డిజిటల్ యుగంలో కొత్త యాప్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఇందులో చాలావరకు మోసపూరితమైన యాప్స్ ఉన్నట్లు అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ASCI) ఓ నివేదికలో విడుదల చేసింది. భారతదేశంలోని 53 టాప్ యాప్‌లలో 52 యాప్స్ వినియోగదారులను తప్పుదారి పట్టించే రీతిలో ఉన్నాయని వెల్లడించింది.
ఏఎస్‌సీఐ 53 యాప్‌ల నుంచి 12,000 స్క్రీన్‌లను విశ్లేషించిం ఒక్కో యాప్‌కు సగటున 2.7 మోసపూరిత నమూనాలు ఉన్నాయని సంస్థ ఓ నివేదికలో వెల్లడించింది. ఇందులో ప్రైవసీ, ఇంటర్‌ఫేస్, డ్రిప్ ప్రైసింగ్ వంటి 12 విభిన్న మోసపూరిత నమూనాలు ఉన్నట్లు నివేదికలో బయటపడ్డాయి.
పలు మోసపూరిత యాప్‌లను ఇప్పటికే 21 బిలియన్ సార్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇందులో హెల్త్ -టెక్, ట్రావెల్ బుకింగ్, ఈ కామర్స్, స్ట్రీమింగ్ సర్వీస్‌లు, గేమింగ్ సెక్టార్‌లు ఉన్నట్లు తెలుస్తోంది.
కొన్ని షాపింగ్ యాప్స్ తక్కువ ధర, తప్పుడు విషయాలను వెల్లడిస్తూ.. యూజర్ల డేటాను గ్రహిస్తున్నాయి లేదా గోప్యతకు హాని కలిగిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి మోసపూరిత యాప్స్ ఉద్దేశపూరితంగానే ప్రజలను మోసం చేస్తున్నాయని ఏఎస్‌సీఐ నివేదికలో వెల్లడించింది. యాప్‌లు మన నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని బలహీనపరుస్తాయని, మన వ్యక్తిగత సమాచారాన్ని కూడా ప్రమాదంలో పడేస్తాయని సర్వేలో స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment