హనుమకొండ, సాక్షి: పట్టపగలే నగరంలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణం పోయేలా చేసింది. అందరూ చూస్తుండగా.. వెంటాడి మరీ అతన్ని కిరాతకంగా హత్య చేశారు. హనుమకొండలో బుధవారం దారుణం చోటు చేసుకుంది.ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇద్దరు వ్యక్తులు తమలో తాము గొడవ పడ్డారు. ఈ క్రమంలో మాటామాటా పెరిగడంతో హత్యకు దారి తీసింది.
మాచర్ల రాజ్‌కుమార్, ఏనుగు వెంకటేశ్వర్లు ఆటోడ్రైవర్లు. ఈ ఇద్దరికీ స్థానికంగా ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది.అయితే ఈ విషయమై ఇద్దరు నడిరోడ్డుపై వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోవెంకటేశ్వర్లు రాజ్‌కుమార్‌ను వెంబడించాడు. సుబేదారి డీమార్ట్ ఎదురుగా దొరకబుచ్చుకుని దారుణంగా చంపాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృత దేహాన్ని.. ఎంజీఎంకు తరలించారు. ఆపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment