marital relations
-
కంట్లో కారం చల్లి.. కత్తులతో పొడిచి..
చాంద్రాయణగుట్ట: పాత గొడవల నేపథ్యంలో ఓ ఆటోడ్రైవర్ దారుణ హత్యకు గురైన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు....తలాబ్‌కట్టకు చెందిన మహ్మద్ షాకీర్(30) ఆటోడ్రైవర్‌గా పని చేస్తూ భార్యతో పాటు ఇద్దరు పిల్లలతో సహా హఫీజ్‌బాబానగర్‌లో నివాసం ఉంటున్నాడు. గురువారం ఉదయం అతను ఆటోలో బ్యాటరీల లోడ్ తీసుకుని బాలాపూర్ నుంచి చాంద్రాయణగుట్టకు వస్తున్నాడు. డీఎల్ఆర్ఎల్ గేట్ వద్దకు రాగానే వెనుక నుంచి వచ్చిన ఇబ్రహీం అతని స్నేహితులు ఆటోను అడ్డుకుని షాకీర్ కళ్లల్లో కారం చల్లారు. వెంటనే కత్తితో అతని మెడ, ఛాతిపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందితులు పరారయ్యారు. రోడ్డుపై ఆగి ఉన్న ఆటోలో రక్తపు మడుగులో పడిఉన్న షాకీర్‌ను గుర్తించిన వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. ఫలక్‌నుమా ఏసీపీ షేక్ జహంగీర్, చాంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ కె.ఎన్.ప్రసాద్ వర్మ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే షాకీర్‌ను ఇబ్రహీం హతమార్చినట్లు సమాచారం. అప్పుల బాధ తాళలేక గతంలో షాకీర్ బెంగుళూర్ వెళ్లాడు. దీనిని అదునుగా చేసుకుని ఇబ్రహీం షాకీర్ భార్యతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. బెంగుళూర్ నుంచి తిరిగొచ్చిన షాకీర్ విషయం తెలుసుకొని ఇబ్రహీంతో గొడవ పడ్డాడు. అప్పట్లోనే కత్తులతో దాడులకు దిగగా స్నేహితులు అడ్డుకున్నారు. ఎప్పటికైనా చంపేస్తానంటూ షాకీర్ హెచ్చరించాడు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉండడం...ఇటు చంపుతాడేమోన్న భయంతోనే ఈ హత్యకు ఒడిగట్టినట్లు తెలిసింది. నిందితులను దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదపులోకి తీసుకున్నారు. (చదవండి: భార్యను కత్తితో నరికి... మృతదేహానికి పూలమాల వేసి...) -
ప్రియునితో భార్య పరార్.. కూతుళ్లను చంపిన తండ్రి
యశవంతపుర: భార్య మరొకరితో వెళ్లిపోవడంతో ఉన్మాదిగా మారిన భర్త ఇద్దరు చిన్నారి కూతుళ్లను హత్య చేశాడు. ఈ ఘటన కలబురిగిలో జరిగింది. వివరాలు... భోవి నగరకు చెందిన లక్ష్మికాంత్, అంజలి దంపతులకు నలుగురు సంతానం. లక్ష్మికాంత్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అంజలి ఇటీవల ప్రియునితో కలిసి పరారైంది. దీంతో లక్ష్మికాంత్ నలుగురు పిల్లలను అవ్వ వద్ద ఉంచాడు. బుధవారం రాత్రి నలుగురు పిల్లలకు చిరుతిళ్లు కొనిస్తానని చెప్పి బయటకు తీసుకెళ్లాడు. ఇద్దరిని ఆటోలో కుర్చోపెట్టి, మరో ఇద్దరు కూతుళ్లు సోని (11), మయూరి (10)లను పక్కకు తీసుకెళ్లి గొంతు పిసికి చంపాడు. ఇద్దరి మృతదేహాలను ఆటోలో పెట్టుకొని నేరుగా ఎంబీ నగర పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి లొంగిపోయాడు. ఈ దారుణం నగరంలో సంచలనం కలిగించింది. లక్ష్మీకాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. (చదవండి: టీచర్ వికృతానందం.. మహిళలకు అసభ్యకరంగా ఎస్సెమ్మెస్‌లు, వీడియోలు పంపి..) -
ఆ కేసుల్లోకి బంధువులను లాగొద్దు
