ప్రజల హక్కులను కాపాడాలి
ప్రజల హక్కులను కాపాడాలి
Published Mon, Aug 8 2016 10:55 PM | Last Updated on Fri, Aug 31 2018 9:15 PM
విజయవాడ లీగల్ : ప్రజల హక్కులు కాపాడడంలో న్యాయవాదులు కీలక పాత్ర వహించాలని హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చిత్తర్వు నాగేశ్వరరావు సూచించారు. బెజవాడ బార్ అసోసియేషన్ (బీబీఏ) హాలులో ‘సమాజంలో న్యాయవాదుల పాత్ర’ అనే అంశంపై సోమవారం సెమినార్ నిర్వహించారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో ఎంతో మంది న్యా యవాదులు ప్రజాప్రయోజన వ్యాజ్యల ద్వారా ప్రజా సంక్షేమానికి పాటు పడ్డారని చెప్పారు. ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు సుంకర రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ అవినీతిపై పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. కార్యక్రమంలో బీబీఏ అధ్యక్షడు సిహెచ్.మన్మథరా వు, డి.ఆంజనేయ ప్రసాదు, కె.చంధ్ర మౌళి, పి.శ్రీనివాసరావు, పి.కిరణ్, కె.వరప్రసాదరావు, సీనియర్ న్యాయవాదులు చేకూరి శ్రీపతిరావు, సిహెచ్.అజయ్‌కుమార్, పిళ్ళా రవి, సోము కృష్ణమూర్తి, రాజనాల హెహర్ మోహన్ పాల్గొన్నారు.
ఎంపీ కేశినేనిని కలిసిన ప్రతినిధులు
పార్లమెంట్ సభ్యుడు కేశినేని శ్రీనివాస్ (నాని)ని బెజవాడ బార్ అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం కలిశారు. పుష్కరాలకు వచ్చే న్యాయవాదులు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. బార్ వాష్ రూంకు నిధులు కేటాయించాలని కోరారు. స్పందించిన ఆయన కలెక్టర్‌తో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఎంపీని కలిసిన వారిలో బీబీఏ అధ్యక్షుడు సిహెచ్.మన్మథరావు, చేకూరి శ్రీపతిరావు, కె.వి.వి.పరమేశ్వరరావు, దాసరి ఆంజనేయ ప్రసాద్, కె.చంద్రమౌళి, కె.వరప్రసాదరావు, పి.శ్రీనివాసరావు, పి.కిరణ్ ఉన్నారు.
Advertisement