హైకోర్టు సీజేను కలిసిన బీబీఏ ప్రతినిధులు
Published Mon, Jul 25 2016 12:23 AM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM
విజయవాడ లీగల్ :
ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు పూర్తి అదనపు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ దిలీప్ బాబా సాహెబ్ బోసాలేని బెజవాడ బార్ అసోసియేషన్ (బీబీఏ)అధ్యక్షుడు చోడిశెట్టి మన్మథరావు సారథ్యంలో ప్రతినిధి బృందం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఆదివారం కలిశారు. కోర్టుల్లో న్యాయవాదులు, కక్షిదారులు ఎదుర్కొంటున్న సమస్యలు, నగరంలోని సివిల్ కోర్టుల ప్రాంగణంలో నిర్మిస్తున్న కోర్టుల బహుళ అంతస్తుల భవనాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. న్యాయవాదులు, కోర్టులు పలు చోట్ల ఉండటం వలన ఉదయం కాల్ వర్క్‌లో చాలా ఇబ్బందులు పడుతుమని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గతంలో విడుదలైన జీవో ప్రకారం మెట్రో పాలిటన్ సెషన్స్ జడ్జి, రెండో అదనపు జిల్లా జడ్జి కోర్టును వేర్వేరుగా చేయాలని వినతిపత్రంలో కోరారు. న్యాయమూర్తిని కలిసిన వారిలో బీబీఏ కార్యవర్గ సభ్యులు దాసరి ఆంజనేయ ప్రసాదు, కొత్త చంద్రమౌళి, పుప్పాల శ్రీనివాసరావు, పి.కిరణ్, కండెల వర ప్రసాదరావు, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు సుంకర రాజేంద్ర ప్రసాద్, సీనియర్ న్యాయవాదులు గోగుశెట్టి వెంకటేశ్వరరావు, ఎ.వి.రమణ, మట్టా జయకర్ ఉన్నారు.
Advertisement
Advertisement