరకూ ఉందని ఇటీవల సర్వేలు పేర్కొన్నాయి. దీన్ని దృష్టి లో ఉంచుకుని గత రెండేళ్ళుగా బీబీఏ డేటా అనలిస్ట్ కోర్సు ను అంతర్జాతీయ ప్రమాణాలతో జేఎన్టీయూహెచ్ అభివృద్ధి చేసింది. ఛత్తీస్‌గఢ్‌లోనూ బీబీఏ డేటా అనలిస్ట్ కోర్సుకు మంచి డిమాండ్ వస్తోంది. అయితే అక్కడ నిష్ణాతులైన అధ్యాపకుల కొరత కారణంగా ఈ కోర్సుకు అన్ని కాలేజీల్లోనూ అనుమతి ఇవ్వలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణతో భాగస్వామ్యానికి ఛత్తీస్‌గఢ్ సిద్ధమైంది. కోర్సు నిర్వహణ ఎలా? ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కాలేజీల్లో బీబీఏ అనలిస్ట్ కోర్సులో ప్రవేశాల ప్రక్రియను ఆ రాష్ట్రమే నిర్వహిస్తుంది. విద్యార్థులు ఆన్లైన్ ద్వారా జేఎన్టీయూహెచ్కు లాగిన్ అవుతారు. ఇక్కడ ఎంపిక చేసిన ప్రొఫెసర్లు ఆన్లైన్ ద్వారా వారికి బోధన చేస్తారు. దీనికి అనుగుణంగా రెండుచోట్లా ఒకే తరహా సిలబస్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. పరీక్షలు కూడా ఆన్లైన్లోనే చేపట్టినప్పటికీ, మూల్యాంకన విధానం మాత్రం తామే చేపడతామని ఛత్తీస్‌గఢ్ అధికారులు అంటున్నారు. దీనిపై భిన్నాభిప్రాయం వ్యక్తమవుతోంది. బోధించే అధ్యాపకులే మూల్యాంకనం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇలావుండగా ఈ కోర్సు నిర్వహణ కారణంగా జేఎన్టీయూహెచ్కు ఆదాయం పెరిగే అవకాశం ఉందని, అవసరమైతే కోర్సుకు సంబంధించిన సర్టిఫికెట్ ఇచ్చే అంశాలపైనా ఆలోచిస్తున్నట్టు జేఎన్టీయూహెచ్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మన అధ్యాపకులకు మంచి గుర్తింపు ఛత్తీస్‌గఢ్ కోరిక మేరకు బీబీఏ డేటా అనలిస్ట్ కోర్సుకు అవసరమైన బోధన తోడ్పాటు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. దీనివల్ల మన అధ్యాపకులకు మంచి గుర్తింపు ఉంటుంది. అయితే కోర్సు నిర్వహణపై సమాలోచనలు జరుగుతున్నాయి. అన్ని రకాల అనుమతులు వచ్చిన తర్వాత ప్రారంభించే యోచనలో ఉన్నాం. – ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి (జేఎన్టీయూహెచ్ వీసీ) -
పిఠాపురంలో బీబీఏ మూడో సంవత్సరం విద్యార్థిని అదృశ్యం
-
జైలుకు పంపించాలా?.. బీడీఏ, బీబీఎంపీపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, బనశంకరి(కర్ణాటక): బెంగళూరులో పార్కులు, మైదానాల్లో అక్రమ కట్టడాల నిర్మాణాల గురించి సర్వే నివేదిక అందజేయకపోవడంపై బీడీఏ, బీబీఎంపీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకరిద్దరిని జైలుకు పంపిస్తేగాని పరిస్థితి మారదని హెచ్చరించింది. న్యాయసేవల సమితి వేసిన పిటిషన్‌ను మంగళవారం విచారించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితురాజ్ అవస్తి.. కోర్టు ఆదేశాలను సంస్థలు పట్టించుకోవడం లేదని అన్నారు. బీబీఎంపీ కమిషనర్‌ను జైలుకు పంపిస్తామన్నారు. పార్కులు, మైదానాల్లో అక్రమ కట్టడాల నిర్మాణాలను సహించేదిలేదు, పెద్దవాళ్లపై చర్యలు తీసుకోవడానికి మీరు వెనుకాడవచ్చు కానీ మేము భయపడబోం. తక్షణం చర్యలు తీసుకోకపోతే అదికారులకు ఇబ్బందులు తప్పవని స్పష్టం చేశారు. సర్వే నివేదిక అందజేయడానికి మరో వారం గడువు ఇవ్వాలని బీబీఎంపీ వకీలు కోరారు. సుప్రీంలో పాలికె ఎన్నికల కేసు బీబీఎంపీ ఎన్నికల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. బీబీఎంపీ ఎన్నికలు జరపాలని మాజీ కార్పొరేటర్లు శివరాజు, అబ్దుల్ వాజిద్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. గతంలో రెండునెలల్లోగా ఎన్నికలు జరపాలని హైకోర్టు అదేశించగా, ప్రభుత్వం ఇప్పట్లో నిర్వహించలేమని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల విషయమై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వివరాలను ఒక నెలలోగా అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
TS EDCET 2021: నిబంధనలు సవరిస్తూ ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: బీఏ, బీకాం, బీఎస్సీ వంటి సంప్రదాయ కోర్సులు చదివిన వారు మాత్రమే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో (బీఎడ్) చేరే అవకాశం ఉండగా ఇకపై ఇతర సబ్జెక్టులు చదివిన వారికి బీఎడ్‌లో చేరే అవకాశం వచ్చింది. ఈ మేరకు బీఎడ్ ప్రవేశాల నిబంధనలను ప్రభుత్వం మార్పు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా జీవో 16 జారీ చేశారు. ఇప్పటివరకు డిగ్రీలో ఓరియంటల్ లాంగ్వేజెస్ చదువుకున్న వారికి బీఎడ్‌లో చేరే అవకాశం లేకపోగా ఇప్పుడు వారికి కొత్తగా అవకాశం దక్కింది. డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎస్సీ (హోంసైన్స్), బీసీఏ, బీబీఎం, బీఏ (ఓరియంటల్ లాంగ్వేజెస్), బీబీఏ, బీటెక్ చేసిన వారు కూడా బీఎడ్ చదివే వీలు ఏర్పడింది. వారు ఆయా డిగ్రీల్లో 50 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. ఇవి చదివిన వారంతా అర్హులే.. ► బీఎడ్ ఫిజికల్ సైన్స్ చేయాలంటే.. బీఎస్సీ విద్యార్థులు ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ లేదా సంబంధిత సబ్జెక్టును పార్ట్–2 గ్రూపులో చదివి ఉండాలి. బీటెక్ విద్యార్థులు ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ; బీసీఏ విద్యార్థులు ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ సబ్జెక్టులను ఇంటర్మీడియట్లో చదివి ఉంటే చాలు. ► బీఎడ్ బయోలాజికల్ సైన్స్‌లో చేరాలంటే బీఎస్సీ/బీఎస్సీ (హోంసైన్స్) చేసిన వారు బోటనీ, జువాలజీలో ఏదో ఒక సబ్జెక్టు డిగ్రీలో పార్ట్–2 గ్రూపులో చదివి ఉండాలి. బీసీఏ విద్యార్థులైతే ఇంటర్లో బయోలాజికల్ సైన్స్ చదివి ఉండాలి. ► బీఎడ్ సోషల్ సైన్సెస్ చేయాలంటే బీకాం/బీబీఎం/బీబీఏ/బీసీఏ అభ్యర్థులు ఇంటర్లో సోషల్ సైన్స్ చదివి ఉండాలి. ► ఓరియంటల్ లాంగ్వేజెస్‌లో బీఎడ్ చేయాలనుకునే వారు బీఏలో తెలుగు/హిందీ/మరాఠీ/ఉర్దూ/అరబిక్/సంస్కృతంను ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా చదివి ఉండాలి. లిటరేచర్ అభ్యర్థులు (బీఏ–ఎల్) తెలుగు/హిందీ/మరాఠీ/ఉర్దూ/అరబిక్/సంస్కృతం చదివి ఉంటే చాలు. బీఏ ఓరియెంటల్ లాంగ్వేజెస్ వారు తెలుగు/హిందీ/మరాఠీ/ఉర్దూ/అరబిక్/సంస్కృతం చదివి ఉండాలి. ఎంఏ తెలుగు/ హిందీ/ మరాఠీ/ ఉర్దూ/ అరబిక్/ సంస్కృతం చేసిన వారు కూడా అర్హులే. చదవండి: 10 వేలకు పైగా ఉద్యోగాలు.. ఆశావహులకు తీపికబురు NMDC Recruitment 2021: ఎన్ఎండీసీలో 89 పోస్టులు -
ప్రాణం తీసిన మాక్ డ్రిల్; నకిలీ ఎన్డీఎమ్ఏ ఉద్యోగి
సాక్షి, చెన్నై: కోయంబత్తూరు జిల్లా నర్సీపురంలోని కోవై కలైమగల్ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించిన మాక్ డ్రిల్‌లో 19 ఏళ్ల బీబీఏ స్టూడెంట్ లోగేశ్వరి ప్రమాదవశాత్తు మరణించిన సంగతి తెలిసింది. ఈ ఘటనకు బాధ్యుడైన అర్ముగం ప్రస్తుతం పోలీసులు రిమాండ్‌లో ఉన్నాడు. అయితే పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసలు అర్ముగం ఎన్డీఎమ్ఏ(నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటి) ఉద్యోగే కాదని తెలిసింది. కళాశాల యాజమాన్యం పూర్తి వివరాలు విచారించకుండానే అతన్ని మాక్ డ్రిల్ కోసం పిలిపించారని పోలీసు అధికారులు భావిస్తున్నారు. విచారణలో భాగంగా పోలీసులు అర్ముగం వివరాలను సేకరించారు. అయితే ఇవన్ని నకిలీవని తెలింది. అంతేకాక అతని ఇచ్చిన అడ్రస్ ప్రూఫ్ కూడా నకిలేదేనని నిర్ధారించారు. అతని దగ్గర దొరికిన ఎన్డీఎమ్ఏ గుర్తింపు పత్రాలు కూడా ఫోర్జరివేనని గుర్తించారు. అంతేకాక అర్ముగం తన ఫేస్బుక్ ప్రోఫైల్‌లో తనను తాను ఎన్డీఎమ్ఏ ఉద్యోగిగా ప్రకటించుకున్నట్లు తెలిసింది. కాలేజీ యాజమాన్యం కేవలం అర్ముగం ఫేస్బుక్ ప్రొఫైల్ చూసి అతన్ని ఎన్డీఎమ్ఏ సభ్యునిగా భావించారని, అతని పూర్తి వివరాలను తెలుసుకోలేదని తెలిపారు. విచారణ కోనసాగుతుందని పోలీసు అధికారులు తెలిపారు. అయితే మృతురాలి తల్లితండ్రులు తమ కుమార్తె మరణానికి కారణమైన కాలేజీ యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అతను ఎన్డీఎమ్ఏ సభ్యుడు కాదు: ఎన్డీఎమ్ఏ అర్ముగం తనను తాను ఎన్‌ఎమ్‌డీఏ ఉద్యోగిగా చెప్పుకుని కాలేజీలో మాక్ డ్రిల్ నిర్వహించి ఒకరి మరణానికి కారణమవడంతో స్వయంగా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎమ్ఏ) రంగంలోకి దిగింది. మాక్ డ్రిల్ నిర్వహించిన సభ్యుడు ఎన్‌డీఎమ్‌ఏకు చెందిన వ్యక్తి కాదని ప్రకటన విడుదల చేసింది. వివరాల ప్రకారం.. ‘ఇటువంటి మాక్ డ్రిల్స్‌కు ఎన్డీఎమ్ఏ అనుమతివ్వదు. కాలేజీలో నిర్వహించిన మాక్ డ్రిల్‌లో ఎన్డీఎమ్ఏ భాగస్వామ్యం లేదు. సదరు ట్రైనీ అసలు ఎన్‌డీఎమ్‌ఏకు చెందిన వ్యక్తే కాద’ని ప్రకటించింది. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఇటువంటి డ్రిల్స్ నిర్వహించకూడదని హెచ్చరించింది. ఏది ఏమైనా పొరపాటు జరిగిందని, ఒక నిండు ప్రాణం బలైందని సంతాపం తెలిపింది. -
విద్యార్థిని ఆత్మహత్య
అన్నానగర్: కళాశాల విద్యార్థిని ఉరి వేసుకు ని ఆత్మహత్య చేసుకున్న ఘటన తరమణిలో చోటు చేసుకుంది. వివరాలు... తరమణి, భారతీయార్ నగరం వీధికి చెందిన మురుగన్ కుమార్తె నిర్మల(18). ఈమె మేడవాక్కంలోని ప్రైవేటు కళాశాలలో, బీబీఏ చదువుతున్నారు. ఇలా ఉండగా ఆదివారం రాత్రి నిర్మల ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న వేళచ్చేరి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
ప్రత్యేక హోదా కోసం న్యాయవాదుల నిరసన
విజయవాడ లీగల్ : ప్రత్యేక హోదా కోరుతూ బెజవాడ బార్ అసోసియేషన్ (బీబీఏ) న్యాయవాదులు బుధవారం విధులు బహిష్కరించారు. సివిల్ కోర్టుల ప్రాంగణంలో బీబీఏ హాలు ఎదురుగా ఉన్న గాంధీజీ విగ్రహానికి వినతిపత్రం అందజేసి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీబీఏ అధ్యక్షుడు చోడిశెట్టి మన్మథరావు మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, హోదా ఇవ్వ కుండా కేంద్ర పభుత్వం దోబూచులాడుతుందన్నారు. హోదా ప్రకటించకపోతే యువత భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతుందని, రాష్ట్రంలో అభివృద్ధి నిలిచిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తొలుత న్యాయవాదులు విధులకు గైర్హాజరై, కోర్టుల ప్రాంగణం చుట్టూ తిరిగి నినాదాలు చేశారు. బీబీఏ ప్రతినిధులు డి.ఆంజనేయప్రసాద్, కె.చంద్రమౌళి, పి.శ్రీనివాసరావు, పి.కిరణ్,కె.వర ప్రసాదరావు, ఎన్.ప్రసాదరావు,సీనియర్ న్యాయవాదులు వి.గురునాథం, వెన్నా.రమేష్ చంద్రబాబు, గోగువెట్టి వెంకటేశ్వరరావు, ఎ.వి.రమణ, మద్ది జ్ఙానాంబ,కోట జయరాజ్, రాజకుమారి, కె.వి.రంగారావు పాల్గొన్నారు. -
ప్రజల హక్కులను కాపాడాలి
విజయవాడ లీగల్ : ప్రజల హక్కులు కాపాడడంలో న్యాయవాదులు కీలక పాత్ర వహించాలని హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చిత్తర్వు నాగేశ్వరరావు సూచించారు. బెజవాడ బార్ అసోసియేషన్ (బీబీఏ) హాలులో ‘సమాజంలో న్యాయవాదుల పాత్ర’ అనే అంశంపై సోమవారం సెమినార్ నిర్వహించారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో ఎంతో మంది న్యా యవాదులు ప్రజాప్రయోజన వ్యాజ్యల ద్వారా ప్రజా సంక్షేమానికి పాటు పడ్డారని చెప్పారు. ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు సుంకర రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ అవినీతిపై పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. కార్యక్రమంలో బీబీఏ అధ్యక్షడు సిహెచ్.మన్మథరా వు, డి.ఆంజనేయ ప్రసాదు, కె.చంధ్ర మౌళి, పి.శ్రీనివాసరావు, పి.కిరణ్, కె.వరప్రసాదరావు, సీనియర్ న్యాయవాదులు చేకూరి శ్రీపతిరావు, సిహెచ్.అజయ్‌కుమార్, పిళ్ళా రవి, సోము కృష్ణమూర్తి, రాజనాల హెహర్ మోహన్ పాల్గొన్నారు. ఎంపీ కేశినేనిని కలిసిన ప్రతినిధులు పార్లమెంట్ సభ్యుడు కేశినేని శ్రీనివాస్ (నాని)ని బెజవాడ బార్ అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం కలిశారు. పుష్కరాలకు వచ్చే న్యాయవాదులు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. బార్ వాష్ రూంకు నిధులు కేటాయించాలని కోరారు. స్పందించిన ఆయన కలెక్టర్‌తో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఎంపీని కలిసిన వారిలో బీబీఏ అధ్యక్షుడు సిహెచ్.మన్మథరావు, చేకూరి శ్రీపతిరావు, కె.వి.వి.పరమేశ్వరరావు, దాసరి ఆంజనేయ ప్రసాద్, కె.చంద్రమౌళి, కె.వరప్రసాదరావు, పి.శ్రీనివాసరావు, పి.కిరణ్ ఉన్నారు. -
హైకోర్టు సీజేను కలిసిన బీబీఏ ప్రతినిధులు
విజయవాడ లీగల్ : ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు పూర్తి అదనపు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ దిలీప్ బాబా సాహెబ్ బోసాలేని బెజవాడ బార్ అసోసియేషన్ (బీబీఏ)అధ్యక్షుడు చోడిశెట్టి మన్మథరావు సారథ్యంలో ప్రతినిధి బృందం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఆదివారం కలిశారు. కోర్టుల్లో న్యాయవాదులు, కక్షిదారులు ఎదుర్కొంటున్న సమస్యలు, నగరంలోని సివిల్ కోర్టుల ప్రాంగణంలో నిర్మిస్తున్న కోర్టుల బహుళ అంతస్తుల భవనాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. న్యాయవాదులు, కోర్టులు పలు చోట్ల ఉండటం వలన ఉదయం కాల్ వర్క్‌లో చాలా ఇబ్బందులు పడుతుమని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గతంలో విడుదలైన జీవో ప్రకారం మెట్రో పాలిటన్ సెషన్స్ జడ్జి, రెండో అదనపు జిల్లా జడ్జి కోర్టును వేర్వేరుగా చేయాలని వినతిపత్రంలో కోరారు. న్యాయమూర్తిని కలిసిన వారిలో బీబీఏ కార్యవర్గ సభ్యులు దాసరి ఆంజనేయ ప్రసాదు, కొత్త చంద్రమౌళి, పుప్పాల శ్రీనివాసరావు, పి.కిరణ్, కండెల వర ప్రసాదరావు, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు సుంకర రాజేంద్ర ప్రసాద్, సీనియర్ న్యాయవాదులు గోగుశెట్టి వెంకటేశ్వరరావు, ఎ.వి.రమణ, మట్టా జయకర్ ఉన్నారు. -
ఫైనాన్స్, అకౌంటింగ్లో సర్టిఫికెట్ కోర్స్
సాక్షి, బిజినెస్ బ్యూరో : కార్పొరేట్ ఫైనాన్స్‌లో చక్కని కెరీర్ కావాలనుకునే యువత కోసం ప్రత్యేకంగా ‘అప్లయిడ్ ఫైనాన్స్- అకౌంటింగ్లో సర్టిఫికెట్ కోర్సు’ను అందజేస్తున్నట్లు ఆంధ్రమహిళా సభ తెలియజేసింది. బీకామ్, బీబీఏ అర్హత గల యువత కోసం ఈ కోర్సును ప్రారంభిస్తున్నట్లు ఆంధ్ర మహిళాసభ ప్రొఫెసర్ సి.వి.రామ్మోహన్ తెలియజేశారు. మూడు నెలల వ్యవధి గల ఈ కోర్సుకు రూ.12,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఉస్మానియా క్యాంపస్ రోడ్లో ఉన్న ఆంధ్రమహిళా సభను సంప్రతించవచ్చు. ఏఎంఎస్ఎస్ఓఐ.ఓఆర్జీ.ఇన్ వెబ్‌సైట్‌ను కూడా సందర్శించవచ్చు. -
సొంతగూటికి మోడీ పెంచిన బిడ్డ!
-
బహుదూర్‌ను తల్లిదండ్రులకు అప్పగించిన మోడీ!
ఖట్మండు: భారత ప్రధాని నరేంద్రమోడీ మానవతా దృక్పథానికి నిలువుటద్దంలా నిలిచారు. నిస్సహాయ స్థితిలో 16 ఏళ్ల కిందట మోడీని కలిసిన బహుదూర్ ను చేరదీసి మోడీ విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. అహ్మదాబాద్‌లో ప్రస్తుతం బహుదూర్ బీబీఏ చదువుతున్నాడు. మోడీ ప్రధాని పీఠాన్ని చేపట్టిన తర్వాత బహుదూర్ యూనివర్శిటీ హాస్టల్‌కు మారారు. రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని మోడీ నేపాల్ కు చేరుకున్న సందర్భంగా బహుద్దూర్ ను మోడీ తల్లిదండ్రులకు అప్పగించారు. ప్రధాని మోడీ సమక్షంలో తల్లిదండ్రులను బహుదూర్ కలుసుకున్నారు. ఇరుదేశాల అధికారుల సమక్షంలో బహుదూర్ ను మోడీ అప్పగించారు. -
విశాఖలో విద్యార్థులను మోసం చేసిన AIM సంస్థ