![Senior Actress Vennira Aadai Nirmala About Bad Incident - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/20/Senior%20Actress%20Vennira%20Aadai%20Nirmala01.jpg.webp?itok=VYerFGs_)
ఒకప్పుడు తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ వెన్నిరాడై నిర్మల. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం అనే బేధాలు లేకుండా దక్షిణాదిన అన్ని భాషల్లో నటించిందామె. వందలాది చిత్రాలు చేసిన ఆమె తన సహజ నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. వెన్నెలాడె చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఆమె హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నాలుగు వందలకు పైగా చిత్రాలు చేసింది. తెలుగులో భక్త ప్రహ్లాద, కరుణామయుడు, శ్రీ సీతారాముల కల్యాణం చూద్దము రారండి, కలిసుందాం రా, జయం మనదేరా, నిన్నే ప్రేమిస్తా వంటి అనేక తెలుగు చిత్రాలు చేసింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ఎదురైన చేదు అనుభవాన్ని చెప్పుకొచ్చింది.
'ఒక రోజు ఏమైందంటే.. సినిమా షూటింగ్ అయిపోయాక ఇంటికి వచ్చేశా. ఆ సినిమాలోని హీరో నా ఇంటికి అర్ధరాత్రి తాగి వచ్చి తలుపు తట్టాడు. నేను డోర్ ఓపెన్ చేయలేదు. అతడేమో అలాగే తలుపు తడుతూనే ప్లీజ్, డోర్ ఓపెన్ చేయండి, నేనేం చేయను.. జస్ట్ లోపలకు వచ్చి నీ పక్కనే నిద్రించి వెళ్లిపోతా అన్నాడు. తర్వాతి రోజు నుంచి నేను షూటింగ్‌కే వెళ్లలేదు సరికదా సినిమా కూడా చేయనని చెప్పేశాను. దర్శకనిర్మాతలు నన్ను ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ నా వల్ల కాదంటూ సినిమా నుంచి వైదొలిగాను. ఇలాంటివాటిని నేనస్సలు సహించను' అని చెప్పుకొచ్చింది నిర్మల.
Comments
Please login to add a commentAdd a comment