హెచ్-1బీ వీసా, ఇమ్మిగ్రేషన్ సంస్కరణల విషయంలో సోషల్ మీడియాలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే దీనికి ప్రపంచ కుబేరుడు 'ఇలాన్ మస్క్'(Elon Musk) మద్దతుగా నిలిచారు. ఈ వీసాల పరిరక్షణ కోసం అవసరమైతే యుద్ధానికైనా సిద్ధమేనని తేల్చిచెప్పారు. హెచ్-1బీ వీసాలను వ్యతిరేకిస్తున్న వారిపై బూతు ప్రయోగం కూడా చేశారు. దీనికి సంబంధించిన ట్వీట్స్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
స్పేస్ ఎక్స్ఎం, టెస్లా వంటి కంపెనీలను స్థాపించడానికి మాత్రమే కాకుండా.. నేను ఇప్పుడు అమెరికాలో ఉన్నానంటే దానికి కారణం హెచ్-1బీ వీసా (H-1B Visa) అని మస్క్ స్పష్టం చేశారు. హెచ్-1బీ వీసాల కారణంగానే దేశం బలమైన దేశంగా అవతరించింది. కాబట్టి వీసాలను వ్యతిరేకిస్తున్నవారు ఓ అడుగు వెనక్కి వేయండి అని టెస్లా బాస్ అన్నారు.
నిజానికి హెచ్-1బీ వీసాలను జారీ చేయడం వల్ల అమెరికాలోని ఉద్యోగాలను బయటి వ్యక్తులు సొంతం చేసుకుంటారు. కాబట్టి అమెరికా ఫస్ట్ నినాదాన్ని అమలు చేయనంటే ఈ వీసాల జారీ చేయకూడదని కరడుగట్టిన రిపబ్లికన్‌లు చెబుతున్నారు. దీనిపై ప్రస్తుతం మిశ్రమ స్పందనలు వినిపిస్తున్నాయి.
The reason I’m in America along with so many critical people who built SpaceX, Tesla and hundreds of other companies that made America strong is because of H1B.
Take a big step back and FUCK YOURSELF in the face. I will go to war on this issue the likes of which you cannot…— Elon Musk (@elonmusk) December 28, 2024
త్వరలో ప్రారంభం కానున్న ట్రంప్ క్యాబినెట్‌లోని.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE) కో-హెడ్స్ మస్క్, వివేక్ రామస్వామి హెచ్-1బీ వీసాల ద్వారా చట్టబద్ధమైన ఇమ్మిగ్రేషన్ అమలు చేయనున్నారు. దీనిపై కూడా కొన్ని వ్యతిరేఖ నినాదాలు వినిపిస్తున్నాయి.
10 లక్షల నాన్ ఇమ్మిగ్రేషన్ వీసాలు
ఇదిలా ఉండగా భారతదేశంతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరచుకోవడానికి అమెరికా అంకిత భావంతో పనిచేస్తోంది. ఇందులో భాగంగానే.. భారతీయులకు వరుసగా రెండో ఏడాది ఏకంగా 10 లక్షల కంటే ఎక్కువ 'నాన్ ఇమ్మిగ్రేషన్ వీసా'లను జారీ చేసింది. ఇందులో ఎక్కువ భాగం విజిటర్ వీసాలు (పర్యాటకుల వీసాలు) ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment