
సెమీఫైనల్స్‌కు నిర్మల అర్హత
లండన్: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మహిళల 400 మీటర్ల విభాగంలో భారత అథ్లెట్ నిర్మలా షెరోన్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఆదివారం జరిగిన 400 మీటర్ల హీట్స్‌లో 22 ఏళ్ల నిర్మల 52.01 సెకన్లలో గమ్యానికి చేరి నాలుగో స్థానంలో నిలిచింది.
సోమవారం మూడు సెమీఫైనల్స్ జరుగుతాయి. పురుషుల మారథాన్ రేసులో టి. గోపీ 28వ స్థానంలో నిలువగా... 110 మీటర్ల హర్డిల్స్‌లో సిద్ధాంత్ హర్డిల్స్‌లోనే నిష్క్రమించాడు.