న్యూఢిల్లీ: నేర నిర్ధారణ జరిగేంత వరకు వరకట్న వేధింపులు తదితర వైవాహిక వివాదాల్లో భర్త కుటుంబ సభ్యులు, బంధువులను నిందితులుగా చేర్చొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి కేసుల్లో భర్త తరఫు దూరపు బంధువులను విచారించడంలో జాగ్రత్తగా వ్యవహరించాలని దిగువ స్థాయి కోర్టులకు సూచించింది. 2016 నాటి హైదరాబాద్ హైకోర్టు తీర్పును సవాలుచేస్తూ ఓ వ్యక్తి తల్లి తరఫు బంధువులు దాఖలుచేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావుల ధర్మాసనం విచారణకు స్వీకరించింది. వైవాహిక వివాదంలో తమపై నేర విచారణను రద్దుచేయాలని కోరుతూ వారు దాఖలుచేసుకున్న పిటిషన్‌ను హైదరాబాద్ హైకోర్టు కొట్టేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ‘వైవాహిక వివాదాలు, వరకట్న వేధింపులకు సంబంధిం చిన కేసుల్లో భర్త కుటుంబ సభ్యులు, బంధువులను విచారించడంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. సాధారణ ఆరోపణలపై ఆధారపడొద్దు. నేరంలో బంధువుల పాత్ర ఉందని నిర్ధారించుకునేంత వరకు వారిని విచారణలో భాగం చేయొద్దు’అని బెంచ్ అభిప్రాయపడింది. కేసు పూర్వాపరాలివీ భర్త, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన తల్లి తరఫు బంధువులు తనను వేధిస్తున్నారని హైదరాబాద్‌కు చెందిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కొడుకును భర్త కిడ్నాప్ చేశాడనీ ఆరోపించింది. ఈ కేసులో తమపై విచారణ జరపొద్దని భర్త తరఫు బంధువులు హైదరాబాద్ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు వారి విజ్ఞప్తిని తోసిపుచ్చింది. కోర్టు తీర్పుతో పోలీసులు చార్జిషీట్లు దాఖలుచేశారు. 2008లో వివాహం చేసుకుని, అమెరికాలో నివాసం ఉంటున్న ఈ జంట మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని, భార్యను నిత్యం మానసికంగా, శారీరకంగా హింసిస్తున్న భర్తకు ఆయన తల్లి తరఫు బంధువులు మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు. ‘పిటిషనర్లు (భర్త తరఫు బంధువులు).. భార్యను వేధిస్తున్న భర్తకు మద్దతుగా నిలవడం ద్వారా నేరంలో పాలుపంచుకున్నట్లు భావించలేం. న్యాయ ప్రక్రియ దుర్వినియోగమవుతోందని గుర్తిస్తే తప్ప, విచారణను మధ్య లో నిలిపివేయబోం. న్యాయ పరిరక్షణకు మధ్యలో జోక్యం చేసుకునేందుకు సందేహించం’ అని కోర్టు పేర్కొంది. విచారణ సందర్భంగా బాధితురాలి తరఫు లాయర్ వాదిస్తూ..మహిళకు చెందిన కొన్ని పత్రాలను ఆమె భర్త తరఫు బంధువులు లాక్కున్నారని, ఆమె కొడుకును అపహరించి అమెరికా తీసుకెళ్లడానికి భర్త ప్రయత్నించాడని కోర్టుకు తెలిపారు. -
భార్యపై అనుమానంతో..
గంపలగూడెం: భార్య వివాహేతర సంబంధం నెరుపుతుందని అనుమానించిన భర్త ఆమెను దారుణంగా హతమార్చాడు. ఇంట్లో నిద్రిస్తున్న ఆమెను తలపై కర్రతో బలంగా మోదడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటన కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం మేడూరులో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ప్రకాశ్, నిర్మల దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. భార్య వేరొకరితో వివాహేతర సంబంధం నడుపుతోందని అనుమానిస్తూ తరచు ఆమెతో గొడవపడుతుండేవాడు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న నిర్మల(32) తలపై కర్రతో కొట్టాడు. దీంతో తీవ్రంగా రక్తస్రావమై ఆమె మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.