
హైదరాబాద్: అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఆస్కీ) నూతన డైరెక్టర్ జనరల్ (డీజీ)గా ప్రొఫెసర్ నిర్మల అఫ్సింగీకర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆస్కీ చైర్మన్ పద్మనాభయ్య ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆర్‌హెచ్.ఖ్వాజా రాజీనామా చేయటంతో ఆమెను నియమించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..సంస్థ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో భౌతిక శాస్త్రంలో ఎంటెక్ చేసిన నిర్మల, ఐఐఎం బెంగళూర్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. ఆమె సేవలకు గుర్తింపుగా పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment