బహుదూర్‌ను తల్లిదండ్రులకు అప్పగించిన మోడీ!
ఖట్మండు: భారత ప్రధాని నరేంద్రమోడీ మానవతా దృక్పథానికి నిలువుటద్దంలా నిలిచారు. నిస్సహాయ స్థితిలో 16 ఏళ్ల కిందట మోడీని కలిసిన బహుదూర్ ను చేరదీసి మోడీ విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. అహ్మదాబాద్‌లో ప్రస్తుతం బహుదూర్ బీబీఏ చదువుతున్నాడు.
మోడీ ప్రధాని పీఠాన్ని చేపట్టిన తర్వాత బహుదూర్ యూనివర్శిటీ హాస్టల్‌కు మారారు. రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని మోడీ నేపాల్ కు చేరుకున్న సందర్భంగా బహుద్దూర్ ను మోడీ తల్లిదండ్రులకు అప్పగించారు.
ప్రధాని మోడీ సమక్షంలో తల్లిదండ్రులను బహుదూర్ కలుసుకున్నారు. ఇరుదేశాల అధికారుల సమక్షంలో బహుదూర్ ను మోడీ అప్పగించారు.