
అన్నే హంతకుడు
జంట పరువు హత్య కేసు.. ప్రత్యేక కోర్టు తీర్పు
శిక్ష వివరాలు 29వ తేదీకి వాయిదా
ముగ్గురు విడుదల
సేలం: మేట్టుపాళయలో 2019వ సంవత్సరం పరువు హత్య కేసులో ప్రేమికుడి అన్నే హంతకుడని కోవై ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. మరణశిక్ష వేసే స్థాయికి నేరం జరిగినట్టు తెలిపిన న్యాయమూర్తి ఈ కేసులో సంబంధం ఉన్న ముగ్గురిని విడుదల చేసింది. వివరాలు.. కోవై జిల్లా మేట్టుపాళయం సమీపంలోని వెల్‌లై పాళయం. అక్కడ ఉన్న సిరంగరాయన్ ఓడై ప్రాంతానికి చెందిన కరుప్పుసామి. ఈయన కుమారులు వినోద్ (27), కనకరాజ్ (23). వీరిద్దరు కూలీ కార్మికుడు. వీరిలో కనకరాజ్ అదే ప్రాంతానికి చెందిన వర్షిణి ప్రియా (17)ను ప్రేమించాడు.
వీరి ప్రేమ వ్యవహారం తెలిసిన అన్న వినోద్ దళిత యువతితో ప్రేమ వదులుకోమని తమ్ముడు కనకరాజ్‌ను హెచ్చరించాడు. అయినప్పటికీ ప్రేమికులు ఇద్దరు 2019, జూలై 25వ తేది కలుసుకున్నారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన వినోద్ ఆవేశంతో వారిద్దరిని నరికాడు. దీంతో తీవ్రంగా గాయపడిన తమ్ముడు కనకరాజ్ రక్తపు మడుగులో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. కోవై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన వర్షిణి ప్రియ అదే నెల 29వ తేది మృతి చెందింది. జంటను హత్య చేసిన వినోద్ పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ కేసులో వినోద్ సహచరులు కందవేల్, అయ్యప్పన్, చిన్నరాజ్ అనే ముగ్గురిని మేట్టుపాళయం పోలీసులు అరెస్టు చేశారు.
ఈ కేసు విచారణ కోవై ఎస్‌సీ, ఎస్‌టీ కేసులను విచారించే న్యాయస్థానంలో జరుగుతూ వచ్చింది. ఈ కేసు తుది విచారణ గురువారం జరిగింది. మొదటి ముద్దాయి వినోద్‌పై నేరం నిరూపించబడిన కారణంగా అతడిని నేరస్తుడిగా న్యాయమూర్తి వివేకానంద తీర్పు ఇచ్చారు. అదే విధంగా మరణ శిక్ష విధించి స్థాయికి నేర జరిగిందని తెలిపిన న్యాయమూర్తి ఈ కేసులో సంబంధం ఉన్న ముగ్గురిని విడుదల చేశారు. వినోద్‌కు విధించిన శిక్ష గురించిన వివరాలను ఈ నెల 29వ తేది (బుధవారం) వెల్లడించబడుతుందని న్యాయమూర్తి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment