భార్యపై అనుమానంతో..
Published Thu, Sep 8 2016 2:56 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
గంపలగూడెం: భార్య వివాహేతర సంబంధం నెరుపుతుందని అనుమానించిన భర్త ఆమెను దారుణంగా హతమార్చాడు. ఇంట్లో నిద్రిస్తున్న ఆమెను తలపై కర్రతో బలంగా మోదడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటన కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం మేడూరులో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ప్రకాశ్, నిర్మల దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. భార్య వేరొకరితో వివాహేతర సంబంధం నడుపుతోందని అనుమానిస్తూ తరచు ఆమెతో గొడవపడుతుండేవాడు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న నిర్మల(32) తలపై కర్రతో కొట్టాడు. దీంతో తీవ్రంగా రక్తస్రావమై ఆమె మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.
Advertisement
Advertisement