మన హెచ్‌1బి వీసాలు మనకే.. ఆందోళన వద్దు | H-1B visa for professionals would not come down: Nirmala | Sakshi

మన హెచ్‌1బి వీసాలు మనకే..ఆందోళన వద్దు

May 20 2017 5:05 PM | Updated on Sep 26 2018 6:44 PM

మన హెచ్‌1బి వీసాలు మనకే.. ఆందోళన వద్దు - Sakshi

మన హెచ్‌1బి వీసాలు మనకే.. ఆందోళన వద్దు

హెచ్‌ 1బి వీసాల అమెరికా కొత్త నిబంధనలపై ఆందోళన చెందాల్సిన అవసరంలేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ చెప్పారు.

న్యూఢిల్లీ: హెచ్‌ 1బి  వీసాల  అమెరికా కొత్త నిబంధనలపై   ఆందోళన చెందాల్సిన అవసరంలేదని  కేంద్ర వాణిజ్య ,  పరిశ్రమల శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ చెప్పారు. వివాదాస్పద వీసా సమస్యలపై   భారతీయ టెక్‌ నిపుణులు, ఐటీ  పరిశ్రమను భయపడాల్సిన అవసరం లేదని  భరోసా ఇచ్చారు.  వీసా జారీ ప్రక్రియలో అమెరికా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు  చేపట్టింది తప్ప, భారతీయులకు జారీ చేసే వీసాల సంఖ‍్య తగ్గదని తెలిపారు.  ఇప్పటివరకు  మనకు  లభిస్తున్న హెచ్‌ 1 బీ వీసాలు మనకు దక్కుతాయని కేంద్రమంత్రి హామీ  ఇచ్చారు.

మూడు సంవత్సరాలకాలంలో మంత్రిత్వ శాఖ సాధించిన విజయాలపై  పుస్తకాన్ని సీతారామన్  శనివారం  ఆవిష్కరించారు. అనతరం విలేఖరులతో మాట్లాడుతూ వీసాలపై  భయాందోళన చెందాల్సిన  అవసరం లేదని ఐటి పరిశ్రమను కోరారు.  హెచ్‌ 1 బీ వీసాల జారీకి లాటరీ ప్రక్రియలో మార్పులు  తేవాలని అమెరికా  ప్రయత్నిస్తోందని   తాను భావిస్తున్నానన్నారు.   అంతే తప్పఇండియన్‌  టెకీలకు జారీ చేసి వీసాల సంఖ‍్య తగ్గదన్నారు. వీసా ఆందోళనలు  అమెరికా అధ్యక్షుడుగా ఒబామా ఉన్నపుడు  కూడా ఉన్నాయన్నారు. అయితే  వీసా జారీ ప్రక్రియలో మాత్రమే ట్రంప్‌ కొత్తగా జారీ చేసిన ఎగ్జిక్యూటివ్‌ ఆర్దర్‌ మార్పు తీసుకొచ్చిందన్నారు.

గత కొన్ని  రోజులుగా  అమెరికా  సహా  వివిధ అభివృద్ధి చెందిన దేశాలు  తమ  ఉద్యోగులను విదేశీ ఉద్యోగులకు కాకుండా  స్థానికులకు దక్కేలా రక్షణాత్మక చర్యలు  చేపడుతున్నాయన్నారు. ఇందులో భాగంగానే  అమెరికాలోని ట్రంప్‌ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోందన్నారు.   ముఖ్యంగా హెచ్‌ 1 బీ వీసాల జారీలో లాటరీ  పద్దతికి స్వస్తి పలికి ‌మెరిట్-ఆధారిత ఇమ్మిగ్రేషన్ పాలసీతో భర్తీ చేయాలని కోరుతోందని ఆమె చెప్పారు.

అలాగే అమెరికా వీసాల్లో కేవలం 17 శాతం మాత్రమే భారతీయ కంపెనీలకు వెళ్తున్నాయనీ, భారతీయ కంపెనీలు అందిస్తున్న సేవల ద్వారా అనేక అమెరికా కంపెనీలు లబ్ది పొందుతున్నాయని కేంద్రమంత్రి పేర్కొన్నారు. హెచ్‌ 1బీ వీసాల జారీ రివ్యూపై   భారత ఆందోళనలను అమెరికాకు  ఇప్పటికే వ్యక్తం చేసినట్టు  తెలిపారు. రెండు దేశాల మధ్య సానుకూల సంబంధాల నేపథ్యంలో వీటిని తిరిగి సమీక్షిస్తుందనే ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా పోటీ పడుతున్న అమెరికన్ కంపెనీలను తయారు చేయడానికి
 అధిక నైపుణ్యం  అవసరమైన చోట  ఫస్ట్‌ గ్రాడ్యుయేట్లను కాకుండా  కచ్చితంగా  నిపుణులకోసం అమెరికా చూస్తుందని నిర్మలా సీతారామన్‌   పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement