మోడీ చలవతో.. సెలెబ్రిటీగా మారిన జీత్ | Narendra Modi's Jeet Bahadur a celebrity at home | Sakshi
Sakshi News home page

మోడీ చలవతో.. సెలెబ్రిటీగా మారిన జీత్

Published Tue, Aug 5 2014 4:48 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

మోడీ చలవతో.. సెలెబ్రిటీగా మారిన జీత్ - Sakshi

మోడీ చలవతో.. సెలెబ్రిటీగా మారిన జీత్

ఖాట్మండ్: భారత ప్రధాని నరేంద్ర మోడీ సంరక్షణలో విద్యాబుద్దులు నేర్చి ప్రయోజకుడైన నేపాలీ కుర్రాడు జీత్ బహదూర్ ఒక్కసారిగా సెలెబ్రిటీగా మారిపోయాడు. నేపాల్లో పర్యటించిన నరేంద్ర మోడీ జీత్ను అతని కుటుంబ సభ్యులకు అప్పగించిన సంగతి తెలిసిందే.

దీంతో మొన్నటి వరకు బాహ్య ప్రపంచానికి తెలియని 26 ఏళ్ల జీత్.. భారత్, నేపాల్లోని వార్తపత్రికలు, టీవీ చానెళ్లలో పాపులర్ అయ్యాడు. నేపాల్లోని నవల్పారసి జిల్లా లోకహ గ్రామం జీత్ సొంతూరు. ఆదివారం రాత్రి జీత్ సొంతూరుకు వెళ్లాడు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ప్రాంతాల వారు జీత్ను చూడటానికి అతని చిన్న ఇంటి ముందు బారులు తీరుతున్నారు. సాధారణ ప్రజలేగాక జర్నలిస్టులు, స్థానిక నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా వస్తున్నారు. జీత్ అందరితో ముచ్చటిస్తూ తీరికలేకుండా గడుపుతున్నాడు. భద్రత సిబ్బంది సాధారణ దుస్తుల్లో అతనికి రక్షణ కల్పిస్తున్నారు. సందర్శకుల కోసం అతని ఇంటి ముందు ప్రత్యేకంగా టెంట్ వేశారు. అహ్మదాబాద్లో బీబీఏ చదువుతున్న జీత్ వారం తర్వాత భారత్ తిరిగిరానున్నాడు. చిన్నతనంలో నేపాల్ నుంచి పారిపోయి వచ్చిన జీత్ను మోడీ చేరదేశారు. అతణ్ని చదవించి ప్రయోజకుడిని చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement