Jeet Bahadur
-
చంపేస్తారేమోనని భయపడ్డాం..
షాజహాన్‌పూర్: రెండున్నరేళ్ల క్రితం అఫ్గాన్ వెళ్లిన ఓ భారతీయుడు తాలిబన్ ఆక్రమణ అనంతరం తిరిగి భారత్‌కు చేరుకోవడానికి చేసిన ప్రయత్నాలను వివరించారు. తాలిబన్ల చేతిలో దాదాపుగా మరణం ఖాయమనుకున్న పరిస్థితి నుంచి ప్రాణాలతో బయట పడిన సంఘటనలను వణుకుతూ చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని చినోరె గ్రామానికి చెందిన జీత్ బహదూర్ రెండున్నరేళ్ల క్రితం అఫ్గాన్‌లోని ఓ కన్సల్టెన్సీలో సూపర్వైజర్గా చేరారు. అయితే తాలిబన్లు అఫ్గాన్‌ను ఆక్రమించాక పరిస్థితులు మారిపోయాయి. కార్యాలయాలన్నీ మూతబడ్డాయి. దీంతో మరో మార్గం లేక భారత్‌కు తిరిగి వచ్చేందుకు జీత్ సహా అదే కంపెనీలో పని చేస్తున్న 118 మంది భారతీయులు నిర్ణయించుకున్నారు. ఈ నెల 18న కాబూల్ విమానాశ్రయానికి వచ్చారు. విమానాశ్రయానికి చేరుకోవడానికి ముందే తాలిబన్లు జీత్ వద్ద ఉన్న రూ. లక్ష నగదును, ఇతర వస్తువులను దోచుకున్నారు. డెన్మార్క్ ఎంబసీ వద్దకు చేరుకున్న వారిని ‘మీరు అఫ్గాన్ హిందువులా’ అని తాలిబన్లు ప్రశ్నించారు. అయితే తాము భారతీయ హిందువులమని చెప్పడంతో వారిని వదిలేశారు. నగదు దోచుకోవడం గురించి ప్రశ్నించగా, అది తాలిబన్లు చేయలేదని సమాధానమిచ్చారని చెప్పారు. తమ తాలిబన్లు అలాంటి పనులకు పాల్పడరని పేర్కొన్నారు. దీంతో చీకట్లోనే వారు నడుచుకుంటూ విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే అప్పటికే వేలాది మంది పౌరులు విమానాశ్రయం వద్దే పడిగాపులు కాస్తున్నారు. అక్కడికి చేరుకున్న జీత్ బృందం దాదాపు మూడు రోజుల పాటు ఎలాంటి తిండీ తిప్పలు లేకుండా గడిపారు. ఇదిలా ఉండగా, తమకు తిండి లేక అల్లాడుతున్న సమయంలోనే తాలిబన్లు అక్కడి చేరుకొని తమను అయిదు గంటల పాటు ఆరుబయట నేల మీద కూర్చోబెట్టారని అన్నారు. అత్యాధునిక ఆయుధాలు ధరించి ఉన్న తాలిబన్లు తమను హతం చేస్తారని భావించినట్లు చెప్పారు. అయితే భారత్ నుంచి వచ్చిన ఆర్మీ విమానం తమను ఎక్కించుకొని ఈ నెల 22న ఢిల్లీ బయలుదేరిందని చెప్పారు. అప్రకటిత కర్ఫ్యూ.. అఫ్గానిస్తాన్‌లో ప్రస్తుతం అప్రకటిత కర్ఫ్యూ కొనసాగుతోందని జీత్ పేర్కొన్నారు. అన్ని కార్యాలయాలు మూతబడ్డాయని చెప్పారు. ఇంట్లో నుంచి బయటకు ఎవరూ రావడం లేదన్నారు. రోడ్ల మీద మహిళలు, పిల్లలు కనిపించడం లేదని పేర్కొన్నారు. మహిళల మీద తాలిబన్లు దాడులు చేసిన ఘటనలేమీ లేనప్పటికీ, గతాన్ని తలచుకొని చాలా మంది భయపడుతున్నారని అన్నారు. దేశం విడిచి వెళ్లవద్దని, ఎలాంటి హాని కలిగించబోమని తాలిబన్లు చెబుతున్నారని వెల్లడించారు. కాబూల్ నుంచి భారత్‌కు 75 మంది.. న్యూఢిల్లీ: తాలిబన్ పాలనలోకి వెళ్లిపోయిన అఫ్గాన్ నుంచి వలసలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అఫ్గాన్ రాజధాని కాబూల్ నుంచి 75 మంది పౌరులతో పాటు, సిక్కు పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ్ సాహిబ్ ప్రతులను మూడింటిని భద్రంగా అఫ్గాన్ నుంచి భారత్‌కు ఐఏఎఫ్ యుద్ధ విమానం ద్వారా పంపినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 45 మంది అఫ్గాన్ సిక్కులు, హిందువులు ఉన్నట్లు తెలిపారు. మరో 200 మంది అఫ్గాన్ సిక్కులు, హిందువులు దేశం విడిచేందుకు ఎదురు చూస్తున్నారని ఇండియన్ వరల్డ్ ఫోరం అధ్యక్షుడు పునీత్ సింగ్ చంధోక్ తెలిపారు. గత కొద్ది రోజులుగా వీరు కాబూల్ విమానాశ్రయానికి 10 కిలోమీటర్ల దూరంలోని గురుద్వారా కర్తే పర్వాన్‌లో ఆశ్రయం పొందినట్లు తెలిపారు. వీరిని తాలిబన్ చెక్‌పోస్టుల నుంచి తప్పిస్తూ అమెరికా బలగాలు విమానాశ్రయానికి చేర్చాయని పేర్కొన్నారు. ఈ సంస్థ భారత విదేశాంగ శాఖ, భారత వాయు సేన (ఐఏఎఫ్)లతో కలసి అఫ్గాన్ నుంచి పౌరులను తరలిస్తోంది. అఫ్గాన్ నుంచి వచ్చిన పౌరులు, గురు గ్రంథ్ సాహిబ్ గురించి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి కూడా ట్వీట్ చేశారు. మరోవైపు ఖతార్ రాజధాని దోహా నుంచి నాలుగు ప్రత్యేక విమానాల ద్వారా 146 మంది పౌరులు సోమవారం భారత్ చేరుకున్నారు. -
మోడీ చలవతో.. సెలెబ్రిటీగా మారిన జీత్
ఖాట్మండ్: భారత ప్రధాని నరేంద్ర మోడీ సంరక్షణలో విద్యాబుద్దులు నేర్చి ప్రయోజకుడైన నేపాలీ కుర్రాడు జీత్ బహదూర్ ఒక్కసారిగా సెలెబ్రిటీగా మారిపోయాడు. నేపాల్‌లో పర్యటించిన నరేంద్ర మోడీ జీత్‌ను అతని కుటుంబ సభ్యులకు అప్పగించిన సంగతి తెలిసిందే. దీంతో మొన్నటి వరకు బాహ్య ప్రపంచానికి తెలియని 26 ఏళ్ల జీత్.. భారత్, నేపాల్‌లోని వార్తపత్రికలు, టీవీ చానెళ్లలో పాపులర్ అయ్యాడు. నేపాల్‌లోని నవల్పారసి జిల్లా లోకహ గ్రామం జీత్ సొంతూరు. ఆదివారం రాత్రి జీత్ సొంతూరుకు వెళ్లాడు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ప్రాంతాల వారు జీత్‌ను చూడటానికి అతని చిన్న ఇంటి ముందు బారులు తీరుతున్నారు. సాధారణ ప్రజలేగాక జర్నలిస్టులు, స్థానిక నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా వస్తున్నారు. జీత్ అందరితో ముచ్చటిస్తూ తీరికలేకుండా గడుపుతున్నాడు. భద్రత సిబ్బంది సాధారణ దుస్తుల్లో అతనికి రక్షణ కల్పిస్తున్నారు. సందర్శకుల కోసం అతని ఇంటి ముందు ప్రత్యేకంగా టెంట్ వేశారు. అహ్మదాబాద్‌లో బీబీఏ చదువుతున్న జీత్ వారం తర్వాత భారత్ తిరిగిరానున్నాడు. చిన్నతనంలో నేపాల్ నుంచి పారిపోయి వచ్చిన జీత్‌ను మోడీ చేరదేశారు. అతణ్ని చదవించి ప్రయోజకుడిని చేశారు. -
నా బిడ్డకు మోడీ కొత్త జీవితాన్ని ఇచ్చారు!
కఠ్మాండు: 'నేను నా బిడ్డకు జన్మినిస్తే.. భారత ప్రధాని నరేంద్ర మోడీ నా కొడుక్కి కొత్త జీవితాన్ని ప్రసాదించారని' జీత్ బహదూర్ తల్లి ఖాగిసర మగర్ తెలిపారు. పదహారేళ్లకిందట పరదేశంలో తప్పిపోయిన కొడుకును మోడీ తిరిగి తమ చెంతకు చేర్చడంతో ఆ నిరుపేద నేపాలీ కుటుంబంలో ఆనందంలో మునిగిపోయింది. పదేళ్ల వయసులో అన్న దశరథ్ వెంట భారత్‌కు వచ్చిన జీత్ బహదూర్ తప్పిపోయాడు. అదృష్టంకొద్ది అహ్మదాబాద్‌లో ప్రస్తుత భారత ప్రధాని నరేంద్రమోడీ వద్దకు చేరాడు. అప్పటినుంచి మోడీ సంరక్షణలోనే ఉంటున్న 26 ఏళ్ల జీత్ ఎట్టకేలకు తల్లిదండ్రుల వద్దకు చేరాడు. జీత్ కుటుంబం గురించి చేసిన అన్వేషణ ఫలించడంతో నేపాల్ పర్యటనకు వచ్చిన మోడీ ఆదివారం అతడిని తల్లి ఖగిసర, అన్న దశరథ్ సురుమగర్కు అప్పగించారు. ఆ సందర్భంగా జీత్ బహదూర్ తల్లి కన్నీటి పర్యంతమైయ్యారు. 'నేను జన్మనిస్తే.. మీరు మాత్రం నా బిడ్డకు చక్కటి మార్గం చూపించారని, భవిష్యత్తులో నా కుమారుని ఉన్నత విద్యకు మీ సలహాలు తప్పకుండా తీసుకుంటామని' ఆమె మోడీతో అన్నారు. -
16 ఏళ్ల తర్వాత కుటుంబం వద్దకు
కఠ్మాండు: పదహారేళ్లకిందట పరదేశంలో తప్పిపోయిన కొడుకు తిరిగి తమ చెంతకు చేరడం ఆ నిరుపేద నేపాలీ కుటుంబంలో ఆనందం నింపింది. పదేళ్ల వయసులో అన్న దశరథ్ వెంట భారత్‌కు వచ్చిన జీత్ బహదూర్ తప్పిపోయాడు. అదృష్టంకొద్ది అహ్మదాబాద్‌లో ప్రస్తుత భారత ప్రధాని నరేంద్రమోడీ వద్దకు చేరాడు. అప్పటినుంచి మోడీ సంరక్షణలోనే ఉంటున్న 26 ఏళ్ల జీత్ ఇప్పుడు బీబీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు. జీత్ కుటుంబం గురించి చేసిన అన్వేషణ ఫలించడంతో నేపాల్ పర్యటనకు వచ్చిన మోడీ ఆదివారం అతడిని తల్లి ఖగిసర, అన్న దశరథ్ సురుమగర్కు అప్పగించారు. కన్న కొడుకులా జీత్‌కు విద్యాబుద్ధులు చెప్పించి తమ వద్దకు చేర్చినందుకు తల్లి ఖగిసర మోడీకి ధన్యవాదాలు తెలిపింది. కొడుకును మళ్లీ కలుసుకున్నందుకు ఎలా అనిపిస్తోందని మోడీ ఆమెను అడిగారు. మోడీ తనను ఎంతో ఆదరంగా చూసుకున్నారని జీత్ చెప్పాడు. ఖగిసర కుటుంబం నేపాల్‌లోని నవాల్పరాస్ జిల్లాలో మురికివాడలో ఆ కుటుంబం నివసిస్తోంది. కుటుంబాన్ని కలుసుకున్నప్పటికీ భారత్‌లోనే చదువు పూర్తిచేస్తానని జీత్ తెలిపాడు. హిందీలో బాగా మాట్లాడే జీత్... నేపాలీభాషను దాదాపు మరచిపోయాడు. కొద్దిగామాత్రం అర్థంచేసుకోగలుగుతున్నాడు. ఇన్నాళ్లూ ఓ వీఐపీవద్ద పెరిగినందుకు ఆనందంగా ఉందని, అయితే వీఐపీ వద్ద ఉంటున్నానన్న భావన తనకు ఎప్పుడూ కలగలేదని జీత్ అన్నాడు. -
సొంతగూటికి మోడీ పెంచిన బిడ్డ!
-
బహుదూర్‌ను తల్లిదండ్రులకు అప్పగించిన మోడీ!
ఖట్మండు: భారత ప్రధాని నరేంద్రమోడీ మానవతా దృక్పథానికి నిలువుటద్దంలా నిలిచారు. నిస్సహాయ స్థితిలో 16 ఏళ్ల కిందట మోడీని కలిసిన బహుదూర్ ను చేరదీసి మోడీ విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. అహ్మదాబాద్‌లో ప్రస్తుతం బహుదూర్ బీబీఏ చదువుతున్నాడు. మోడీ ప్రధాని పీఠాన్ని చేపట్టిన తర్వాత బహుదూర్ యూనివర్శిటీ హాస్టల్‌కు మారారు. రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని మోడీ నేపాల్ కు చేరుకున్న సందర్భంగా బహుద్దూర్ ను మోడీ తల్లిదండ్రులకు అప్పగించారు. ప్రధాని మోడీ సమక్షంలో తల్లిదండ్రులను బహుదూర్ కలుసుకున్నారు. ఇరుదేశాల అధికారుల సమక్షంలో బహుదూర్ ను మోడీ అప్పగించారు. -
మోడీ పెంచిన బిడ్డ తల్లిదండ్రుల చెంతకు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నేపాల్ పర్యటనకు మానవతా కోణంతో కూడిన ఓ ప్రత్యేకత ఉంది. పసితనంలో నిస్సహాయ స్థితిలో మోడీ వద్ద పెరిగిన జీత్ బహదూర్ అనే ఓ బాలుడు ఇన్నేళ్లకు బీబీఏ డిగ్రీ విద్యార్థిగా ఎదిగి, నేపాల్‌లోని తన తల్లిదండ్రులను ఆదివారం కలుసుకోబోతున్నాడు. మోడీనే స్వయంగా అతన్ని వారికి అప్పగించనున్నారు. మోడీ ట్విట్టర్లో ఈ విషయం చెప్పారు. కొన్నేళ్ల కిందట తాను బహదూర్‌ను ఎలా కలుసుకున్నదీ వివరించారు. పసితనంలో, ఏ భాషా అర్థంచేసుకోలేని స్థితిలో బహదూర్ తన దృష్టిలో పడ్డాడని, చదువులో ఆటల్లో ఆసక్తి పెంచుకుని, గుజరాతీ నేర్చుకున్నాడనితెలిపారు. అదృష్టవశాత్తూ ఇన్నాళ్లకు అతని తల్లిదండ్రులను గుర్తించగలిగామని, బహదూర్ కాలికి ఆరువేళ్లు ఉండటంతో వారు అతన్ని గుర్తించేందుకు వీలైందన్నారు. జీత్ బహదూర్ పూర్తిపేరు జీత్ బహదూర్ మాగర్. అతని కుటుంబం పశ్చిమ నేపాల్‌లోని కవసోటీ మునిసిపాలిటీలో ఒక మురికివాడలో ఉంటోంది. నేపాల్ పత్రికలు అందించిన సమాచారం.. ప్రకారం జీత్ బహదూర్ ప్రస్తుతం బీబీఏ చదువుతున్నాడు. 1998లో పలువురు నేపాలీయులు భారత్‌కు వలసవచ్చినపుడు బహదూర్ కూడా తన అన్నతో కలసి రాజస్థాన్ చేరుకున్నాడు. అయితే, అతని అన్న రాజస్థాన్‌లో తను చేస్తున్నపని నచ్చకపోవడంతో తిరిగి నేపాల్ వెళ్లాలనుకున్నాడు. వెళ్లేటపుడు, నేపాల్ సరిహద్దులోని గోరఖ్‌పూర్ వెళ్లే రైలు ఎక్కాల్సిన బహదూర్,.. పొరపాటున అహ్మదాబాద్ రైలు ఎక్కేశాడు. అహ్మదాబాద్ చేరుకున్న బహదూర్‌ను గమనించిన ఓ మహిళ అతన్నిమోడీ ఇంటికి తీసుకెళ్లింది. అప్పటికి మోడీ ముఖ్యమంత్రి కాదు. అప్పటి నుంచి మోడీ సంరక్షణలోనే బహదూర్ పెరిగాడు. మోడీ ప్రధాని అయ్యాక ఆయనతో పాటు ఢిల్లీ చేరుకున్నాడు. అతని బస యూనివర్సిటీ హాస్టల్‌కు మారింది. ఇన్నాళ్లూ మోడీ సంరక్షణలో పెరిగిన బహదూర్‌ను తమతో తీసుకెళ్లేందుకు, మోడీని కలుసుకునేందుకు బహదూర్ తల్లి, అన్న, వదిన, చెల్లి ఇప్పటికే కఠ్మూండూ చేరుకున్నారు. కఠ్మాండూలోని భారతీయ రాయబార కార్యాలయం ఇందుకు ఏర్పాట్లు చేసింది. మోడీ తన సమక్షంలోనే బహదూర్‌ను అతని కుటుంబంతో కలవాలని ఆశిస్తున్నారని జీత్ బహదూర్ అన్న దశరథ్ చెప్పారు.